2025 Messages
వెండిని వెతికేటట్లు జ్ఞానాన్ని
వెతకండి అది మీ జీవితంలో వెలుగులతో నింపుతుంది
సామెతలు 2:4 -- 6
వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల
దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞాన మిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
ఇది జ్ఞానాన్ని వెతకడం గురించిన వచనం. వెండి లాంటి విలువైన వస్తువులను మనం ఎంత ఆత్రంగా వెతుకుతామో, అలాగే దేవుని జ్ఞానాన్ని కూడా ఆసక్తితో, వెతికినపుడు మాత్రమే యెహోవాకు భయపడటం (ఆత్మీయ జ్ఞానం) మనకు క కలుగుతుంది. ఇది ఆధ్యాత్మికమైన లోతైన అనుభవానికి మార్గం చూపుతుంది.
జ్ఞానం దొరకాలంటే అది నిజంగా విలువైనదిగా భావించి, దాన్ని మన హృదయంతో వెదకాలి.
1. "వెండిని వెదకినట్లు" అనగా ఏమిటి?
వెండి అనేది విలువైన లోహం. మనుషులు దానిని పొంది సంపదను సంపాదించాలనే ఆశతో శ్రమిస్తారు. వారు భూమిని తవ్వుతూ, లోతుల్లోకి వెళ్ళి, ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టుతూ వెదుకుతారు.
ఇలాగే దేవుని జ్ఞానం కోసం కూడా మనం:
శ్రమించాలి దానికోసం సమయం కేటాయించాలి
మనసుతో హృదయంతో వెదకాలి సహజ మైన ఆసక్తిని కలిగి ఉండాలి.
2. "దాచబడిన ధనమును వెదకినట్లు" అంటే ఏమిటి?
ఇది మనం కనుగొనలేని, కానీ ఎంతో విలువైన రహస్యమైన ధనాన్ని వెదకడం వంటిది. దాచబడిన ధనం ఒక నిధిలా ఉంటుంది – ఇది ఉచితంగా కనిపించదు. దానిని కనుగొనాలంటే:
మన మనస్సాక్షిని పదును చేయాలి
పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి
ప్రార్థనలో స్థిరంగా ఉండాలి
ఆత్మ జ్ఞానం కొరకు ఆకలితో ఎదురు చూడాలి.
దేవుని జ్ఞానమూ ఇలాగే రహస్యంగా దాగి ఉంటుంది, కానీ దాన్ని వెదకే వారికి దేవుడు వెల్లడిస్తాడు.
జ్ఞానం, ముఖ్యంగా దేవుని జ్ఞానం, మనకు స్వయంగా రాదు. అది శోధన, ఆత్రత, ప్రయత్నం వలన మాత్రమే వస్తుంది. దానిని మనం ఎంత విలువైనదిగా భావిస్తామో, అంత శ్రమిస్తే అది మనకు దొరుకుతుంది.
దేవుని భయము జ్ఞానానికి తొలి మెట్టు.
ఈ కాలంలో మనం డిగ్రీల కోసం ఉద్యోగాల కోసం డబ్బు కోసం బాగా మనము శ్రమిస్తాము. కానీ దేవుని జ్ఞానం కోసం మనము శ్రమించలేము. కానీ ఈ వాక్యం మనకు ఏమని చెప్తుంది అని అంటే “దేవుని జ్ఞానం అత్యంత విలువైన నిధి.” దానిని వెదకడం అనేది శాశ్వతమైన ఫలితాలు ఇచ్చే ప్రయత్నం మాత్రమే కాదు లోతైన ఆత్మీయ జీవితమును కలిగి ఉండటానికి కూడా ఇది మనకు సహకరిస్తుంది ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవునిలో మనలను స్థిరపరిచే ఉంచుతుంది.
"దేవుని జ్ఞానాన్ని సాథించి వెదకండి – అది దొరికితే మీ జీవితమంతా మారిపోతుంది."
వెండి అంటే ఏమిటి బైబిల్ దృష్టిలో?
బైబిలులో వెండి అనేది: విలువను, స్వచ్ఛతను, శుద్ధిని సూచిస్తుంది పరిశోధన చేయాల్సిన నిధిగా కనిపిస్తుంది శోధించి పొందే సంపదను సూచిస్తుంది
జ్ఞానం కూడా అచ్చం అలాగే: దాగి ఉంటుంది
శ్రమతో వెదికితే మాత్రమే దొరుకుతుంది
దొరికితే ఆది మన జీవితాన్ని అద్భుతముగా నిర్మిస్తుంది
యోబు 28:15 - 17
సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణ మైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.
ఈ వాక్యంలో జ్ఞానం యొక్క విలువ వెండి, బంగారానికి మించినదని స్పష్టంగా చెప్తోంది.
