2025 Messages
మన మెక్కడికి వెళ్లినా ప్రార్థనను మనతో తీసుకెళ్ళుదాం.
దేవున్ని మనము ప్రార్థించడంలో అందులో ఒక నిరీక్షణ ఉంది ఒక సంతోషం ఉంది ఒక విజయం ఉంది ఒక ఓదార్పు ఉంది నెమ్మదిని కలిగించే ఒక సమాధానం ఉంది ఇన్ని మంచి గుణాలను కలిగిన ప్రార్థనను మనం ఎక్కడికి వెళ్ళినా మనతోనే తీసుకు వెల్దాం.
1. "ప్రార్థన – ప్రార్థించే వ్యక్తి యొక్క శక్తి"
ప్రార్థన అనేది కేవలం మన మాటలు కాదు.
అది మన హృదయ స్పందనను దేవుని చెవికి చేర్చే ఒక భలమైన సాధనం
అందుకే దావీదు ఇలా చెబుతాడు:
కీర్తనలు 18:6
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
2. "ప్రార్థనలో ఉంది ఓ నమ్మకం."
ఏదైనా కావాలని మన హృదయం ఆశించినప్పుడు
దేవుని దగ్గరకు వెళ్లడమే మన విశ్వాసం యొక్క ప్రారంభం.
ప్రార్థనలో మనం అడిగే ఒక్కో మాట
మనము నమ్మే ఒక సజీవుడైన దేవునితో మాట్లాడే ప్రయత్నం. అందుకే పరిశుద్ధ గ్రంధం మనకు ఇలా చెబుతుంది
మార్కు 11:24
అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
ఈ వాక్యం మనకు చెబుతుంది —
మనము మన నోటితో చేసే ప్రార్థనకు ముందు మన హృదయంలో నమ్మకం విశ్వాసం అన్నది ఉండాలి.
మన ప్రార్థన దేవుని చెవులకు మాత్రమే కాక,
ఆయన చేతులకు కూడా తాకాలి.
"మన ప్రార్థన దేవుని చెవులకు మాత్రమే కాక, ఆయన చేతులకు కూడా తాకాలి."
చెవులకు తాకడం అంటే:
మన ప్రార్థన దేవుడు వినిపించుకోవడం,
మన మాటలు ఆయన మనస్సులోకి చేరడం.
చేతులకు తాకడం అంటే:
దేవుడు చేసే పనిలో మార్పు కలగడం,
ఆయన చేతుల ద్వారా కార్యములు జరగడం, అంటే:
రక్షణ, స్వస్థత, ఓదార్పు మనము ప్రయాణించవలసిన మార్గమును తెలియజేసే పనులను చేయటం.
కీర్తనలు 32:8
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.
దేవుని "చేతులు" అనగా ఆయన శక్తి, చర్య, కార్యం, చురుకుతనం.
యెషయా 59:1
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
దేవుని చెవి మన ప్రార్థనలో వినటానికి, దేవుని చెయ్యి మనలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాయి.
అందుకే...దేవుని చేతులు కదలాలి అంటే మన ప్రార్థనలో: నమ్మకం ఉండాలి,వినయము ఉండాలి,
కోరిక మాత్రమే కాదు, ఆత్మను కదిలించే విశ్వాసం ఉండాలి.
ప్రార్థన దేవుని చెవులను తాకాలి — ఆయన మన బాధలను వినాలి. కానీ అదే ప్రార్థన ఆయన చేతులను తాకితే — ఆయనే పని మొదలెడతాడు. మన కోసం ఉద్యమిస్తాడు. కనుక ప్రార్థనలో వినిపించుకోవడమే కాదు, దేవుని చేతుల్లో కార్యరూపం దక్కించే విశ్వాసం మనకు కావాలి!
దేవుడు ఆలస్యం చేస్తాడు… కానీ మరిచిపోడు.
ఆయన మౌనంగా ఉంటాడు… కానీ చూసి ఉంటాడు.
