2025 Messages
నిరీక్షణలో ఉన్న విజయం
దేవుని వాగ్దానాలు ఆలస్యంగా నెరవేరినప్పటికీ, అవి ఘానంగా, దివ్యంగా నెరవేరుతాయి. మనము నమ్మిన వాక్యము పట్ల మనము నిలకడగా ఉన్నప్పుడే ఆ నమ్మకానికి విలువ కనిపిస్తుంది. మనము ప్రయాణించే దారిలో ఉన్న మన పట్టుదల, మన ప్రార్థనలో ఉన్న బలము, నిశ్చలమైన మన నిరీక్షణ ఇవే దేవుని చేతిలో మన విజయానికి మార్గం. భౌతికంగా కాదు, ఆత్మసంబంధంగా దీవించబడిన జీవితం అంటే అదే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితం వారు యిచ్చే సాక్ష్యం.
చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సహోదరికి కలిగిన అద్భుతమైన సాక్షాన్ని విన్నాను తనకు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్న సమయంలో తన భర్త తనను వదిలి వేరొక స్త్రీతో సహజీవనం చేస్తూ ఆమె ద్వారా ఒక కుమార్తెకు కూడా తాను జన్మను యిచ్చి తాను వివాహం చేసుకున్న స్త్రీని నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు ఈ మొదట స్త్రీ తాను పుట్టింటికి వెళ్ళిపోకుండా వృద్ధాప్యంలో ఉన్న తన అత్తమామల దగ్గరనే ఉంటూ వారిని చూసుకుంటూ తన బిడ్డలను పెంచి పెద్ద చేసింది.
మందిరానికి వెళ్లిన పార్కుకి షాపులకు ఎక్కిడికి వెళ్లిన అందరు కుటుంభముతో వస్తె తాను తన బిడ్డలు ఒంటరిగా తన భర్త తమ దగ్గర లేని లోటును తన భర్త ద్వార తాను తన బిడ్డలు ఏటువంటి అనందమును అనుభవించని స్థితిలో ఈ స్త్రీ తనకు సంభవించిన పరిస్థితిని బట్టి ఎంతో వేదనను అనుభవిస్తూ ఉండేది.
తాను తన బిడ్డలు పొందవలసిన సౌఖ్యములను సంతోషాలను యోగ్యత లేని వేరొక స్త్రీ ఆమె బిడ్డ పొందుతూ ఉన్నప్పుడు ఈ విషయంలో తనను ఎవ్వరూ ఏమి అన్నా తాను ఒకటే వారికి సమాధానం ఇస్తూ వచ్చేది * నేను పెండ్లి భార్యను * ఎప్పటికైనా నా భర్తను దేవుడు నా దగ్గరకు తీసుకొని వస్తాడు అన్న ఒక నిరీక్షణను తాను కలిగి ఉండేది దానినే ఇతరులకు తెలియజేసేది.
ఈ స్త్రీకి కలిగిన నిరీక్షణ ఎన్నో వాక్యాలను బట్టి లేదు ఒకే ఒక్క వాక్యమును తాను హృదయ పూర్వకముగా విశ్వసించింది వివాహము అన్ని విషయాలలో ఘానమైనది అని దేవుడిచ్చిన ఈ వాగ్దానమును దేవుని క్రమమును నమ్మిన దేవుని ఆజ్ఞను పాటించిన ఈమె జీవితమును దేవుడు ఘానపరిచాడు !
ఒకరోజు తన భర్త నుంచి తనకి ఫోన్ వచ్చింది నేను కలిసి జీవిస్తున్న ఈ స్త్రీ గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయింది నాకు ఈమెకు కలిగిన కుమార్తెకు వివాహ సమయం వచ్చింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ కుమార్తెను నేను వదలలేను తనను తీసుకొని నీ దగ్గరకు నేను వస్తాను ఈ కుమార్తెను నీ కుమార్తెగా నీవు అంగీకరిస్తావా ! ఆని తన భర్త తనతో చెప్పినప్పుడు ఈ స్త్రీ సంతోషంగా తన భర్తను తన దగ్గరకు రమ్మని ఆ కుమార్తె బాధ్యతను తాను స్వీకరించి తన బిడ్డలతో్ పాటు తనకు కూడ వివాహం చేసింది.
