CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

కీర్తనల వాగ్దానం & పరిశుద్ధాత్మ శక్తి భూదిగంతముల వరకు సాక్షిగా

కీర్తనలు 2:1
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
కీర్తనలు 2:2
మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పార వేయుదము రండి అని చెప్పుకొనుచు
కీర్తనలు 2:3
భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
కీర్తనలు 2:4
ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు.
కీర్తనలు 2:5
ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును.
కీర్తనలు 2:6
నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.
కీర్తనలు 2:7
కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.
కీర్తనలు 2:8
నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
కీర్తనలు 2:9
ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు.
కీర్తనలు 2:10
కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.
కీర్తనలు 2:11
భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
కీర్తనలు 2:12

ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

ఈ కీర్తనలు రెండవ అధ్యాయంలో 12వ వచనములు ఉన్నవి ఇందులో ఎనిమిదవ వచనం గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం,

కీర్తనలు 2:8 వ వచనమును ఇక్కడ మనము గమనించి నట్లయితే "నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను."

ఈ వాగ్దానంలో మనము గమనించినట్లయితే కీర్తనలు 2:8 వ వచనము మరియు అపొస్తలుల కార్యములు 1:8 వ వచనము ఒకే నెరవేర్పుని సూచిస్తున్నాయి.

ఈ రెండు వచనాలు:

అపో.కార్యములు 1:8
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

దేవుడు కీర్తనలలో తన కుమారునికి ఒక గొప్ప వాగ్దానం చేశాడు – జనములన్నిటినీ ఆయనకు స్వాస్థ్యముగా ఇవ్వడం. అది కేవలం ఇశ్రాయేలుకు పరిమితమై ఉండే వరం కాదు; ప్రపంచమంతటికి వ్యాప్తి చెందే వాగ్దానం. ఈ వాగ్దానం నెరవేరడానికి మార్గం అపొస్తలుల కార్యములు 1:8లో చూపబడింది.

యేసు తన శిష్యులకు పరిశుద్ధాత్మ వాగ్దానం ఇచ్చాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వారు సువార్తను తీసుకుని భూమి చివర దాకా తీసుకుని వెళ్లగలరు. అంటే కీర్తనలలోని వాగ్దానం “జనములు నీకు స్వాస్థ్యం అవుతాయి” అని చెప్పబడితే, అపొస్తలుల కార్యములలో దానికి మార్గం చూపబడింది – “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందెదరు” అని.

రెండు వచనాలు కలిపి చూస్తే ఒక సమగ్ర మైన దృశ్యం మనకు కనబడుతుంది:

కీర్తనలలో ఒక లక్ష్యం వ్రాయబడి ఉంది, జనములు ఆయనకు వారసత్వం కావాలి అని.

అపొస్తలుల కార్యములలో దానికొరకు సాధన ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ జనములను చేరుకోవాలి అని.

ఇది మనకు ఏమి చెబుతోంది?
మన స్వంత శక్తితో జనములను ప్రభువుకు గెలవలేం ఇవ్వలేము. కీర్తనల వాగ్దానం మన ముందు ఉన్నదే గాని, అది పరిశుద్ధాత్మ శక్తి లేనిదే అది మన జీవితంలో నెరవేరదు. నీతిని గూర్చి పాపమును గూర్చిమనలను ఒప్పింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవ్వరికీ మనము సువార్త చెప్పిన అది ఫలించదు, ఫలితాన్ని ఇవ్వదు, దేవునికి మనము జనములు అనే స్వాస్థ్యమును మనము సంపాదించలేము,

అందుకే పరిశుద్ధాత్మ నింపుదలను మనం అడిగినప్పుడు,దేవునికి స్వాస్థముగా ఉండే జనములను మనము దేవుని కొరకు సంపాదించ కలుగుతాము. భూదిగంతముల వరకు దేవునికి
దేవునికి సాక్షులై మనము ఉంటాము.

లూకా 11:13వచనాలలో ఉన్నట్లు,
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.దేవుడు ఇస్తున్న అత్యుత్తమ వరం పరిశుద్ధాత్మ, మన బలహీనతలను సరి చేసేది, మనలను నడిపించేది, దేవుని చిత్తములో వుండేలా చేసేది ఈ పరిశుద్ధాత్మనే. కాబట్టి మనం ధైర్యంగా అడిగినప్పుడు ఆయన ఎంతో నిశ్చయముగా మనకు పరిశుద్ధాత్మను ఇస్తాడు.

ఈ వాక్యము ఆధారంగా
దేవుని కొరకు జనములను సంపాదించడానికి పరిశుద్ధాత్మ నింపుదలను మీరు అడుగుతారు కదా!

ఎస్తేర్ క్రైసోలైట్
21-9-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