CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

దేవుని ప్రజల మధ్య గలిబిలి సృష్టించే ఆత్మ

ఇది భౌతిక గలిబిలి కాదు — ఇది ఆత్మల యుద్ధం.

ఆనాది కాలం నుంచి దేవుని ప్రజలను, వారి ప్రత్యేకతను భంగపర్చేందుకు సాతాను తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం మనకందరికీ తెలుసు — ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనిని మరింత బలంగా స్పష్టంగా మనకు చూపించింది.

ప్రవీణ్ గారు మరణించిన తర్వాత తన విషయంలో యూట్యూబ్లో చర్చ జరిగిన ప్రతి వీడియోలో కూడా క్రైస్తవుల పట్ల ఒక చులకనగా కామెంట్స్ అనేవి కనబడుతూ వస్తున్నాయి వాటిని చూస్తున్నప్పుడల్లా వాక్యానుసారమైన జవాబును కామెంట్ రూపంలో నేను ఇవ్వాలని అనుకున్న నేను దేనికి కూడా కామెంట్ అన్నది చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే వాక్యాన్ని తెలిసిన దేవుని ప్రజలు, దేవుని వాక్యం తెలియని అన్యుల మిశ్రమ సమాజంలో ఉండకూడదు. ఎందుకంటే, అక్కడ వారి మాటలకు ప్రతిస్పందించడం వలన గలిబిలికి అవకాశమిస్తుంది.

దేవుని ఆత్మ మనకు సమాధానాన్ని తీసుకొని వస్తుంది గలిబిలిని కలవరాన్నితీసుకుని వచ్చేది దురాత్మ యెహోవా ఆత్మ సౌలును ఎందుకు విడిచిపోయింది అని అంటే సౌలు దేవుని ఆజ్ఞలను పదే పదే తృణీకరిస్తూ వచ్చాడు దేవుని ఆత్మ సౌలుని విడిచిన వెంటనే దురాత్మ సౌలులోకి వచ్చింది దేవుని ఆజ్ఞలను పాటించని వారిలో ఎటువంటి ఆత్మ పని చేస్తుందో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది.

1సమూయేలు 16:14

యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా

యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్లెను; యెహోవా పంపిన చెడు ఆత్మ అతనిని బాధించెను.

ఈ వచనంలో దేవుడు చెడు ఆత్మను అనుమతించడం వల్ల సౌలు రాజు కలవరపడి, తన రాజ్యం అస్థిరతకు గురైనది ఇది గలిబిలికి ఒక ఉదాహరణగా పరిగణించవచ్చు.

న్యాయాధిపతులు 9:23-24

అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,

అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.

అప్పుడు దేవుడు అబీమెలెకు మరియు షెకెము పురుషుల మధ్య ఒక చెడు ఆత్మను పంపెను అబీమెలెకు కొట్టిన వారి మీద షెకెము పురుషులు విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ దేవుడు చెడు ఆత్మను పంపడంతో సామాజికంగా విమర్శనలు బహిష్కరణలు, కలహాలు మొదలయ్యాయి. ఇది ప్రజల మధ్య గలిబిలిని కలిగించే ఆత్మకి ఉదాహరణ.

1రాజులు 22:21- 23

అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా

ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక ఆత్మ వచ్చి అబద్దపు ఆత్మగా ప్రవక్తల నోట మాట్లాడుతానని చెబుతుంది:

నేను వెళ్లి అతని ప్రవక్తల నోట అబద్ధపు ఆత్మగా ఉండెదను.

* ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను..*

ఇది ప్రజల హృదయాలలో భ్రాంతి, కలహం కలిగించేందుకు అనుమతించబడిన ఆత్మ యొక్క స్పష్టమైన ఉదాహరణ.

