CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

ప్రార్థన మనము ఈ లోకంలో ఉన్నంతవరకే మనతో ఉంటుంది, స్తుతి మనము వెళ్లే పరలోకం వరకు మనతో వస్తుంది,

కీర్తనలు 117:1
యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది....... ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.
కీర్తనలు 117:2
కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతిం చుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.

ఇది కీర్తనల గ్రంథంలో 117 వ అధ్యాయము ఇది ఈ అధ్యాయము అన్నిటి కంటే చిన్న అధ్యయం,ఇందులో ఒకటి రెండు వచనాలు,మాత్రమే ఉన్నవి,కీర్తనల గ్రంథము మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది,దేవుని సమాధానము మనలను ఆవరిస్తుంది, ఈ వాక్యాలు అన్నీ కూడా మనము దేవుణ్ణి ప్రార్థించేటట్లు, స్తుతించేటట్లు, ఇందులోని వాక్యాలు ఉంటాయి,

క్రైస్తవుని ఆత్మ సంబంధమైన విషయాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు, ప్రార్ధన, స్తుతి,

  1. ప్రార్థన (Prayer)
    ప్రార్థన అనేది ఇది దేవునితో నేరుగా మనము జరిపే సంభాషణ.

మన అవసరాలను, కృతజ్ఞతతో, నమ్మకంతో, ప్రార్థన ద్వారా మన హృదయాన్ని దేవునికి సమర్పించడం.

1థెస్సలొనికయులకు 5:17-18
యెడతెగక ప్రార్థనచేయుడి;
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

ఫిలిప్పీయులకు 4:6
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

ఇక్కడ ప్రాధాన్యత దేనికి అని అంటే, వ్యక్తిగతంగా,స్పష్టంగా మనము దేవునితో చేసే సంభాషణకు,దేవునితో మనము చేసే ప్రార్థన అనే ఈ సంభాషణలో మనము మన శరీర సంబంధమైన జీవితానికి అవసరమైన వాటిని గురించి దేవున్ని అడగవచ్చు, మన ఆత్మ సంబంధమైన విషయాలకు సంబంధించిన వాటి గురించి కూడా మనము దేవున్ని అడగవచ్చు,

దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనలను దేవుడు విస్తరింప చేయాలని కూడా మనము అడగవచ్చు, మన అవసరత అది ఏదైనాప్పటికిని, దేవునితో మనము చేసే సంభాషణ, మన అవసరతలు కొరకు దేవున్ని అడగటం, దేవునితో సంభాషణ చేయడం,అన్నది మాత్రమే ఈ ప్రార్థనలో మనకు కనబడుతుంది,

2. స్తుతి / కీర్తన

దేవుని మహిమను, దేవుని పరిశుద్ధతను, దేవుని శక్తి సామర్ధ్యములను, దేవుని బల ప్రభావములను గుర్తించి, అవి ఎంత గొప్పవో వాటిని బట్టి దేవున్ని ఆరాధించడం అనేది, దేవున్ని స్తుతించటం లోకి వస్తుంది,

అంటే మన పాటల ద్వారా, మన నోటితో చేసే స్తోత్ర అర్పణ ద్వారా, మన హృదయములో నుంచి వచ్చే భక్తి అర్పణ ద్వారా, దేవుని మహిమను గుర్తించి అంగీకరించి స్తుతించడం,ఇది దేవునికి మనము చెల్లించే స్తుతి,

కొంతమంది మన అవసరతల కొరకు దేవునితో మనం చేసే ప్రార్థన సంభాషణల కొరకు,అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు, మరి కొంతమంది దేవుడు ఏమై ఉన్నాడో అన్న గుర్తింపును గ్రహించిన వారిగా, వాళ్ళు ఇంకా దేని కొరకు ఎక్కువగా ప్రార్థించ లేరు కానీ పాటల ద్వారా,స్తోత్ర వాక్యాలు ద్వారా దేవునితో యెడతెగని స్తుతి సహవాసమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటారు,

