CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

దేవుడు నిర్ణయించిన సరిహద్దులలోనే ఆశీర్వాదం ఉంది.

దేవుడు ప్రతీదానికి, జీవితం, ఆస్తులు, సంబంధాలు,సహవాసాలు,మనము నివసించే ప్రదేశాలకు, స్థలాలకు, మన ఆత్మకు కావలసిన పరిమితులు, వీటి అన్నిటికీ కూడా దేవుడు, సరిహద్దులను నిర్ణయించాడు, ఆ సరిహద్దులను దాటితే, మనము బాధలు, కలవరాలు, మరియు కష్టాలను ఎదుర్కొంటాము. మన జీవితంలో దేవుడిచ్చేశాంతి, సమాధానము, క్షేమము, కాపుదల, మరియు ఆశీర్వాదం, అనేవి కూడా దేవుడు మనకు నిర్ణయించిన సరిహద్దుల్లోనే మనకు లభిస్తాయి.

దేవుడు ఎందుకు ఈ సరిహద్దులను విధించాడు,వీటి ప్రాముఖ్యత ఏమిటి?

దేవుడు ఒక క్రమశిక్షణ గల దేవుడు,1కోరింథీయులకు 14:33
ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
ఆయన సృష్టిలో ప్రతిదానికి సరిహద్దులు విధించాడు. ఆకాశం, భూమి, సముద్రం, నక్షత్రాల గమనం—అన్నిటికి ఆయన నియమించిన పరిమితులు ఉన్నాయి.

యోబు 38:10-11
దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
నీవు ఇంత వరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణప బడు ననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?

అంటే సముద్రానికే సరిహద్దు వేశాడు. అది దాటి పోకుండా.

ద్వితియోపదేశకాండము 32:8
మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.

ఇది భూమికి సంబంధించిన సరిహద్దులు,

ఎందుకు భూమి కొరకు అనాలి?

ఈ వాక్యం "మోషే గీతం"లో భాగం. ఇశ్రాయేలీయులను కనాను దేశంలో స్థిరపరచబోతున్న సందర్భంలో, దేవుడు ప్రతి జనానికి భూమి వారసత్వం కేటాయించాడని చెబుతోంది.

"స్వాస్థ్యములు" అనే పదం – ఇక్కడ స్వాస్థ్యం అంటే భూమి, వారసత్వం, నివాసస్థలం. ఇది ఆత్మీయంగా కూడా వర్తించవచ్చు కానీ మొదటిది భౌతిక భూమి.

అపో.కార్యములు 17:26-27
మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.

ఈ వాక్యం కూడా దేవుడు జనాలకు భూమిపై నివాస సరిహద్దులు నిర్ణయించాడని స్పష్టంగా చెబుతోంది.

భౌతికంగా దేవుడు భూమిపై ప్రతి జనానికి సరిహద్దులు కేటాయించినట్లే, ఆత్మీయంగా కూడా ఆయన మన జీవితానికి పరిమితులు, పరిధులు నిర్ణయించాడు. మనం దాని లోనే నడిచినప్పుడు ఆయన రక్షణలో ఉంటాం.

ఈ సరిహద్దుల ప్రాముఖ్యత,

  1. రక్షణ కోసం – సరిహద్దులు లేకుంటే సముద్రం భూమిని ముంచుతుంది; అలాగే ఆత్మీయ జీవితంలో సరిహద్దులు లేకుంటే పాపం మనలను మ్రింగి వేస్తుంది.

  1. క్రమం కోసం – ప్రతి సరిహద్దు దేవుడు విధించిన నియమాన్ని సూచిస్తుంది. అవి మనకు నియంత్రణను నేర్పుతాయి.

  1. స్వాస్థ్యము యొక్క పరిరక్షణ కోసం, పూర్వీకులు పెట్టిన సరిహద్దు రాళ్లను తొలగించవద్దని చెప్పబడింది. ద్వితియోపదేశకాండము 27:17
    తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను. ఇది దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలను కాపాడుకోవాటానికి ఒక హెచ్చరిక.

  1. దేవుని పరిపాలనను మనము గుర్తించేందుకు, మనం ఎక్కడ నివసించాలో, మనకున్న పరిధి ఎంతవరకో ఆయన నిర్ణయించాడని గుర్తు చేస్తుంది, (అ.కా. 17:26).

  1. పవిత్రత కోసం – సరిహద్దులు దాటితే పాపంలో పడిపోతాము. దేవుడు మనకు పరిశుద్ధతను కాపాడుకునే ఆత్మీయ పరిమితులు కూడా ఇచ్చాడు.

