CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

వారి దేవుడే యిప్పుడు నా దేవుడు

చాల సంవత్సరాల క్రితం నా ప్రార్ధన ఎలా ఉండేది అని అంటే నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నాకు దేవుడు గుర్తుకు చేసిన ప్రతి ఆవిధేయతను భట్టి క్షమించమని ఆడిగిన తరువాత కూడ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా ఆన్న అనుమానం కలిగేది నా నోటితో నేను ప్రార్ధిస్తూ ఉన్న ఆ సమయంలోనే నా మనసు వీటిని గురించి ఆలోచిస్తూ ఉండేది.

అప్పుడు నేను ఏమి చేసేదాన్ని అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహాము దేవుడా ! ఇస్సాకు దేవా యాకోబు దేవుడా ! అని పిలిచి ప్రార్థిస్తు పెద్ద పెద్ద గొప్ప సేవకులు అని నాకు అనిపించే వారి పేరుతో కూడా దేవున్ని పిలిచి ప్రార్థిస్తు వుండేదాన్ని.

ఇల ఎందుకు అని అంటే నేను పిలిస్తే నేను మాట్లాడుతుంటే నేను ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నా ప్రార్థనకు తొందరగా జవాబు ఇస్తాడో ! లేదో ! వీరు అందరు గొప్ప గొప్ప వాళ్ళు కదా వీరి పేరుతో కూడా నేను దేవుని పిలిస్తే నా ప్రార్ధన తొందరగా ఆలకిస్తాడు అని నాకు అనిపించి అప్పుడు నేను అలా ప్రార్థిస్తూ ఉండే దాన్ని.

దేవుడు అబ్రహాములో దేవున్ని వెంబడించే సమర్పణను చూశాడు ఇస్సాకు లో విధేయతను చూశాడు యాకోబులో నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడువను అన్న పట్టుదల ప్రార్థనను దేవుడు చూశాడు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల వారి దేవుడుగా వ్రాయబడిన వాక్యాలను మనము చూస్తాము.

ఈ దేవున్ని గురించి మనకు ఎలా తెలుసు ! వీరి ద్వారానే వీరు దేవుని వెంబడించడం మూలాన్నే వీరిని కాపాడిన దేవుడు వీరి అవసరతలు తీర్చిన దేవుడు వీరికి సహాయం చేసిన దేవుడు వీరిని ఉన్నతంగా హెచ్చించిన దేవుడు ఈ దేవుడు నాకు కూడా కావాలి అని మనము ఈ రోజులలో ఈ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము ఈ దేవుని మనము వెంబడిస్తు ఉన్నాము.

ఈరోజు మనము ఇల ప్రార్థించే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వారు ఎలా ఆయనను అనుసరించారో వెంబడించారో, ఆయన వారికి ఎలా ప్రత్యుత్తరమిచ్చాడో, అదే దేవుడు మన ప్రవర్తనను మన జీవిత విధానమును ఆ దేవుని పట్ల మనము కలిగి ఉన్న విశ్వాసమును భక్తిని ఆ దేవుని పట్ల మనము ఆధారపడే తత్వమును విధానమును గమనిస్తున్నాడు,

దేవుని కొరకు దేవుని వెంబడించుటలో మనలో ఉన్న దృఢ సంకల్పమును దేవునికి దేవుని వాక్యమునకు విధేయతను చూపే గాఢమైన నిర్ణయమును నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను వదలను ఆనే అడుగు వెనక్కి తీయని స్థిరమైన ప్రార్థన మనస్సును

దేవుడు గౌరవిస్తాడు, మన ప్రార్థనలను ఆలకిస్తాడు.

అన్నీ నామముల కంటే ఘానమైన నామముగా హెచ్చింపబడిన క్రీస్తు యేసు ప్రభువు వారి నామములో దేవుని దగ్గరకు చేరే భాగ్యము క్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానాల ద్వారా మనకు దొరికింది దీనిని విశ్వసించే ప్రతి ఒక్కరికి ఉచితముగా దేవుడు అనుగ్రహించాడు.

మనము ఎవరి నామములో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ప్రార్థిస్తున్నా ఆ ప్రార్థనలో మనము దేవునిపై ఆధారపడే విధానములో మన హృదయం దేవుని పట్ల ఎంత పూర్ణమైన పట్టుదలను కలిగి ఉన్నది అన్న విషయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు దానిని బట్టి మనకు జవాబును మన ప్రార్థనలకు సమాధానమును ఇస్తాడు.

అప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల ప్రార్థనలు విన్న వారి దేవుడు ఈరోజు కూడా నిన్న నేడు నిరంతరం మారని దేవుడుగా తను విశ్వసించిన ప్రజలతో ప్రయాణిస్తూ ఉన్నాడు.

నా పితరుల అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు వారి దేవుడు నేను చూస్తున్న ఈ గొప్ప గొప్ప దైవ సేవకుల దేవుడు ఇప్పుడు ఈ దేవుడు నా దేవుడుగా ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నన్ను నడిపిస్తాడు, ఆయనను నేను వెంబడిస్తాను దేవునికి నేను విలువైన వ్యక్తిని దేవుని నుంచి వచ్చే సమాధానం ఆలస్యం అయినా, నిశ్చయంగా అది వచ్చి తీరుతుంది. ఆని మీరు చెప్పగలరా !

ఎస్తేర్ క్రైసోలైట్

20-5-2025