2025 Messages
" అంత నా మేలుకే "
మనకు మంచి జరిగినప్పుడు మనకు మేలు జరిగినప్పుడు మనము ఆశీర్వదించబడినప్పుడు "ఇది నా మేలు కోసమే జరిగిందని" చెప్పటం మనకు అలవాటే. కానీ అదే మాట మనం కీడు జరిగినప్పుడు చెప్పగలిగితే — అదే నిజమైన విశ్వాసం! మనకు నష్టమైనప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా అదే ధైర్యంగా చెప్పగలగడం విశ్వాసముతో ఉన్న మనుషులకు మాత్రమే ఆది సాధ్యం.
ఒక దైవజనుడు తన అన్న మరణించిన సమయంలో తనకు కలిగిన బాధతో ఇటువంటి ఆర్థమును ఇచ్చే పాటను తాను వ్రాసారు ఆ పాట నేటికీ ఎంతో మందికి ఆదరణను ఓదార్పును ఇచ్చింది ఇస్తుంది. ఒకరి బాధ మరోకరికి ఆశీర్వాదం అవుతుంది. ఆత్మలోకంలో జరిగే పోరాటాలు మన బాహ్య జీవితంలో ప్రభావం చూపుతాయి.
ఒక మరణం ద్వార కలిగిన భాధలో నుండి పుట్టిన పాట ఆనేక మందిని ఆదరిస్తు వుంటే మనకు యీ పరిచర్య ఒక అద్భుతమైన పరిచర్య అని మనకు అనిపిస్తు వుంటుంది ఇది మనకు బాహ్యంగా మన కన్నులకు కనపడే పరిచర్య సేవ అని దీనిని గూర్చి మనం చెప్పవచ్చు ఇటువంటి మరణకరమైన భాధ ఆనేది కలిగే పరిస్థితి రావటానికి ఇది ఒక ఆత్మ సంబంధమైన ఆత్మలోకంలో జరిగే ఒక పోరాటం ద్వారా వస్తుంది జరుగుతుంది ఇది నిజము ఇది మనకు బాహ్యలోకములో కనబడే పోరాటం కాదు ఇది ఒక మరణం అన్నది జరుగుతుంది మరణకరమైన పరిస్థితి వస్తుంది అని అంటే ఆత్మలోకంలో దాని గురించి ఒక పోరాటం అన్నది జరుగుతుంది అని మనకు అర్థం అయిపోవాలి.
యెషయా 43:2
" నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు." నదులు జలములు నీటి ప్రవాహము అనేవి మనలను ముంచి వేస్తాయి అంటే మనం జీవించటానికి దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని ఇక్కడ నిలబెట్టాడో ఆ ఉద్దేశం జరిగించకుండా ఉండటానికి మనల్ని నశింప చేయటానికి ఇవి మనల్ని ముంచి వేస్తాయి కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో నేను నిస్సహాయస్థితిలో ఉన్నాను
అని దేవున్ని ప్రార్థిస్తూ ఉంటారో కచ్చితంగా దేవుడు వారిని ఆ జలములకు ఆ నదులకు అప్పగించడు.
యోబు 7:1
భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా?
ఈ లోకంలో మనము జీవించాలి అని అంటే ఎన్నో యుద్ధాలు చేయాలి అవి కనపడే యుద్ధాలు కావు. మనము ఈ లోకంలో బ్రతకటానికి మన స్థానాన్ని స్థిరపరచుకోవడానికి చేసే యుద్ధాలు పోరాటాలు ఆత్మలోకంలో జరిగేవి ఇవి మనకు బాహ్యంగా కనపడేవి కావు అందుకనే దేవుని ప్రజలు ఈ లోకంలో బ్రతికేటప్పుడు ప్రతి విషయంలో వాక్యాన్ని ఆధారం చేసుకొని నడవాలి ఏ విషయంలోనైనా ఏ రీతిగానైనా ఎవరితోనైనా మనము కట్టబడేది అది దేవుడు చూపించిన దేనా అది వాక్యానుసారముగా ఉన్నదా లేక మానవుని తలంపులు ప్రకారము వెళుతున్నానా అన్నది మనము జ్ఞానముగా గుర్తించాల్సిన అవసరత దేవుని ప్రజలకు ఎంతైనా ఉన్నది.
మన జీవితంలో ప్రతి సంఘటన వెనుక ఆత్మలోకంలో ఒక పోరాటం ఉంటుంది.
మీకు ఈ పోరాటాము గురించి తెలిస్తే, మీ మార్గాలు దేవుని వాక్యానుసారముగా వున్నాయా లేదా ! అన్న విషయమును మీరు గ్రహించగలుగుతారు.
ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు నరులు తమ తలంపులతో తమ ఆలోచన ప్రకారం కట్టిన బాబేలు గోపురమును చూడటానికి దిగి వచ్చాడు అని వ్రాయబడ్డది ఇక్కడ భాషలను తారుమారు చేయటానికి ప్రధాన కారణం ఏమిటంటే వారు కట్టే గోపురం దేవుని తలంపుల్లో నుంచి వచ్చినది కాదు అది వారి నరుల ఆలోచన మాత్రమే,
బాబేలు గోపురం మానవుల ఆలోచనల ఫలితం. కాబట్టి దేవుడు దానిని వ్యర్థం చేసాడు ఎందుకంటే అది ఆయన ఉద్దేశం కాదని. ఇదే సిద్ధాంతం — మన జీవితంలో మనుషులు కట్టే "కట్టడాలు" కూడా దేవుని ఉద్దేశం కాకపోతే, అవి చివరకు వ్యర్థం అవుతాయి.
మనం చేసే పనుల్లో కానీ మనం మన తోటి వారితో మానవులతో చేసే సహవాసాలతో కట్టుకునే కట్టడాలలో అది దేవుని ఆలోచన ప్రకారంగానే ఉండాలి దేవునికి విరుద్ధమైనది మనమే కట్టడం కట్టిన మనం ఏ పని చేసిన దేవుడు దానిని తారుమారు చేసి దానిని వ్యర్ధపరుస్తాడు.
మానవుని ఆలోచన ప్రకారం మన కంటికి అది రమ్యంగా ఉంటుంది అది మనకు క్షేమకరమైనది లాభకరమైనది అని అనిపిస్తుంది కానీ మనకు లాభకరమైనది క్షేమకరమైనది అని మనము అనుకునే మార్గము మనం కట్టుకునే కట్టడం అది దేవుని వాక్యానుసారమైనదేనా వాక్యంతో దేవుడు మాట్లాడాడ దేవుని ఉద్దేశంలో ఉన్నాదేనా ! అన్న విషయమును మనము స్పష్టంగా గ్రహించాలి.
దేవుని ఆజ్ఞను ఆలోచనను పెడచెవిని పెట్టిన ఆదాము ద్వారా ఈ సృష్టి యావత్తు కూడా వ్యర్థపరచబడ్డది మరణించబడవలసిన అవసరత కలిగి ఉన్నది దేవుని వాక్యమే మనకు విజయాన్ని ఇస్తుంది దేవుని ఆలోచన మనకు విజయాన్ని ఇస్తుంది దేవుని మార్గమే మనకు సరి అయినది.
నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నిన్ను ముంచలేవు అని వాగ్దానం వచ్చిన ఒక సంవత్సరం లో, నేను నా బంధువు ద్వారా నేను ఒక కట్టడం ద్వారా ఆత్మసంబంధమైన ఆత్మలోకంలో జరిగే ఒక పోరాటంలోకి నేను నేట్టివేయబడ్డాను లాక్కొనబడ్డాను అందులోకి ఆపోరాటంలో కి వెళ్లిపోయాను — అది మనుషుల నుండి వచ్చిన నిర్ణయమే కాని, దేవుని ఉద్దేశం కాదని నాకు తెలుసు. వారు కట్టిన ఆ కట్టడం, నా ప్రమేయం లేకుండానే మానవ ప్రయత్నంతో నిర్మించబడింది. కానీ నాకు దేవుడు ముందే వాగ్దానం ఇచ్చాడు — 'నీవు నదులలో బడి వెళ్లినప్పుడు అవి నిన్ను ముంచలేవు.' ఈ వాక్యము ఈ వాగ్దానము ఆ సమయంలో ఆ సంవత్సరంలో నన్ను నిలబెట్టింది స్థిరపరిచింది నేను నశింపకుండా నన్ను కాపాడింది. చివరికి, మనుషులు కట్టిన ఆ కట్టడం మరణకరమైన ఒక పరిస్థితి ద్వారా వ్యర్ధపరచబడినది —
ఆ కట్టడం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా నాకు క్షేమం లేకుండా చేయటానికి మానవుని ఆలోచన ప్రకారం కట్టబడ్డ కట్టడం ఇది అక్కడ మరణం, వ్యర్ధ పరచబడటం, అన్నది దేవుడు తీసుకురాకపోతే నేను అందులో నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదు నాకు విడుదల అన్నది లేనేలేదు.
మన నేత్రాలు చూసేవి ఈ లోక సంబంధమైన కట్టడాలను మాత్రమే కాని ఈ లోకంలో మనం చేసే ప్రతి పని వెనుక మనము కట్టే రకరకాలైన ప్రతి కట్టడం వెనుక మనము చేసే ప్రతి సహవాసం వెనుక మనము వేసుకున్న ప్రతి బంధం వెనుక ఆత్మలోకంలో జరిగే పోరాటం ద్వార ఒక ప్రభావం అన్నది బాహ్యా లోకంలోని అది మన మీద మన జీవితం మీద పడుతుంది.
