2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
ప్రారంభం,కొనసాగింపు,ముగింపు,
{అన్నిటికి విశ్వాసమే ఆధారం}
"నీతిమంతుడు తన విశ్వాసము చేత జీవించును” అనే వాక్యం హబక్కూకు 2:4 నుండి మొదట వచ్చింది. ఆ తర్వాత కొత్త నిబంధనలో మూడు సార్లు ప్రత్యక్షంగా కనిపిస్తుంది,{పౌలు గారి ద్వారా రెండుసార్లు, హెబ్రీయుల గ్రంథకర్త ద్వారా ఒకసారి}
ఇక్కడ పౌలు మాత్రమే కాకుండ, హెబ్రీయుల గ్రంథకర్త కూడా ఆని ఎందుకు అన్నాను అని అంటే,
హెబ్రీయుల గ్రంధమును, చాలామంది పండితులు పౌలే వ్రాశాడని అనుకున్నారు, కాని ఖచ్చితంగా ఆయనే వ్రాసాడని అనుకోవడం సరికాదు,
హెబ్రీయుల గ్రంథకర్త గురించి స్పష్టమైన పేరు బైబిల్‌లో ఎక్కడా ఇవ్వబడలేదు. అందుకే ఇది కొత్త నిబంధనలో “అజ్ఞాత గ్రంథం”గా పరిగణించ బడుతుంది.
కొంద మంది చాలాకాలం పాటు పౌలే వ్రాశాడని నమ్మారు. అయితే దీనిని వ్రాసిన “శైలి, భాష, ఆలోచన విధానం” పౌలు వ్రాసిన ఇతర పత్రికలతో భిన్నంగా ఉందని చెప్పి పౌలేనని అనుకోవడం కష్టమని కొంతమంది భావించారు.
ఇప్పటికి బైబిల్ పండితులు, దీనిని వ్రాసినది ఖచ్చితంగా ఎవరని చెప్పలేము అని అంగీకరిస్తున్నారు. కానీ గ్రంథం అంతా పరిశీలిస్తే స్పష్టమయ్యేది ఏమిటంటే, ఇది పౌలు వంటి అపొస్తలుల యుగానికి చెందిన వ్యక్తి ద్వార ఆని,
దీనిని వ్రాసిన వ్యక్తికి యూదులపై, పాత నిబంధనపై లోతైన పరిజ్ఞానం ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇది వ్రాయబడ్డది.
కాబట్టి “హెబ్రీయుల గ్రంథకర్త ఎవరు?” అన్నది
దేవునికి మాత్రమే ఖచ్చితంగా తెలుసు.
మనకు తెలిసినది ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడి, మన విశ్వాసాన్ని బలపరచడానికి సంఘానికి ఇయ్యబడినది అని (2 తిమోతి 3:16 ప్రకారం).
విశేషం ఏమిటంటే, విశ్వాసము గురించి ఒక్కొక్క పత్రికలో ఒకో రీతిగా వ్రాయబడ్డది, రోమా - నీతిని గురించి, గలతీ- జీవం గురించి, హెబ్రీ- స్థిరత్వం - ధైర్యం గురించి,
పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో విశ్వాసము గురించి వ్రాయబడిన ఈ పత్రికలను మనం ధ్యానం చేస్తే, ఈ మూడు పత్రికల్లో విశ్వాసం అన్నది ఒకే అంశం, కానీ ఫోకస్, దానిమీద పెట్టబడిన దృష్టి అన్నది వేర్వేరు కోణాల్లో కనపడుతుంది,
పాత నిబంధనలో – హబక్కూకు 2:4
హబక్కూకు రాసిన విశ్వాస వచనం ప్రకారం, విశ్వాసం అనేది కష్టాలు, క్లిష్ట పరిస్థితుల మధ్య దేవునిపై ఆధారపడటం, నిలబడటానికి అవసరమని చూపిస్తుంది. మనం చూడలేని పరిస్థితులలో కూడా, దేవుని ఉద్దేశాన్ని నమ్మి, నీతివంతులముగా జీవించడం కోసం విశ్వాసం ఎలా పని చేస్తుందో ఇది వివరించబడింది.
