CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 4 }

దేవుని ప్రత్యక్షత అంటే, కేవలం శరీర రూపంతో “దేవుడు కనబడటం” కాదు, లేకపోతే “దూత ఒక రూపంలో నిలబడి ఉండటం” కూడ కాదు. దేవుని ప్రత్యక్షత అంటే, దేవుడు మాట్లాడిన క్షణం.

అది ఒక దూత ద్వారా కావచ్చు, స్వప్నంలో కల ద్వార కావచ్చు, లేదా వాక్యముతోనైనా కావచ్చు, కానీ ఎప్పుడూ ఏదో ఒక సందేశం లేదా మనం నడవవలసిన మార్గమును చూపటమే అని దాని అర్థం.

దేవుని ప్రత్యక్షత దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుని నుండి ఒక సందేశం రావడం, మనకు మార్గదర్శకతను అందించడం, దేవుని సంకల్పం మనకు తెలియ పరచబడటం, మనకు దేవుని నుండి ఒక హేచ్చరిక రావటం.

  1. ఆదికాండము 12:7 లో యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై “నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదను” అని చెప్పెను. ఇక్కడ దేవుని ప్రత్యక్షతలో ఒక సందేశం ఉంది, ఆదే దేవుని వాగ్దానం.

  1. న్యాయాధిపతులు 6:12 లో యెహోవా దూత గిద్యోనునకు ప్రత్యక్షమై “పరాక్రమముగల బలాఢ్యుడా యెహోవా నీతో కూడ ఉన్నాడు,” అని దూత తనతో చెప్పింది.యిది కేవలం ప్రత్యక్షత మాత్రమే కాదు, ధైర్యం కలిగించే వాక్యమును గిద్యోనుకు అందించ బడినది,

  1. లూకా 1:11–13 గబ్రియేలు దూత జెకర్యాకి ప్రత్యక్షమై “నీ ప్రార్థన వినబడెను” అని చెప్పెను.
    ఈ ప్రత్యక్షతకు ప్రయోజనం, దేవుని కార్యం గురించి తెలియజేయడం.

దేవుడు ఏ రూపంలో మనకు ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షమయ్యే ప్రతి సందర్భం వెనుక దివ్యమైన,ఉన్నతమైన ఒక ఉద్దేశ్యం అనేది ఉంటుంది. ఆ ప్రత్యక్షత మౌనంగా ఉండదు,దానిని పొందిన వారు కూడా మౌనంగా ఉండలేరు,దేవుని ప్రత్యక్షతను పొందని వారు మౌనంగా ఉన్నవారు, నిశ్శబ్దం అనేది వారిలో ఏలుతుంది అని అర్థం,

అందుకే లేవీయులో,దావీదో తెలియని అజ్ఞాత వ్యక్తి వ్రాసిన కీర్తనగా పేర్కొనబడిన 115 వ కీర్తనలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది,
కీర్తనలు 115:17 "మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు,"

కీర్తనలు 6:5
మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?

అందుకే దేవుని ప్రత్యక్షత లేని వాళ్ళు ఆత్మసంబంధంగా మృతమైన స్థితిలో ఉన్నవారని,కృతజ్ఞతలు తెలుపలేని వారని, ఆయన కార్యాలను ప్రకటించలేని వారని.
వారు బ్రతికిన వారి శరీరం సజీవంగా ఉన్నప్పటికి,ఆత్మసంబంధంగా వారు మృతులు గానే పరిశుద్ధ గ్రంథము వారిని గూర్చి ఈ కీర్తనలలో వివరిస్తుంది,

అందుకే ఎవరికైనా “దేవుడు ప్రత్యక్షమయ్యాడు” అని అంటే “దేవుడు తన ఉద్దేశ్యాన్ని మానవునికి తెలియజేశాడు” అని అర్థం.

