CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

దేవుని ఇల్లు ప్రత్యేకముగా

“దేవుని ఇల్లు” అంటే బైబిలు ప్రకారం ప్రధానంగా రెండు అర్థాలు ఉన్నాయి:

  1. ఒకటి యాజకులు మాత్రమే పరిచర్య చేసే స్థలం, దేవుని ఆత్మ నివాసముండే, పరిశుద్ధమైన దేవుని మందిర స్థలం, యెరూషలేములోని దేవాలయం యొక్క పరిశుద్ధ స్థలం,(1రాజులు 8:10-13, 2 దిన 7:1-2).

  1. దేవుడు తన ఆత్మ ద్వారా, నివాసముండే మానవుని హృదయం, కొత్త నిబంధనలో విశ్వాసుల సంఘాం, క్రీస్తులో విశ్వాసులే దేవుని ఇల్లు
    (1 తిమోతికి 3:15; హెబ్రీయులకు 3:6;
    1 కొరింథీయులకు 3:16-17).

  1. పాత నిబంధనలో, దేవుని ఇల్లు (ఆలయం/గుడారం) పేరుతో ఎప్పుడూ అవి వేరుగా ఉండేది.

ప్రజలు నివాసముండే ఇళ్ళ తో అవి కలిసిపోలేదు. ఉదాహరణకు, షిలోహు లోని మందిర గుడారము (1 సమూయేలు 1:24), యెరూషలేములోని దేవుని ఆలయము (1 రాజులు 6 అధ్యాయం) ఇవి అన్నీ కూడా ప్రజల ఇళ్లల్లో కాకుండా వేరే ప్రాంతంలో నిర్మించబడినవి.

ఇది దేవుని పరిశుద్ధత, దేవుని గౌరవం అన్నది వేరుగా ఉంచబడిందని, అది ప్రత్యేకమైనదని ఇది మనకు చూపిస్తుంది.

2. కొత్త నిబంధనలో, దేవుడు మానవుడు కట్టిన కట్టడాలలో కాకుండా, మానవుని హృదయంలో నివసిస్తాడు,అన్న విషయాన్ని ఇది మనకు తెలియజేస్తుంది, (అపో. కార్యములు 7:48-49).

విశ్వాసులే దేవుని ఇల్లు. అంటే, మన ఇల్లు దేవుని ఇల్లుగా మారవచ్చు, ఎందుకంటే దేవుడు ఆత్మగా మనలో నివసిస్తున్నాడు.

“దేవుని ఇల్లు” (అంటే సంఘాం, ప్రార్థనా మందిరం) యివి వేరుగా ఏర్పాటుచేయబడుతాయి. అపొస్తలులు ప్రత్యేకంగా ఒకచోట కూడి ప్రార్థించారు, అని (అపో. కార్యములు 2:46; 12:12).ఆధారముగా
దీనిని మనము చెప్పవచ్చు,

భౌతికంగా,దేవుని ఇల్లు అంటే, (ఆలయం,సమాజమందిరం) మరియు మానవులు నివసించే ఇల్లు,ఇవి రెండు వేరు వేరుగా ఉంచబడటం అన్నది, బైబిలు విధానం.

ఆత్మీయంగా మన ఇల్లు కూడా దేవుని ఇల్లు కావచ్చు, ఎందుకంటే దేవుడు మనలో నివసిస్తాడు కాబట్టి.

అందువల్ల, రెండు దగ్గరగా ఉండవచ్చు, కానీ ఒకటి మరొకటితో కలిసిపోలేదు. దేవుని పరిశుద్ధతను,ప్రత్యేకముగా వేరుగా ఉంచాలని బైబిలు చెబుతుంది.

  1. ప్రిస్కిల్లా మరియు అకూల:

అపొ. కార్యములు 18:1-3, రోమా 16:3-5 ఇక్కడ
వాళ్లు తమ ఇంటిలోనే సంఘాన్ని ఉంచారు. వారి ఇంటిలోనే సంఘాం కూడు కూనేది అని బైబిలు చెబుతోంది.