కీర్తనలు 12:6
యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.
ఇక్కడ దేవుని వాక్యం శుద్ధి చేయబడ్డ వెండికి పోల్చబడింది. అంటే దేవుని జ్ఞానం స్వచ్ఛమైనదిగా, నిర్దోషమైనదిగా ఉంది.
వెండిని పోలిన జ్ఞానం (సామెతలు 2:4)
వాక్య పరిశోధన, ధ్యానం ద్వారా పొందాలి
విలువైన వెండి లోహం వలే జ్ఞానం కూడ ఆత్మీయంగా అమూల్యమైనది దీనిని అగ్ని లాంటి పరీక్షల ద్వారా శుద్ధి చేయాలి అంటే జ్ఞానమును ఆచరణలో పేట్టటం వలన ఆత్మవిశ్వాసం ద్వారా ఆది స్వచ్ఛంగా మారుతుంది ఇది మనకు
మిగిలే సంపద కాదు, భూ సంబంధమైన లోహం లాగా ఆస్తిగా దీనిని మనము దాచుకునేది కాదు నశించిపోయి ఆత్మలను రక్షించడానికి ఆత్మీయ జీవితంలో సరియైన పరిపక్వతను గ్రహించని ప్రజల కొరకు యిది వినియోగించదగినది ఇది మానవుల జీవితాన్ని మారుస్తుంది, వారికి మార్గనిర్దేశం చేస్తుంది.
దీనీ కోసం మనము ఏం చేయాలి ?
"తలంచే స్థాయిలో కాక, తవ్వే స్థాయిలో వెదకండి."
అప్పుడు జ్ఞానపు నిధి మీకు లభిస్తుంది — అది మీ జీవితాన్ని వెలిగిస్తుంది.
తలంచే స్థాయి : ఇది మన ఊహలలో మనము అనుకునే దానిని బట్టి మనము కలిగి ఉన్న స్థితి
తవ్వే స్థాయి : మన తలంపులలో మన ఊహలలో మనము అనుకున్న దానిని క్రియల రూపంలో పెట్టే స్థితి
జ్ఞానాన్ని వెదకుము — వెండిని వెదకినట్లు !
దేవుని జ్ఞానం అలానే దాగి ఉంటుంది. అది స్పష్టంగా కనబడదు. దాని కోసం మన హృదయముతో వెదకాలి. జ్ఞానాన్ని వెదకేవారికి దేవుడు ఏమి ఇస్తాడు?
1. తన భయాన్ని గ్రహించే అనుభవం
2. మార్గనిర్దేశం
3. పరిజ్ఞానము
4. జీవితం మారిపోయే ఆత్మసంబంధమైన వెలుగును
1. తన భయాన్ని గ్రహించే అనుభవం
ఇది దేవుని “భయాన్ని” (భక్తితో కూడిన గౌరవాన్ని) గమనించడం. అంటే మన హృదయంలో దేవుని గొప్పతనాన్ని గ్రహించి, దేవుని ముందు మర్యాదగా నమ్రతగా ఉండడం అనే భావన. ఇది భయపడి పారిపోవడమేమీ కాదు — ఇది గౌరవముతో కూడిన భయం.
2. మార్గనిర్దేశం
మన జీవన ప్రయాణంలో దేవుడు చూపే మార్గం. ఈది జ్ఞానాన్ని అనుసరించి మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో సూచించేది. యెషయా 30:21
మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
ఇదే త్రోవ దీనిలోనే నడువుడి అన్న స్వరమును దేవుని వాక్యము ద్వారా మన ఆత్మసంబంధమైన చెవులు గ్రహిస్తాయి
3. పరిజ్ఞానము
జ్ఞానము కంటే లోతైనది. పరిజ్ఞానం అంటే మనం చూసే విషయాల వెనుక దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని ఇష్టాన్ని గుర్తించగల గుణం మన ఆత్మలో ఉన్న పరిపక్వత.
4. జీవితం మారిపోయే ఆత్మసంబంధమైన వెలుగును : ఇది దేవుని జ్ఞానాన్ని పొందినప్పుడు కలిగే ఒక కొత్త ఆధ్యాత్మిక చూపు మన జీవితం పూర్తిగా మారిపోతుంది. జ్ఞానాన్ని వెదకేవారికి దేవుడు ఏమి ఇస్తాడు? సరిగ్గా చెప్పాలంటే: దేవుడు జ్ఞానాన్ని వెదకేవారికి జీవితం మారిపోయే ఆత్మసంబంధమైన వెలుగును ఇస్తాడు ఆత్మీయ జీవితంలో మనకు దేవుని పట్ల కలిగి ఉండే భయమును ఒక లోతైన అనుభవాన్ని తీసుకువస్తుంది
అందుకే "యెహోవా యందు భయభక్తి కలిగి యుండుటే జ్ఞానమునకు మూలము" అనే వాక్యం బైబిలులో పలు చోట్ల మనకు కనిపిస్తుంది.