. రోమీయులకు రాసిన పత్రికలో ప్రధానంగా విశ్వాసం ద్వారా మనం నీతివంతుల మవుతామనే సూత్రం మీద దృష్టి పెట్టబడింది. అంటే మనము నీతిని పొందటానికి విశ్వాసం మనకు ఎంత ప్రాముఖ్యమో ఈ పత్రికలో వివరించబడింది.
గలతీయులకు ఇక్కడ ముఖ్యంగా ధర్మశాస్త్రం ఆధారంగా కాదు, విశ్వాసం ఆధారంగా మనకు జీవం దొరుకుతుందనే విషయం వ్రాయబడింది. దీని ఫోకస్,దీని దృష్టి ఏమిటంటే, మనం ఏ విధంగా విశ్వాసంలో నిలబడి జీవముగా ఉండగలమో అనే దానిపై ఉంది.
హెబ్రీయులకు రాసిన పత్రికలో ముఖ్యంగా విశ్వాసంలో స్థిరంగా ఉండటం మీద దృష్టి ఉంది.
ఈ పత్రికలో ప్రధానంగా విశ్వాసంలో స్థిరంగా ఉండటం, మనం చూడలేని, ఆశించిన విషయాలపై విశ్వాసం ఉంచడం ద్వారా ధైర్యంగా ముందుకు సాగటం అనే అంశం మీద దృష్టి పెట్టబడింది.
ఇది మనము చూడలేనివి, అయినప్పటికీ దేవుని వాగ్దానం ప్రకారం ఆశించిన విషయాలపై విశ్వాసం ఉంచడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడం ఎలా సాధ్యమవుతుందో వివరించబడింది.
దేవుని దృష్టిలో జీవము అనేది కేవలం శ్వాస తీసుకోవడం కాదు, విశ్వాసంలో నడవడం. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మన కంటికి కనబడేది నిరాశ కలిగించే పరిస్థితే అయినా, విశ్వాసమే మనకు మనలను జీవింప చేసే ఒక శక్తి. నీతిమంతుడు తన బుద్ధి, తన బలసామర్ధ్యములపై, తన సంపాదనను ఆధారం చేసుకొని కాదు – దేవుని వాగ్దానాలపై ఆధారపడిన విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసం లేకపోతే మనం కేవలం ఉన్నట్టే ఉంటాం, కానీ విశ్వాసంతో మనం నిజంగా జీవిస్తాం.
కాబట్టి విశ్వాసము అనే ఈ ఒకే వాక్యం మూడు కోణాలలో విస్తరించబడింది,
రోమీయులలో మనం ఎలా నీతిమంతులమవుతామో చూపుతుంది.
{ రోమీయులు 1:17 – నీతిమంతత్వం }
మానవుడు ధర్మశాస్త్రం ద్వారా ఎప్పటికీ దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు, మన ప్రయత్నాలు, మన మంచితనము ఏదీ కూడా మనలను రక్షించలేదు. సర్వ మానవుల కొరకు నీతిగా చేయబడ్డ నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు వారిని విశ్వాసించుటయో మనకు నీతి.. కాబట్టి
విశ్వాసం అనే వస్త్రం లేకుండా దేవుని ఎదుట మనము నిలబడలేము,ఇందులో మనము గమనించవలసిన సత్యము ఏమిటంటే,విశ్వాసం అనేది మనకు నీతి వస్త్రములను ధరింప చేస్తుంది,
హెబ్రీయులకు 11:6
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
2. గలతీయులలో మనం ఎలా జీవముతో నింపబడతామో చూపుతుంది.
{ గలతీయులు 3:11 – జీవం}
ధర్మశాస్త్రం మన తప్పులను చూపుతుంది, కానీ జీవం ఇవ్వదు. జీవం యేసు రక్తంలో ఉంది, దానిని మనకున్న విశ్వాసమే స్వీకరించగలదు. మనకు ప్రతిరోజూ ఊపిరి తీసుకోవడం ఎంత అవసరమో, అలాగే ప్రతిరోజూ విశ్వాసమే మన ఆత్మకు జీవం ఇస్తుంది.ఇందులో సత్యం ఏమిటంటే, విశ్వాసం లేకపోతే మనం బతుకుతున్నట్టు ఉంటాం కానీ నిజంగా జీవించము.
3. హెబ్రీయులలో మనం ఎలా విశ్వాసంలో నిలబడుతామో చూపుతుంది.
