2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
🌾 చూసి నమ్మినవారికన్నా చూడక నమ్మినవారు ధన్యులు 🌾
యోహాను 20:29
యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు, “నీ సంతానం ఇసుక రేణువుల్లా విస్తరిస్తుంది” అని వాగ్దానం చేశాడు. దేవుడు తనకి వాగ్దానం ఇచ్చిన ఆ సమయంలో తనకి సంతానం లేదు, కానీ ఆ వాగ్దానం తన కాలంలో నెరవేరలేదు. అయినా అబ్రహాము దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఎందుకు అని అంటే తనతో మాట్లాడిన దేవుడు సజీవుడు,సజీవంగా ఉన్న దేవుడు అని, అబ్రహాము గ్రహించాడు, గుర్తించాడు, నమ్మాడు,విశ్వసించాడు కాబట్టి,
ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకరు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, అని మనకు మాత్రమే తెలుస్తుంది, కాని ఇంకొకరికి ఎలా తెలుస్తుంది,తెలవదు, అలానే దేవుడు ఒక విషయంలో మనతో మాట్లాడిన, తన పరిచర్య కొరకు మనలను పిలిచిన,దేవుడు మనకు ఏదైనా బాధ్యతను అప్పగించిన, దాని విషయంలో దేవునికి మనకు మధ్య ఏం జరుగుతున్నది అన్నది, మనకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఇంకొకరికి అసలు తెలవదు,
30 సంవత్సరాల క్రితం,దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలిచాడు, అందరికీ కనపడే రీతిలో,అందరిలా దేవుడు నన్ను వాడుకోవటం లేదు,దేవుడు నాకు ఇచ్చిన పిలుపు వేరే, నన్ను వాడుకుంటున్న విధానం వేరే, నా కుటుంబంలో, నా బంధువుల మధ్య, నేను నివసిస్తున్న సమాజం మధ్య, ఒక్క సంవత్సరం కూడా వ్యర్థం కాకుండా దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు, నన్ను ఎలా నడిపిస్తున్నాడు, అది నాకు మాత్రమే తెలుసు, అది ఇంకొకరికి ఎలా తెలుస్తుంది, తెలవదు,
చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు, దేవుడు నన్ను వాడుకోవటం లేదు అని,కానీ దేవుడు నాకు ఏ పరిచర్యను అప్పగించాడు, ఎ బాధ్యతను ఇచ్చాడు, నాతో ఎలా మాట్లాడి నన్ను నడిపిస్తున్నాడు,
నా జీవితంలో వచ్చే పోరాటాలు ఎందుకు, ఎటువంటి ఉద్దేశంతో ఆవి వస్తున్నాయో, దాని ద్వారా దేవుడు ఏమి చేస్తున్నాడు, అన్న విషయం కూడా నాకు మాత్రమే అర్థం అవుతుంది,
కాబట్టి నేను అస్సలు భయపడటం లేదు, అందరికీ కనపడే రీతిలో దేవుడు నన్ను వాడుకోవటం లేదు, అని నేను ఎప్పుడూ బాధపడలేదు, కానీ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, అని యేసు చెప్పిన వాక్యమును, దేవుడు నన్ను పిలిచాడు అన్న వాస్తవాన్ని నమ్మని వారికి మాత్రం,వారి దృష్టిలో నేను దేవుని ఉద్దేశంలో లేని వ్యక్తినిగా కనపడుతూ ఉంటాను,
అబ్రహాముకు దేవుడు {ఆదికాండము 22:17}
నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను;
నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని,
{ ఆదికాండము 12:7 } దేవుడు చేసిన ఈ ప్రమాణమును ఇప్పుడు మనము నమ్ముతున్నాము అబ్రహములో దేవుడు తన వాగ్దానాన్ని తాను చెప్పిన మాటను నెరవేర్చాడు అని,
ఎందుకు అని అంటే, అబ్రహముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం యాకోబులో నెరవేరి ఇశ్రాయేలు అనే ఒక దేశం ఇప్పుడు మనకు కనపడుతుంది కాబట్టి,
ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులకు క్రీస్తు యేసు ప్రభువు వారి ద్వారా ఆశీర్వాదకరంగా ఉన్నారు కాబట్టి, అబ్రహాము సంతానము ఇసుక రేణువుల వలె ప్రపంచమంతా విస్తరించింది అని, మనము చూసిన దానిని బట్టి ఇప్పుడు నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము,
కాని అప్పటి సమాజం, ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెరవేర్పును చూడలేదు కాబట్టి, అబ్రహామును హేళన చేసి ఉండవచ్చు, “ఎక్కడ ఉంది దేవుడు నీకు నెరవేర్చిన వాగ్దానం?” అని ప్రశ్నించి ఉండవచ్చు. కానీ అబ్రహాముకి ఒక్కటి తెలుసు, తనతో మాట్లాడింది,తనకు వాగ్దానము ఇచ్చింది, తనను పిలిచింది, సజీవుడైన దేవుడే అని.
