CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

శ్రమ = శిక్ష కాదు.

శ్రమ = ప్రార్థనకు ఆహ్వానం.

శ్రమలు మరియు కష్టాలు వచ్చినప్పుడు, ఓర్పుతో ప్రార్థిస్తూ దేవునిపై ఆధారపడే లక్షణం — ఈ రోజుల్లో దేవుని ప్రజల జీవితాల్లో చాలా వరకూ కనిపించటము లేదు లోకంలో ఉన్న వారి లాగా కాకుండా ప్రత్యేకముగా దేవుని ప్రజలలో ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది..

"వ్యక్తిత్వం" అనే పదానికి అర్థం.

ఒక వ్యక్తి అంతరంగంలో ప్రత్యేకమైన ఆత్మగుణాలు, ప్రవర్తన విధానము, ఆలోచనా ధోరణి, నడవడిక — ఇవన్నీ కలిపిన స్వభావమును "వ్యక్తిత్వం" అని అంటారు.

దేవుని ప్రజలైన విశ్వాసుల అంతరంగంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు అతనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వం లక్షణం ఏమిటంటే అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే గుణము,

2 దినవృత్తాంతములు 7:14

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

ఇది ఏ ప్రభుత్వం ఏ అధికారులు ఇచ్చిన హామీ కాదు. మనకు ఇది దేవుడు ఇచ్చిన హామీ.

దేవుడు మనకిచ్చిన ఈ హామీని నెరవేర్చాలని మనము ప్రార్థించాలని మన శ్రమలో నుండి మనకు కలిగిన ఉపద్రవాల నుండి మనము విడిపింపబడాలని ప్రార్థించే అబ్బా తండ్రి అని మొర పెట్టే ఆత్మను పరిశుద్ధాత్మను మనలో దేవుడు ఉంచాడు హామీ ఇచ్చిన దేవుడే ఆ హామీని నెరవేరుస్తాడు అని నమ్మిన క్రొత్త నిబంధన భక్తులు వారి శ్రమలలో దేవునికి మొర పెడుతూ వచ్చారు.

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఈ వచనంలో తమ్ములు తాము తగ్గించుకుని అన్న వాక్యానికి అర్థం ఏమిటంటే దేవా ! నాకు మీరు తప్ప ఇంకొక ఆధారం ఏమీ లేదు ఈ లోకంలో మానవులు కానీ అధికారం కానీ రాజ్యాలు కానీ ప్రభుత్వాలు కానీ నాకు సహాయం చేసేవిగా లేవు నీవు మాత్రమే నా ఆధారం అన్న రిక్త హస్తాలతో దేవుని సన్నిధానం లోకి వెళ్లి ప్రార్థించడం దేవునిపై ఆధారపడటం దేవుని దృష్టిలో ఇది తగ్గింపు,

ఈ లోకం నాకు ఇచ్చిన అధికారమును నేను సద్వినియోగం చేసుకోవాలి నాకంటే గొప్ప వారి సహాయం అధికారం పై నేను ఆధారపడాలి అన్న ఇటువంటి అభిప్రాయాలు ఒక వ్యక్తిలో ఉన్నంతవరకు వారు దేవుని సన్నిధిలోకి వెళ్లి ప్రార్ధించలేరు దేవునిపై ఆధారపడలేరు మానవ ప్రయత్నాలను చేస్తూనే ఉంటారు దేవుడు చేసే ప్రయత్నానికి అవకాశం అన్నది ఇవ్వరు.

ఆది సంఘంలో దేవుని శిష్యులు ఇలా లేరు మా దగ్గర ఉన్నదే మేము నీకు ఇచ్చుచున్నాము అని చెప్పి అనేకులను స్వస్తపరిచారు దయ్యములను పారద్రోలారు వాళ్లలో ఉన్న శక్తి పరిశుద్ధాత్మ శక్తి అపరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వారు భూమిని తల క్రిందులు చేయువారు అన్న బిరుదును వారు పొందారు.

ఈ రోజుల్లో మనకు ఎదురవుతున్న శ్రమలు అనేకం. అన్యాయమా? అపహాస్యమా? అణచివేతనా?

