CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

జ్ఞానవంతురాలు దేవుని ఆలోచనలో ఒక భాగం

సామెతలు 14:1

జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును

జ్ఞానం కలిగిన స్త్రీ (లేదా వ్యక్తి) ప్రేమ, క్రమశిక్షణ, బాధ్యతతో. తన కుటుంబాన్ని నిర్మిస్తారు

ఇది వ్యక్తిగత జీవితానికే కాక కుటుంబ జీవితం, సామాజిక బాధ్యతలకూ వర్తించగల నైతిక బోధనగా యిది చెప్పబడుతుంది.

దేవుడు యావత్తు సృష్టిలో ప్రతి ఒక్కరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో సృష్టించాడు. జ్ఞానం, వివేచన, తనయందు భయభక్తులు కలిగిన స్త్రీలను ఆయన తన ప్రణాళికలలో ఒక భాగంగా ఏర్పరచుకున్నాడు. జ్ఞానవంతురాలు అంటే కేవలం జ్ఞానంను సంపాదించిన వారు పుస్తకాలు చదివినవారే కాదు – దేవుని వాక్యాన్ని గ్రహించి, దాని ప్రకారం జీవించేవారే నిజమైన జ్ఞానవంతులు.

సామెతలు 31 అధ్యాయంలోని స్త్రీ – ఆమె నిత్యం దేవుని భయంతో జీవిస్తుంది, తన ఇంటిని బలపరుస్తుంది, ఇతరులకు జ్ఞానం పంచుతుంది. అలాంటి వ్యక్తి దేవుని ఆలోచనలలో భాగం కాదా?

మన జీవితాల్లో దేవుని ఉద్దేశ్యం నెరవేరేందుకు, ఆయన మనపై ఉంచిన పిలుపును నెరవేర్చేందుకు జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం మన శ్రమతోనే కాకుండా, ఆయన వాక్యము ద్వారా, ప్రార్థనల వల్లనూ మనకు లభిస్తుంది. దేవుని ఆలోచనలలో భాగమవ్వాలంటే, ఆయన ఆలోచనల్ని మన ఆలోచనలుగా చేసుకోవాలి.

వ్యక్తిగత జీవితమైన కుటుంబ జీవితమైన సమాజ బాధ్యత లైనను మనము దేనిని కట్టిన అది వాక్యముతో ఆధారమై ఉండాలి వాక్యము తోనే అది కట్టబడాలి మనము బాధ్యత తీసుకునే దాని విషయంలో దేవుని దగ్గర ఒక వాక్యము ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు అది సంపూర్ణంగా కట్టబడటానికి అవసరమైన పరిస్థితిలన్నీ మన ప్రమేయం లేకుండానే అవి సమకూడ బడతాయి

మనము తీసుకునే ఏ బాధ్యత అయినా దాని విషయంలో దేవుని వాక్యము వాగ్దానం మీద ఆధారపడకుండ ఇతరులను నిందించటం అనేది----- ఆవుతుంది.

చాలా సంవత్సరాల క్రితం భక్త సింగ్ గారి సహవాసము మా గ్రామంలో నా తల్లి గారి ద్వార మా గృహములో ప్రారంభమైనది మా గృహములో కొన్ని రోజులు ఆరాధన జరిగిన తర్వాత ఎక్కువమంది ప్రజలు వస్తూ ఉండటంతో నా తల్లి గారు వేరొక గృహమును తీసుకొని అక్కడ ఆరాధన జరిపిస్తూ వచ్చారు కొన్ని సంవత్సరాలకి సంఘాము పెద్దగా అయింది హైదరాబాద్ హెబ్రోన్

సహవాసంలో తర్ఫీదు అయిన వివాహం కాని ఒక యౌవ్వన దైవజనుడు మా సంఘానికి కాపరిగా సేవకుడుగా హైదరాబాద్ నుంచి పంపబడ్డారు.