1. సామెతలు 1:7
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
2. యోబు 28:28
మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
3. కీర్తనలు 111:10
యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
ఈ వాక్యాలు అన్ని కలిపి మనకు ఏమని స్పష్టం చేస్తున్నాయి అని అంటే :
దేవుని పట్ల భయభక్తితో ప్రారంభమయ్యే జ్ఞానమే నిజమైన జ్ఞానము. అది భయం కాదు మన జీవితంలో దేవుని ఆజ్ఞలను గైకోనే లెక్కచేసే గౌరవించే విధేయత చూపే హృదయాన్ని కలిగి దేవుణ్ణి ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉండుటయే దేవుని జ్ఞానము అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది
అలాంటి భయభక్తి ఉన్నవారికి దేవుడు తన జ్ఞాన ద్వారాలను తెరిచినట్టు బైబిలు చెబుతోంది.
మనము ఎంత ఎక్కువ లోతైన ఆత్మీయతను కలిగి ఉంటామొ ఎంత గాఢతను కలిగిన భయ భక్తిని దేవుని పట్ల మనం కలిగి ఉంటామొ అంతే లోతైన గాడతను కలిగిన వెదకుడి మీకు దొరుకును అనిన జ్ఞానమై యున్న దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు
వెండి వలె విలువైనది దేవుని జ్ఞానం.
అది దొరకాలి అంటే విశ్వాసంతో వెదకాలి.
మీ హృదయంలో ఆ ఆకలి ఉందా?
దేవుని జ్ఞానం కోసం మనం ఎంత శ్రమిస్తున్నాము?
దేవుని జ్ఞానం మనకు ఎందుకు అవసరం ?
హోషేయా 4:6
నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.
"జ్ఞానం అంటే కేవలం బుద్ధి కాదు — అది దేవుని గురించి తెలిసికొని, దేవునికి ఇష్టముగా దేవుని చిత్తములో జీవించడమూ, ఆయనకు విధేయతతో బ్రతకడమూ. ఇది యెహోవా యందలి భయభక్తి, వివేకమును కలిగిన వారి లక్షణం."
జ్ఞానం అంటే శాస్త్ర విద్య లేదా తెలివి మాత్రమే కాదు.
అది దేవుని గురించి నిజంగా తెలిసికొని అది మన తలంపులలో మాత్రమే కాకుండా, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. దేవుడంటే భయభక్తి ఉన్నవారు అలా జీవిస్తారు అంటే, అది వారి లక్షణంగా కనిపిస్తుంది.
దేవుని జనులు ఆయన మాటను మరచినప్పుడు విస్మరించినప్పుడు, వారు ఆత్మీయంగా మాత్రమే కాక భౌతికంగా కూడా నాశనానికి లోనవుతారు.
ఇది ఈరోజు మనకూ వర్తిస్తుంది: దేవుని వాక్యమునకు ప్రాధాన్యం ఇవ్వకపోతే, దారి తప్పే ప్రమాదం ఎక్కువ. అందుకే – జ్ఞానం వెదకండి, వాక్యాన్ని హృదయపూర్వకంగా గ్రహించండి.
జ్ఞానం అంటే– దేవుని చిత్తములో బ్రతకడమే!
సామెతలు 1:7

జ్ఞానం అంటే కేవలం పుస్తక జ్ఞానమా? కేవలం తెలివితేటల? కాదు!
బైబిల్ ప్రకారం జ్ఞానం అంటే —
దేవుని గురించి తెలిసికొని, ఆయన చిత్తములో ఇష్టపడి జీవించడము.
ఆయనకు విధేయతగా, భయభక్తితో
వాక్యాను సారముగా బ్రతకడమే నిజమైన జ్ఞానం.
ప్రతిరోజూ దేవుని చిత్తమేదీ అని అడుగుతూ బ్రతికే మనిషే – నిజమైన జ్ఞానవంతుడు.
ఈ రకమైన జ్ఞానం ఎవరిలో ఉంటుంది?
యెహోవా యందు భయభక్తి కలిగినవారిలో!
ప్రార్థన:
“యెహోవా, నీ భయభక్తిని నాకు నేర్పుము.
నీ చిత్తాన్ని గ్రహించే జ్ఞానం నాకు కలుగజేయుము.
తెలివి కాదు, నీతో నడిచే హృదయం నాకు కావాలి.
నీ వాక్యాన్ని ప్రేమించేవాడిగా, ఆచరించేవాడిగా నన్ను మార్చుము.
యేసునామంలో ప్రార్థించుచున్నాను, ఆమెన్.”
ఎస్తేర్ క్రైసోలైట్
16-5-2025