ఈ సాక్షాన్ని నేను వింటున్నప్పుడు నా హృదయం పట్టలేనంత బాధను దుఃఖాన్ని అనుభవించింది
ఇటువంటి పరిస్థితులకుండా వెళ్తున్న ఎంతోమంది స్త్రీలకు ఈమె సాక్ష్యము ఒక క్రమాన్ని నేర్పుతుంది
దేవుని వాక్యము పట్ల విశ్వాసం కలుగుతుంది ఒక నిరీక్షణను దేవునిపై ఉంచాలి అన్న విశ్వాసము దేవుని పట్ల కలగటమే కాకుండా ఈమెకు విజయాన్ని ఇచ్చిన దేవుడు నాకు కూడా విజయాన్ని ఇస్తాడు అన్న విశ్వాసము దేవునిపై కలుగుతుంది.
ఈ సాక్ష్యమును నేను వింటున్నప్పుడు నాతో పాటు నా కుమార్తె కూడా విన్నది అది విన్న వెంటనే నా కుమార్తె నాతో ఏమని అన్నది అంటే "నాకు నచ్చలేదు ఆమె ఇన్ని బాధలు పడి తనను మళ్ళీ తన దగ్గరకు వస్తానంటే రమ్మని చెప్పటం అని " నిజమే మనకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుంది తాను తన బిడ్డలు తన భర్త ద్వారా ఏమి అనుభవించారు తనకు సహాయం చేయవలసిన వయసులో తనకు సహాయం చేయకుండా తాను తన భర్తకు సహాయం చేయాల్సిన స్థితిలో దేవుడు తన భర్తను తన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు.
లోకానుసారంగా దీనిని మనం ఆలోచిస్తే మనకు ఇటువంటి బాదే కలుగుతుంది కానీ ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసు సైనికురాలిగా తాను దేనినైతే నమ్మిందో పోరాడిందో అందులో తాను దేనిని కోల్పోయిందో అది తనకు కనపడటం లేదు దేవుడు తనకిచ్చిన విజయము మాత్రమే తనకు కనపడుతుంది అందుకే మరల తన భర్తను తాను స్వీకరించింది.
ఆమె తన జీవితంలో ఓ తోడు, ఓ వెసులుబాటు అనిపించే సహాయం ఆమెకు అవసరమైన సమయంలో దొరకలేదు. కానీ ఏదో ఒక శరీర సంబంధమైన ఆశీర్వాదం కోసం ఆమె ఎదురు చూడలేదు – ఆమె తన నమ్మకాన్ని, తన నిరీక్షణను దేవునిపై ఉంచింది. దీవెనలు అంటే శరీర సంబంధమైన సంతోషాలు కాదని, తాను నమ్మిన నమ్మకానికి ఫలితంగా ఇచ్చే దేవుని సమాధానమే నిజమైన దీవెన అని ఆమె జీవితములో దేవుడు నిరూపించాడు ఇప్పుడు ఆమె చూడవలసింది తాను కోల్పోయిన సంతోషం కాదు దేవుడు తన విశ్వాసానికి తనకు ఇచ్చిన విజయాన్ని మాత్రమే.
దేవుని వాక్యము తెలిసిన భక్తి కలిగిన స్త్రీ బాధ్యతలను నెరవేర్చటానికి మాత్రమే పనికి వచ్చింది కాని దేవుడంటే దేవుని వాక్యం అంటే తెలియని స్త్రీ ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా అన్ని సౌఖ్యాలను సంతోషాలను ఆశీర్వాదాలను అన్నిటిని అక్రమంగా తాను అనుభవించింది ఆని సహజంగా మనం అందరం అనుకుంటూ ఉంటాము.
వాక్యానుసారంగా భక్తి కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన జీవితంలో సంతోషంగా జీవిస్తారు ఆశీర్వాదాలు అంటే ఇవే అని మనకు అనిపిస్తూ ఉంటుంది * ఆశీర్వాదం అంటే దేవుడు మనలను తన కొరకు ఏర్పరచు కోవటమే నిజమైన ఆశీర్వాదం * ఇందులో మన ప్రమేయం లేకుండానే దేవుడు మనలను ఎటువంటి సమర్పణ గలిగిన మనము వదిలిపెట్టవలసిన సంతోషాలు సౌఖ్యాలు ఎన్ని ఉన్నప్పటికీని వాటిని మనము వదల లేకపోయినా మనకు ఇష్టం లేకపోయినా బలవంతముగా నైనా వాటిని వదిలి వేసే పరిస్థితులను దేవుడు తన ప్రజల జీవితాలలో తీసుకుని వస్తాడు.