"ఒకరి సరిహద్దును దాటి ఇంకొకరు వస్తే ఏం జరుగుతుంది?"

  1. సరిహద్దులు దాటితే శాపం వస్తుంది,

ద్వితియోపదేశకాండము 27:17
తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

యిల చేసే వారిని దేవుడు శాపగ్రస్తుడని అన్నాడు, అంటే ఎవరి భూమికి వారు పెట్టిన సరిహద్దును మార్చి తమకై తీసుకోవడం దేవుని దృష్టిలో పెద్ద పాపం. అలాంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడు.
అనుమతి లేకుండా,ఇంకొకరి స్థలంలోకి ప్రవేశించడం, ఇంకొకరికి సంబంధించిన వాటి మీద అధికారం తీసుకోవడం కూడా ఇది సరిహద్దును దాటినట్లే,

ఇటువంటి వాటి విషయంలో,దేవుడు ఖచ్చితముగా తీర్పు తీరుస్తాడు,

2. సరిహద్దులు దాటితే దేవుని తీర్పు వస్తుంది.

సామెతలు 23:10-11
పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు, వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

ఎవరి హక్కును మనము దాటి పోయిన, దేవుడు స్వయంగా వారికోసం నిలబడతాడు. అన్యాయం చేసినవారికి తీర్పు వస్తుంది.

3. సరిహద్దు దాటితే క్రమం చెడిపోతుంది,

సముద్రం సరిహద్దు దాటితే భూమి మునిగిపోతుంది,
యోబు 38:10-11
దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డ గడియలను తలుపులను పెట్టించినప్పుడు
నీవు ఇంత వరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణప బడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?

మానవులు తమకు నిర్ణయించిన సరిహద్దులను దాటితే కలవరము, పోరాటాలు, నష్టాలు వస్తాయి.

దేవుడు మన జీవితంలో మనము నడవవలసిన ఆత్మీయ పరిమితులు కూడా పెట్టాడు. వాటిని దాటితే పాపంలో పడిపోతాము.

స్వార్థముగా, అసూయతో,ఇతరుల పరిధిలోకి హక్కులు దోచుకోవడానికి వెళ్తే దేవుడు న్యాయం చేస్తాడు.

సరిహద్దులు దాటడం అంటే దేవుడు పెట్టిన క్రమానికి వ్యతిరేకంగా నడవడం. అది శాంతి, సమాధానమును, క్షేమమును ఎప్పటికీ మనకు ఇవ్వదు.

{ మా ప్రక్క వాళ్లు,వాళ్లకి కూడా టూ బెడ్ రూమ్స్ ఉన్నాయి. వాళ్లకి మాకంటే ఎక్కువగా బాల్కనీ ఉంది. కానీ అక్కడ వారు నడవరు, వాకింగ్ చేయరు, కావాలని మా చిల్డ్రన్స్ బెడ్ రూమ్ వైపు వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు, అటు అన్ని గ్లాస్ డోర్స్ ఉంటాయి. అక్కడ వర్క్ చేసుకునే మా పిల్లలకు అది చాల ఇబ్బందికరంగా ఉంటుంది.అక్కడ నేను చేసుకునే నా ప్రేయర్స్ కూడా ఆపివేశారు,

మేము డబ్బులు కట్టే మా స్థలంలో,చూశారా వారు చేసేది ఎంత దౌర్జన్యమో,దేవుడు పెట్టిన సరిహద్దులను గురించి,తెలియకపోతే నష్టం తెచ్చుకునేటట్లు,ఎలా ప్రవర్తిస్తారో,ఈ విషయంలో ఈరోజు నా పిల్లలు చాలా ఒత్తిడికి గురయ్యారు,వారికోసం దేవుని వాక్యంలో నుండి నేను రాసిన వర్తమానం ఇది,

మీకు కూడా ఇటువంటివి ఎదురవుతున్నాయా ! దేవుడు పెట్టిన సరిహద్దులను దాటితే శాంతి పోతుంది, ఒత్తిడి వస్తుంది, కలవరము కలుగుతుంది. కానీ మనం దేవుడు పెట్టిన సరిహద్దులలోనే నిలబడితే ఆయన రక్షణ, శాంతి మనకు లభిస్తుంది.

దేవుడు నియమించిన, వాక్యాల ద్వార, ఆజ్ఞల ద్వార, నియమాల ద్వార, సరిహద్దులను గురించిన,వాక్య ప్రత్యక్షత ఆత్మజ్ఞానము మీరు గ్రహించారా అయితే విశ్వాసం ఉంచండి.}

ఎస్తేర్ క్రైసోలైట్
18-9-2025