CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

ప్రార్థన = నా స్వరం దేవుని చెవులకు
వాక్యం = దేవుని స్వరం నా చెవులకు

ప్రార్థన అంటే ఏమిటి? వాక్యం అంటే ఏమిటి? ఈ రెండు విషయాలను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం,

ప్రార్థన అంటే ఏమిటి?
మనం దేవునితో మాట్లాడటం, మన అవసరాలు, మన మనసులోని మాటలు, మనకోచ్చే సందేహాలు అన్ని కూడ దేవునికి చెప్పటం. దీనినే ప్రార్థన అని అంటారు1థెస్సలొనికయులకు 5:17 వ వచనములో
యెడతెగక ప్రార్థనచేయుడి అని వుంది,

అంటే మనము ప్రతిరోజు కూడా మన తోటి మానవులతో,మనము ఎలా మాట్లాడుతుంటామో అలానే దేవునితో మనము ఎడతెగక మాట్లాడుతూ ఉండాలి,ఇదే ప్రార్థన అని అంటే,

వాక్యం అంటే ఏమిటి?
దేవుడు మనతో మాట్లాడటం, మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం, తన ఉద్దేశాన్ని, తన వాగ్దానాన్ని మనకు తెలియజేయడం. కీర్తనలు 119:105 (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.ఈ వాక్యము మనకు వెలుగుగా వున్నది,ఈ వెలుగై ఉన్న వాక్యమే మనకు త్రోవను చూపుతుంది,

ఈ వాక్యము వలన మనకు కలిగే ఇంకొక మేలు ఏమిటంటే 2 తిమోతికి 3:16–17; వచనాల ప్రకారం, దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును,మనకు ప్రయోజనమును కలిగిస్తుంది.

మనము దేవుని ప్రార్థిస్తున్నాము అని అంటే, దాని అర్థం, మనము దేవునితో మాటలాడుతున్నాము, సంభాషిస్తున్నాము, మనకు సంబంధించిన అవసరత కొరకు, మనకు అర్థం కాని విషయం కొరకు, దేనికో ఒక దాని కొరకు దేవునితో మనము సంభాషిస్తున్నాము అని అర్థం, అందుకే మత్తయి 7:7లో, అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.అని వ్రాయబడి ఉన్నది,

మరి దేవుని వాక్యాన్ని మనము వింటున్నాము,చదువుతున్నాము, అని అంటే దాని అర్థం: మనము దేవున్ని ఏదైతే అడిగామో, ప్రార్థించామో, ఏ విషయం కొరకు దేవునితో సంభాషించామో, ఆ విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి అన్న విషయాన్ని, మనము తెలుసుకుంటున్నాము, దేవుని సమాధానమును మనము పొందుకుంటున్నాము అని అర్థం, దీనిని
యోహాను సువార్త 15:7 వ వచనము కూడా రూడి పరుస్తుంది,

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచి యుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.ఈ వాక్య ప్రకారము మనము మన ప్రార్థనకు దేవుని నుండి సమాధానాన్ని పొందుకుంటున్నాము అని అర్థము,

దేవుడు వాక్యము ద్వారా, మాట్లాడే దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు అని,నా అనుభవము ద్వారానే,నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా దేవున్ని గ్రహించాను దేవున్ని తెలుసుకున్నాను,

అందుకే చూడండి, హెబ్రీయులకు 4:12 వవచనంలో కూడా వాక్యం ఇలా ఉంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంత మట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.

ఇక్కడ దేవుని వాక్యము సజీవమైనది, అది హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను, గ్రహిస్తుంది, అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది,

అందుకే,దేవుడు దేవుని వాక్యము సజీవమైనది, అది మాట్లాడుతుంది, అని నా అనుభవం ద్వారా నేను గుర్తించిన, అప్పటి నుంచి నాకు సంబంధించిన ప్రతి అవసరంలో, ముందు మానవుల దగ్గరికి నేను వెళ్ళను, దేవుని దగ్గరికే వెళ్లి ప్రార్థిస్తు ఉంటాను,

అదే సమయంలో దేవుని వాక్యాన్ని కూడా వింటూ ఉంటాను, ఎందుకు అని అంటే, నేను ప్రార్థించే విషయంలో దేవుడు నాకు ఏమని సమాధానం ఇస్తాడు అన్న దాని కొరకు,

మన ప్రార్థనకు జవాబు వచ్చే అంతవరకు ఎందుకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి అని అంటే,కీర్తనలు119:49–50 వ వచనాలలో వ్రాయబడినట్లు, దేవుని వాక్యము మనకు నిరీక్షణ కలిగిస్తుంది, మనకు ఆదరణ కలిగిస్తుంది కాబట్టి,

దేవుడు తన వాక్యం ద్వారా నాకు సమాధానం ఇచ్చేంతవరకు, అంటే ఒక వాక్యము ద్వారా ఒక వాగ్దానం ద్వారా నేను అడిగింది దేవుడు ఇస్తాను, అని సమాధానం, దేవుని నుంచి నాకు వచ్చేంతవరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను,

నేను ప్రార్ధించిన విషయంలో, దేవుడు నాకు వాగ్దానం అంటే తన వాక్యం ద్వారా మాట్లాడితే, ఇక నేను మరలా ప్రార్థించను, ఆ విషయంలో నా ప్రార్థనను ఇక ఆపివేస్తాను,