మన విశ్వాసంతో ప్రార్థించబడిన ఒక్క మాట కూడా వృధా కాదు.
దేవుని పట్ల విశ్వాసం ఉంచిన హృదయం ,మనము ప్రార్థనలో చెప్పిన మాటలు మన భవిష్యత్తును మార్చగల శక్తిని కలిగి ఉంటాయి.
మీ ప్రార్థన —
దేవుడు వింటున్నాడు. విశ్వాసంతో అడగండి.
మీరు ప్రార్థిస్తున్న ఒక చిన్న మాట, ఒక చిన్న ఆశ, ఒక చిన్న కోరిక…అది దేవుని చెవుల్లో పడినప్పుడు,
అది ఆవగింజలాంటి విశ్వాసపు విత్తనముల మారుతుంది
మత్తయి 17:20 -- 21
అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
లూకా 17:6
ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
మీరు నేడు చేసే ప్రార్థన,
ఒక్క చిన్న విశ్వాసంతో చేసినా,
దానిలో బలమైన ప్రభావం ఉండొచ్చు —
అది మీ జీవితంలోని ఒక పెద్ద చిక్కును సమస్యను పరిష్కరించగలిగే శక్తి కలిగిన తాళముగా అది మారొచ్చు.
దేవుడు వింటున్నాడు. నమ్మకంగా అడగండి.
అంటే — మీ చిన్న ప్రార్థనను ఆయన పెద్ద కార్యంగా మారుస్తాడు.
3. " ప్రార్థనలో ఉంది ఓ ఓదార్పు."
ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే సమయం మాత్రమే కాదు… మన లోతైన బాధను గమనించే ఓ దివ్యమైన దేవుని చేతి స్పర్శ కూడా. మనం కన్నీటితో అడుగులు వేస్తున్నప్పుడు, మనకు మాటలు రాకపోయినా, మనం దేవుని ఎదుట దిగులుతో మౌనంగా నిలబడినప్పుడు కూడా — దేవుడు మన హృదయాన్ని గమనిస్తాడు.అందుకే,
కీర్తనలు 34:18
విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. అని దేవుని వాక్యం సెలవిస్తుంది
ప్రార్థనలో దేవుడు మనకు దగ్గర అవుతాడు, మన బాధ మనకు బాధ లాగా అనిపించదు మన కష్టం మనకు కష్టం లాగా అనిపించదు. మన శ్రమ మనకు శ్రమలాగా అనిపించదు. వీటన్నిటిలో మనము సంతోషంగా నడుస్తాం ప్రార్థన ద్వారా దేవున్ని హత్తుకునే దేవునిపై ఆధారపడే అద్భుతమైన అనుభవం ఇది
మన కన్నీళ్లను ఎవరు పట్టించు కోకపోయినా
కీర్తనలు 56:8
నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో1 కనబడును గదా.
"కవిలె" అనగా దేవుడు వ్రాసిన పుస్తకము గుర్తింపు పత్రము జ్ఞాపకాల నమోదు పుస్తకం అని అర్థం. ఇది దేవుడు మన గురించి జ్ఞాపకాలు లేదా మన చర్యలను నమోదు చేసుకునే దిగా చెప్పబడింది.
ఇది దేవుని ప్రేమ, ఆయన మన ప్రతి కన్నీటిని లెక్క పెట్టే విధానమును మనకు తెలియజేస్తుంది.
ఇది మనం ఒంటరిగా లేమని, మన కన్నీళ్లు వృథా కావని గొప్ప ఓదార్పునిచ్చే వాక్యం.
మీరు మాటలేమి మాట్లాడ లేక పోయినా, మీ ప్రార్థనల మధ్య వేదన కన్నీళ్లే మిగిలినా… ఓ మాటను మాత్రం మీరు మర్చిపోకండి
దేవుడు మీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు
ఆయన ఓదార్చటానికి సిద్ధంగా ఉన్నాడు.
