2025 Messages
నన్ను చూసే దేవుడు
నా అవసరతను తీర్చే దేవుడు
హగరు ( తిరస్కరించబడినవారు )
హగరు అనే పేరు హిబ్రూ భాషలో "దూరంగా వెళ్లినవారు,అనే అర్థము కలిగి ఉంది తిరస్కరించబడినవారు అనే భావనను కూడా యిది కలిగిస్తుంది.
హగరు ఎక్కడి నుంచి వచ్చింది?
హగరు ఒక ఈజిప్టు స్త్రీ, ఇమె అబ్రాహాం కుటుంబంలో ఉన్న ఈజిప్టు నుండి వచ్చిన దాసి. ఆమె ఈజిప్టు నుంచే శారాతో పాటు వచ్చింది. ఆమె శారాకు ఒక దాసిగా ఉన్నది.
హగరు పేరును తొలిసారిగా ప్రస్తావించబడే వచనం:
ఆదికాండము 16:1
అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
ఇక్కడ ఆమె గురించి ఈజిప్టు దాసురాలు అని స్పష్టంగా చెప్పబడింది — అంటే ఆమె ఈజిప్టులో పుట్టినది లేదా అక్కడనుంచి వచ్చినది అని అర్థం. కానీ ఈమె ఎప్పుడు, ఎక్కడి నుండి శారాకు దాసురాలుగా వచ్చింది అన్నది చెప్పలేదు.
చాలామంది బైబిల్ పండితులు మరియు వ్యాఖ్యానకులు ఇలా అంచనా వేస్తారు
శారాయి ఈజిప్టుకు వెళ్లినప్పుడు, ఫరో ఆమెకు గౌరవంగా ఒక దాసురాల్ని లేదా అనేక దాసుల్ని ఇచ్చి పంపించివుండవచ్చు.
హగరు బహుశా అప్పుడు వచ్చినవారి లో ఒకరిగా ఉంటుందన్నది సాధారణ అభిప్రాయం.
ఆదికాండము 12:16 లోనే ఫరో, శారాయిని తీసుకెళ్లినందుకుగాను అబ్రాహాము సంపదతో పాటు "దాసులు, దాసురాళ్లు" కూడా పొందాడు అని మాత్రమే వ్రాయబడింది.ఆదికాండము 12:16
అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.
అక్కడ శారాకు ప్రత్యక్షంగా దాసురాలు ఇవ్వబడ్డాయని లేదా హగర్‌నే ఇచ్చారు అని అనే వివరాలు సూటిగా లేవు. కానీ బైబిలు నేరుగా అలా చెప్పలేదు.
బైబిలు హగర్ ఎప్పుడు శారాకి దాసురాలై వచ్చిందో స్పష్టంగా చెప్పదు. అయితే ఆమె ఈజిప్టు మహిళ అని వచనాల్లో ఉన్నందున, శారాయి ఈజిప్టులో ఉన్నప్పుడు ఆమెను పొందినదై ఉండవచ్చు అనే భావన బలంగా ఉంది.
హగర్ ఈజిప్టువారి దాసురాలు. బహుశా శారాయి ఈజిప్టుకు వెళ్లినప్పుడు, ఆమెకు ఫరో ఇచ్చిన దాసురాలుగా వచ్చివుండవచ్చు. అయితే బైబిలు దీన్ని స్పష్టంగా చెప్పలేదు.
దేవుడు అబ్రహాముకు సంతానము గురించి వాగ్దానం చేసినప్పటికీ, శారా పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా గర్భం ధరించకపోవడంతో,
శారా ద్వార అబ్రహాముకి సంతానం కలగని కారణంగా శారా తన దాసి అయిన హగర్‌ను అబ్రహాముకి భార్యగా ఇచ్చి, హగరు ద్వారా సంతానాన్ని పొందాలని నిర్ణయిస్తుంది.