పరలోకము నుండి ఈ భూలోకమునకు మన కొరకై పంపబడిన ఈ పరలోకపు మన్న వాక్యము అనే క్రీస్తు యేసు ప్రభువు వారు,తాను శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఎవరికి ప్రత్యక్షమైన,గ్రుడ్డివారికి చూపు కలిగింది, స్వస్థత లేని వారికి స్వస్థత కలిగింది, మృతులు సజీవులుగా తిరిగి లేచారు, బుద్ధిలేని వారికి బుద్ధి కలిగింది, మంచి ప్రవర్తన లేని వారికి మంచి ప్రవర్తన కలిగిన వారిగా జీవించారు, జయించలేని మానవునికి అన్నిటిని జయించే శక్తి కలిగిన పరిశుద్ధాత్మను పొందే భాగ్యం కలిగింది,

చూశారా ••••• వాక్యమైయున్న యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షమైతే,మనలో ఎన్ని మార్పులు జరుగుతాయో,

సంఖ్యాకాండము 18:20
నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.అన్న వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ,నాలో కూడా ఇటువంటి ప్రత్యక్షతనే నాకు కలిగింది, తర్వాత సంవత్సరం నా వాగ్దానం లేవీయకాండము 26:4
మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును,

దేవునికి భయపడే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాక్యం అనే వర్షాన్ని పంపిస్తాడు, ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలని మనం ఫలించాలని, అలానే నా జీవితంలో కూడా ఈ వాగ్దానము నెరవేరటం నేను చూశాను, ఆ సంవత్సరం మా అన్నయ్యకు వివాహం జరిగి మేము ఆ సిరిసిల్ల పట్టణము నుండి కరీంనగర్ పట్టణమునకు షిఫ్ట్ అయ్యాము,

ఆ కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి హెబ్రోన్ సహవాసానికి వెళ్తున్నటువంటి ఒకరు వున్నారు, వారి గృహానికి సమీపంలోనే మా ఇల్లు ఉండేది, వారి కుమార్తెలు ఇద్దరు మాకు లాగా యూత్ వాల్లే కాబట్టి,వారితో స్నేహము వలన మేము క్రమం తప్పకుండా వాళ్లతో కలిసి నేను మా చెల్లి ఇద్దరము మందిరానికి వెళుతూ ఉండేవాళ్ళము.

అలా యూత్ మీటింగ్ లో, ఆదివారం ఆరాధనలో, శనివారం ప్రార్థన కూడికలో,బుధవారం బైబిల్ స్టడీలో మేము క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండటం వలన నేను అంతకుముందు కంటే కొంచెం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ వచ్చాను,

మా ఇంటిలో కి మా వదిన వచ్చిన తర్వాత కొంచెం పరిస్థితి మారింది, ఎందుకంటే మా అన్నయ్యకు మా మీద విపరీతమైన ప్రేమ ఉండేది, ఆ ప్రేమ చూసి తాను తట్టుకోలేక పోయేది మా వదిన,నేను దేవుని వాక్యం ద్వారా పట్టుబడ్డాను, దేవుడు నడిపింపులోనే నడుస్తున్నాను అని బాహ్యంగా ఎవరికీ తెలవలేదు, అర్థం కాలేదు కాబట్టి, నేను ఎవరితో మాట్లాడినా కూడా చెడుగా అర్థం చేసుకొని మా అన్నయ్యకు తాను చెబుతూ ఉండేది,

యూత్ వాళ్లు అంటే ఆ స్థితిని దాటిన వాళ్ళకి ఎంత చులకన భావం ఉంటుందో,యూత్ వాళ్లు అంటేనే,వాళ్లు తొట్రుపాటుకు గురయ్యేవారు అన్న భావాన్ని కలిగి ఉంటారు, వాళ్ల మనసులో కూడా ఒక నిర్ణయాలు ఉంటాయి. ఒక పద్ధతులు ఉంటాయి. వాళ్లకంటూ ఒక క్రమమైన విధానమన్నది ఉంటుంది అన్న విషయం చాలామందికి అర్థం కాదు, వారి యూత్ స్థితిని బట్టి అవమానించే వారుగా ఉంటారు,

మేము మా అమ్మకు దగ్గరలో ఉండాలి అని, మా అన్నయ్య భద్రాచలంనకు ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాడు, అందరూ ఉన్న ఎవ్వరు నన్ను అర్థం చేసుకోలేని ఒక ఒంటరి జీవితానికి పునాది అన్నది నాకు ఇక్కడే ఇక్కడ నుండే ప్రారంభమైంది,

మన జీవితంలోనికి దేవుడు ఎటువంటి మార్గాన్ని తీసుకుని వచ్చినప్పటికీ అది మన ఆత్మ సంబంధమైన జీవితమునకు ఆశీర్వాద కారణంగానే ఉంటుంది కానీ నష్టాన్ని తెచ్చేదిగా ఉండదు,

