CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

దేవుని మర్మాలు, ఆయన హృదయంలో దాచిన నిధులు

ఈ సంవత్సరం అంతా నాకు నిధుల వేటలా ఉంది ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ దానిని చదువుతున్నప్పుడు కానీ ఏదైనా ఒక మాట గాని అంశం గాని నా ముందుకు వచ్చినప్పుడు దాని గురించి పరిశోధిస్తూ పరిశీలిస్తూ వస్తున్నాను అలా ఒక వర్తమానాన్ని వ్రాయగలుగుతున్నాను దానిని వ్రాసే వరకు మిగత అన్నిటిని పక్కన పెట్టేయాలన్న ఆసక్తి నాలో కలుగుతుంది దీనిని ఈ వర్తమానాలు ఎవరికి ఉపయోగ పడుతున్నాయో లేదో కూడా నాకు తెలియదు కానీ వ్రాయాలి అన్న ఒక తపన నాలో కలిగి రాస్తున్నాను దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చి నాకు తెలియజేస్తున్న సత్యాలను నేను వ్రాయటమే ఇది కూడ దేవుని పరిచర్యే అని దీనిని నేను విశ్వసిస్తున్నాను

ఈ సంవత్సరం నా వాగ్దానం "అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను." (యెషయా 45:3

పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు

"అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.")

" భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు." అన్న యెషయా43:1లోవున్న నా బాప్తిసం వాగ్దానం ద్వార ఈ వాక్యం ద్వార పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్య కొరకు పిలిచిన నా పిలుపును స్థిర పరచినప్పుడు

అప్పుడు నాకు తెలవదు దేవుడు నన్ను ఏ రీతిగా వాడుకోబోతున్నాడో

నన్నే కాదు దేవుని హృదయములో ఉన్న మర్మములను తెలుసుకోవాలని వాటిని గ్రహించాలని వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలని వాటి ప్రకారము జీవించాలని వాటిని ఇతరులకు అందివ్వాలని ఆశపడే ప్రతి ఒక్కరిని దేవుడు "పేరు పెట్టి నీవు నా సొత్తు" ఆని పిలుస్తున్నాడు.

దేవుడు తన హృదయంలో వున్న మర్మములను తెలియజేయటానికి సర్వ లోకంలో ఉన్న తన యందు భయభక్తులు కలిగి ఉండే ప్రజల నందరిని దేవుడు పిలుస్తున్నాడు.

దేవుడు తన వాక్యము ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను పిలిచినప్పుడు

దేవుని మర్మాలు, ఆయన హృదయంలో దాచిన నిధులు ఆనేవి మనకు దొరుకుతాయి

కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

1. దేవుని హృదయం అంటే ఏమిటి?

దేవుని హృదయం అనగా ఆయన అంతరంగిక స్వభావం –ప్రేమ, దయ, న్యాయం, పరిశుద్ధత, శాంతి, కృప, నమ్మకము – ఇవన్నీ కలసిన దేవుని వ్యక్తిత్వము.

దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆయన క్రియలను మాత్రమే కాక, ఆయన ఏందుకు చేస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, అనే కోణంలో మనము చూడాలి. కీర్తనలు 103:7

ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను

అంటే, మోషే దేవుని హృదయాన్ని దేవుని హృదయంలో ఉన్న వాటిని మాత్రమే చూస్తే, జనులు కేవలం దేవుడు చేసే చర్యలను చూశారు.

2. దేవుని మర్మములు అంటే ఏమిటి?

యుగాలకు అతీతమైన దేవుని ఆత్మీయ రహస్యమూ, గొప్ప ఉద్దేశమూ నే మర్మము అని అంటారు.