ఇది ఆ కాలంలో సామాన్యంగా పాటించే సంప్రదాయం — దాసిని సంతానోత్పత్తి కోసం ఇవ్వడం. హగర్ ఈజిప్టు దేశానికి చెందిన శారాతో పంపబడిన దాసీ. శారాకు సంతానము కలగలేదు
ఆ రోజుల్లో ఇది ఒక సాధారణ పద్ధతి — ఒక దాసిని తన భర్తకు ఇచ్చి, ఆమె ద్వారా పిల్లలు పొందడం (ఇది చట్టబద్ధంగా స్త్రీకి సంబంధించిన సంతానం అయ్యేది).
ఆదికాండము 16:2
కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.
శారా దాసి అయిన హగర్‌కు ఇక్కడ ఎవరి నుంచి ఎటువంటి ఎలాంటి ఆమోదం ఇవ్వబడలేదు.
ఆమె తనకు ఏం జరుగుతుందో చెప్పుకోలేకపోయింది.తనమీద తనకు ఎటువంటి హక్కులను లేకుండా దాస్యము అనేది చేసింది
ఇది సామాజిక విధానాల వల్ల ఒక వ్యక్తి తన యొక్క స్వేచ్ఛను కోల్పోయిన ఉదాహరణ.
ఆ రోజుల్లో దాసుల స్థితి ఎలా ఉండేది?
బైబిలు కాలంలో దాస్య వ్యవస్థ సామాన్యంగా ఉండేది. కొన్ని ప్రధాన అంశాలు:
యుద్ధాల్లో పట్టుబడినవారు, అప్పుల బానిసలు, లేదా బహుమతిగా ఇచ్చిన వారు దాసులవుతారు.
ఒక ఇంట్లో పనిచేసే దాసులు ఎప్పుడైనా వారి యజమాని నిర్ణయాలకే లోబడి ఉండేవారు.
స్త్రీ దాసులను అప్పట్లో గృహ సేవలు, బిడ్డల సంరక్షణతో పాటు, శారీరక అవసరాల కోసం కూడా బలవంతంగా వినియోగించుకునేవారు.
స్త్రీ ఆయిన పురుషుడు అయిన దాస్యములో వుండటము అనేది అది చాలా కష్టాన్ని కలిగించే విషయం.
ఎందుకు అని అంటే : దాస్యం వలన మనమీద మనకు ఉండే హక్కును స్వతంత్రతను కోల్పోతాము
మనకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా మనము ఎవ్వరి అధికారంలో ఉంటున్నామో వారికి మాత్రమే ఇష్టముగా మనము ఉండాల్సి వస్తుంది దాస్యము అనేది మన ఇష్టాలను ఆశలను ఆశయాలను నియంత్రిస్తుంది వ్యక్తి స్వేచ్ఛకు ఇది దూరం చేస్తుంది.
దాస్యములో ఉన్న వారిని గురించి చెప్పవలసి వస్తే వీరు అన్ని స్వేచ్ఛలకు దూరమైన వారు
వీరు ఆశయాల నుండి వీరిలో ఉన్న కోరికల నుండి వీరు తమకంటే బలవంతులైన వారి చేత నెట్టి వేయబడిన వారు అంతరంగంలో బాహ్యంగా వీరు కలిగి ఉన్న స్థితి వీరు ఏమి కావాలని కోరుకుంటారో వీరు ఏ రీతిగా బ్రతకాలని అనుకుంటారు వాటి అన్నిటి నుండి వీరు తిరస్కరించబడిన వారుగా ఉంటారు.
తిరస్కరించబడిన వారు దూరమైన వారు దూరముగా వెళ్లినవారు అనే అర్థము వచ్చే పేరు కలిగిన హాగరు అబ్రహాము శార కుటుంబంలో దాస్యం లో ఉన్న వ్యక్తిగా ఆ దాస్యము ద్వార తాను తన బిడ్డకు ఒక గుర్తింపును కోల్పోయి సమాజ పరముగా గౌరవం లేని స్థితిలో స్థానంలో అరణ్యంలో తన బిడ్డకు కలిగిన అవసరతను బట్టి తాను తన బిడ్డ ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుడు వారిని చూశాడు.