తాను ఎంత బాగా సేవ చేసె వారు అంటే ఒక్క గంట కూడ వ్యర్థముగా గడిపేవారు కాదు ఆసమయంలో తాను వాక్యం చెప్పె విధానం అద్భుతంగా వుండేది అందరికి అర్థమయ్యే రీతిలో విడమర్చి వాక్యాన్ని బోధించేవారు అప్పుడు నేను అనుకునే దానిని ఈ దైవజనులు లాగా నేను వాక్యాన్ని చెప్పగలగాలి అని అలానే ప్రాక్టీస్ చేస్తూ వచ్చేదాన్ని నేను కొంతమంది స్త్రీలను గురించి వ్రాసిన బుక్ ని ప్రచురించినప్పుడు ఆ దైవజనులను నేను అడిగాను మీకు లాగా నేను వర్తమానం అందించగలిగానా అని అప్పుడు తాను ఏమని అన్నారు అంటే నాకంటే గొప్పగా వ్రాసారమ్మ మీరు అని.

తనకి వివాహం కాలేదు కాబట్టి చాలా సంబంధాలను తన పైన ఉన్న సేవకులు తనకి చూస్తూ వచ్చారు తనకి ఎవ్వరు నచ్చలేదు అటువంటి సమయంలో నా తల్లిగారు నా విషయము తనని అడుగుతూ వచ్చారు నా తల్లి గారి ఉద్దేశం ఏమిటి అని అంటే తన నుంచి ప్రారంభించబడిన ఈ పరిచర్య మంచిగా కొనసాగాలి అని అంటే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఈ సహవాసంలో బాధ్యతలను కలిగి ఉండాలి అని ఆశపడ్డారు.

అందుకే నేను హెబ్రోన్ వెళ్లాలని నేను ఆశ కలిగి ఉన్నప్పటికీ నా తల్లి గారికి అది ఇష్టం లేదు ఆ దైవజనులు నేను ప్రార్థించి దేవుడు ఏం మాట్లాడుతాడో చెబుతాను అని అన్నారు అంతే ఇంకా ఎప్పుడు దాని విషయంలో నా తల్లి గారు తనని అడగలేదు.

ఒక సంవత్సరం అడుగుడి మీకు ఇయ్య బడును అన్న వాగ్దానం నాకు వచ్చింది ఆ సంవత్సరం ఆ దైవజనులు నాకు మందిరంలో సండే స్కూల్ పరిచర్యను ఇచ్చారు తాను నాకు పరిచర్యను ఇచ్చి ప్రార్థించేటప్పుడు మాత్రమే ఆ ఒక్కసారి అదే మొదటిసారి అదే చివరిసారి నేను అక్కడ ఉన్నప్పుడు తనతో మాట్లాడింది ఎందుకంటే ఒక యౌవ్వనస్తురాలుగా తనతో మాట్లాడటం వల్ల చూసే వాళ్ళకి చేడుగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో నేను తనతో మాట్లాడకుండా ఉన్నాను సండే స్కూల్ కి సంబంధించిన ఒక పుస్తకాన్ని నాకు తను ఇచ్చినప్పుడు నేను తనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే మళ్లీ ఈ పరిచర్యను నా నుంచి తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వరు కదా అని అడిగాను దానికి వెంటనే నవ్వి అన్నారు ఇవ్వను అని అంతే,

ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఆ దైవజనుడు ఒకరిని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని మందిరంలో అందరికీ తెలిసింది నా విషయంలో ప్రార్థించి ఏ విషయం అన్నది చెబుతాను అన్న దైవజనుడు నా తల్లి గారికి ఎటువంటి విషయాన్ని చెప్పలేదు ఆ సమయంలో నాకు ఆది

అవమానముగా అనిపించింది నా ప్రమేయం లేకుండా

నన్ను అడగకుండా నా తల్లి నా విషయంలో తనను అడిగింది ఇప్పుడు ఏ విషయం అన్నది తాను చెప్పకుండా వేరొకరిని నిర్ణయించుకుంటున్నాడు ఆ సమయంలో నా విషయంలో కొంతమంది సేవకులు ఆ దైవజనుడికి నా విషయాన్ని మరలా చెబుతూ వేరే వైపు ప్రయత్నిస్తున్న తన ప్రయత్నాన్ని ఆపాలని చూసారు కానీ తాను వినలేదు.