2. లూదియా:
అపొ. కార్యములు 16:14-15,40
లూదియా తన ఇంటిని పరిచర్య కొరకు తెరిచింది. అక్కడే పౌలు, సీలా మొదలైనవారు ఆశ్రయం పొందారు.

3. ఫిలేమోను
ఫిలేమోను 1:1-2
“నీ ఇంటిలో కూడిన సంఘామునకు” అని పౌలు వ్రాశాడు.

ఈ మూడు ఉదాహరణలు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి, “దేవుని పని ప్రారంభంలో, ఇంట్లో మొదలవచ్చు అని”

కానీ కొన్ని సమస్యలు వస్తాయి? శత్రువు అంటే,సాతాను మన ద్వారా జరిగే, ప్రార్థనను,స్తుతి గీతములను, వాక్య సేవలను నిరోధించడానికి సమస్యలను కలిగిస్తాడు (1 థెస్సలొనీకయులకు 2:18). ఆవి కుటుంబం ద్వార కావచ్చు, పక్కవాళ్ల ద్వారా కావచ్చు, భౌతికముగా స్థలములాంటి సమస్యలు కూడా కావచ్చు.

సార్వత్రిక దేవుని సంఘాన్ని పరిశుద్ధ గ్రంథము స్త్రీతో పోల్చుతుంది. ఇది స్త్రీలకే పరిమితం కాదు. సంఘాం అంటే స్త్రీ, పురుషులు కలిసిన విశ్వాసుల సమూహం. చాలా సంవత్సరాల క్రితం, నా పుస్తక పరిచర్య కొరకు, భక్తి విశ్వాసముగల స్త్రీలు, పురుషులు ఇచ్చిన సంతకాలు, దైవజనులు నా కొరకు చేసిన ప్రార్థనలతో, నా సంఘాన్ని దేవుడు ప్రారంభించాడు.

అందువల్ల సంఘాము అనేది ఒక స్త్రీని సూచించునది కాదు, లేక పురుషుని సూచించునది కాదు; ఎవరో ఒకరికి మాత్రమే పరిమితమైనది అసలే కాదు. కానీ క్రీస్తులో ఉన్న విశ్వాసులందరినీ గూర్చి ఆది సూచిస్తుంది.స్త్రీతో పోల్చడం అనేది దేవుడు చూపించిన ఒక చూచన మాత్రమే.

నిర్గమకాండము 33:7
అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచువచ్చెను.

ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి:

  1. మోషే గుడారాన్ని పాళెమునకు వెలుపల కట్టాడు,
    ఇశ్రాయేలీయుల పాళెము అంటే వారి దినచర్య, వారి కుటుంబాలు, వారి ఇళ్ళు. మోషే ఆ గుడారాన్ని బయట కట్టడం ద్వారా, అది సాధారణ జీవితం నుండి వేరుగా,ప్రత్యేకంగా ఉందని చూపించాడు.
    ఇది “దేవుని సన్నిధి” సాధారణ పనుల మధ్య కాకుండా వేరుగా సిద్ధం చేయబడిన స్థలంలో,ఉండటం, కలవడం, అని సూచిస్తుంది.

  1. దేవుని సన్నిధి అక్కడికి వచ్చేది, గుడారంలో యెహోవా మేఘాముగా దిగివచ్చి మోషేతో మాట్లాడేవాడు, (నిర్గమకాండము 33:9–11). అందువల్ల, అది సాధారణ గుడారం కాదు; అది దేవునితో కలిసే సమావేశపు గుడారం,

పాత నిబంధనలో మోషే గుడారాన్ని పాళెము వెలుపల కట్టిన ఉదాహరణను,మనము చూస్తే, దేవుని ఇల్లు వేరుగా, మన ఇల్లు వేరుగా అని గుర్తించడం,మనకు ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతుంది. మోషే పాళేమునకు వెలుపల ఆ గుడారాన్ని కట్టడం ద్వారా, అది మానవుల శరీర సంబంధమైన,సాధారణ దినచర్యల నుండి వేరుగా, దేవుని సన్నిధి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన స్థలం అని చూపించాడు. అందులోనే దేవుడు మోషేతో మాట్లాడి, తన ప్రజలకు దిశానిర్దేశం ఇచ్చాడు. ఈ విధంగా, మన జీవితంలోనూ, మోషే చేసినట్లు, దేవుని కోసం ప్రత్యేక సమయాన్ని, స్థలాన్ని వేరుగా ఉంచడం అనేది చాలా ముఖ్యం.