హగరు పొందిన ఇటువంటి స్థితి ప్రతి ఒక్కరి జీవితాలను దర్శించే అనుభవాన్ని మన ఇంటి వారి ద్వారా మన బంధువుల ద్వారా మన బాధ్యతలను చూడవలసిన వారి ద్వారా మనము వున్న మన చుట్టూ ప్రక్కల సమాజం ద్వారా మనమందరము ఏదో ఒక అప్పుడు దీనిని ఎదుర్కొనే ఉంటాము.
మనస్థితి ఎటువంటిది అయినప్పటికీ మనము కలిగి ఉన్న సమస్య ఎంత తీవ్రమైనప్పటికీని మన నిస్సహాయ స్థితిని బట్టి అది మనలను ఎలా బంధించి ఉంచినప్పటికీ ఈ లోకానుసారముగా ఈ లోకంలో ఉన్న ఈ సమాజ స్థితి గతులు మనకు గుర్తింపును ఇవ్వకపోయిన మన ప్రతి వేదన పరిస్థితులలో మనలను చూచే దేవుని దృష్టి మన మీద ఉంటుంది మనలను మనస్థితులను చూచే దేవుడు సజీవముగా అప్పుడు ఇప్పుడు మారని దేవుడు గా మార్పు చెందని దేవుడుగా వున్నాడు.
“నా కుమారుని మరణాన్ని చూడలేను” అని హగరు
కూర్చుని ఏడుస్తున్నట్లే మనము కూడా మనకు కలిగిన భారమైన స్థితిని బట్టి ఏడుస్తూ ఆసమయంలో అవిశ్వాసం అనేది మనలోకి వచ్చినప్పుడు మన స్థితిని మనలను నిందించుకుంటూ ఒక నిరాశకరమైన వాతావరణమును మనము సృష్టించుకుంటాము.
!
మనస్థితి మనము వెళ్లే పరిస్థితులు మన అనుభవాలను ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రము కచ్చితంగా చూస్తూ ఉంటాడు
అందుకే ఇదే త్రోవ దీనిలోనే నడువుడి అని మనలను బలపరిచే మనలను దారి తప్పించని వాక్కులను తన సేవకుల ద్వారా మనకు పంపుతూ ఉంటాడు.
అరణ్యంలో ఉన్న హాగరు కూడా దేవుని దూత ద్వారా ఇటువంటి సహాయాన్నే తాను పొందింది.
ఆదికాండము 21:17
దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు;
దేవుడు మన కన్నీటిని చూస్తాడు మనము ఏడుస్తున్న ఏడుపు స్వరాన్ని వింటాడు తన వాక్కును తన సందేశాన్ని మనకు పంపిస్తాడు మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని వాక్యం మీద దేవుని వాక్కు కొరకు మనము ఆధారపడతాము
దేవుని వాగ్దానం కొరకు మనము దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిలో నుండి ఒక చిన్న వాక్యాన్ని వాగ్దానముగా మనము తీసుకుంటాము ఇది దేనిని సూచిస్తుంది అని అంటే మనము దేవుని మీద ఆధారపడటాన్ని పరోక్షముగా మనము దేవుని ఆశ్రయిస్తుండటాన్ని దేవుని ప్రార్థిస్తుండడాన్ని ఇది తెలియజేస్తుంది.
మనము ఈ జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ మన స్థితిని చూసిన దేవుడు మన వద్దకు ఏ వాక్కును పంపిన అది మన జీవితంలో మన పరిస్థితులను మార్చే ఒక అద్భుతాన్ని చేస్తుంది.
ఇటువంటి అద్భుతమే హగరు జీవితంలో జరిగింది.
ఆదికాండము 21:18--19
నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.
