2025 Messages
🪨 బండమీద సర్పము జాడ,
సామెతలు 30:18 --19
నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,
బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.
2. బండమీద సర్పము జాడ,
సర్పము బండమీద చురుకుగా, శత్రువులు గుర్తించలేని విధంగా సాగిపోతుంది.
కానీ ఆది వెళ్లిన మార్గము దాని జాడ మనకు కనిపించదు.బండ పైన కాలి ముద్ర ఆది వెళ్లిన జాడ తెలియకుండా అది సాగిపోతుంది.
ఇది రహస్యంగా, తెలివిగా, అప్రమత్తంగా ఉండే జీవికి సూచన.
బహిరంగంగా కనపడకపోయినా, కొన్ని మార్గాలు ఎంతో బలమైనవి, అర్థం చేసుకోవడానికి ఆత్మీయ జ్ఞానం అవసరం. దేవుని కార్యములు, మనుషుల హృదయాలు, వారి మార్గాలు కొన్ని సార్లు మన కళ్లతో కనిపించవు. అయితే అవి ఉన్నాయి, పరిగణలోనికి వాటిని మనము తీసుకోవాలి.
"బండమీద సర్పం" పరిశుద్ధ గ్రంథం దీని గురించి మనకు ఏమీ తెలియజేస్తుంది ?
బండ = దేవుడు (స్థిరమైన రక్షణ)
సర్పం = అపాయం / శత్రువు / తెలివైన శత్రువు
మనం దేవునిలో ఉన్నా, శత్రువు కదలికలు మెల్లగా ఉంటాయి, స్పష్టంగా కనిపించవు – అందుకే అప్రమత్తంగా ఉండమని ఈ వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. సర్పం బండమీద నడిచిన దాని జాడ మనకు కనిపించదు. ఇది చాలా చిన్న విషయం. కాని ఆత్మీయంగా చూసినపుడు ఇది ఒక గాఢమైన సూచన.
బండ అనగా దేవుడు. ఆయన సాక్షాత్తు మనకు రక్షణ, మన దాగు స్థలం.
సర్పం అనగా శత్రువు. అది పాపం, మాయ, ఆపాయం అనుదినము పరీక్షల రూపంలో మనకు ఎదురవుతుంది.
ఈ వాక్యం మనకు చెప్పేది ఏమిటంటే:
మనము దేవునిలో ఉన్నప్పటికీ, శత్రువు దాగిన మార్గాల్లో, కనబడని విధంగా మన మధ్య చలించగలదు. దాని అడుగులు బయటకు జాడ చూపించవు.అందుకే—మనము బండమీద నిలబడినవారమే అయినా, అప్రమత్తత, ఆత్మీయమైన విచక్షణ మనకు తప్పనిసరి.
దేవుని వాక్యమే మనకు శత్రువు జాడ చూపించే దీపం. బండమీద సర్పం జాడ కనబడదంటే—మన జీవితంలో శబ్దం లేకుండా వచ్చే శత్రువు ప్రవేశం కూడా, మన దృష్టిలోంచి తప్పిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచంలోని కొన్ని మార్గాలు మన కళ్లకు కనపడవు.సర్పము బండమీద నెమ్మదిగా, తెలివిగా దాని జాడలు దానిముద్ర మనకు కనపడనీయకుండా సాగుతుంది ఇదే విధంగా మన జీవితాల్లో దేవుడు చేస్తున్న పనిలోను, శత్రువు చేసే చలనలలోను కొన్ని మనకు కనపడని అగాధ మైన రహస్యాలు ఉంటాయి. వాటిని మనం చూడలేం, పట్టలేం, కానీ అవి ఉన్నయి.
శత్రువు మనకు ప్రత్యక్షంగా కనిపించనంత లోతుగా, యుక్తిగా పని చేస్తాడు. శత్రువు కార్యకలాపాలలో మనము వెంటనే గ్రహించలేని, లోతైన, ప్రమాదకరమైన రహస్యాలు ఉంటాయి. శత్రువు చేసే చలనాల్లో కొన్ని మన కళ్లకు కనిపించవు.