"మర్మము" అనేది దేవుని రహస్యమైన ఆలోచన, ఆయన ఆత్మ సంబంధమైన ప్రణాళిక, యుగాలను దాటి ఉండే గంభీరమైన ఉద్దేశం. ఇది సాధారణంగా మనుషులకు కనిపించదు బోధపడదు. ప్రపంచం దృష్టికి ఇది అపార్థమైనదైనప్పటికీ అంటే,ప్రపంచం దృష్టిలో దీనికి అర్థం లేకపోయినా, దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో ఇది అత్యంత విలువైనదిగా గొప్పదిగా నిలుస్తుంది.

ఇది ప్రపంచ దృష్టికి అపార్థమైనది, ఎందుకు :

యుగయుగాలనుండి దేవుడు దాచిన ఆత్మీయ రహస్యమయమైన దేవుని ఉద్దేశమైన మర్మము ఎందుకు ఈ ప్రపంచం దృష్టిలో అర్థం లేకుండ వుంది అంటే

దైవిక ఆలోచనలు మానవ జ్ఞానానికి అతీతం – దేవుని ఆలోచనలు మన ఆలోచనలా కాకుండా పరిపూర్ణమైనవి ప్రపంచం లాజిక్, విజ్ఞానం, అనుభవం ఆధారంగా చూస్తుంది; కానీ మర్మము విశ్వాసం ద్వారా మాత్రమే అర్థమవుతుంది.

యెషయా 55:8 -9

నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

ఆత్మీయ విషయాలు ఆత్మ ద్వారా మాత్రమే గ్రహించగలిగినవి – 1కోరింథీయులకు 2:14

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు ( ఈ లోక సంభందమైన శరీరసంబంధమైన మనుషులు ) దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

ప్రపంచం లాభనష్టాల దృష్టితో చూస్తుంది – దేవుని ఉద్దేశం చాలాసార్లు తక్షణ ఫలితాలకంటే అంటే — దేవుడు మన జీవితంలో తన ఉద్దేశాలను తక్షణ (తక్కువ కాలంలో కనిపించే) ప్రయోజనం కోసం కాకుండా, నిత్యమైన, శాశ్వతమైన, ఆత్మీయమైన మెరుగుదల కోసం తీర్చిదిద్దటామె దేవుని అసలు లక్ష్యం.

1. తక్షణ ఫలితాలు అంటే – మనం ఆశించే విజయాలు, సౌకర్యాలు, సమస్యల నుండి వెంటనే మనకు విముక్తి, భౌతిక అభివృద్ధి కలగటం. ఇవి తాత్కాలికమైనవి.

2. శాశ్వతమైన ఫలితాలు అంటే – మన ఆత్మ యొక్క పరిశుద్ధత, దేవునితో మనకు వున్న సంబంధం లోతుగా మారడం, వన విశ్వాసం పరిపక్వత చెందడం పరిపూర్ణతను కలిగి వుండటం, మరియు శాశ్వత జీవితానికి సిద్ధపడడం. ఇది మానవుల పట్ల దేవుని అసలు లక్ష్యం.

ఉదాహరణకు:

ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆవ్యక్తి బాధ తక్షణం తొలగించబడకపోవచ్చు. కానీ ఆ బాధ ద్వారా అతను అధిక విశ్వాసంతో, ఓర్పుతో, దేవునిపై ఆధారపడే వ్యక్తిగా మారుతాడు. ఇది దేవుడు చేస్తున్న "శాశ్వతలక్ష్యం".

రోమీయులకు 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

అంటే, మన ప్రార్ధనలకు వెంటనే ఫలితం జవాబు రాకపోయినా అది మనకు కష్టంగా కనిపించినా అనిపించిన, చివరకు అది మన ఆత్మీయ మెరుగుదలకే అభివృద్ధికే దారి తీస్తుంది.