ఒకసారి నా పెద్ద కుమార్తె ఒకటిన్నర సంవత్సరం వయసులో ఉన్నప్పుడు తనకు ఒక పాల బాటిల్ అవసరమైంది అది దాన్ని ఖర్చు ఒక 50 లోపే ఉంటుంది దానిని కొనగలిగే స్తోమత ఉన్నప్పటికీ నా భర్తకు అది అంతా అవసరం అని అనిపించలేదు కానీ ఒక తల్లిగా నేను గుర్తించాను నా కుమార్తె ఏడుస్తూ ఉన్నప్పుడు తనతో నేను కూడా ఏడుస్తూ ఉండేదాన్ని ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెప్తున్నాను అని అంటే దానిని జయించాను కానీ అప్పుడు ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితి ఒకరోజు మా ఇంటి ఓనర్ మా ఇంటికి వచ్చింది ఎందుకు పాప బాగా ఏడుస్తూ వుంది అని నన్ను అడిగింది నేను తనకి చెప్పాను
తనకి నేనంటే బాగా ఇష్టం ఎందుకు అంటే తన కుమార్తె అమెరికాలో ఉంటుంది నేను వారి ఇంటిలోనికి వచ్చిన తరువాత చాల సంవత్సరాల నుండి సంతానము కలగని అమెరికాలో ఉన్న తన కుమార్తె కు కుమారుడు పుట్టాడు అందుకే ఆమె నన్ను చాలా ఇష్టంగా చూసేది
నేను పాప గురించి విషయం చెప్పిన వెంటనే ఆమె
వారి ఇంటిలోకి వెళ్లి ఒక అద్భుతమైన ఖరీదైన అమెరికా నుంచి తీసుకుని వచ్చిన ఒక క్రొత్త పాల బాటిల్ని నా కుమార్తె కొరకు ఇచ్చింది దేవుడు మన కన్నీటికి చాలా విలువను ఇస్తాడు
4. " ప్రార్థనలో ఒక సమాధానము వుంది "
మనము ప్రార్థించినప్పుడు మన హృదయానికి ఒక నెమ్మది కలుగుతుంది
ఫిలిప్పీయులకు 4:6-7
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
ఈ వాక్యం ప్రకారం — మనం ప్రార్థనలో మన మనసులోని భారాన్ని దేవునికి అప్పగించినప్పుడు, ఆయన మన హృదయాన్ని కాపాడే శాంతిని ప్రసాదిస్తాడు. అదే "నెమ్మది", అదే "సమాధానం".
ప్రార్థనలో దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ప్రార్థనలో మన హృదయాన్ని నెమ్మదింప జేస్తాడు. " అదే దేవుని సమాధానం ప్రారంభమైనది ఆవటానికి సంకేతం."
5. "ప్రార్థనలో విజయం ఉంది"
ప్రార్థనలో ఓ విశ్వాసపు విజయం ఉంది.
మన శ్రమలకు, పరీక్షలకు పరిష్కారం ఒక్కసారిగా రాకపోవచ్చు. కానీ మనం ప్రార్థనలో నిలిచినప్పుడు, దేవుడు మన తరఫున యుద్ధం చేస్తాడు.
యాకోబు 5:16
నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.
ప్రార్థనలో స్థిరంగా ఉండడం — ఓ శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆయుధం.
అది మన పరిస్థితిని వెంటనే మార్చకపోయినా,
మన హృదయాన్ని బలపరుస్తుంది.
మన విశ్వాసాన్ని ప్రక్షాళన చేస్తుంది.
విజయాన్ని చేరడానికి మార్గం వేసే సాధనమే ప్రార్థన.
మీకు ఎదురైన సవాళ్లు ఏవైనా సరే
ప్రార్థనలో నిలబడండి.
విజయం దేవునివద్ద ఉంది.
మన మెక్కడికి వెళ్లినా ప్రార్థనను మనతో తీసుకెళ్ళుదాం. పరిస్థితులు మారినా, ప్రార్థన మారదు. దేవుడు మారడు. మత్తయి 6:8
మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.
ఎస్తేర్ క్రైసో లైట్
18-5-2025