CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

అభిషేకం

1యోహాను 2:27

అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటిని గూర్చి మీకు భోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు(నిలిచియుండుడి).

పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి ఎల వస్తాడు ?

1. పరిశుద్ధాత్మ దైవజనుల చేతులు ఉంచుట ద్వారా రావచ్చు,

కొన్ని సందర్భాలలో, దేవుని శిష్యులు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దిగినట్లు కనిపిస్తుంది.

అపొస్తలుల కార్యములు 8:17 – “అప్పుడు వారు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందిరి.”

పరిశుద్ధాత్మ మనం దేవుని ప్రార్థించినప్పుడు కూడా వస్తుంది.

యేసు స్పష్టంగా చెప్పిన వాక్యం:లూకా 11:13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.ఇది మనం ప్రత్యేకంగా ప్రార్థించినప్పుడు కూడా పరిశుద్ధాత్మ మన మీదికి వస్తాడని స్పష్టం చేస్తుంది.

అభిషేకం అంటే ఏంటి?

పరిశుద్ధాత్మతో మనము దేవుని ప్రజలముగా ముద్రించబడటం, పరిశుద్దాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తి నోందటం అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన ప్రార్థనలకు విజయాన్ని పొందటం దేవుని కొరకు గొప్ప కార్యాలను మనం చేయటం.

దేవుని వాక్యము వాగ్దాన రూపంలో మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటి ప్రభావం వలన మన జీవితంలో అద్భుతాలు జరగటం ఆత్మయు జీవమునై యున్నా దేవుని వాగ్దానం దేవుని వాక్యము ద్వారా మనం అభిషేకించ బడినప్పుడు మన జీవితంలో గొప్ప మార్పులు మనము చూడగలము.

అభిషేకం ఉన్నవాడు పరిశుద్ధాత్మ చేత బోదింప భడతాడు (1 యోహాను 2:27):

ఇది వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మతో నడిచే జీవితం గురించి చెప్తుంది. దేవుని వాక్యము వింటున్నప్పుడు లేక చదువుతూ ఉన్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండి, ఆ వాక్యాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. ఇది దేవునితో ప్రత్యక్ష సంబంధం, దైవీకమైన నడిపింపును సూచిస్తుంది. దీని వల్ల వాక్యాన్ని అర్థం చేసుకునే వివేచనా శక్తి మనకు కలుగుతుంది.

"అభిషేకం అంటే దేవుని శక్తితో నడవడం"

పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు— దానినే అభిషేకం అంటాం. ఇది కేవలం చేతులు ఉంచి నేత్తి మీద నూనే రాసి ప్రార్థించినప్పుడు మాత్రమే కాదు; మన మనస్సు హృదయం దేవుని వాక్యానికి లోబడినప్పుడే, పరిశుద్ధాత్మ మనపై పని చేయడం ప్రారంభిస్తాడు. ఆయన స్వయంగా మనకు బోధించటం మొదలుపెడతాడు.

1 యోహాను 2:27 వాక్యంలో చెప్పినట్టు, "మీలో ఉన్న అభిషేకం మీకు అన్నిటినీ నేర్పుతుంది" — ఇది అద్భుతమైన వాగ్దానం. ఇది అభిషేకాన్ని మానవ బోధకులకు ప్రత్యామ్నాయంగా చూపడం కాదు. కానీ పరిశుద్ధాత్మ బోధనకు ప్రాధాన్యత ఇవ్వడం.

అభిషేకం అంటే శక్తి కాదు — అది నడిపింపు.

అభిషేకం అంటే గర్వం కాదు — అది ఆత్మయందు విధేయత. అభిషేకం ఉన్నవాడిని ఎవడు నిలిపివేయలేడు — ఎందుకంటే దేవుడే అతనికి బోధకుడు.

"అభిషేకము ఉన్నవారిని దేవుడు నడిపిస్తాడు"

మనలో నిలిచిన పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒక శిక్షకుడిలా, ఉపాధ్యాయుడిలా మన మనస్సులో మన హృదయంతో మాట్లాడతాడు. మన అందరికి ఆత్మలో నిత్యము శిక్షణ అందించే దేవుని పద్ధతి ఇది. ఇది శరీరాన్ని ధరించి బోధించే మానవ బోధకులకు యిది విరోధం కాదు, కానీ ఆత్మ యొక్క స్వతంత్రమైన దేవుని నడిపింపును మనము కలిగి ఉండటము పరిశుద్ధాత్మ బోధకు మనము ప్రాముఖ్యతను ఇవ్వటం.

