CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును

కీర్తనలు గ్రంథము ఒకటవ అధ్యాయములో మొత్తం ఆరు వచనాలు ఉన్నాయి,ఇవి
దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
కీర్తనలు 1:2
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
కీర్తనలు 1:3
అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.
కీర్తనలు 1:4
దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
కీర్తనలు 1:5
కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
కీర్తనలు 1:6
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

ఇవి ఈ కీర్తనలు 1వ అధ్యాయములోని అరు వచనాలు

కీర్తనల గ్రంథంలోని మొదటి అధ్యాయమును ఎవరు వ్రాసారో,పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడ లేదు. కీర్తనల గ్రంథమును మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, చాలా కీర్తనల దగ్గర “దావీదు కీర్తన” అనే శీర్షిక కనిపిస్తుంది, కానీ ఈ అధ్యాయం వద్ద అలాంటి heading లేదు. అందువల్ల దీనిని ఎక్కువమంది బైబిల్ పండితులు రచయిత ఎవరో తెలియని కీర్తనగా దీనిని భావిస్తారు.

అయితే, ఈ అధ్యాయం ఒక ప్రత్యేకమైన స్థానమును కలిగి ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కీర్తనల గ్రంథానికి ముఖద్వారం లాంటిది.
ఇందులో రెండు మార్గాలు స్పష్టంగా మనకు చూపబడ్డాయి:

  1. ధర్మశాస్త్రంలో ఆనందించే నీతిమంతుని జీవితం గురించి,

  1. దుష్టుల మార్గం గురించి,

ఈ రెండు మార్గాల మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ, మన జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో, ఆలోచించేటట్లు జేస్తుంది, ఈ కీర్తనల గ్రంథములోని మొదటి అధ్యాయం.

పరిశుద్ధ గ్రంథంలో దావీదు వ్రాసిన ఈ కీర్తనలు నాకు చాలా ఇష్టమైనవి, ఎందుకు అంటే ఇవి చాలా ఆదరణ కలిగిస్తాయి, ఇవి చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి, అంతే కాకుండా దేవుని స్తుతించటం, అనే విషయం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ కీర్తనలు చదివినప్పుడు మనకి తెలుస్తుంది,ఇందులోని ప్రతి అధ్యాయము ఒక విలువైనదే అని చెప్పాలి, ఈ అధ్యాయంలోని వాక్యాలు బాగా లేవు, అని చెప్పగలిగే ఒక్క అధ్యాయం కూడా ఇందులో లేదు,

ప్రతి అధ్యాయము ద్వార ఒక అద్భుతమైన అనుభవాన్ని ఆదరణను,మనము గ్రహిస్తాం, ఏ అధ్యాయమును మనము చదువుతున్న అది చాలా అమూల్యమైన వాక్యాలుగా మనకు కనిపిస్తూ, అనిపిస్తూ, ఉంటాయి,

ఈ కీర్తనల గ్రంథమును మనము చదువుతూ ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు మనము దేవుని స్తుతించేటట్లు చేస్తాయి, కొన్ని వాక్యాలు మనము దేవుని ప్రార్థించేటట్లు చేస్తాయి, కొన్ని వాక్యాలు మనకు జ్ఞానాన్ని కలగచేస్తాయి,అందుకే ఈ కీర్తనల గ్రంథమును మనం ఎప్పుడు చదివినా ఆ చదివిన సమయం వ్యర్థము కాకుండా ఏదో ఒక మేలును మనము పొందుతాము.

ఈ కీర్తనల గ్రంథం, మొదటి అధ్యాయంలో వ్రాయబడిన, శ్రేష్టమైన వాక్కులు ఏమిటి అని అంటే,

దుష్టుల ఆలోచనచొప్పున నడువక,
పాపుల మార్గమున నిలువక,
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
ఈ మొదటి అధ్యాయము మొత్తానికి మూల సందేశము ఇదే, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు,దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రంలో ధ్యానించేవాడు ఎందుకు ధన్యుడు అని అంటే, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని వాక్యము, దేవుని నోటి నుంచి వెలువడిన మాటలు, అవి ఆత్మయు జీవమునై యున్నవి, కాబట్టి దివారాత్రములు ఆ జీవాన్ని, జీవము కలిగిన ఆ సన్నిధిని, దేవుని వాక్యము ద్వారా, ఎవరైతే పొందుతూ ఉంటారో,

వారు ఆకు వాడకుండా జీవమును కలిగి, పచ్చగా ఉండే, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు,నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు,జీవాన్ని కలిగి పచ్చగా ఉండటానికి గల కారణం, అది ఎల్లప్పుడూ నీటిని తన వేర్లతో పీల్చుకుంటూ ఉంటుంది.

