2025 Messages
మరణ శాసనాన్ని వ్రాసిన దేవుడు, తానే దానికి బాధ్యత వహించిన ప్రభువు!
హెబ్రీయులకు 9:17
మరణశాసన మెక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
మరణశాసన మెక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. అన్న వాక్యమును వింటున్నప్పుడు నాకు అనిపించింది చాలామంది క్రీస్తు ప్రభువు పాత నిబంధనలో ఎక్కడ కనబడరు అని విమర్శిస్తూ ఉంటారు కదా ఈ వాక్యం ఆధారం చేసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై యున్న దేవున్ని నేను వెతకాలి ఒక వర్తమానము రాయాలని అనుకున్నాను,
క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు మానవుల పాపముల కొరకు మరణించి సమాధి చేయబడ్డారు అని 1 కొరింథీయులకు 15:3 వచనములో మనకు కనపడుతుంది. క్రీస్తు ప్రభువు మరణించటానికి కారణం – తాను ఏమైనా మరణ శాసనము అన్నది దేని గురించైనా వ్రాశాడా? అని హెబ్రీయులకు 9:17 వచనమును చదువుతున్నప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది కదా!
ఆసలు ఈ మరణ శాసనము అన్నది ఎక్కడ ప్రారంభమైనది అన్న విషయం మనము చూస్తే
ఆదికాండము 2:17
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను ఇక్కడ మరణాన్ని గురించిన శాసనము మనకు బహిరంగముగా మనకు కనపడుతుంది. ఈ శాసనం ఎవరు ఇచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడు. ఇది మానవుని అవిధేయతకు మానవుడు చేసిన పాపానికి దేవుడు చేసిన మొదటి న్యాయ నిర్ణయం – అంటే "మరణ శాసనం". ఇక హెబ్రీయులకు 9:17 ప్రకారం, మరణ శాసనం వ్రాసిన వాడే మరణించాలి అని చెప్పబడింది.
ఇప్పుడు మనము ఒక విషయాన్ని గ్రహించాలి – ఈ మరణ శాసనాన్ని వ్రాసినవాడు మానవుడు కాదు… దేవుడు !
అయితే ఈ మరణ శాసనాన్ని తానే వ్రాసిన దేవుడు, తానే దానిని మానవుని బదులు తాను భరించాలని నిర్ణయించాడంటే, అది ఎవరు? యేసు క్రీస్తు ప్రభువా ! .అసలు ఈ మరణ శాసనాన్ని ఇచ్చింది యెహోవా దేవుడు. మరి హెబ్రీయులకు 9:17 ప్రకారం, ఈ మరణ శాసనాన్ని వ్రాసినవ్యక్తి మరణించబడాలి.
మరి మరణించిన వ్యక్తి ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు.
అయితే ఈ ఇద్దరూ వేర్వేరా? లేక ఒక్కటేనా?
తండ్రి మరియు కుమారుడు ఒక్కటే:
పశువుల రక్తం మన పాపాలను పూర్తిగా తొలగించలేకపోయింది. దేవుడు తానే శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి – తానే మరణ శాసనాన్ని తనపై వేసుకుని – తన మరణంతో దానిని తుడిచివేశాడు.
కొలస్సీయులకు 2:14
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,
ఇక్కడ ఈ వాక్యంలో మనం స్పష్టంగా చూడగలం – మరణ శాసనాన్ని వ్రాసిన దేవుడు – అదే యేసు క్రీస్తు ప్రభువు– తానే తన మరణంతో దాన్ని సంపూర్తిచేసాడు. దీని అర్థం ఏమిటంటే
పాత నిబంధనలో మరణ శాసనాన్ని ఇచ్చిన దేవుడే, కొత్త నిబంధనలో మనకొరకు ఆ శాసనానికి భాద్యత వహించిన యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే.
పాత నిబంధనలో యెహోవా దేవుడు గా మనకు కనపడుతున్నారు = క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువుగా మనకు కనబడుతున్నారు.
ఆయన యుగయుగములకు దేవుడు, మారనివాడు. తానే మొదటి వాడు, తానే చివరి వాడు.
1. యోహాను 10:30
నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.
2. యోహాను 1:1,14
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను;
3. యోహాను 14:9
నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు
4. యెషయా 9:6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
5. ప్రకటన గ్రంథం 1:8
అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
పాత నిబంధనలో న్యాయాన్ని ప్రకటించిన దేవుడు, కొత్త నిబంధనలో కృపను చూపిన ప్రభువు ఒక్క దేవుడే. తానే శాసనం వ్రాసిన దేవుడు, తానే దానికి బాధ్యత వహించి గొర్రె పిల్లగా బలి అయినది ఒక్క దేవుడే, యెహోవా దేవుడు = యేసు క్రీస్తు ప్రభువు అని నిరూపించే విధముగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడే విషయాలు:
1. తిమోతికి 3:16
నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
ఈ వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది దేవుడు → శరీరరూపములో కనిపించాడు → అది యేసే!