ఈ వచనాల ఆధారంగా, "గలిబిలి సృష్టించే ఆత్మ" అనే భావము బైబిల్‌లో "చెడు ఆత్మ", "అబద్ధపు ఆత్మ", "విచ్ఛిన్నతను కలిగించే ఆత్మ" అనే రూపాల్లో కనబడుతుంది. అయితే, ఈ ఆత్మలు స్వతంత్రంగా పని చేయక, దేవుని అనుమతితోనే పనిచేస్తున్నట్లు

మనకు అర్థం అవుతుంది కాబట్టి ఇటువంటి గలిబిలిని కలవరాన్ని ఆ సమాధానాన్ని కీడును సృష్టిస్తు సంచారం చేస్తున్న ఏ మిశ్రిత సమాజంలోనికి కూడ దేవుని వాక్యము తెలిసి ఉన్న దేవుని ప్రజలు ఏ రూపంలో కూడా ప్రవేశించకూడదు మనకు న్యాయం చేసేది దేవుడే న్యాయం చేయాల్సిన బాధ్యతను కలిగి ఉన్న అధికారులు న్యాయం చేయనప్పుడు వారి బాధ్యతా రాహిత్యం వలన వారికి శిక్ష అది దేవుని నుంచి వస్తుంది

ఎవరి ద్వారా గలిబిలి వస్తుందో వారి నుంచి దేవుని ప్రజలు ప్రత్యేకింపబడాలి. వారువేసే నిందలకు వారికి సంబంధించిన ప్రతివాటికి దేవుని ప్రజలు స్పందిస్తూ ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటే ఆ గలిబిలిని అశాంతిని కీడును కలిగించే ఆత్మ స్వాధీనంలోకి వారు వెళుతున్నట్లే.

2 తిమోతికి 1:7

దేవుడు మనకు శక్తియు ప్రేమయు,

ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు.

ఇంద్రియ నిగ్రహమును గల (స్వస్థబుద్ధియుగల ఆత్మనే) ఆత్మనే "ఇంద్రియ నిగ్రహము" అనే పదము దీనిని బైబిల్ భాషలో మనము చెప్పాలంటే "స్వీయ నియంత్రణ" అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. బైబిల్‌లో ఇది ఒక ఆత్మఫలముగా (Fruit of the Spirit) పేర్కొనబడింది:

గలతియులకు 5:22- 23

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమ మేదియులేదు.

ఇంద్రియ నిగ్రహము అంటే:

శరీర మనోభావాలను నియంత్రించుకోవడం

ఆత్మ ఆధీనంలో ఉండి పవిత్రతతో జీవించడం

ఈ లక్షణం పరిశుద్ధాత్మ పనిచేస్తున్న ఫలితముగా మానవుని హృదయం లోపల నుండి వస్తుంది,

ఇంద్రియ నిగ్రహము అనేది బైబిల్ ప్రకారం ఒక పవిత్రమైన ఆత్మఫలము, ఇది మనిషి తన శరీర సంభందమైన కోరికలను భావోద్వేగాలను దేవుని చిత్తానికి అనుగుణంగా నియంత్రించుకోవడాన్ని సూచిస్తుంది.

"ఇంద్రియాలు" అంటే మన five senses (దృష్టి, వినికిడి , వాసన, రుచి, స్పర్శ)తో పాటు మన మనసు, కోరికలు, భావోద్వేగాలు, శరీర కోరికలు అన్నిటినీ కలిపే ఒక భావాన్ని వ్యక్తికరించటానికి ఉపయేగిస్తారు

"ఇంద్రియ నిగ్రహము" అంటే —

ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రలోభాలకు, కోరికలకు పరిశుదాత్మతో నియంత్రించటం దేవుని చిత్తానికి విరుద్ధంగా జరగకుండా ఆపుకోవడం.

బైబిల్ ప్రకారం ఇది పరిశుద్ధాత్మ వలన కలిగే ఫలితాలలో ఒకటి — అంటే ఇది మన శక్తితో సాధించేది కాదు,పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సాధించాల్సిన పవిత్ర మైన లక్షణం.

కోపం వచ్చినప్పుడు శాంతంగా ఉండటం

ఆకలితో ఉన్నా దొంగతనానికి వెళ్ళకపోవడం

శరీరపు పాపపు కోరికలకు తలవంచకుండా ఉండటం

ఇవి అన్నీ ఇంద్రియ నిగ్రహానికి ఉదాహరణలే.