ఈ రెండు వచనాల ప్రకారము నడిచిన, వారిలో మూడవ వచనము నెరవేర్పు అన్నది జరుగుతుంది,

దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించువారు, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టువలె ఉంటారు. వారు తమ కాలములో ఫలమిచ్చే వృక్షంలా నిలబడతారు, అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది.

ఇక్కడ నీరు అనేది దేవుని వాక్యానికి సూచన. చెట్టు అనేది మనిషి. ఎవరు వాక్యమనే నీటి దగ్గర నాటబడతారో, వారు ఆత్మయు జీవమునై యున్న దేవుని వాక్యపు సన్నిధి ద్వారా ఫలిస్తారు. వారు చేయు ప్రతి ప్రయత్నంలో విజయాన్ని పొందుతారు.

వాక్యమనే నీటిని, దివారాత్రములు పొందినవారు, ఎందుకు విజయాన్ని పొందుతారు, అని అంటే,
వాక్యము అను నామము కలిగిన క్రీస్తు యేసు ప్రభువు వారు, లోకమును శరీరాన్ని సాతాన్ని మరణాన్ని కూడా జయించి తిరిగి లేచారు కాబట్టి, వాక్యము అను నామము కలిగిన యేసు క్రీస్తు ప్రభువు వారి సన్నిధి మాత్రమే మనకు విజయాన్ని ఇస్తుంది,

తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును,

దేవుడు ఇచ్చిన వాక్యము వాగ్దానం = వాక్యము అనే నీటికి సూచనగా వుంది,

విశ్వాసంలో నిలిచి ఉండుట = దేవుని వాక్యము అనే నీటిలో నాటబడిన చెట్టుకు అంటే దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించే వారికి సూచనగా ఉంది,

ఫలము = దేవుడు నిర్ణయించిన సమయానికే కనబడే ఫలితము,

కీర్తనలు మొదటి అధ్యాయము మూడవ వచనమును నేను చదువుతూ ఉన్నప్పుడు,"తన కాలమందు" అన్న వాక్యమును నేను ధ్యానం చేస్తూ వచ్చాను, తన కాలం అంటే ఏమిటి ?
ఉదా:

ప్రతి సంవత్సరానికి మనము దేవుని దగ్గర ఒక వాగ్దానమును తీసుకుంటూ ఉంటాము. ఆ వాగ్దానం ఆ సంవత్సరములోనే, దాని సమయము దాటకముందే నెరవేరుతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాక్యపు నీటిలో మనము ఒక చెట్టు వలె నాటబడి ఉంటాము. ఆ సంవత్సరమంతా ఆ వాగ్దానంలో విశ్వాసంతో నిలిచి, దాని నెరవేర్పు కొరకు ఎదురుచూస్తూ ఉంటాము. అందువల్ల, ఆయన నిర్ణయించిన సమయములో దాని ఫలము కనబడుతుంది. దేవుడు ఇచ్చిన వాక్యం — ఆ వాగ్దానం — తన కాలమును దాటిపోదు.

అలాగే ప్రతి విషయంలోను, ప్రతి సందర్భంలోను దేవుని వాగ్దానాలను వాక్యమనే నీటిలో మనము విశ్వాసంతో, నిలబడినప్పుడు, స్థిరపడినప్పుడు, ఫలము – ఫలితము – విజయము అనేవి ఆయన నిర్ణయించిన తన సమయానికే మనకు ప్రత్యక్షమౌవుతాయి. యిదే తన కాలమందు ఫలమిచ్చేచెట్టు అని అంటే,

అతడు చేయునదంతయు సఫలమగును.

"అతడు చేయునదంతయు సఫలమగును” కీర్తనలు 1:3 వ వచనంలో వున్న ఈ వాక్యము చాలా శక్తివంతమైన వాగ్దానం.

దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించే వారి ప్రయత్నములు, ఎందుకు సఫలమవుతాయి,అని అంటే,

  1. దేవుని వాక్యం దేవుని జీవముతో నిండి వున్నది.

దేవుని వాక్యం మనకు, మన మార్గాలకు దీపం లాంటివి,కీర్తనలు 119:105
(నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. దేవుని వాక్యం ప్రకారం నడిచే వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. వారి మార్గంలో దేవుని వాక్యం అనే ప్రకాశం ఉంటుంది కాబట్టి,

2. దివారాత్రములు చదవడం = మన మనసు,మన హృదయము, దేవునితో,దేవుని వాక్యము తో ఏకత్వాన్ని కలిగి ఉండటం,

దేవుని వాక్యమును, మనము ఎల్లప్పుడు చదువుతూ ఉన్నప్పుడు, మనము తీసుకునే నిర్ణయాలు,ఆలోచనలు,మనం మాట్లాడే వాక్కులు మాటలు అన్నీ కూడా దేవుని చిత్త ప్రకారము, దేవునికి ఇష్టంగా అవి మారుతాయి. అందువల్ల మనము చేసే పనులు వ్యర్థముగా ఉండవు, అవి దేవుని ఆలోచనలతో కలుస్తాయి కాబట్టి, ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి, అవి స్థిరపరచబడతాయి.