దాని యొక్క దాడులు వ్యూహాత్మకంగా, లోతుగా ఉంటాయి. కనిపించకుండా, కొంతసేపటికి మనకు అర్థం కాని మార్గాలలో పని చేసి, మనల్ని మోసపెట్టి పడేయాలనే ప్రయత్నం శత్రువు వలన కలుగుతుంది.
బండ మీద సర్పము సాగినట్లే శత్రువు మన స్థిరమైన బండయైన దేవుని దగ్గర మనము వున్నపుటికి ఆ బండ మీద మనము స్థిరపరచబడినప్పటికీ కూడా శత్రవు వస్తాడు.
శత్రవైన సాతాను మార్గాలు శభ్దం లేకుండ మనకు వినబడకుండ నిశ్శబ్దంగా ఉంటాయి. మనం 'అప్రమత్తంగా" లేకపోతే, దేవుని శాశ్వత రక్షణ మనకు ఉన్నప్పటికీ మన జీవితాలలో శత్రువు అయిన సాతాను తన జాడలను ఏర్పరచుకోవచ్చు.
కాబట్టి మనం బండమీద నిలబడినవారమైతే – దేవునిలో శాశ్వతంగా దాగినవారమైతే – శత్రువు జాడను కనుగొనగలిగే ఆత్మీయ దృష్టి మనకు అవసరం.
స్థిరమైన బండలాంటి స్థలాలలో అంటే దేవుడు ఇచ్చిన రక్షణ, ఆశ్రయం, ఆశీర్వాదాల మధ్యలో
మనము స్థిరంగా ఉన్నప్పటికీ, అంటే బండలాగే దేవుని రక్షణలో మనము నిలిచి ఉన్నప్పటికీ, మనలో జాగ్రత్త, జ్ఞానం, మరియు వివేకం లేకపోతే, మనము ఆ స్థిరతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.మనం బలంగా ఉన్నామనుకునే సమయంలోనూ, అపవాది మెల్లగా, మోసపూరితంగా పని చేస్తుంటాడు.
శత్రువు బండమీద సర్పంలా వచ్చి మనల్ని మోసం చేయవచ్చు. కాబట్టి మెలకువగా ఉండాలి.
1పేతురు 5:8
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
ఈ రోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే —
దేవుని మాటలపై మనము మన దృష్టిని నిలిపితే, దేవుడు మనకు కనపడని, అజ్ఞాతమైన, అస్పష్టమైన మార్గాలనూ స్పష్టంగా చూపిస్తాడు. మనం నడిచే ప్రతి దారిలో దేవుని ఇష్టం, దేవుని చిత్తమే కనిపించాలి. మన కళ్లకు కనిపించని మార్గమూ, దేవుని చిత్తంతో స్పష్టమవుతుంది.
బండమీద ఉన్నప్పటికీ మెలకువగా ఉండాలి.
రక్షణలో ఉన్నప్పటికీ ప్రార్థనలో ఉండాలి.
ఆశీర్వాదాలలో ఉన్నప్పటికీ జాగ్రత్తతో నడవాలి.
ఇది ఆత్మీయ యుద్ధం గురించిన ఒక హెచ్చరిక
మెలకువగా ఉండండి — బండ మీద కూడా సర్పం తిరుగుతుంది.
జ్ఞానంతో నడవండి — కనపడని మార్గాలలో కూడా దేవుని చిత్తం దేవుని నడిపింపు మనకు వెలుగుగా మారుతుంది.
ప్రతి రోజు మనం అడుగడుగునా దేవుని చిత్తాన్ని మాత్రమే గమనిస్తూ, ఆయన వెలుగులో నడిచేలా ప్రార్థిద్దాం.
" దేవా, నేను మీ బండమీద నిలబడ్డాను.
కానీ నా మధ్య చలించగలిగే ఏ దుష్టశక్తినైనా గుర్తించగలిగే ఆత్మీయమైన నేత్రాలను,గ్రహించగలిగే వివేకమును, మీ పరిశుద్ధాత్మను, ఆత్మీయమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడే
ఉపదేశమును, నాకు సమృద్ధిగా ఇవ్వండి.
యేసు నామములో ఆమెన్ "

ఎస్తేరు క్రైసోలైట్
22-5-2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 22-5-25