ఒకరోజు నేను ప్రార్థించటానికి మొకరించాను నేను మొకరించిన వెంటనే తల పైకి ఎత్తి ఎదురుగా ఉన్న గోడ వైపు చూసినప్పుడు అక్కడ ఒక వాక్యం నన్ను ఆకర్షించింది "ఈ యుద్ధము యెహోవాదే " దావీదు గొల్యాతుకు మధ్య జరిగిన యుద్ధమది ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అన్ని దారులు మూసుకుపోయాయి ఈ సమయం కొరకే దేవుడు ఈ సంవత్సరం అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో నాకు సహాయం ఎవ్వరూ చేయలేరు ఇ స్థితిలో నేను దేవునిపై ఆధారపడాలి అని అనుకొని పట్టు వదలకుండా దేవుని ప్రార్థిస్తూ వచ్చాను.

"సమర్పించుకున్న వ్యక్తిని నేను ఈ మందిరములో ఉన్నప్పుడు ఇంకొక స్త్రీవేరొక దగ్గర నుంచి వచ్చి ఈ మందిరంలో పరిచర్య చేయటానికి వీలు లేదు సమర్పించుకున్న వ్యక్తిగా అది నాకు అవమానం నేను హెబ్రోన్ కి వెళ్లాలని అనుకున్న నా ప్రమేయం లేకుండా నేనిక్కడ ఉండాల్సి వచ్చింది నాకు సంబంధం లేని అవమానాన్ని నేను ఎందుకు పొందాలి నాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నాకు విజయాన్ని ఇవ్వండి అని నేను దేవుని ప్రార్థిస్తూ వచ్చేదాన్ని"

ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే నా విషయంలో నా తల్లి గారికి ఆ దైవ జనుడి కి మధ్య నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నాకు అవమానం కలగకుండా నేను దీని గురించి దేవునితో పోరాడాల్సి వచ్చింది కొన్ని రోజుల తర్వాత తాను ఎవరినైతే చేసుకోవాలని అనుకున్నాడో ఆస్త్రీ తల్లిదండ్రులు మేము మా కుమార్తెను సేవకుడికి ఇవ్వము అని చెప్పి సంబంధాన్ని రద్ధు చేసుకున్నారు

ఆ సంవత్సరం దేవుడు నా వాగ్దానాన్ని అలా నెరవేర్చాడు.

తరువాత సంవత్సరం నా వాగ్దానం "మీకు సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచేదను"

ఈ వాగ్దానము ఎలా నెరవేరుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ దీనిని చూసినప్పుడు వెంటనే నాకు అనిపించింది గత సంవత్సరం అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాగ్ధానముతో నేను దేనినైతే అడిగానో దాని విషయంలో పూర్తి సమాచారం ఏమైయున్నది అన్నది ఈ సంవత్సరం నాకు తెలియపరచబడుతుంది అని విశ్వసించాను.

ఒకరోజు ఆదివారం రోజున ప్రకటనలు తెలియపరిచే

సమయములో మా దైవజనుల వివాహము జరిగే సమయాన్ని తేదీలను ప్రకటించారు అది ఆ మందిరంలో ఉన్న ఎవ్వరికి ఆ విషయం తెలవదు అప్పటివరకు ఆ ప్రకటన ప్రకటింప బడుతున్నప్పుడు ఆ మందిరములో నా తల్లి కళ్ళల్లో నేను చూసిన కన్నీరును ఎప్పటికీ నేను మర్చిపోలేను.

అది విన్న నాకు వెంటనే అనిపించింది ఈ మందిరంలో ఉన్న పిల్లల పరిచర్య బాధ్యత తనను వివాహం చేసుకునే స్త్రీదే అని, ఎందుకంటే పిల్లల పరిచర్య అంటే దేవుడిచ్చిన ఆత్మీయ సంతానమునకు చూచన ఆ ప్రకటన

వచ్చిన వెంటనే నేను నా దగ్గర ఉన్న సండే స్కూల్ మెటీరియల్ అంతా తీసుకొని వెళ్లి టేబుల్ మీద పెట్టి ఇంటికి వచ్చేసాను.