యిల ఎందుకు అని అంటే వాక్యం అనే వాగ్దానం ద్వారా, నాకు సమాధానం వచ్చేసింది కాబట్టి, కచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు, అన్న విశ్వాసంతో,ఇక ఆ విషయంలో ప్రార్థించడం అనే దానిని ఆపి వేస్తాను,

అందుకే రోమీయులకు 10:17 వ వచనములో
"కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును."అని వ్రాయబడ్డది, క్రీస్తును గూర్చిన మాటను మనము వినుట వలన మనకు విశ్వాసము అనేది కలుగుతుంది, అందుకే దేని కొరకైనా మనం ప్రార్ధించేటప్పుడు మనము దేవుని వాక్యాన్ని,వింటూ ఉండాలి,

దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేంత ఆ మధ్య సమయంలో, దేవుడు ఏదైతే నాతో మాట్లాడాడో, దానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నప్పుడు, వాటిని చూసి నాకు మరల అవిశ్వాసం వస్తుంది. అప్పుడు నేను మరల దేవున్ని అడుగుతూ ఉంటాను, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాను, చదువుతూ ఉంటాను, దేవుడు మరల నాతో నా విశ్వాసాన్ని బలపరచ డానికి తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉంటాడు,చూశారా •••• మనము ఎంత బలహీనుల మో, దేవుని వాక్యము మనతో మాట్లాడకపోతే మనలో ఎంత అవిశ్వాసం వచ్చేస్తుందో,

అందుకే యెహోషువ 1:8 వ వచనము మనకు ఇచ్చే సందేశము ఏమిటి అని అంటే, మనం దేవుని మార్గంలో నుంచి తప్పిపోకుండా,ఉండటానికి,మన మార్గములను వర్ధిల్ల చేసుకోవడానికి దివారాత్రములు దేవుని వాక్యమును మనము చదువుతూ ఉండాలి. వింటూ వుండాలి,

అంటే ఇక్కడ ప్రార్థన అన్నది, నా అవసరతల కొరకు దేవునితో మాట్లాడటం, సంభాషించటం కొరకు అయితే, నాకు ప్రకటింపబడుతున్న,నేను చదువుతున్న దేవుని వాక్యం, అది దేవుడు నాతో మాట్లాడి, నాకు సమాధానం ఇచ్చి, నా ప్రార్థనకు జవాబు ఇచ్చి, నాలో విశ్వాసమును పెంచే దేవుని స్వరం.

ఇప్పుడు ప్రార్థన ద్వారా నా స్వరం దేవునికి వినిపించటం ప్రాముఖ్యమైనదా, లేక నాకు వినబడుతున్న వర్తమానాల ద్వారా దేవుని స్వరాన్ని వినటం ప్రాముఖ్యమైనదా, అని అంటే, దేవుని ఉద్దేశాన్ని తెలియజేసే బోధలు, మన ఉద్దేశాన్ని దేవునికి తెలియజేసే ప్రార్థనలు — ఈ రెండూ కూడ మన జీవితంలో ప్రాముఖ్యమైనవే, మనకు అవసరమైనవే,

పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని ప్రజలు ఈ విధముగానే, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుండా దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు, అపో.కార్యములు 6:4
లో ఇది మనకు కనపడుతుంది,

పరలోక రాజ్యం ఈ భూమి మీద అనేక చోట్ల విస్తరిస్తూ ఉంది, ఈ రాజ్యానికి అధికారి దేవుడు మాత్రమే, 1 కోరింథీయులకు 12:4–6 వచనాల వరకు ఉన్న ఈ వాక్యాన్ని మనము గమనిస్తే భూమి మీద విస్తరించబడిన ఈ పరలోక రాజ్యం కొరకు పని చేసే పని వాళ్లకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యమును, ఒక్కొక్క కృపావరమును, ఒక్కొక్క భారమును ఇచ్చాడు,అని మనకు అర్థమవుతుంది,

ప్రతి ఒక్కరిలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి వారు వారి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. యోహాను 1:1ప్రకారము దేవుడు వాక్యమై ఉన్నాడు, అటువంటి శక్తిమంతుడైన ఈ దేవుని వాక్యమును ఒక శక్తిగా ప్రజల అవసరాల కొరకు ప్రకటిస్తున్న వాళ్లు దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపిన వాళ్లే అని మనకు అర్థమవుతుంది,

మనకు కలిగిన భారము మనకు ప్రాముఖ్యమైనదిగా కనబడుతు వున్న కారణాన్ని బట్టి, ఇంకొకరికి కలిగిన భారమును మనము తృణీకరించకూడదు అని
1 కోరింథీయులకు 12:4–6 వచనాల ఆధారంగా మనము గ్రహించ గలుగుతున్నాము,

కాబట్టి మనము జీవించే ఈ క్రైస్తవ జీవితం అనేది, ప్రార్థనతో ప్రారంభమై, వాక్యంతో బలపడుతుంది. ఒకటి లేకుండా మరొకటి సంపూర్తి కాదు. ప్రార్థన మన స్వరాన్ని దేవునికి వినిపిస్తే, దేవుని వాక్యం మన జీవితంలో మనకు దేవుని స్వరాన్ని వినిపిస్తుంది. ఈ రెండూ కలిసి సమానముగా నడిచి నప్పుడు, మాత్రమే, మన విశ్వాస జీవితం స్థిరపడుతుంది,

ఎస్తేర్ క్రైసోలైట్
3-10-2025

🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