2 . యెహోవా మాత్రమే సింహాసనంపై పదిలంగా ఉండే వాడు – కీర్తనలు 93:2
పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే
యెహోవా నామమే కాదు యేసు క్రీస్తు ప్రభువు అను నామములో కూడా ఇటువంటి స్థానమే ఉంది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది.
హెబ్రీయులకు 1:6
మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. హెబ్రీయులకు 1:8
గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
3. యెషయా 6:1-3
రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
ఇక్కడ యెషయా యెహోవా తేజస్సును చూశాడు,
దేవుని గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఈ విషయాన్ని గురించి యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు.
యోహాను 12:41
యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను.
ఇక్కడ యోహాను సూటిగా చెబుతున్నాడు —
యెషయా చూసిన వాడు యేసు క్రీస్తే అని!
అంటే, యెషయా 6 వ అధ్యాయములో ఉన్న యెహోవా సింహాసనంపై కూర్చొన్న తేజస్సు – అదే యేసు క్రీస్తు ప్రభువు యొక్క దివ్య స్వరూపం.
ఇది ఎలాంటి సత్యం?
ఇది తండ్రి కుమారా పరిశుద్ధాత్మ అనే త్రిత్వ స్వరూపంలో ఉన్న దేవునికి స్పష్టమైన ఉదాహరణ
యెషయా 6 వ అధ్యాయంలో ఉన్న యెహోవా దేవుడు యోహాను 12 వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువే.
ఇది క్రీస్తుప్రభువు యొక్క, శాశ్వతత్వం, మరియు త్రిత్వ సంబంధాన్ని సూచించే బలమైన గ్రంథసాక్ష్యం.
క్రీస్తు – శరీరధారణకు ముందు కూడా – దేవుని రూపంగా ఉన్నాడని చూపిస్తుంది
(యోహాను 1:1-14, కొలొస్సయులకు 1:15, హెబ్రీయులకు 1:3 కూడా ఇదే సృష్టతను యిస్తున్నాయి )
4. కొలస్సీయులకు 1:15
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
ఇటువంటి దివ్య స్వరూపమును కలిగి ఉన్న దేవుని మానవుడు ఎందుకు చూడలేదు ?
5. పవిత్రతతో, తేజస్సుతో నిండి ఉన్న దేవుని దివ్య స్వరూపంను చూడడం పాపముతో నిండి ఉండే మనుషులకు ఆది సాధ్యపడదు అందుకే ఆదాము ఆజ్ఞాతి క్రమం తరువాత చల్లపూటన ఆదాముతో మాట్లాడుట కొరకు యెహోవా దేవుడు ఏదేను తోటలోనికి వచ్చినప్పుడు ఆదాము తోట మధ్యలో దాగి ఉన్నాడు అని వ్రాయబడినది.
ఆదికాండము 3:8
చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచ రించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగు కొనగా,
యోహాను 1:18
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైక కుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.
ద్వితియోపదేశకాండము 4:12
యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి.
( యోహాను 1:18; ద్వితీయోప. 4:12).
6. నిర్గమకాండము 17:6
ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను. పాత నిబంధనలో నీళ్లను ఇచ్చిన ఈ బండ
యేసుక్రీస్తు ప్రభువు అని క్రోత్త నిబంధనలో చెప్పబడుతుంది.
1కోరింథీయులకు 10:4
అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
పాత నిబంధనలో న్యాయాన్ని ప్రకటించిన దేవుడు, కొత్త నిబంధనలో కృపను చూపిన ప్రభువు ఒక్క దేవుడే. తానే శాసనం వ్రాసిన దేవుడు, తానే దానికి బాధ్యత వహించి గొర్రె పిల్లగా బలి అయినది ఒక్క దేవుడే మనలను విమోచించినది కూడా ఆ దేవుడే
పరలోకములో తండ్రిగా ఉన్న దేవుడు భూమి మీద కుమారుడిగా మనతో నివసించాడు శరీర దారిగా ఈ భూలోకంలో జన్మించి మనతో నివసించిన ఈ దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గా మనలో నివసిస్తున్నాడు ఈ త్రిత్వమై యున్న ఒకే ఒక దేవుడు అందరి వాడు తనను విశ్వసించే వారికందరికీ అతి సమీపముగా ఉండే దేవుడు.
ఒక ప్రశ్న !
నేను ఇంకా తండ్రిని, కుమారుని వేర్వేరుగా చూస్తున్నానా? లేక ఒకే దేవుని త్రిత్వ మైన స్వరూపాన్ని చూడ గలుగు తున్నాన ?
నా పాపములవలన శాసనం వ్రాయబడితే, ఆ శాసనాన్ని రద్దు చేయటానికి దేవుడు ఎంతటి ప్రేమను చూపించాడో నేనెప్పుడైన నిజంగా విచారించానా?
యేసు క్రీస్తు ప్రభువు శరీరరూపంలో వచ్చిన దేవుడని నమ్మే విశ్వాసములో నేను వున్నానా?
ఎస్తేర్ క్రైసోలైట్
19-4-2025