ఆరోజు సాయంత్రం మందిరానికి సంబంధించిన ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు సండే స్కూల్ మెటీరియల్ నాకు ఇచ్చి అక్క ఈ పరిచర్య నువ్వు చెయ్యి బ్రదర్ ఆ సంబంధాన్ని రద్దు చేసుకుంటారంటా ! అని చెప్పినప్పుడు నేను ఒక్కటే అన్నాను తాను ఒక స్త్రీ మందిరంలో ప్రకటించిన తర్వాత రద్దు చేసుకుంటే ఆమె స్థితి ఎలా ఉంటుంది నాకు అవసరం లేదు ఇవి తీసుకొని వెళ్ళిపోయి ఇచ్చే సేయ్ అని చెప్పాను.

తర్వాత నేను ఇంకా మందిరం మానివేసి చాలాకాలం ఇంట్లోనే ఉండిపోయాను ఆ దైవజనుడు తన మామ గారి మందిరములోనే వివాహం చేసుకొని చాలా రోజుల వరకు ఇక్కడకు రాకుండా అక్కడే ఉన్నాడు ఇక్కడ ఆ దైవజనులు లేకపోయినా సంఘస్తులు పరిచర్యను కొనసాగిస్తూ ఉండేవాళ్ళు ఆ సమయంలో నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అది ఏమిటంటే "కుమారుని విషయంలో శారా వాగ్దానం పొందిన తర్వాత అబ్రహాము జీవితంలో హాగరు వచ్చింది." ఎవరు మొదటిగా వాగ్దానం పొందారో వారే అబ్రహాము జీవితంలో వారసులు ఎప్పుడైతే ఈ అంశం దేవుడు నా ముందుకు తీసుకొని వచ్చాడో నాతో మాట్లాడుతూ వచ్చాడో ఆప్పుడు నేను దీనిని గట్టిగా పట్టుకున్నాను వెంటనే నేను దానిని ఆ అంశమును ఒక వర్తమానంగా వ్రాసి ప్రతిరోజు దానిని చదువుతూ ప్రార్థించటానికి నన్ను నేను ఉజ్జీవ పరుచుకుంటూ వచ్చాను.

ఎస్తేర్ రాజు చేతిలో నశించిపోవటానికైనా సిద్ధపడింది కానీ శత్రువు చేతిలో అపజయం పొందటానికి సిద్ధపడలేదు.

"అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాగ్దానము ద్వారా నేను పొందిన ఈ పొలములో తాను ఆ స్త్రీ ఒక్క రోజు కూడా పరిచర్య చేయడానికి వీలు లేదు దేవా! ఒకవేళ ఆమె ఒక్కరోజైనా పరిచర్యను చేస్తే

నా విషయంలో మీరు మాట తప్పిన వారు అవుతారు " అన్నటువంటి ఇదే మాట నేను ప్రతిరోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను దేవున్ని అడుగుతూ వచ్చేదాన్ని

ఒక త్రీ మంత్స్ తర్వాత ఆ దైవజనుడు తన భార్యను తన బంధువులు తీసుకొని వచ్చి అక్కడ విందు చేద్దామని అనుకున్నాడు ఆ విందు జరిగిన సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ అప్పటివరకు ఆ దైవజనులకి సహకారాలుగా దోస్తులుగా ఉన్న ఫ్రెండ్స్ కి దైవజనులకు మధ్య ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది వాలల్లో వాళ్లకి

గొడవలు జరిగి ఒక త్రీ డేస్ మాత్రమే వారు అక్కడ ఉండి వెళ్లిపోయారు నేను ఆ వివరాలన్నీ సేకరించాను ఆ దైవజనురాలు ఇక్కడ ఏమైనా పరిచర్య చేసిందా అని ఎమి చేయలేదు ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు

ఒక రోజురాత్రి నేను నిద్రిస్తున్న సమయంలో నాకు ఒక కల వచ్చింది అందులో ఆ దైవజనుడను సమాధి చేసిన మట్టితో కప్పబడిన ప్రాంతం అది ఎత్తుగా కప్పబడిన ఆ మట్టి దగ్గర నేను కూర్చొని ఏడుస్తూ

వున్నాను ఏమని ఏడుస్తూ ఉన్నను అని అంటే "కనీషం ఈ దైవజనుడి శవాన్ని కూడా అంటే మృతి చెందిన బాడీని కూడా నన్ను చూడనివ్వలేదు నేను చూడకుండానే పాతిపెట్టారు అని " బాగా ఏడుస్తూ ఉన్నాను ఆ సమయంలో తెల్లని తల వెంట్రుకలు కలిగిన ఒక వృద్ధుడు ఒక కర్ర చేత పట్టుకొని నా దగ్గరికి వచ్చి "అమ్మ ఈ దైవజనుడు తిరిగి లేవటం నీవు చూస్తావు ఎడవకు" అని చెప్పినప్పుడు నాకు వెంటనే మెలకువ వచ్చేసింది నేను అనుకున్నాను కద ! రాకడ సమయం లో కదా యిది జరిగేది అని

నా కలలో ఆ వృద్ధుడు చెప్పిన మాట నాకు వివాహము అయ్యి నేను ఆ ప్రాంతాన్ని వదిలిన చాల సంవత్సరాల తర్వాత నెరవేరింది వెళ్లిపోయిన ఆ దైవజనుడు మరళ వచ్చి ఆక్కడ నేను నాతల్లి గారి దగ్గర వున్నపుడు కట్టబడిన అమందిర స్థలము దానికి సంబంధించిన వాటన్నిటిని నా తల్లిగారికి యిచ్చి తాను ప్రక్క గ్రామంలో పరిచర్యను ప్రారంభించి అక్కడ పరిచర్యను చేస్తూ ఉన్నారు.

2011లో నా పుస్తకమును ముద్రించే సమయంలో వేరొక దైవజనుడి ద్వారా తనతో నేను ఫోన్ ద్వారా మాట్లాడాను ఆ సమయంలో ఆ దైవజనుడు ఏమన్నాడు అని అంటే నా మినిస్ట్రీ పేరుతో మీ పుస్తకాన్ని ప్రచురించండి అని అడిగారు అప్పుడు నేను ఒక్కటే మాట చెప్పాను నేను పరిచర్యలో ఒంటరిగానే ఒక ఉమెన్ గానే ముందుకు వెళ్లదలిచాను అని చెప్పను అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నదే ఈ క్రైసోలైట్ ఉమెన్స్ మినిస్ట్రీస్ నా తల్లిగారి ద్వారా ప్రారంభించబడిన మందిరంలో ఆ పొలంలో దేవుని వాగ్దానం ద్వారా పోరాడిన నా ఉమెన్స్ మినిస్ట్రీ నాతో పాటే వుంది.

శారా వాగ్దానం పొందిన తర్వాత

దేవుడు వాగ్దానం ఇచ్చి శారాను విజయం లోనికి నడిపించిన తర్వాత ఎంతమంది వాగ్దానం లేని వారు వచ్చినప్పటికీ వారికి అపజయమే కలుగుతుంది.

విజయాన్ని అందించడంలో కుటుంబాలను కట్టడంలో సంఘాలను కాపాడటంలో దేవుని సేవలో ప్రాముఖ్యమైన రీతిలో స్త్రీలు వాడ భడుతుంటే,

కొంతమంది విచ్ఛిన్నం చేసే మూఢురాళ్ళుగా

స్త్రీలను చిత్రీకరించి నిందిస్తు ఉంటారు.

ఇలా విమర్శించే వారందరు రూతు స్వాస్థ్యమును విడిపించిన బోయజు లాంటి బాధ్యతను కలిగి ఉండగలరా !

ఎస్తేర్ క్రైసోలైట్

23-5-2025