ఎందుకు ప్రభువా నాకు ఈ వేదన నాకు ఈ పరిస్థితి అని అంటే ఇంకొకరికి మనము వెళ్లిన అనుభవము ఆదరణగా ఉండాలి వారికి ఒక వాక్య క్రమము మనము నేర్పించాలి దేవుని వాక్యము పట్ల ఒక నిరీక్షణ వారికి మన అనుభవము తెలియా చేయాలి అని దేవుడు మనకు ఇటువంటి ఎవ్వరు మనలను అర్థం చేసుకోలే నటువంటి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన అనుభవాల గుండ పరిస్థితుల గుండా మన జీవితములను దేవుడు తీసుకొని వెళ్తాడు.
తాను నమ్మిన ఒక్క వాక్యానికి ఆమె జీవితమే ఒక పేద్ధ సాక్ష్యంగా నిలిచింది, అనేక మందికి అది ఆదరణగా మారింది. ఇదే నిజమైన విజయానికి దేవుడు వేసిన ముద్ర. మనము దేనినైతే నమ్మినమొ ఆ వాక్యములో మనము నిలిచి ఉండగలిగితే, దేవుడు మన అలోచన రూపములో కాకపోయినా, తన ఆలోచనల పరంగా వాటిని గొప్పగా ఘనపరిచి మనకు చూపుతాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానాలను మరిచిపోడు మన విశ్వాసాన్ని వృథా చేయడు.
ఆమె జీవితం మనకు ఏమని చెబుతోంది అని అంటే దేవుని వాగ్దానాన్ని పట్టుకునే చేతులు బలహీనమైనవైనా ఎటువంటి సామర్థ్యం లేని వైన, ఆవి దేవుని చేతిలో ఓ ఆయుధం. సత్యానికి దేవుని వాక్యానికి నిలబడ్డవారిని కాలం కాదు, మనుషులు కాదు… దేవుడే గౌరవిస్తాడు.
నమ్మకంగా ఎదురుచూసిన ప్రతి కన్నీటికి, దేవుడు సమాధానంగా ఓ సంతోషాన్ని ఇచ్చేది దేవుడే.
తాను కోల్పోయిన అనేక విషయాల మధ్యన, ఆమె దేవునిపై కోల్పోని విశ్వాసం ఆమెను నిజమైన విజయానికి చేర్చింది ఇది మనకు ప్రతి క్షణం ఒక పాఠం కావాలి.
ఆమె జీవితం ద్వారా దేవుడు ఒక్కొక్కరి ప్రయాణం ప్రత్యేకమని, ఒక్కొక్కరికి ఇచ్చే పిలుపు భిన్నమని స్పష్టంగా చూపించాడు. ఈ స్త్రీ చేసిన సమర్పణ, క్షమించగలిగిన హృదయం, దేవుని ప్రేమ ఎటువంటిదో ప్రత్యక్షంగా మనకు చూపిస్తున్నాయి. మనకు నచ్చిన నచ్చకపోయినా, మన దృష్టికి అన్యాయంగా కనిపించినా దేవుని క్రమమును నమ్మిన వారు చివరకు ఘానతను పొందుతారు.
ఒక నిస్సహయురాలిగా ఒంటరితనముకుండా దేవుడు తనని నడిపిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న వారి ద్వారా భక్తి కలిగిన వారి ద్వారా భక్తి లేని వారి ద్వారా తనను అర్థం చేసుకోలేని వారి ద్వారా తనకు ఎన్నో వేదనకరమైన పరిస్థితుల గూండ ఈ స్త్రీ ప్రయాణించి ఉంటుంది ఇది కచ్చితం ! ఎందుకంటే మనము కలిగి ఉన్న పరిస్థితిని బట్టి మన చుట్టూ ఉన్న ఈ సమాజం మనము ఏమై ఉన్నాము అన్న విషయమును గుర్తిస్తుందే తప్ప దేవుడు మనకు ఇవ్వబోయే విజయమును బట్టి మనలను గుర్తించలేదు.
ఈ వర్తమానం మనకు తెలియపరిచేది ఏమిటంటే – దేవునిపై మనము వుంచే మన విశ్వాసం, మన నిరీక్షణ, మన సమర్పణ చివరకు దేవుని ప్రణాళికను మనలో పూర్తి చేస్తాయి. నిరీక్షణతో కూడిన గమ్యం ఉన్న మన విశ్వాసయాత్ర మనం చూసే విజయానికి మించినది దేవుడు మనలో చేయదలచుకున్న పని. అలాంటి విజయం కోసం దేవుని చేతిలో మన జీవితం రూపుదిద్దుకోవాలని ప్రార్థించుదాం.
విలాపవాక్యములు 3:22-23
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
ఎస్తేర్ క్రైసో లైట్
7-5-2025