మేము భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ హెబ్రోన్ సహవాసంలో నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళుతూ ఉండే దాన్ని, ఎందుకు అని అంటే అక్కడ "మహా సామార్ధ్య ఓయేసు బహు విశాలుడవు నీవు" అన్న పాటను ఎక్కువగా అక్కడ పాడుతూ ఉండేవాళ్ళు, దాని కొరకు అది ఇష్టమై నేను ఆ పాటను వినటానికి నేను క్రమం తప్పకుండా నేను అక్కడి మందిరానికి వెళుతూ ఉండేదాన్ని,

ఆ సంవత్సరం అయిపోతుంది అని అనంగా మా కాలేజీలోని మాకు బాగా పరిచయమైన కొంతమందికి,నేను మా చెల్లి ఇద్దరము గ్రీటింగ్స్ కార్డ్స్ న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధం చేసుకున్నాము,

అందులో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఉన్నారు, వారందరూ మా క్లాస్ వాళ్ళె, మేము అలా సిద్ధం చేసుకున్న గ్రీటింగ్స్ కార్డుని మా రికార్డ్స్ లలో పెట్టుకున్నాము, వాటిని మాకు తెలియకుండా
మా వదిన చూసింది అని మాకు తెలవదు,

నేను నా చేతితో రాయకుండా పేపర్ లోని అక్షరాలను కట్ చేసి ఆ గ్రీటింగ్స్ కార్డు మీద అతికించినందుకు,దానిని మా అన్నయ్య తప్పు పట్టారు, ఎందుకు అంటే పేపర్లోని వాటిని కట్ చేసి అతికించే అంత ఇంపార్టెంట్ ఎందుకు తీసుకున్నావు అని,నూతన సంవత్సరం ప్రారంభం తోటే నాకు కష్టాలు అపార్థాలు మొదలయ్యాయి,

కొన్ని రోజుల తర్వాత,నాకు వచ్చిన ఈ బాధను భరించలేక దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని చదవాలని అనుకున్నాను,
ఆ సంవత్సరమంతా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం
యెషయా 51:12 "నేను నేనే మిమ్ము నోదార్చువాడను" ఈ వాగ్దానమే నన్ను చాలా ఆదరించింది,

ఓ •••• దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన
ఈ అధ్యాయంలో ఇంత మంచి వాక్యాలు ఉన్నాయా అని నేను మొట్టమొదటిసారిగా ఇష్టంతో ఆసక్తితో నేను ఈ అధ్యాయాన్ని పదేపదే చదువుతూ ఆదరించ బడుతు వచ్చాను,

నేను సజీవుడను, సజీవుడైన దేవుడను, నిన్ను చూస్తున్న దేవుడను నేనే అని, దేవుడు తన వాక్యం ద్వారా మనకు ప్రత్యక్ష పరచు కోవటమే కాదు, ఆ వాక్యాన్ని వర్షములా మనకు పంపి, మనలో విశ్వాసాన్ని నింపి,అదే వాక్యము ద్వారా మనలను ఆదరిస్తాడు,

హృదయ రహస్యములు ఎరిగినది దేవుడు ఒక్కడు మాత్రమే, అందుకే మనలను ఎవరు అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా మన హృదయాన్ని ఎరిగింది, దేవుడు మాత్రమే కాబట్టి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవున్ని మనము ఆశ్రయించినప్పుడు, దేవుని సమాధానము దేవుని ఆదరణ మనకు ఖచ్చితంగా ఉంటుంది,

ప్రత్యక్షత నుండి వాగ్దానానికి,
వాగ్దానం నుండి అనుభవానికి,
అనుభవం నుండి నడిపింపుకు,
దేవుడు మన జీవితానికి అంతా ఒక ఆత్మీయ మార్గదర్శకుడిగా నిలుస్తాడు.
మనకు అర్థం కాకపోయినా, ఆయన మార్గం సంపూర్ణమైనది.

ప్రతీ వాగ్దానం నన్ను దేవునికి దగ్గర చేసింది.
ఆయన ప్రత్యక్షతను మరింత స్పష్టంగా నాకు తెలియజేసింది. నా జీవితంలోని ఈ భాగం నాకు నేర్పినది ఏమిటంటే, దేవుడు కనిపించక పోయినా మాట్లాడుతాడు,తన వాక్యం ద్వారా ఆదరిస్తాడు ఆయన మాటే,దేవుని వాక్యమే మనకు అసలైన ప్రత్యక్షత.