అది ఏమైనా సరే దానిని చూసినప్పుడు మన మనస్సు కలత చెందుతుంది. అప్పుడు మన స్పందన ఏమిటి? మనకంటే గొప్ప సేవకుల్ని మనము మొరపెట్టుకుంటున్నామా ! అధికారులకు మనకు కలిగిన శ్రమను బట్టి మనము విజ్ఞాప్తిచేస్తున్నామా ! అప్పుడు మనము చేయాల్సింది ఇవేమీ కాదు మోకాళ్ళ మీద దేవుని ప్రార్థించడమే మనం చేయవలసిన పని,

అపొస్తలుల కార్యములు 4:29–31

పేతురు, యోహాను బెదిరింపులకు గురైనప్పుడు ప్రజలు ఏమి చేశారు? సేవకులు విశ్వాసులు అందరూ పారి పోయారా? అధికారులను కలిశారా? కాదు. వాళ్లు ప్రార్థించారు.

వారు చేసిన ప్రార్థనతో భూమి కంపించింది. వారు పరిశుద్ధాత్మతో నిండిపోయారు. ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు.

సమూయేలు కాలంలో – ప్రజలు రాజు కావాలన్నారు. దేవుడు సంతోషించలేదు. ఎందుకు?

వాళ్లు దేవుని రాజ్యాన్ని దేవుని అధికారమును వదిలి మానవుని నాయకత్వాన్ని కోరారు.రాజు కావాలని కోరారు వారి దృష్టి దేవుని వైపు కాక మానవుని వైపు పెట్టారు వారి సమస్యలను తీర్చేది దేవుడు కాదు మానవుడైన రాజే అని వారు నమ్మారు

ఇప్పటికీ అదే జరుగుతోంది దేవుని శక్తిని గుర్తించడంలో పొరపాటు పడుతున్నారు. మేము దేవుని ఎదుట వంగక, మా విజ్ఞాపనలను అధికారుల ఎదుట వినిపిస్తాము అనే మన ధోరణి మన హృదయం దేవునిపై ఆధారపడేటట్లు మారాలి. అబ్బా తండ్రి అని మొర్రపెట్టే వ్యక్తిత్వం కలిగిన అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని ప్రజలైన మనమందరము కలిగి ఉండాలి

యెషయా 33:22

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

దేవుడు శ్రమ ద్వారా మనలోని ప్రార్థనా ఆత్మను రగిలించాలను కుంటున్నాడు.

ఆయన మనలను తన కృపా సింహాసనం ఎదుటకు ప్రార్ధన ద్వార మనలను తీసుకురావాలని కోరుకుంటున్నాడు. మనకు శ్రమ వస్తే – దేవుడు దూరంగా ఉన్నట్టు కాదు... దేవుడు మనలను తన దగ్గరకు పిలుస్తున్నట్టే!

ఈ కాలంలో మనకెదురయ్యే ప్రతి శ్రమకు మన స్పందన ఏమిటి?

దీని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు ఏమి తెలియజేస్తుంది ?

శ్రమలు మనల్ని అర్హులను చేయడానికి, మనలను దేవుని దగ్గరకు చేర్చడానికి వస్తాయి.

రోమీయులకు 5:3-4

అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను( శీలము) కలుగజేయునని యెరిగి

శ్రమలయందును అతిశయపడుదము.

శ్రమ వచ్చినప్పుడు పౌలు, సీలా – జైలులో ప్రార్థించారు (అపో. కార్య. 16)

ఆది సంఘం – బెదిరింపుల ముందు ప్రార్థనలో గడి పారు (అపో. కార్య. 4)

దానియేలు – రాజాజ్ఞా వచ్చినా కూడా తన గది తలుపులు తెరిచి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించాడు వీళ్ళందరు అధికారులను ఆశ్రయించలేదు – తాము నమ్మిన దేవుడిని ఆశ్రయించారు.

సామెతలు 21:1

యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును. ఇది ఎంత గొప్ప వాక్యం కదా !

మన విజయం, మన రక్షణ, మన సమాధానం దేవునిలో మాత్రమే ఉంది.

శ్రమ = శిక్ష కాదు.

శ్రమ = ప్రార్థనకు ఆహ్వానం.

మనం ప్రార్థించటానికి మన హృదయం పరివర్తన చెందడానికి దేవుడు ఎమైయున్నాడో అన్నది మనము అనుభవ పూర్వకముగా రుచి చూడటానికి మనకు శ్రమ రావటం అన్నది మనకు ఇది అతిశయించవలసిన విషయమె !

అన్ని తలుపులు మూసుకుపోయినట్టు అనిపించినా ప్రార్థన అనే తలుపు మాత్రం ఎప్పటికీ తెరిచే ఉంటుంది ఆని మీకు తెలుసా !

ఎస్తేర్ క్రైసోలైట్

1-5-2025