2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
మన స్థానమును మనము గుర్తించామా!
"ఆ మనుష్యుడవు నీవే."{ 2 సమూ 12:7 }
నాతాను ప్రవక్త దావీదుతో,పలికిన మాట ఇది,దేవుడు దావీదు వద్దకు నాతాను ప్రవక్తను ఎందుకు పంపాడు,
దేవుని హృదయానుసారుడైన దావీదు చేసిన పాపము ఏమిటి? తాను మీరిన హద్దుఏమిటి?
తాను చూపిన స్వార్థం ఏమిటి?
దేవుడు విధించిన శిక్ష ఏమిటి?
ఈ విషయాలను ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం,
దావీదు చేసిన పాపం,
దావీదు దేవుని హృదయానికి అనుకూలమైన వ్యక్తి అయినప్పటికీ, ఈ సంఘాటన ద్వార తన హద్దులను మించి వెళ్లాడు.
అతడు ఊరియా భార్య అయిన బత్సేబను చూసినప్పుడు, తనలో ఉన్న కోరికను నియంత్రించుకోలేక, తన అధికారం, తన రాజ్యస్థానం వాడుకుని, ఆమెను పిలిపించుకొని పాపంలో పడ్డాడు.
1యోహాను 3:4
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది: దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం, పాపం యొక్క నిజమైన అసలు స్వరూపం.
పాపం గురించి మనుష్యులు అనేక నిర్వచనాలు ఇస్తారు. కానీ బైబిల్ మాత్రం ఒకే వాక్యంతో సూటిగా చెబుతుంది — దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమె పాపం అని.
మనిషి దృష్టికి చిన్న తప్పు, పెద్ద తప్పు అనే తేడా ఉన్నా, దేవుని దృష్టిలో ఆజ్ఞను అతిక్రమించడం ఏదైనా పాపమే.
పాపం అనేది బయట కనబడే పనులకే పరిమితం కాదు; దేవుని వాక్యానికి అవిధేయత అన్నది, లోపల నుంచే ప్రారంభమవుతుంది.
దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ, నిర్గమ 20:17, ద్వితీ 5:21 లో వున్న "నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు" అన్న ఆజ్ఞను మీరి ఇక్కడ దావీదు తన హద్దును దాటి, తాను పాపం చేసాడు,
2. దావీదు యొక్క స్వార్థం
ఊరియాకు ఉన్న ఒకే ఒక భార్యను తనదిగా చేసుకోవాలనే కోరిక అతనిని ఈ స్వార్థం లోనికి నెట్టింది.
రాజ్యాధికారమనే శక్తి తనని రక్షిస్తుందని భావించి
ఒక సాధారణ సైనికుడి జీవితమును, తాను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునే కవచంగా దావీదు వాడుకున్నాడు.
దేవుని ఆజ్ఞను అతిక్రమించి,తన కోరిక తీర్చుకోవడం కోసం, ఒక కుటుంబం, ఒక మనిషి జీవితం, ఒక సైనికుని విశ్వాసం అన్నీ పణంగా పెట్టాడు, ఇదే దావీదులో మనకు కనపడే నిజమైన స్వార్థం.
3. దేవుడు విధించిన శిక్ష
2 సమూయేలు 12:10–14 వచనాలలో
ప్రవక్త అయిన నాతాను “ఆ మనుష్యుడు నీవే!” అని చెప్పిన వెంటనే దావీదు తన పాపాన్ని అంగీకరించాడు. అయితే పాపానికి ఫలితం అన్నది దేవుని నుంచి వచ్చింది,
ఆ పాపానికి ఫలితం దేవుడు ఇచ్చిన శిక్ష దావీదు ఇంటిలో ఎప్పుడూ ఖడ్గం (యుద్ధం/కలహం) ఉండబోతుందని దేవుడు చెప్పాడు.
దావీదు చేసిన రహస్య పాపానికి ప్రతిగా, అతని ఇంట్లోనే బహిరంగ అవమానం జరుగుతుందని ప్రకటించాడు (తర్వాత అబ్షాలోము చేసిన పనులు ఇదే ప్రవచనానికి ఫలితం).
బత్సేబతో కలిగిన మొదటి బిడ్డ మరణించాడు.
దావీదు తన తప్పును అంగీకరించినందున తాను మాత్రం మరణించ కుండా కాపాడబడ్డాడు, కానీ తాను చేసిన పాపం అనే విత్తనం యొక్క ఫలితాలు,తన ఇంటిలో తనతోనే వచ్చాయి,
ఇది మనకిచ్చే వర్తమానం ఏమిటంటే,
పాపం రహస్యమని అనుకుని దానిని కప్పిపుచ్చుకోవడం సాధ్యం కాదు; దేవుని కళ్లకు ప్రతీది బహిరంగమే. ప్రభుత్వం, స్థాయి, శక్తి, ఆధిక్యం ఎవరికి ఉన్నా అది పాపాన్ని సమర్థించదు.
తప్పు గుర్తించిన వెంటనే దాని కోసం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చూపడం అవసరం, అది దేవుని క్షమాపనను తెస్తుంది.
మనము చేసిన పాపానికి క్షమాపన మనకు లభించినా, దాని ఫలితాలు మన వెంటే వస్తాయి, ఇది మనకు హెచ్చరిక.
దావీదు చేసిన పొరపాటు కేవలం ఒక తప్పు నిర్ణయం మాత్రమే కాదు, తన సరిహద్దులు మరిచిపోవడం.
దేవుడు దావీదుని గొర్రెల కాపరిగా ఉన్న చోట నుంచి తీసుకొని, ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు.