ఈ బాహ్యమైన లోకంలో అనేకులను ఆదరించే ఆదరణ కరమైన ఒక పాట రావడానికి ఒక దైవజనుడు బాధ గుండా ప్రయాణిస్తే ఆ పాటను వ్రాయటానికి గల కారణం రావడానికి దేవుడు ఇంకొక వ్యక్తిని ఆత్మలోకంలో వాడుకున్నాడు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది మనం వేసే అడుగు చేసే పని ఎంత జాగ్రత్తగా వేయాలో చేయాలో అని ఆత్మలోకంలో జరిగే పోరాటాలు మన బాహ్య జీవితంలో ప్రభావం చూపుతాయి.
ఒక వృద్ధాప్యంలో ఉన్న భక్తునికి అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచెదవు, అని కానీ నువ్వు పైవాడుగా ఉందువు గాని క్రింద వాడవుగా ఉండవు, అని కానీ వస్తే ఈ వాక్యానికి ఇంక భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వాక్యాలకు అర్థం పరలోకానికి వెళ్తున్నాం అని కానీ ఈ లోకంలో శ్రమలు సమస్యలు వస్తుందన్నప్పుడు ముఖ్యంగా మనము బంధువుల ఆధీనంలో ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మనతో వారి ఆలోచన ప్రకారం రకరకాల కట్టడాలను మనతో కడుతూ ఉన్నప్పుడు మనపై అధికారం వారు తీసుకునేటట్లు ఉన్నప్పుడు
అక్కడ వాగ్దానం ఇచ్చిన దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు మన ప్రమేయం లేకుండా ఏ విషయంలో కట్టబడ్డమొ మనలను విడిపించడానికి
దేవుడు అక్కడ ఒక దానిని వ్యర్ధపరచాలి మరణానికి లోను చేయాలి ఇది సత్యం దీనిని ఎవరు గమనించలేరు ఆత్మ లోకంలో ఈ పోరాటాన్ని గురించి మనము గమనిస్తే ఖచ్చితంగా మన మార్గాలు మన కట్టడాలు మన సహవాసాలు మన బంధుత్వాలు మన బాంధవ్యాలు అన్నీ కూడా దేవుని వాక్య ప్రకారము దేవుని ఆలోచన ప్రకారమే ఉంటాయి.
దేవుని వాక్య ప్రకారము మనము ఏ విషయము గుండ ప్రయాణించామొ కచ్చితంగా ఆ విషయంలోనే పదేపదే మనము పరీక్షకు గురవుతూ ఉంటాము దేవుని వాక్యము దేవుని వాగ్దానము ఆది మనలను శుద్ధికరించే అగ్ని.బంగారానికి పరీక్షలు అవసరం.
ఇదే మన విశ్వాసానికి కూడా వర్తిస్తుంది. దేవుడు అనేక సార్లు మనల్ని పరీక్షల ద్వారా పరిశుద్ధ పరుస్తు వుంటాడు.,
బంగారానికే ఎక్కువ పరీక్ష ఉంటుంది పదే పదే అది అగ్నిలోకి వెళ్లాలి ఎందుకంటే దానిలో ఉన్న మళినం అంతా పోవాలి కాబట్టి దేవునికి ఇష్టమైన శుద్ధ సువర్ణముల అది ఉండాలి కాబట్టి బంగారము అగ్నిలో ఎక్కడ శుద్ధికరించబడుతుందో ఆ స్థలములో అది ప్రకాశిస్తుంది ఎన్నిసార్లు ఎంతమంది ద్వారా అగ్నిగుండ వెళ్తుందో ఆ ప్రదేశాలన్నిటిలో దాని ప్రకాశము దానిని చూసేవారికి కనబడుతుంది.
బంగారం పదే పదే అగ్నిలో శుద్ధి కావాలి. అలాగే దేవుడు మనల్ని పదే పదే పరీక్షిస్తాడు — ఎందుకంటే మనము ఆయన కిష్టమైన వారము కాభట్టి.
మీరు కూడా పదే పదే ఎందుకు ప్రభువా నేను ఇలా పరీక్షించబడుతున్నాను మీ ఆలోచన ప్రకారమె కదా! నేను నడుస్తున్నది అని మీరు బాధపడుతున్నారా !
అయితే మీరు ఎన్నిసార్లు పరీక్షించబడతారో అన్నిసార్లు అంతమంది అన్ని స్థలాలలో మీలో ఉన్న దేవుని ప్రకాశం వారందరికీ తెలియబడాలని దేవుడు మిమ్మల్ని పరీక్షలు గుండా నడిపిస్తున్నాడని ఆత్మలోకంలో నిరంతరము దేవుని సైనికునిల మనము నిరంతరం పోరాడాలని ఈ లోకంలో శరీర సంబంధంగా మనము జీవిస్తున్న ఈ జీవితము
ఈ లోకంలో మనం జీవించే మన జీవన విధానం ఆత్మలోకంలో జరుగుతున్న పోరాటంలో యుద్ధంతో సంబంధం కలిగి ఉందని అక్కడ జరిగే పోరాట ప్రభావం అన్నది మన పై ఖచ్చితంగా పడుతుంది అన్న ఈ సత్యాన్ని మీరు గ్రహించారా !
ఎస్తేర్ క్రైసోల్తెట్
29-4-2025