చాలా సమయంలో నాకు కలిగిన అనుభవాలలో ఏ విషయంలోనైనా దేవుడు నాతో సూటిగా మాట్లాడినప్పుడు, నాకు అప్పుడు వెంటనే ఏమని అనిపిస్తుంది అంటే, అప్పటివరకు నేను దేవున్ని ప్రార్థించిన ఆ అవసరత నాకు ఇంకా వద్దు, నాకు దేవుడు మాత్రమే కావాలి, ఆ క్షణాన దేవున్ని మాత్రమే నేను కలిగి ఉండాలి, ఆ దేవున్ని నేను చూడాలి, అన్న ఆతృత నాలో కలుగుతూ ఉంటుంది,

దేవునికి నాకు మధ్య జరిగిన ఆ సంభాషణ ద్వారా,నాలో ఒక ప్రార్థన అన్నది రాదు, కానీ పాటల ద్వారా దేవున్ని ఆరాధించే స్తుతి మాత్రమే నాలో నుంచి వస్తుంది,

ప్రార్థించే ఆత్మను గురించి బోధించేటప్పుడు, స్తుతించే ఆత్మను కించపరచకూడదు, అవమానపరచకూడదు. దానిని తక్కువగా చూడకూడదు,

దేవుణ్ణి మనము ప్రార్థిస్తే మన సమస్త అక్కరలు అవసరతలు తీరుస్తాడు, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు, అని మనము దేవునితో చేసే సంభాషణను ఎంత ప్రాముఖ్యమైనదిగా గుర్తిస్తున్నామొ,

దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఎంత ప్రభావం గలవాడు, అన్నిటికంటే ముఖ్యంగా మన కొరకు తాను ఏమి చేశాడో, అన్న సత్యమును మనము గ్రహించినప్పుడు,అప్పుడు స్తుతి ద్వారా, మనము దేవునితో చేసే సంభాషణ అది కూడా అంతే ప్రాముఖ్యమైనది అని, ప్రార్థించే వారు,ప్రార్థన ప్రాముఖ్యతను గ్రహించిన, ప్రతి ఒక్కరూ కచ్చితంగా దీనిని గుర్తించి తీరాలి,

పరలోకంలో దేవున్ని స్తుతించే ప్రధానమైన వ్యక్తిగా ఉన్న లూసిఫర్, తన స్థానాన్ని దేవుని దగ్గర పోగొట్టుకున్నప్పుడు, తన స్థానంలోకి దేవుని ఆరాధించే ఒక సమూహాన్ని దేవుడు తీసుకురావాలి అని సార్వత్రిక సంఘామును దేవుడు సిద్ధపరుస్తున్నాడు,

మన అవసరతల కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవునితో మనము చేసే ప్రార్థన అనే సంభాషణ,అది ఈ లోకంలో మనము జీవించి ఉన్నంతవరకే,

కానీ నిత్యత్వం వరకు,మనతో పాటు వచ్చేది, పరలోకంలో మనం చేయగలిగేది, దేవున్ని ఆరాధించ గలిగేటట్లు చేసేది ప్రార్థన కాదు, స్తుతి మాత్రమే, అందుకే దావీదు కీర్తనల గ్రంథంలో ఇలా వ్రాశాడు,

కీర్తనలు 34:1
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.

అందుకే పరలోకంలో మనము చేయబోయే స్తుతిని ఈ లోకంలో పాటల ద్వారా,అభ్యాసం చేసుకునేవారిని, స్తుతించే ఆత్మను కలిగిన వారిని, మనం అవమాన పరచకూడదు, వారిని, వారి పాటలను, గురుకులతో పోల్చకూడదు,ఎందుకు అంటే, మన నోటి నుండి వచ్చిన,దేవునికి అనుకూలముగా లేని, ప్రతి మాట మనకు తీర్పును తీరుస్తుంది కాబట్టి,

అందుకే ఎవరైనా కానీ “ప్రార్థన మాత్రమే ముఖ్యం, కీర్తన అంత ముఖ్యం కాదు” అని భావిస్తే,
ఇది పూర్తిగా correct కాదు అని మనము గ్రహించాలి.

అందుకే బైబిల్ ప్రకారం,ప్రార్థన + స్తుతి = సంపూర్ణమైన ఆత్మసంబంధమైన జీవితం,ఈ రెండిటిని ఎవ్వరు కూడా వేరుపరచకూడదు,

ఎస్తేర్ క్రైసోలైట్
27-9-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