దేవుడు మనకు తక్షణము వెంటనే యిచ్చే విజయం కంటే, శాశ్వతమైన మేలును, మన ఆత్మ సంబంధమైన అభివృద్ధిని, ఆయనతో ఉన్న బంధాన్ని అభివృద్ధి చేయడాన్ని ప్రాముఖ్య మైనదిగా చూస్తాడు. శాశ్వతమైన మేలును లక్ష్యంగా ఉంచటం అంటే ఇదే దైవిక పరిపూర్ణత,ఆత్మీయ శ్రేయస్సు,దేవునితో నిత్య సంబంధం,పరిపక్వమైన విశ్వాస జీవితం, పరిశుద్ధత వైపు ప్రయాణం యొక్క అర్ధం

దేవుడు మనకు ఇచ్చేది తాత్కాలిక సౌకర్యం కాదు, ఆత్మసంబంధమైన క్షేమము అనే శాశ్వత బహుమానమును సిద్ధం చేస్తున్నాడు.

మన కష్టాల మధ్య దేవుని ఉద్దేశం పరలోక ఆశీర్వాద ల వైపు మనల్ని నడిపించడమే.

అందుకే అపోస్తులుడైన పౌలు ఇలా అంటాడు:

1కోరింథీయులకు 2:9 -10

ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

"అంటే దేవుని మర్మాలు, ఆయన హృదయంలో దాచిన నిధులు — అవి ఆత్మవలననే తెలుస్తాయి."

దేవుని మర్మాలు ఎవరికి, ఎప్పుడు, ఎలా తెలిసిపోతాయి?

ఎవరికి?

దేవునియందు– భయభక్తులు వుంచిన వారికి.

దేవుని మాటను గౌరవించే, ఆయనకు విధేయత చూపించే వారికి మాత్రమే ఆయన తన అంతరంగములో తన హృదయములో వున్న విషయాలను వెల్లడిస్తాడు. కీర్తనలు 25:14

యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

ఎప్పుడు?

మనం ప్రార్థనలో, వాక్యధ్యానంలో, వినయంతో ఆయనను వెదుకుతుంటే,ఆయన సమయానికి,

మన హృదయం, ఆయన హృదయానికి సన్నిహితమయ్యే సమయంలో,

ఎలా?

దేవుని ఆత్మవలన,ఆయన వాక్యాన్ని ధ్యానించడం వలన,ఆత్మీయ సంబంధం వలన ,

కొన్ని బైబిల్ ఉదా:

1. అబ్రాహాము – దేవుని స్నేహితుడు:

అబ్రాహాము భయభక్తితో దేవునిని నమ్మాడు, అందుకే దేవుడు తన మర్మాన్ని అతనికి తెలిపాడు. ఆదికాండము 18:17

అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?

2. మోషే – ఆయన మార్గములను గ్రహించినవాడు:

ఇశ్రాయేలు జనులు దేవుని క్రియల్ని మాత్రమే చూశారు. కాని మోషే దేవుని హృదయాన్ని దేవుని

ఉద్దేశాన్ని గ్రహించాడు అర్థం చేసుకున్నాడు.

3. దానియేలు భయభక్తితో ప్రార్థించి– ప్రార్థన వల్ల కల యొక్క భావాన్ని రహస్యాన్ని గ్రహించాడు జ్ఞానమును పొందాడు, దేవుడు మర్మాన్ని దాని భావాన్ని దానియేలునకు తెలిపాడు.

దానియేలు 2:19-- 22

అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.---

4. యోహాను – యేసు గుండెపై తలవాల్చిన శిష్యుడు: యోహాను దేవుని ప్రేమను లోతుగా గ్రహించాడు, అందుకే ప్రభు యేసు అంత్యకాల మర్మాలను అతనికి (ప్రకటన గ్రంథం ద్వారా) తెలియజేశాడు.

దేవుని హృదయం తెలుసుకోవడం అనేది భయంతో నెరవేర్చే విధానం కాదు, ప్రేమతో కూడిన, భయభక్తితో, ఆత్మసంబంధముగా ఆయనతో నడవడం ద్వారా కలిగే గొప్ప అనుభవం.దేవుని మర్మాలు తెలిసినవారు,ఈ లోకాన్ని వదిలి అంటే ఈ లోకంలో నుండి ప్రత్యేకింపబడి పరిశుద్ధమైన దేవుని రాజ్యంలో జీవించేలా పరిశుద్ధులుగా మారతారు.

