2025 Messages
స్తుతితో కూడిన ప్రార్థన( యేసే ఆదర్శం )
యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా చోట్ల స్వస్థతలను అద్భుతాలను చేశాడు, అయితే వాటికి ముందు చాలా సార్లు చిన్న వాక్యాల రూపంలోనే ప్రార్థనలు చేశాడు – అవి పెద్ద
దీర్ఘమైన ప్రార్థనలు కావు, యేసయ్య ఎక్కువగా పెద్ద పెద్ద దీర్ఘ ప్రార్థనలు చేయలేదు. కొన్ని చోట్ల చిన్న వాక్యాలు, కొన్ని చోట్ల తనకు ఇచ్చిన అధికారానికి కృతజ్ఞతతో మాట్లాడాడు.విశ్వాసంతో తండ్రిని స్తుతించారు.
వాటిలో కొన్ని ఉదాహరణలు
1. లాజరును మృతులలో నుండి లేపినప్పుడు ఇది (యోహాను 11:41–42):
తండ్రీ, నీవు నా మనవి విన్నావు కనుక నేను నీకు కృతజ్ఞతులు చెల్లించు చున్నాను." అని పలికారు
ఇది ఒక్కసారి మాత్రమే యేసయ్య దేవునికి "థ్యాంక్స్" అన్నట్టు స్పష్టంగా బైబిల్లో రాసి ఉంది.
2. రెండు
రొట్టెలను విరిచే సమయంలో ఇది (మత్తయి 14:19; 15:36):
ఆకాశము వైపు చూచి ఆశీర్వదించి అని ఇక్కడ చెప్పబడింది – అంటే ఒక చిన్న ప్రార్థన చేసినట్టు.
దీనిలో స్పష్టంగా "దేవా నీకు కృతజ్ఞతలు" అని మాటలు కనిపించవు, కానీ కృతజ్ఞతతో ప్రార్థించాడని అర్థమవుతుంది.
3. మూడు
ఆఖరి భోజనం ప్రభు రాత్రి భోజనం సమయంలో (లూకా 22:19):
ఆయన రొట్టె తీసుకొని కృతజ్ఞతలు చెప్పి...
ఇక్కడ కూడా "కృతజ్ఞతలు చెప్పి" అన్నది ఉంది,
యేసయ్య రోగులను స్వస్థపరచేటప్పుడు పెద్దగా ప్రార్థనలు చేయలేదు. చాలా సార్లు ఆయన కేవలం చిన్న మాటలతోనే స్తుతి వాక్యములు తోనే ఇచ్చినందుకు చేసినందుకు అని తండ్రిని స్తుతిస్తూ ప్రజలకు స్వస్థతను కలిగించాడు.
"కుష్టు రోగులతో శుద్ధులవ్వమని చెప్పాడు.
కళ్లులేని వారితో నీవు చూచుచున్నావు.
మృతురాలైన బాలికతో తాలితా కూమి" అని చిన్నగా చెప్పిన మాట. ఈ సందర్భాలలో ఎక్కడా ఆయన “దేవా, దయచేసి స్వస్థత ఇవ్వండి” అని ప్రార్థించినట్టు రాసిలేదు.
అంటే క్రీస్తు ప్రభువు వారికి తన గురించిన ఒక సత్యమన్నది తనకు తెలిసి ఉంది తాను గ్రహించి ఉన్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది
తాను పరిశుద్ధాత్మతో ఎందుకు నిర్మించబడ్డాడో తానుగ్రహించాడు రోగములను తీసుకుని వచ్చే శరీరం మీద లోకం మీద సాతాను మీద మరణం మీద విజయాన్ని పొందుతారని ఈ విషయాన్ని తాను గ్రహించాడు కాబట్టి అద్భుతములను చేసే ప్రతి విషయంలో తాను దీర్ఘప్రార్థనలు చేయలేదు కృతజ్ఞతలు మాత్రమే దేవునికి చెల్లించాడు అంటే తన మనవిని దేవుడు ఆలకించాడని దేవుడు తనను పంపిన ఉద్దేశాన్ని తాను జరిగిస్తున్నాడని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది.
ఏదైనా ఒక విషయంలో మనకు ఒక క్లారిటీ అన్నది రానంతసేపు దాని విషయమై దేవుని దగ్గర ఎంత సమయమైనా మనం ప్రార్థిస్తూ ఉంటాము
ఆ విషయంలో దేవుని ఉద్దేశ్యము దేవుని నిర్ణయము ఏమిటి అన్నది మనకు అర్థం అయినప్పుడు మనం ఇంకా ఎక్కువ సమయము ఆ విషయంలో మనము ప్రార్ధించలేము దేవునికి కృతజ్ఞతలు మాత్రమే చెల్లిస్తాము.
క్రీస్తు ప్రభువు కూడా సిలువ వేయబడే ముందు గెత్సెమనే తోటలో ఆయన చాలా దుర్దశలో ఉన్న ఒక మనిషిగా, ఆయన చెమట రక్తముగా మారినంత తీవ్రంగా ప్రార్థించాడు.ఎందుకు అని అంటే మీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని దేవుని వేడుకున్నారు ఆ సమయంలో ఒక దూత వచ్చి తనను బలపరిచినప్పుడు దేవుడు తనక అప్పగించిన పనిని చేయటానికి సిద్ధమయ్యారు.
అందుకే స్తుతితో కూడిన చిన్న చిన్న వాక్యాలు కలిగిన ప్రార్థనలను మనము చేయటం మనకి ఎంతో శ్రేయస్కరం ప్రతి రోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రి అయిన దేవునికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.
ఎస్తేర్ క్రైసోలైట్
22-4-2025