ఎస్తేర్ క్రైసో లైట్
7-11-2025

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 4 }

దేవుని ప్రత్యక్షత అంటే, కేవలం శరీర రూపంతో “దేవుడు కనబడటం” కాదు, లేకపోతే “దూత ఒక రూపంలో నిలబడి ఉండటం” కూడ కాదు. దేవుని ప్రత్యక్షత అంటే, దేవుడు మాట్లాడిన క్షణం.

అది ఒక దూత ద్వారా కావచ్చు, స్వప్నంలో కల ద్వార కావచ్చు, లేదా వాక్యముతోనైనా కావచ్చు, కానీ ఎప్పుడూ ఏదో ఒక సందేశం లేదా మనం నడవవలసిన మార్గమును చూపటమే అని దాని అర్థం.

దేవుని ప్రత్యక్షత దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుని నుండి ఒక సందేశం రావడం, మనకు మార్గదర్శకతను అందించడం, దేవుని సంకల్పం మనకు తెలియ పరచబడటం, మనకు దేవుని నుండి ఒక హేచ్చరిక రావటం.

  1. ఆదికాండము 12:7 లో యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై “నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదను” అని చెప్పెను. ఇక్కడ దేవుని ప్రత్యక్షతలో ఒక సందేశం ఉంది, ఆదే దేవుని వాగ్దానం.

  1. న్యాయాధిపతులు 6:12 లో యెహోవా దూత గిద్యోనునకు ప్రత్యక్షమై “పరాక్రమముగల బలాఢ్యుడా యెహోవా నీతో కూడ ఉన్నాడు,” అని దూత తనతో చెప్పింది.యిది కేవలం ప్రత్యక్షత మాత్రమే కాదు, ధైర్యం కలిగించే వాక్యమును గిద్యోనుకు అందించ బడినది,

  1. లూకా 1:11–13 గబ్రియేలు దూత జెకర్యాకి ప్రత్యక్షమై “నీ ప్రార్థన వినబడెను” అని చెప్పెను. Aఈ ప్రత్యక్షతకు ప్రయోజనం, దేవుని కార్యం గురించి తెలియజేయడం.

దేవుడు ఏ రూపంలో మనకు ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షమయ్యే ప్రతి సందర్భం వెనుక దివ్యమైన,ఉన్నతమైన ఒక ఉద్దేశ్యం అనేది ఉంటుంది. ఆ ప్రత్యక్షత మౌనంగా ఉండదు,దానిని పొందిన వారు కూడా మౌనంగా ఉండలేరు,దేవుని ప్రత్యక్షతను పొందని వారు మౌనంగా ఉన్నవారు, నిశ్శబ్దం అనేది వారిలో ఏలుతుంది అని అర్థం,

అందుకే లేవీయులో,దావీదో తెలియని అజ్ఞాత వ్యక్తి వ్రాసిన కీర్తనగా పేర్కొనబడిన 115 వ కీర్తనలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది,
కీర్తనలు 115:17 "మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు,"

కీర్తనలు 6:5
మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?

అందుకే దేవుని ప్రత్యక్షత లేని వాళ్ళు ఆత్మసంబంధంగా మృతమైన స్థితిలో ఉన్నవారని,కృతజ్ఞతలు తెలుపలేని వారని, ఆయన కార్యాలను ప్రకటించలేని వారని.
వారు బ్రతికిన వారి శరీరం సజీవంగా ఉన్నప్పటికి,ఆత్మసంబంధంగా వారు మృతులు గానే పరిశుద్ధ గ్రంథము వారిని గూర్చి ఈ కీర్తనలలో వివరిస్తుంది,

అందుకే ఎవరికైనా “దేవుడు ప్రత్యక్షమయ్యాడు” అని అంటే “దేవుడు తన ఉద్దేశ్యాన్ని మానవునికి తెలియజేశాడు” అని అర్థం.