3. దేవుని వాక్యమును మనము చదువుతూ ఉన్నప్పుడు, అది మనలో విశ్వాసాన్ని పెంచుతుంది.
మనలో విశ్వాసం రాకుండా ఎలాంటి ప్రయత్నం కూడా సఫల మవ్వదు

హెబ్రీయులకు 11:6
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

దేవుని వాక్యమును ధ్యానించుట వలన మన విశ్వాసము బలపరచ బడుతుంది, విశ్వాసంతో మనము చేసే పని,ప్రయత్నం సఫలం అవుతుంది,

అంటే," సఫలం" అనే
రహస్యం మన శ్రమలో లేదు, మనం ఎవరితో నడుస్తున్నాము ఆనే దానిలో ఉంది.
దేవుని వాక్యాన్ని దివారాత్రములు చదివే వ్యక్తి, ప్రతి పనిని దేవుని ఆలోచనలో జరిగేలా చేస్తాడు. అందుకే అతడు చేయునదంతయు సఫలమగును.

"దుష్టులు,గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు."
ఈ వాక్యంలో దేవుడు నీతిమంతులు, దుష్టులు మధ్యలో ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తున్నారు.

పొట్టు అంటే ధాన్యం దంచేటప్పుడు గింజ చుట్టూ ఉండే బలహీనమైన పొర. అది బరువు లేకుండా గాలిలో ఎగిరిపోతుంది. గాలి చెదరగొట్టిన పొట్టు అంటే శాశ్వతమైన స్థిరత్వం లేకుండా ఎగిరిపోయే దాని పరిస్థితిని సూచిస్తుంది.

ఈ వాక్యములో దుష్టుల పరిస్థితి అలాంటిదని,ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్నది, దుస్టులు వారు, వారి సామర్థ్యములు, ఈ లోకంలో ఎంత బలంగా కనబడినా, దేవుని సమక్షంలో వారికి తేలిపోయే స్వభావమే కానీ వారికి, కదలకుండా ఉండే బరువు,స్థిరత్వం ఉండదు. వారు నిలకడ లేకుండా, శాశ్వతమైన విలువ లేకుండా ఆవుతారు.

🌾 నీతిమంతులు ధాన్యపు గింజలవంటి వారు, విలువైనవారు, సేకరింపబడతారు, దేవుని భద్రతలో దాచబడతారు, ఉంచబడతారు.
దుష్టులు మాత్రం పొట్టువంటి వారు వ్యర్థమైనవారు, గాలిలో ఎగిరిపోయే వారు, చివరికి నాశనం పొందే వారు.

ఈ వాక్యమును బట్టి మనము గ్రహించవలసినది ఏమిటంటే దేవుని వాక్యమే మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది మనము ఏ ప్రయత్నం చేసిన అందులో మనము స్థిరంగా ఉండాలి అని అంటే దేవుని వాక్యము వాగ్దానము అదే మనలను మన ప్రయత్నాలను స్థిరపరుస్తుంది.

గాలికి ఎగిరే పొట్టుల మనము ఉండకూడదు అని అంటే, దేవుని వాక్యమును మన ఆధారం చేసుకుని జీవించాలి,

ఈ వాక్యం రెండు ప్రధాన సత్యాలను మనకు తెలియజేస్తుంది:

  1. న్యాయవిమర్శలో దుష్టులు నిలబడలేరు

దేవుడు స్థాపించిన న్యాయా సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలి. అక్కడ మానవుడు చేసిన ప్రతి ఒక్క పని, అతని హృదయ స్థితి అంతా కూడా అక్కడ దేవుని ఎదుట బహిర్గతం కావాల్సిందే, .

దుష్టులు అక్కడ తమను సమర్ధించుకోలేరు, దేవుని న్యాయం ముందు నిలబడలేరు,

ప్రకటన గ్రంథం 20:12
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

2. నీతిమంతుల సభలో పాపులు నిలువరు,

దేవున్ని విడచి పెట్టేవారు కచ్చితంగా భక్తిహీనులే, వారు పశ్చాత్తాపం లేని పాపులు గానే గుర్తించబడతారు, వీరు దేవుని ప్రజల సమాజంలో భాగముకాలేరు.