2 సమూయేలు 12:7–8 వచనాలలో నాతాను గుర్తు చేసిన విధముగా, దావీదు రాజుగా ఉండగా దేవుడు అతనికి లెక్కలేనంత మంది భార్యలను, గౌరవం, రాజ్య స్థానం అన్నీ ఇచ్చాడు,
అయినప్పటికీ, దావీదు ఒక రాజుగా తన స్థానమును, దేవుని హృదయానుసారుడుగా ఉన్న హోదాను, గౌరవించకుండా, ఊరియాకు మాత్రమే కలిగిన స్థానంలోకి వెళ్లిపోయాడు.
తనకు సంబంధించినవి అనేకము ఉన్నా, తాను పొందకూడని దానిపట్ల దృష్టి పెట్టాడు.
ఇది మనిషి జీవితంలో జరిగే ఒక ప్రమాదం, దేవుడు ఏ రూపంలో మనకు ఆశీర్వాదాలను ఇచ్చాడో దానిని మరచి,మనకు సంబంధం లేని వాటిని మనం ఆశించడం,
మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన స్థానం, బాధ్యత, పరిధి అనేది అది ప్రత్యేకమైనది. దేవుడు మనకు ఇచ్చిన వాటిని గుర్తించి కృతజ్ఞతతో ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. కానీ మనకు ఇవ్వబడని వాటి వెనక పడితే, అది స్వార్థం, అది పాపానికి తలుపు తెరిచినట్టే.
దావీదు చేసిన పొరపాటు మనకు గుర్తు చేస్తుంది:
దేవుని సన్నిధిలో తన స్థానం మరిచిపోయిన వాడు ఎంత బలమైనవాడైనా పడిపోవచ్చు.
దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేక స్థితిలో పిలుస్తాడు.
ఒక స్త్రీకి, ఒక స్త్రీగా దేవుడు ఆమెకు ఇచ్చిన పరిచర్య అది ఆ స్త్రీకి మాత్రమే సంబంధించిన, దేవుడు ఇచ్చిన బాధ్యత. ఒక దైవజనుని వివాహం చేసుకున్న స్త్రీ, ఆయనకు సంబంధించిన పరిచర్యలోనే ఉండాలి.దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ పిలిచిన స్థితిలోనే ఉండాలి. మరొకరి స్థానంలోకి వెళ్ళకూడదు.దావీదు చేసినట్లుగా హద్దుమీరి, ఇతరుల స్థానంలోకి వెళ్ళిపోతే, అది దైవసిద్ధాంతాన్ని త్రొక్కివేస్తునట్టే.
1కోరింథీయులకు 7:17 వ వచనము దీనిని దృఢపరుస్తుంది, అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.
2. రోమీయులకు 12:6-7
మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,•••• పరిచర్యలు వేరువేరు. దేవుడు ఎవరికైతే ఏ వరమును, ఏ బాధ్యతను ఇచ్చాడో, అదే వారి పరిధి.
3. 2 సమూయేలు 12:10–12 (దేవుడు దావీదు విషయంలో నాతాను ద్వార చెప్పిన తీర్పు)
దావీదు హద్దులు మీరాడని, ఊరియాకు చెందిన స్థానంలోకి వెళ్ళాడని దేవుడు నేరుగా తీర్పు చెప్పాడు.
శిక్ష: “నీ ఇంటి లోపల ఖడ్గము ఎప్పటికిని తొలగిపోదు... నీవు రహస్యముగా చేసిన పనిని నేను ఇశ్రాయేలీయులందరి ముందర బహిరంగముగా జరిగించెదను.”
దీని ద్వారా దేవుడు మనకు తెలియజేసే వర్తమానం
దేవుడు ఒకరికి ఇచ్చిన ఆత్మ సంబంధమైన పరిచర్యలోకి మరొకరు చొరబడకూడదు.
ఒకరి స్థానాన్ని మరొకరు ఆక్రమించ కూడదు.
ఒకరికి ఇచ్చిన బాధ్యత పరిచర్యలను హద్దులను దాటి ఇతరుల స్థానంను తీసుకోవడం అనేది దావీదు చేసిన తప్పుతో సమానం.
దేవుడు ఎవరికైతే ఏ స్థితి, ఏ పరిచర్య ఇచ్చాడో అదే వారి హద్దు. మరొకరి పరిధిలోకి దూరడం అనేది దేవుని పిలుపు, క్రమం, నియమం అన్నిటినీ ఆతిక్రమించడం.
శరీర సంబంధమైన అపవిత్రత ఎంత ఘోరమో, ఆత్మ సంబంధమైన పరిచర్యలో హద్దులు దాటటం, స్థానాలను మార్చుకోవడం కూడ, అంతే ఘోరమైన ఆత్మ సంబంధమైన ఆపవిత్రత కూడా అవుతుంది,
"మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యేకమైన పిలుపు, పరిచర్య, స్థానం ఇచ్చాడు.ఎవరికి ఏ రీతిగా పరిచర్యలు చేసే అవకాశం కలిగిందో, ఆ హద్దులోనే విశ్వాసముగా నిలబడి నడవటం పరిచర్యను చేయటం మన కర్తవ్యం. దావీదు చేసిన పొరపాటు మనకిచ్చే హెచ్చరిక ఏమిటంటే, మరొకరి స్థానం ఆక్రమించకూడదు; దేవుడు మనకిచ్చిన పరిధిలోనే నమ్మకంగా ఉండాలి."
ఎస్తేర్ క్రైసోలైట్
26-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