పరలోకము నుండి ఈ భూలోకమునకు మన కొరకై పంపబడిన ఈ పరలోకపు మన్న వాక్యము అనే క్రీస్తు యేసు ప్రభువు వారు,తాను శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఎవరికి ప్రత్యక్షమైన,గ్రుడ్డివారికి చూపు కలిగింది, స్వస్థత లేని వారికి స్వస్థత కలిగింది, మృతులు సజీవులుగా తిరిగి లేచారు, బుద్ధిలేని వారికి బుద్ధి కలిగింది, మంచి ప్రవర్తన లేని వారికి మంచి ప్రవర్తన కలిగిన వారిగా జీవించారు, జయించలేని మానవునికి అన్నిటిని జయించే శక్తి కలిగిన పరిశుద్ధాత్మను పొందే భాగ్యం కలిగింది,

చూశారా ••••• వాక్యమైయున్న యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షమైతే,మనలో ఎన్ని మార్పులు జరుగుతాయో,

సంఖ్యాకాండము 18:20
నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.అన్న వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ,నాలో కూడా ఇటువంటి ప్రత్యక్షతనే నాకు కలిగింది, తర్వాత సంవత్సరం నా వాగ్దానం

లేవీయకాండము 26:4
మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును,

దేవునికి భయపడే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాక్యం అనే వర్షాన్ని పంపిస్తాడు, ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలని మనం ఫలించాలని, అలానే నా జీవితంలో కూడా ఈ వాగ్దానము నెరవేరటం నేను చూశాను, ఆ సంవత్సరం మా అన్నయ్యకు వివాహం జరిగి మేము ఆ సిరిసిల్ల పట్టణము నుండి కరీంనగర్ పట్టణమునకు షిఫ్ట్ అయ్యాము,

ఆ కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి హెబ్రోన్ సహవాసానికి వెళ్తున్నటువంటి ఒకరు వున్నారు, వారి గృహానికి సమీపంలోనే మా ఇల్లు ఉండేది, వారి కుమార్తెలు ఇద్దరు మాకు లాగా యూత్ వాల్లే కాబట్టి,వారితో స్నేహము వలన మేము క్రమం తప్పకుండా వాళ్లతో కలిసి నేను మా చెల్లి ఇద్దరము మందిరానికి వెళుతూ ఉండేవాళ్ళము.

అలా యూత్ మీటింగ్ లో, ఆదివారం ఆరాధనలో, శనివారం ప్రార్థన కూడికలో, బుధవారం బైబిల్ స్టడీలో మేము క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండటం వలన నేను అంతకుముందు కంటే కొంచెం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ వచ్చాను,

మా ఇంటిలో కి మా వదిన వచ్చిన తర్వాత కొంచెం పరిస్థితి మారింది, ఎందుకంటే మా అన్నయ్యకు మా మీద విపరీతమైన ప్రేమ ఉండేది, ఆ ప్రేమ చూసి తాను తట్టుకోలేక పోయేది మా వదిన,నేను దేవుని వాక్యం ద్వారా పట్టుబడ్డాను, దేవుడు నడిపింపులోనే నడుస్తున్నాను అని బాహ్యంగా ఎవరికీ తెలవలేదు, అర్థం కాలేదు కాబట్టి, నేను ఎవరితో మాట్లాడినా కూడా చెడుగా అర్థం చేసుకొని మా అన్నయ్యకు తాను చెబుతూ ఉండేది,

యూత్ వాళ్లు అంటే ఆ స్థితిని దాటిన వాళ్ళకి ఎంత చులకన భావం ఉంటుందో,యూత్ వాళ్లు అంటేనే,వాళ్లు తొట్రుపాటుకు గురయ్యేవారు అన్న భావాన్ని కలిగి ఉంటారు, వాళ్ల మనసులో కూడా ఒక నిర్ణయాలు ఉంటాయి. ఒక పద్ధతులు ఉంటాయి. వాళ్లకంటూ ఒక క్రమమైన విధానమన్నది ఉంటుంది అన్న విషయం చాలామందికి అర్థం కాదు, వారి యూత్ స్థితిని బట్టి అవమానించే వారుగా ఉంటారు,

మేము మా అమ్మకు దగ్గరలో ఉండాలి అని, మా అన్నయ్య భద్రాచలంనకు ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాడు, అందరూ ఉన్న ఎవ్వరు నన్ను అర్థం చేసుకోలేని ఒక ఒంటరి జీవితానికి పునాది అన్నది నాకు ఇక్కడే ఇక్కడ నుండే ప్రారంభమైంది,