దేవుని వాక్కు హగరు కన్నులకు నీటి ఊటను కనుపరచింది ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థించలేని మన కన్నీరు మన ఏడుపు ప్రార్థనగా మారి అది దేవుని నుంచి ఆశీర్వాదాలను తీసుకొని వచ్చే ఒక సందేశాన్ని మనకు ఇవ్వగలదు ఒక చిన్న వాక్యము ద్వారా వాగ్దానం ద్వారా మనస్థితి పట్ల దేవుని ఉద్దేశ్యం ఏమయి ఉన్నదో అని మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు దేవునిపై మనము ఆధారపడినప్పుడు అదే మనము చేసే ప్రార్థనగా మారి మన స్థితి మారటానికి అది కారణము అవుతుంది.
మనము చేసే ప్రార్థన ఏ రూపంలో ఉంది అన్నది కాదు కానీ మన హృదయం సంపూర్ణంగా దేవునిపై ఆధారపడ్డదా దేవుని ఆశ్రయించిందా అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు
మానవుల ద్వారా సహాయాన్ని పొందలేని వ్యక్తులను తిరస్కరించబడిన వారు అని పిలుస్తారు సంబోధిస్తారు.
ఆత్మసంబంధమైన విషయాలలో కానీ శరీర సంబంధమైన విషయాలలో కానీ ఏ ఆశీర్వాదమును పొందలేని తిరస్కరించబడిన వారుగా మీరు ఉన్నారా
ఇటువంటి వారి కోరకు క్రీస్తు యేసు ప్రభువు తనకు కలిగిన సమస్త ఆశీర్వాదాలన్నిటిని సిలువలో తనపై ఆధారపడే వారి కొరకు తనను ప్రార్థించే వారి కోరకు సమర్పించారు.
హగరుకు కలిగిన అవసరత తన కుమారుని దాహాన్ని తీర్చాలి దేవుడు హగరుకు ఒక గ్లాసు నీటిని
ఒక బిందె నీటిని ఒక డ్రమ్ము నీటిని ఇవ్వలేదు ఒక నదిలాగా పారగలిగే సామర్థ్యం ఉన్న నీటి బుగ్గను తనకు చూపించాడు మన జీవితాల్లోకి వచ్చే ప్రతి అవసరతలో దేవునిపై మనము ఆధారపడినప్పుడు అప్పుడు దేవుడు మనకు ఇచ్చే జవాబు అది మనకే కాదు అది అనేకమందికి ఆశీర్వాద కారణంగా అనేకులకు మేలును చేకూర్చే వారిని దేవునివైపు త్రిప్పగలిగే అనుభవంగా ఉంటుంది.
హగరు ఒక దాసి. సామాజికంగా ఆమెకు విలువ లేదు. కానీ దేవుడు ఆమెను రెండు సార్లు ప్రత్యక్షంగా చూసాడు, మాట్లాడాడు. ఇది బైబిలు చరిత్రలో ఒక మహిళకు దేవుని ప్రత్యక్ష దర్శనం వచ్చిన అరుదైన సంఘటన.
ఈ లోకంలో మానవులు ఎవరూ మనకు గుర్తింపు ఇవ్వలేని స్థితిని మనం కలిగి ఉన్న మన ఇంటి వారు మన బంధువులు మన బాధ్యతలను చూడవలసిన వారు మనకు సహాయం చేయక పోయినా అన్ని రీతులలో మనము తిరస్కరింపబడిన వారముగా దూరమైన వారముగా ఉన్న ప్పటికి దేవుని దృష్టిలో మనము ఎవరము అని అంటే ?
* నన్ను చూసే దేవుడు నా అవసరతను తీర్చే దేవుడు * అని హగరులా దేవునికి మనము బిరుదులు ఇచ్చే వారము !
ఈరోజు మీ కోసం ఓ మాట:
ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ, అన్ని బంధాలకు, అన్ని అవసరాలకు మీరు దూరమైనా
అసలు భయపడకండి, దిగులుపడకండి, నిరాశ చెందకండి. ఎందుకంటే హగరును చూసిన దేవుని కను దృష్టి ఈరోజు మీ మీద కూడా ఉంది కాబట్టి! దేవుడు నిర్లక్ష్యం చేయడు... మరిచిపోడు!
ఎస్తేర్ క్రైసోలైట్
17-5-2025