{ హెబ్రీయులు 10:38 – స్థిరత్వం}
విశ్వాసం మొదలుపెట్టడం సులభం, కానీ కష్టకాలంలో దానిలో నిలబడటం అన్నది అదే మనకు అసలైన పరీక్ష. వెనుకడుగు వేసే విశ్వాసం దేవునికి నచ్చదు. విశ్వాసం అనేది ఒక క్షణికమైన కొంత సమయం మాత్రమే ఉండే అనుభవం కాదు, అది జీవితాంతం శాశ్వతముగా కొనసాగించే ప్రయాణం. దీనిలో మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే విశ్వాసం నిజమైనదైతే, అది కష్టాల్లోనూ,శ్రమల్లోను పరీక్షల్లోనూ శోధన కలిగినను విశ్వాసం అన్నది దేవుని నుంచి మనలను విడదీయదు,
"విశ్వాసమువలన నీతిమంతుడు జీవించును” (హబక్కూకు 2:4) అనే ఒకే ఒక వాక్యాన్ని కొత్త నిబంధనలో మూడు వేర్వేరు పుస్తకాలు వేర్వేరు కోణాలలో దేవుడు ఉంచాడు. కారణం ఏమిటంటే, ప్రతి పుస్తకమును మనము చదువుతున్నప్పుడు మనకు అవసరమైన ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించటానికి దేవుడు ఈ ఒక్క వాక్యాన్ని వాడాడు.
మూడు కోణాలు:
రోమీయులకు 1:17 “నీతిమంతుడు విశ్వాసముచేత జీవించును”
ఇక్కడ దృష్టి అంతా కూడా “నీతిమంతుడు” అనే పదంపై ఉంది.
మనం నీతిమంతులమవ్వడమంటే ఎలా?
న్యాయపరచబడుట, విశ్వాసం ద్వారా నీతిమంతులం అవ్వడం (ప్రారంభం).
విశ్వాసం ద్వారానే మనం నీతిగా లెక్కింపబడతాం.
ఇది న్యాయపరచబడుట, అనే అంశముపై దృష్టి పెడుతుంది..
2. గలతీయులకు 3:11 → “విశ్వాసముచేత జీవించును”
ఇక్కడ దృష్టి అంత కూడ “విశ్వాసము” మీద ఉంది.
పరిశుద్ధత విశ్వాసం ద్వారా ప్రతి రోజు జీవించడం (ప్రయాణం).
మన జీవనం కొనసాగడానికి, ఆత్మలో నడవడానికి, కృపలో నిలబడడానికి కూడ విశ్వాసమే ఆధారం.
ఇది క్రైస్తవ జీవితం కొనసాగింపు పై దృష్టి పెడుతుంది.
3. హెబ్రీయులకు 10:38 “నీతిమంతుడు విశ్వాసముచేత జీవించును”
ఇక్కడ దృష్టి అంత కూడ “జీవించును” అనే పదంపై ఉంది.
విశ్వాసంలో నిలిచినవాడే పరీక్షలలో, హింసలలో, చివరిదాకా నిలబడగలడు. ఇది స్థిరత్వంపై దృష్టి పెడుతుంది. స్థిరత్వం విశ్వాసం ద్వారా చివరిదాకా నిలబడటం (ముగింపు).
కాబట్టి ఎందుకు మూడు కోణాలలో ఈ వాక్యము విస్తరించబడింది అని అంటే?
ప్రారంభం, కొనసాగింపు, ముగింపు – అన్నీ విశ్వాసం ద్వారానే అని మనకు గుర్తు చేయడానికి ఈ వాక్యాన్ని మూడు పుస్తకాలు మూడు కోణాలలో ఉంచాయి.
చూశారా ! విశ్వాసమనే ఒకే ఒక వాక్యం మూడు కోణాలలో మన ఆత్మీయ జీవితము మొత్తాన్ని
నీతి – జీవం – స్థిరత్వం, అనే వాటితో ఎల
కప్పి వేస్తుందో,
"మరి, మీ జీవితంలో విశ్వాసం అనేది ఏ దశలో బలహీనపడుతోంది? ప్రారంభంలోనా, మధ్యలోనా, లేక చివరిదాకా నిలబడటంలోనా?”
ఎస్తేర్ క్రైసోలైట్
22-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