మన జీవితంలోనికి దేవుడు ఎటువంటి మార్గాన్ని తీసుకుని వచ్చినప్పటికీ అది మన ఆత్మ సంబంధమైన జీవితమునకు ఆశీర్వాద కారణంగానే ఉంటుంది కానీ నష్టాన్ని తెచ్చేదిగా ఉండదు,

మేము భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ హెబ్రోన్ సహవాసంలో నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళుతూ ఉండే దాన్ని, ఎందుకు అని అంటే అక్కడ "మహా సామార్ధ్య ఓయేసు బహు విశాలుడవు నీవు" అన్న పాటను ఎక్కువగా అక్కడ పాడుతూ ఉండేవాళ్ళు, దాని కొరకు అది ఇష్టమై నేను ఆ పాటను వినటానికి నేను క్రమం తప్పకుండా నేను అక్కడి మందిరానికి వెళుతూ ఉండేదాన్ని,

ఆ సంవత్సరం అయిపోతుంది అని అనంగా మా కాలేజీలోని మాకు బాగా పరిచయమైన కొంతమందికి,నేను మా చెల్లి ఇద్దరము గ్రీటింగ్స్ కార్డ్స్ న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధం చేసుకున్నాము,

అందులో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఉన్నారు, వారందరూ మా క్లాస్ వాళ్ళె, మేము అలా సిద్ధం చేసుకున్న గ్రీటింగ్స్ కార్డుని మా రికార్డ్స్ లలో పెట్టుకున్నాము, వాటిని మాకు తెలియకుండా
మా వదిన చూసింది అని మాకు తెలవదు,

నేను నా చేతితో రాయకుండా పేపర్ లోని అక్షరాలను కట్ చేసి ఆ గ్రీటింగ్స్ కార్డు మీద అతికించినందుకు,దానిని మా అన్నయ్య తప్పు పట్టారు, ఎందుకు అంటే పేపర్లోని వాటిని కట్ చేసి అతికించే అంత ఇంపార్టెంట్ ఎందుకు తీసుకున్నావు అని,నూతన సంవత్సరం ప్రారంభం తోటే నాకు కష్టాలు అపార్థాలు మొదలయ్యాయి,

కొన్ని రోజుల తర్వాత,నాకు వచ్చిన ఈ బాధను భరించలేక దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని చదవాలని అనుకున్నాను,
ఆ సంవత్సరమంతా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం

యెషయా 51:12 "నేను నేనే మిమ్ము నోదార్చువాడను" ఈ వాగ్దానమే నన్ను చాలా ఆదరించింది,

ఓ •••• దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన
ఈ అధ్యాయంలో ఇంత మంచి వాక్యాలు ఉన్నాయా అని నేను మొట్టమొదటిసారిగా ఇష్టంతో ఆసక్తితో నేను ఈ అధ్యాయాన్ని పదేపదే చదువుతూ ఆదరించ బడుతు వచ్చాను,

నేను సజీవుడను, సజీవుడైన దేవుడను, నిన్ను చూస్తున్న దేవుడను నేనే అని, దేవుడు తన వాక్యం ద్వారా మనకు ప్రత్యక్ష పరచు కోవటమే కాదు, ఆ వాక్యాన్ని వర్షములా మనకు పంపి, మనలో విశ్వాసాన్ని నింపి,అదే వాక్యము ద్వారా మనలను ఆదరిస్తాడు,

హృదయ రహస్యములు ఎరిగినది దేవుడు ఒక్కడు మాత్రమే, అందుకే మనలను ఎవరు అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా మన హృదయాన్ని ఎరిగింది, దేవుడు మాత్రమే కాబట్టి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవున్ని మనము ఆశ్రయించినప్పుడు, దేవుని సమాధానము దేవుని ఆదరణ మనకు ఖచ్చితంగా ఉంటుంది,

ప్రత్యక్షత నుండి వాగ్దానానికి, వాగ్దానం నుండి అనుభవానికి, అనుభవం నుండి నడిపింపుకు,
దేవుడు మన జీవితానికి అంతా ఒక ఆత్మీయ మార్గదర్శకుడిగా నిలుస్తాడు. మనకు అర్థం కాకపోయినా, ఆయన మార్గం సంపూర్ణమైనది.