ఇది చాలు, మనలను పిలిచింది మనతో మాట్లాడుతున్నది, మనలను నడిపిస్తుంది, సజీవుడైన దేవుడు, ఆ దేవుడు సజీవంగా ఇంకా జీవించే ఉన్నాడు,అన్న ఒక్క సత్యం మనకు, ఎప్పటికీ గుర్తు ఉంటే అది చాలు,
ఇప్పటికి కూడా మనకు,మనము నమ్మవలసినది మనము వెంబడించవలసినది ఈ సూత్రమునే,
దేవుడు తన పని కొరకు ఎవరిని పిలుస్తాడో, బాధ్యతను ఎవరికి ఇస్తాడో, వారితోనే ఆ సంగతులు మాట్లాడతాడు; వేరొకరితో కాదు.
ఓడను కట్టమని నోవాహుతోనే దేవుడు చెప్పాడు, వేరెవరినీ పంపలేదు. అందుకే నోవాహును విశ్వసించని వారు ఓడను కట్టటానికి నోవాహును దేవుడు పిలిచాడు అని,తనతో దేవుడు మాట్లాడుతున్నాడు అని, దేవుని మార్గంలోనే నోవాహును నడిపిస్తున్నాడు అని, దేవుడు నోవాహును వాడుకుంటున్నాడు అని, విశ్వసించని,అప్పటి ప్రజలు, వారు జలప్రళయములో మునిగిపోయారు. అబ్రహామును నమ్మని వారు కూడ అతని వాగ్దాన నెరవేర్పును చూడలేదు.
మన జీవితాల్లో కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు,దేవుడు మనలను తన పరిచర్య కొరకు పిలిచినప్పుడు, బాహ్యముగా అది ప్రజలందరికీ కనపడేటట్లు వెంటనే, అది మనలో నెరవేరకపోయినా, మన తరంలో కాకపోయినా, మన ముందు తరములో అయినా అది అందరికీ కనపడే రీతిలో అది తప్పక నెరవేరుతుంది.ఎందుకంటే మనలను నడిపిస్తున్నది, మనతో మాట్లాడుతున్నది, సజీవుడైన మనలను పిలిచిన దేవుడు కాబట్టి,
ఇటువంటి పరిస్థితులలో మనలను చూస్తున్న మన ప్రక్కవారు “నిన్ను దేవుడు పిలిచాడా?”
“ఏమి జరుగుతుంది నీ పరిచర్యలో?”
“ఏమీ ఫలితం మాకు కనిపించట్లేదు!”
"ఫలాలు నీలో ఏమి మాకు కనపడటం లేదు"అని ఇలా మనలను అడగవచ్చు,
కానీ మనకు ఒక సత్యం తెలిసి ఉండాలి,
మనతో మాట్లాడింది దేవుడే అని.
మనలను పిలిచింది అబ్రహాము దేవుడే అని,
మన పరిచర్యను నడిపించేది ఆ దేవుడే అని.
మన వాగ్దానాలను నెరవేర్చేది కూడా ఆ దేవుడే అని.
దేవుడు మనలను ఎలా వాడుకుంటానికి పిలిచాడో దానిని, మనము చూడకపోయినా, మన ముందు తరాలు చూస్తాయి. అప్పుడు ఈరోజు మనలను ప్రశ్నించినవారే రేపు మన విశ్వాసాన్ని గుర్తిస్తారు.
మీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం వెంటనే కనిపించకపోతే,
దేవుడు మిమ్ములను పిలిచిన పిలుపు విషయంలో, మీరు కూడా అబ్రహాములా దేవుని పైన విశ్వాసం ఉంచగలరా?
ఎస్తేర్ క్రైసోలైట్
27-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