ఇక్కడ “సభ” అంటే దేవుని సన్నిధిని కలిగి ఉన్న సత్యమైన సంఘాము, దేవుని వాక్యానికి లోబడినవారి సమూహం.

కొన్నిసార్లు దేవుని ప్రజల సమూహంలో పాపాన్ని విడిచిపెట్టని ప్రజలు ఉన్నట్లు మనకు కనపడవచ్చు, కానీ దేవుడు అక్కడ ఆ సమూహమును పరిశుద్ధ పరచే సమయం వచ్చినప్పుడు,గోధుమలు గురు గులు లాగ వేరుపడతారు,

దుష్టులు తాత్కాలికంగా విజయవంతమైనట్లు కనిపించవచ్చు, కానీ దేవుని తుదిన్యాయములో వారు నిలువరు.అందుకే మనము మన హృదయ స్థితిని పరిశీలించుకొని, పాపం నుండి ప్రత్యేకపరచబడి నీతి మార్గంలో నడవాలి.

దేవుడు ప్రత్యేక పరుచుకున్న నీతిమంతుల సమూహంలో నిలబడగలుగుటే నిజమైన ఆశీర్వాదం.

ఈ వాక్యం మనకు చివరి తీర్పు గురించి మాత్రమే కాకుండా, ఇప్పుడే మన స్థితిని పరిశీలించుకోవాలని హెచ్చరిస్తుంది. దుష్టులు న్యాయవిచారణలో నిలువలేరు, పాపులు నీతిమంతుల సమాజంలో నిలబడలేరు. కాబట్టి, మనము దేవుని వాక్యమునకు లోబడి, పరిశుద్ధుల సమూహంలో భాగమై, తుదిన్యాయదినాన ధైర్యంగా నిలబడగలిగేటట్లు మనము సిద్ధపడాలి,

ఈ వచనం మొత్తం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయమునకు ఒక సారాంశం లాంటి మాట, ఇది రెండు మార్గాలను స్పష్టంగా మనకు చూపిస్తుంది,

  1. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును.

ఇక్కడ “తెలియును” అన్న పదం కేవలం దేవుడు గుర్తిస్తాడు అని కాదు, ఆయన కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, తన సన్నిధి ద్వారా మనలను నడిపిస్తాడు అన్న అర్థము వస్తుంది.

నీతిమంతుల మార్గం దేవుని దృష్టిలో ఉంటుంది. వారు తీసుకునే ప్రతి అడుగు ఆయన ఆధీనంలో ఆయన పరిరక్షణలోనే ఉంటుందిఅన్న భావాన్ని ఈ వాక్యము కలిగి ఉంది.

2. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును

దుష్టులు యొక్క జీవితం తాత్కాలికంగా బాగున్నట్లే అనిపించిన మనకు అలా కనిపించిన, అది చివరికి నాశనానికి తీసుకెళుతుంది. ఆ మార్గంలో నడిచే వారు దేవుని సన్నిధిని కోల్పోతారు, నిత్యజీవం నుండి వేరుపడతారు.

ఈ కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము 6 వ చివరి వచనం మన జీవితము దుస్టుల మార్గము వైపా నీతిమంతుల మార్గం వైపా.ఏ దిశలో ప్రయాణిస్తుందో పరిశీలించుకోమని ,ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది.

కీర్తనల మొదటి అధ్యాయం మన జీవితానికి రెండు స్పష్టమైన మార్గాలను చూపిస్తుంది.

ఒకటి నీతి మార్గం — దేవుని వాక్యాన్ని ప్రేమించి, దానిలో నాటబడిన జీవితం;

మరొకటి దుష్టుల మార్గం —ఈ మార్గము తాత్కాలికంగా బలంగా కనిపించినా, చివరికి నాశనానికి నడిపిస్తుంది. నిజమైన ధన్యజీవితం దివారాత్రులు దేవుని వాక్యమును చదువుతూ, దేవుని వాక్యములో ఆనందిస్తు, దేవుడు మనకు తెలిపిన మార్గంలో నడవడమే, నిజమైన ధన్యకరమైన జీవితం.

కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము యొక్క తుది సారాంశము ఏమిటంటే,

నీతిమంతులు నీటి ప్రవాహాల యొద్ద ఉన్న వృక్షంలా వారు స్థిరమైనవారు.

దుష్టులు గాలికి ఎగిరిపోయే పొట్టు వలె అస్థిరతను కలిగిన వారు.

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుస్తుంది, దుష్టుల మార్గము నాశనమునకు నడిపిస్తుంది.
అన్న ప్రాముఖ్యమైన సత్యము చివరగా మనము గుర్తించవలసి ఉంది.

ఎస్తేర్ క్రైసోలైట్
20 - 9 - 2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