అభిషేకము ఉన్నవారిని దేవుడు తానే నడిపిస్తాడు. వారికి వాక్యము జీవమవుతుంది. వాక్యము చదవడమే కాదు, ఆత్మతో కలిపి బోధించబడడం వారి జీవితంలో జరుగుతుంది. ఇది ఒక దివ్యమైన అనుభవం. ఎవడూ బోధించనక్కర్లేదు అనగానే — ఆత్మ యందు ఉన్నవాడు ఆత్మచేతే నడిపింపబడతాడు అని అర్థం.

"దేవుని అభిషేకం ఉన్నచోట, పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ఉపదేశించే ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతునే వుంటుంది" అభిషేకం పొందిన వ్యక్తి దేవుని వరములను ఆశక్తితో ఆపేక్షిస్తాడు.

1కోరింథీయులకు 14:1

ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

నేను రక్షించ భడిన తరువాత ప్రాముఖ్యంగా దేవుని సేవ చేయాలని అనుకున్న తర్వాత పరిశుద్ధ గ్రంథమును బాగా చదువుతూ ఉండేదాన్ని నా సమయము లో ఎక్కువ భాగమును నేను దీనికే వినియోగించే దానిని ఆ సమయంలోనే "విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి" ఈ వాక్యము నన్ను బాగా ఆకర్షించింది నాకు ఈ ప్రవచన వరమును ఇవ్వండి ప్రభువా అని అప్పటినుంచి ప్రార్థిస్తూ వచ్చేదాన్ని.

ప్రవచనం వరము అని అంటే భవిష్యత్తును చెప్పటము మాత్రమే కాదు కానీ దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకొని ఇతరులకు దాన్ని మనము చెప్పటమును గూర్చికూడా ప్రవచన వరమే అని చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితులలో దేవుని హృదయాన్ని ప్రజలకు తెలియజేయడమే ప్రవచనం అని బైబిల్ భాషలో మనం చెప్పవచ్చు.

ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలుగుతున్నారు అని అంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ బోధించకుండా ఎవరికి దేవుని వాక్యం అర్థం కాదు ఇతరులకు దానిని చెప్పలేరు దేవుని వాక్యాన్ని చెప్పగలిగే సామర్థ్యం ఒక వ్యక్తికి దేవుడు ఇలా ఇచ్చాడు అని అంటే ఆ వ్యక్తిని దేవుడు ఏదో ఒక రూపంలో వాడుకుంటాకే అని అర్థం నిష్ ప్రయోజనంగా దేవుడు ఎవరికి ఏ వరమును ఇవ్వడు+

సువార్త అంటే !

దేవుని గురించి తెలియజేసే వార్తమే సువార్త అని అంటారు

ఏ స్థలంలో నిలబడ్డా, దేవుని వాక్యాన్ని ప్రేమతో, విశ్వాసంతో పంచుకుంటే, అది సువార్తే!

దేవుని వాక్యం – యేసు క్రీస్తుని గురించి చెప్పడమే సువార్త అది స్కూల్లో అయినా, మార్కెట్‌లో అయినా, ఇంట్లో అయినా, పల్లెటూళ్లలో అయినా — ఎక్కడైనా పంచితే, అది సువార్తా ప్రచారమే.

స్వస్థత, క్షేమం, ఆశను కలిగించే వార్త దేవుని రాకడకు సిద్ధపరిచే వాక్యం చెప్పడమే శుభవార్త.

పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉన్నా, దేవుని వాక్యం వారి జీవితంలో పని చేస్తే —ఆ వ్యక్తి ద్వారా దేవుడు సువార్తను ప్రకటిస్తాడు అది యాజకుడైనా, మిషనరీ అయినా, ఒక సామాన్య విశ్వాసి అయినా దేవుని చేతిలో పాత్ర అవుతాడు.

చెప్పబడేది రక్షణ కొరకు అయితే — అది సువార్తే

మానవుల క్షేమం కొరకు అయితే — అది శుభవార్తే

ఎక్కడ ఉన్నా, ఎవరైనా — దేవుని వాక్యాన్ని చెబితే — అది శక్తి కలిగిన సేవే

దేవుని గురించిన ఈ శుభవార్తను చెప్పటానికి మనకు అవసరమైంది ఏంటి

అపో.కార్యములు 4:13

వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని(లేక, సామాన్యులని) గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.శిక్షణ లేకపోయినా, వారు యేసుతో కూడ ఉండటం వల్ల శక్తిమంతులయ్యారు.

ఎస్తేర్ క్రైసోలైట్

22-5-2025