మన జీవితంలో దేవుని కోసం ప్రత్యేక సమయాన్ని, స్థలాన్ని వేరుగా కేటాయించటానికే,మన వద్దకు కొన్ని పోరాటాలు వస్తూ ఉంటాయి,

శరీర రీతిగా కట్టబడిన మానవుని ఇంటికంటే, దేవుని పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి సభ్యులుగా చేర్చబడిన ఆత్మ సంబంధమైన ఈ దేవుని సంఘాము, పవిత్రమైనది,ఇది ప్రత్యేకమైనది, ఈ దేవుని సంఘాములో మనము ప్రార్థించిన, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్న, పాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉన్న, మన హృదయంలో చెప్పలేనంత ఆనందం కలుగుతు వుంటుంది,

యెషయా 56:7
"నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను" నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.అని ఇక్కడ వ్రాయబడ్డది,

దేవుని ఇంటికి కలిగిన ప్రత్యేకతను గురించిన ఈ విషయాన్ని బైబిలు ఆధారంగా,మాత్రమే కాకుండా, నా వ్యక్తిగత అనుభవము ద్వార కూడ నేను తెలియజేయాలని అనుకుంటున్నాను,

దేవుని పరిచర్యను నేను చేయాలని నా మినిస్ట్రీని నేను ప్రారంభించిన దగ్గర నుండి, దేవుడు నెమ్మది నెమ్మదిగా నన్ను ప్రత్యేక పరుస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితమే నేను నా ఇంటిలో ప్రార్థన కొరకు ఒక గదిని ఏర్పాటు చేసుకున్నాను.

ఆ గదిలోనే నేను పాటల ద్వారా దేవుని ఆరాధిస్తాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను, దేవున్ని ప్రార్థిస్తాను. చివరికి నా యూట్యూబ్ పరిచర్య కొరకు సిద్ధం చేసే ప్రతిదీ కూడా, నేను ప్రత్యేకపరచుకున్న ఆ ప్రార్థన గదిలోనే జరిగేది.

అయితే కొద్ది రోజుల క్రితం నుండి నా ప్రార్థనలకు, నా స్తుతి గీతములకు ఆటంకం రావడం మొదలైంది. మా పక్కన ఉండే తనకి నేను ఎక్కువగా ప్రార్థనలో ఉండటం, పాటలు పాడుకోవడం నచ్చలేదు. తన దృష్టిలో నేను ఒక పిచ్చిదానిలా కనబడుతున్నాను.

“చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులు ఎవరు కూడా నీ లాగా లేరు, నీకు పిచ్చి పట్టింది” అని తను నాతో అన్నప్పుడు, నాకు ఒక సత్యం అర్థమైంది. నా చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులకు నాలాంటి పిలుపు లేదు, పరిచర్య భారం లేదు. కానీ దేవుడు నన్ను పిలిచాడు. అందువల్ల నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, కలిగి ఉండాలన్న అలోచనతో ఉంటాను.

కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపు విషయంలో, పరిచర్య విషయంలో నేను చూపవలసిన ప్రత్యేకతను ఇంకా పూర్తి స్థాయిలో చూపలేక పోయాను, ఆత్మసంబంధముగా దేవుడు నాకు ఇచ్చిన సంఘాము అనే ఇల్లు, శరీర సంబంధమైన నా ఇల్లు, ఇవి రెండు కూడా వేరు వేరు ప్రత్యేకతలను కలిగి ఉండవలసినవి. కానీ అవి విడివిడిగా లేవు. కాబట్టి దేవుని దృష్టిలో నాకు కలిగి ఉన్న పిలుపు ఏమిటో నా చుట్టు వున్నవారు గుర్తించలేకపోయారు అన్న ఈ సత్యాన్ని దేవుడు నాకు తెలియజేస్తూ వచ్చాడు.