“దేవుని మర్మాలు తెలిసినవారు ఈ లోకాన్ని వదిలి దేవుని రాజ్యంలో జీవించేలా ఎందుకు మారతారు?”

ఎందుకు దేవుని మర్మాలు తెలిసినవారు ఈ లోకాన్ని వదిలి తమ జీవన శైలిని మార్చుతారు?

1. దేవుని నిజమైన ఉద్దేశమును గ్రహించిన వారు తెలిసినవారు, ఈ లోకపు మాయలో జీవించలేరు.

ఈ లోకములో ఉన్న అహంకారం, వ్యర్థ ఆశలు, పాపపు ప్రలోభాలు అన్నీ తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే దేవుని దృష్టిలో ఏది విలువైందో వారికి తెలిసిపోతుంది. 1యోహాను 2:17

లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

2. ఈ లోక రాజ్యాలు నశించిపోతాయి సమాప్తమవుతాయి, కానీ దేవుని రాజ్యం శాశ్వతమైంది ఇది నిత్యమైనది ఇది తెలిసినవారు తన దృష్టిని శాశ్వతమైన వాటిపైనే పెడతారు. కొలస్సీయులకు 3:2 పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి;

3. దేవుని హృదయంలో ఉన్న బాధను, ప్రేమను, దయను గ్రహించినవాడు – ఇక తాను స్వార్థంగా ఉండలేడు. ఆయన ప్రేమ మర్మాన్ని గ్రహించినప్పుడు మన హృదయం మారిపోతుంది. మన అవసరాలకన్నా, దేవుని ఉద్దేశమె ఎక్కువగా పట్టుబడుతుంది. 2 కోరింథీయులకు 5:14

క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది;

4. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగినవాడు ఈ లోకంతో సంబంధాన్ని అనుబంధాన్ని తగ్గించు కుంటాడు. ఆత్మీయ సంబంధం ఈ లోక సంబంధాలకు బలమైన (ప్రత్యామ్నాయం) బదులు అవుతుంది.యాకోబు 4:4 యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

"దేవుని మర్మాలు తెలిసినవాడు, ఈ లోకాన్ని వదిలి దేవుని రాజ్యంలో జీవించేలా మారతాడు.ఎందుకంటే ఆయన హృదయం తెలిసినవాడు,ఆయన ప్రేమ లోతులు గ్రహించినవాడు,ఈ లోకపు వెలుగులను తక్కువగా భావించి నిత్యమైన వెలుగులో నడవాలని తపించే వాడవుతాడు."

దేవుని మర్మాలు ఎవరికి? – ఆయనను ప్రేమించే, భయభక్తులు కలిగినవారికి

ఎప్పుడు? – ఆయన సమయములో, మనం సిద్ధమై ఉన్నప్పుడు

ఎలా? – పరిశుద్ధాత్మ ద్వారా, వాక్య అధ్యయనముతో, ప్రార్థనతో, మరియు జీవితంలో అనుభవాల ద్వారా.

{ స్తుతితో కూడిన ప్రార్థన కొరకు కీర్తనలు 25 వ అధ్యాయములో నుండి స్తోత్ర వాక్యలను సమకూర్చే

సమయంలో 14వ వచనంలో ఉన్న " యెహోవా మర్మము " ఈ పదము నన్ను ఆకర్షించింది యెహోవా మర్మము అంటే ఏమిటి ? అసలు అని నేను తెలుసుకోవాలి అని దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ వచ్చాను నేను పొందిన జ్ఞానాన్ని ఈ రూపంలో •••••}

ఎస్తేర్ క్రైసోలైట్

27-5-2025