CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

ఆత్మ నడిపించే మార్గం – అందరికీ కనబడదు.

ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే మార్గం ఒక వ్యక్తికి మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది — అది పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది తనలో జరుగుతున్న ఈ ఆత్మ నడిపింపు జాడ అనేది ఇది బయట వాళ్ళకి తెలవదు.

ఎందుకంటే అది తనకి తన ఆత్మతో దేవునికి మధ్య జరిగే సంభాషణ. ఇతరులు దాన్ని అర్థం చేసుకోలేరు, ఎందుకంటే అది బుద్ధికి అర్థమయ్యే మార్గం కాదు, అది ఆత్మకు తెలిసే మార్గం. పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆదేశం, అనుభవించేవారికి మాత్రమే స్పష్టంగా తెలిసేది.

విశ్వాసంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడుస్తున్న మార్గంలో ఇతరులు మనకు సాయపడాలనుకునే ప్రయత్నాలు కొన్నిసార్లు మనకు ఆటంకాలుగా మారతాయి — ఎందుకంటే వాళ్లు చూస్తున్న దారిలో మనము నడవలేము, ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ఆధీనములో నడుస్తున్న మనకే ఒక ప్రత్యేకమైన ఆత్మ నడిపింపుగా మనకు తెలుస్తుంది.

1కోరింథీయులకు 2:14

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

ఆత్మ నడిపించే మార్గం, ఇతరుల అంచనాలపై ఆధారపడి ఉండదు. అంచనాల కంటే ఆత్మ నిర్ణయించినదే మనకు ప్రాముఖ్యం.

కొన్నిసార్లు దేవుడు మనలను నడిపించే మార్గము మనము వెళ్లాలి అనుకున్న మార్గము మన ప్రయాణము ఒకే దిశగా ఉండవచ్చు , కాని ప్రయాణ పద్ధతి వేరు. మనము మన పరిశీలనలతో, ఈ లోక సంబంధమైన మన ఆచారాలతో,మన అనుభవాలపై ఆధారపడి ఆ దారిలో వెళ్లాలని అనుకుంటు ఉంటాము కాని పరిశుద్ధాత్మ మనలను నడిపించే మార్గము అది నిశ్శబ్దంగా బాహ్యంగా ఎవరికి కనపడని రీతిలో మనలను నడిపిస్తు వుంటాడు.

ఇద్దరు వెళ్లేది ఒకే దిశవైపు ఒకే మార్గం వైపు కానీ ఇక్కడ తేడా ఏమిటంటే మనము చేసే ప్రయత్నం బాహ్యంగా కనపడుతుంది దేవుడి నడిపించే విధానం బాహ్యంగా కనపడకుండా ఉంటుంది ఈ బాహ్యంగా కనపడే విధానం వల్ల కొన్ని నష్టాలు మనకు రావచ్చు ఆత్మ నడిపింపులో మనం వెళ్లకుండా ఉండటం వల్ల మనం చేరాలనుకున్న గమ్యం ఆలస్యం అవుతుంది.

ఆత్మ చేత నడిపించబడే మార్గం అన్నది బయటివారికి అంటే దేవుని ఆత్మ లేని వారికి అది అర్థం కాదు ఎందుకంటే ఆ మార్గం బాహ్య సంకేతాలతో కనిపించదు. అది ఆత్మ జ్ఞానంతో మాత్రమే గ్రహించదగినది.

"పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలను నడిపించే మార్గాన్ని కాకుండా, మనమే నిర్ణయించుకునే బాహ్య పరిస్థితుల ఆధారంగా నడిచే మార్గం, చాలాసార్లు మనకు నష్టం కలిగించవచ్చు."

ఆత్మ నడిపించబడే మార్గం నిశ్శబ్దమైన మార్గం. ఆ మార్గం అర్థం కావాలంటే, పరిశుద్ధాత్మ జ్ఞానం అవసరం. బాహ్య ప్రయత్నం కాదు.ఈ లోకంలో శ్రమల మధ్య ఆత్మ మౌనంగా మనలను నడిపిస్తూనే ఉంటుంది. అది దేవుని ప్రత్యేక పిలుపు.

యెషయా 55:8

నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

ఎస్తేర్ క్రైసోలైట్

9-6-2025