నేను చేస్తున్న పరిచర్య ప్రదేశం అంతా కూడా ప్రజల కంటికి ఒక ప్రత్యేకమైన రీతిలో కనబడాలి. నేను ఒక గృహిణిగా కాకుండా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని కలిగి ఉండే, దేవుని పరిచర్యను చేస్తున్న వ్యక్తిగా ఇతరులకు కనబడాలి అన్న సత్యాన్ని దేవుడు నాకు తెలియజేశాడు.

దేవుడు నన్ను ఎలా ప్రత్యేకపరుస్తూ వచ్చాడో గమనిస్తూ వచ్చినప్పుడు, ప్రస్తుతం నాకు వచ్చిన ఈ పోరాటం కూడా, నేను మాత్రమే కాకుండా నేను చేస్తున్న పరిచర్య ప్రదేశం అంతా ప్రత్యేకింపబడాలని దేవుడు అనుకుంటున్నాడని, నాకు అర్థం అయింది. నేను దేవుని పరిచర్యను చేసే ప్రత్యేకింపబడిన వ్యక్తిగా గుర్తింపబడాలి, నన్ను నేను ప్రత్యక్షపరచుకోవాల్సిన సమయం వచ్చింది.

అందుకే దేవుడు ఇటువంటి పోరాటాన్ని నాకు అనుమతించాడు, అని నాకు అర్థం అయినప్పుడు, నేను దేవున్ని నా ప్రార్థన స్థలమును, నేను దేవున్ని ప్రార్థించే, స్తుతించే, దేవుని వాక్యాన్ని ధ్యానించే, స్థలము అది ప్రత్యేకింపబడాలి అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తున్నాను,

దేవున్ని ప్రార్థించటానికి, స్తుతించడానికి, దైవ సంబంధమైన కార్యాల కొరకు మాత్రమే, అని మనము నిర్ణయించుకున్నప్పుడు,మనలను ఇంకా ఏది కూడా నిరోధించలేదు, మనము ప్రార్థించే మన ప్రార్థన స్థలము మీద, ఎవ్వరి అధికారము కూడా ఇక ఉండదు,

అందుకే మనకు వచ్చే కష్టాలలో, శ్రమలలో, ఇరుకు ఇబ్బందులలో, మన జీవితంలోనికి వచ్చే ప్రతి విధమైన పోరాటాలలో,ఇది ఎందుకు వచ్చింది ఇది రావడం పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? అని మనం ఆలోచించగలిగితే,శ్రమ ద్వారా, కష్టం ద్వారా, ఇబ్బంది ద్వారా, మనలను నిరోధించ గలిగిన సమస్యల ద్వారా కూడా, దేవుడిచ్చే మేలును మనము పొందగలుగుతాము,

మనకు కలిగే పోరాటాలు అనుకోకుండా వచ్చేవి కావు. ప్రతి పోరాటం వెనుక దేవుడు మనలను ప్రత్యేకపరచి, తన మహిమను మన ద్వారా ప్రజల ముందు ప్రత్యక్షం చేయాలనే ఉద్దేశం దేవునికి ఉంటుంది.

దేవుని మహిమను, దేవుని గుణాతిశయాలను ప్రకటించే దేవుని సంఘాన్ని దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడని అంటే, దాని ద్వారా ఆయన మహిమ ఇంకా ఎక్కువగా ప్రజలకు ప్రత్యక్షమవ్వాలని అర్థం. దేవుని ప్రజలమైన మనకు వచ్చే ప్రతి పోరాటంలో ఒక ఉద్దేశం ఉందని మీరు గ్రహిస్తున్నారా?

ఎస్తేర్ క్రైసోలైట్
29-9-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