మన ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన మన character ను తీర్చిదిద్దే కీలకమైన విషయం ఇది ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు, నిందించినప్పుడు — ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఎలా పని చేస్తుంది?

ఆప్పుడు మన మనసు వెంటనే స్పందించాలనుకుంటుంది — కోపం, బాధ, ప్రతీకారం, నిరాశ వంటి భావోద్వేగాలు వచ్చేస్తాయి. కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, మనల్ని అణచేస్తుంది: దేవుని ఆత్మ వెంటనే మనం ప్రతిస్పందించకుండా అడ్డుకుంటుంది మనలను ఆత్మ పరిశీలన చేసుకునేటట్లు చేస్తుంది ప్రతీకారానికి కాకుండా ప్రార్థనకు ప్రేరేపిస్తుంది:మత్తయి 5:44

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

పరిశుద్ధాత్మ మన హృదయాన్ని మార్చి, నిందించినవారి కోసమే ప్రార్థించమంటుంది. అదే ఆత్మఫలము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చే నిగ్రహం యొక్క గొప్ప శక్తి

ఆత్మ ఫలము మన హృదయాన్ని శాంతితో నింపుతుంది గలతియులకు 5:22

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ప్రపంచం ఆంత మనమీద నింద వేస్తున్నా మనలోని ఆత్మ మనకు ధైర్యంగా చెబుతుంది నీ విలువ నేను నిర్ణయిస్తాను, వాళ్లు కాదు.

యేసును ఎంత మంది విమర్శించారు! అవమానించారు! కానీ ఆయనే నిగ్రహానికి గొప్ప ఉదాహరణ 1పేతురు 2:23 ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.

ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు విమర్శకు బదులుగా:

మౌనం పాటించాలి తన హృదయాన్ని పరిశీలించాలి

ప్రార్థన చేయాలి శాంతి సమాధానముతో దేవునిపై ఆధారపడి నడవాలి.

1కోరింథీయులకు 14:33

ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.

ప్రార్థన

ప్రభువా, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మ ద్వారా మా హృదయాల్ని శాంతితో నింపి మా మాటలను మొము నియంత్రించే నిగ్రహాన్ని మాకు అందించండి గలిబిలిని కలహాన్ని సృష్టించే ఆత్మకు దూరంగా, మీ సమాధానముతో నడిచే వారముగ మమ్ములను ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమేన్.

ఎస్తేర్ క్రైసోలైట్

5-5-2025

దేవుని ప్రజల మధ్య గలిబిలి సృష్టించే ఆత్మ

ఇది భౌతిక గలిబిలి కాదు — ఇది ఆత్మల యుద్ధం.

ఆనాది కాలం నుంచి దేవుని ప్రజలను, వారి ప్రత్యేకతను భంగపర్చేందుకు సాతాను తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం మనకందరికీ తెలుసు — ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనిని మరింత బలంగా స్పష్టంగా మనకు చూపించింది.

ప్రవీణ్ గారు మరణించిన తర్వాత తన విషయంలో యూట్యూబ్లో చర్చ జరిగిన ప్రతి వీడియోలో కూడా క్రైస్తవుల పట్ల ఒక చులకనగా కామెంట్స్ అనేవి కనబడుతూ వస్తున్నాయి వాటిని చూస్తున్నప్పుడల్లా వాక్యానుసారమైన జవాబును కామెంట్ రూపంలో నేను ఇవ్వాలని అనుకున్న నేను దేనికి కూడా కామెంట్ అన్నది చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే వాక్యాన్ని తెలిసిన దేవుని ప్రజలు, దేవుని వాక్యం తెలియని అన్యుల మిశ్రమ సమాజంలో ఉండకూడదు. ఎందుకంటే, అక్కడ వారి మాటలకు ప్రతిస్పందించడం వలన గలిబిలికి అవకాశమిస్తుంది.

దేవుని ఆత్మ మనకు సమాధానాన్ని తీసుకొని వస్తుంది గలిబిలిని కలవరాన్నితీసుకుని వచ్చేది దురాత్మ యెహోవా ఆత్మ సౌలును ఎందుకు విడిచిపోయింది అని అంటే సౌలు దేవుని ఆజ్ఞలను పదే పదే తృణీకరిస్తూ వచ్చాడు దేవుని ఆత్మ సౌలుని విడిచిన వెంటనే దురాత్మ సౌలులోకి వచ్చింది దేవుని ఆజ్ఞలను పాటించని వారిలో ఎటువంటి ఆత్మ పని చేస్తుందో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది.

1సమూయేలు 16:14

యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్లెను; యెహోవా పంపిన చెడు ఆత్మ అతనిని బాధించెను.

ఈ వచనంలో దేవుడు చెడు ఆత్మను అనుమతించడం వల్ల సౌలు రాజు కలవరపడి, తన రాజ్యం అస్థిరతకు గురైనది ఇది గలిబిలికి ఒక ఉదాహరణగా పరిగణించవచ్చు.

న్యాయాధిపతులు 9:23-24

అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,

అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.

అప్పుడు దేవుడు అబీమెలెకు మరియు షెకెము పురుషుల మధ్య ఒక చెడు ఆత్మను పంపెను అబీమెలెకు కొట్టిన వారి మీద షెకెము పురుషులు విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ దేవుడు చెడు ఆత్మను పంపడంతో సామాజికంగా విమర్శనలు బహిష్కరణలు, కలహాలు మొదలయ్యాయి. ఇది ప్రజల మధ్య గలిబిలిని కలిగించే ఆత్మకి ఉదాహరణ.

1రాజులు 22:21- 23

అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక ఆత్మ వచ్చి అబద్దపు ఆత్మగా ప్రవక్తల నోట మాట్లాడుతానని చెబుతుంది:

నేను వెళ్లి అతని ప్రవక్తల నోట అబద్ధపు ఆత్మగా ఉండెదను.

* ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను..*

ఇది ప్రజల హృదయాలలో భ్రాంతి, కలహం కలిగించేందుకు అనుమతించబడిన ఆత్మ యొక్క స్పష్టమైన ఉదాహరణ.

ఈ వచనాల ఆధారంగా, "గలిబిలి సృష్టించే ఆత్మ" అనే భావము బైబిల్‌లో "చెడు ఆత్మ", "అబద్ధపు ఆత్మ", "విచ్ఛిన్నతను కలిగించే ఆత్మ" అనే రూపాల్లో కనబడుతుంది. అయితే, ఈ ఆత్మలు స్వతంత్రంగా పని చేయక, దేవుని అనుమతితోనే పనిచేస్తున్నట్లు

మనకు అర్థం అవుతుంది కాబట్టి ఇటువంటి గలిబిలిని కలవరాన్ని ఆ సమాధానాన్ని కీడును సృష్టిస్తు సంచారం చేస్తున్న ఏ మిశ్రిత సమాజంలోనికి కూడ దేవుని వాక్యము తెలిసి ఉన్న దేవుని ప్రజలు ఏ రూపంలో కూడా ప్రవేశించకూడదు మనకు న్యాయం చేసేది దేవుడే న్యాయం చేయాల్సిన బాధ్యతను కలిగి ఉన్న అధికారులు న్యాయం చేయనప్పుడు వారి బాధ్యతా రాహిత్యం వలన వారికి శిక్ష అది దేవుని నుంచి వస్తుంది ఎవరి ద్వారా గలిబిలి వస్తుందో వారి నుంచి దేవుని ప్రజలు ప్రత్యేకింపబడాలి. వారువేసే నిందలకు వారికి సంబంధించిన ప్రతివాటికి దేవుని ప్రజలు స్పందిస్తూ ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటే ఆ గలిబిలిని అశాంతిని కీడును కలిగించే ఆత్మ స్వాధీనంలోకి వారు వెళుతున్నట్లే.