CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

మీ బాధ్యత ఏమిటో మీకు తెలుసా ?

గత డిసెంబర్ నెలలో ఒకరోజు ఉదయం మా చిన్న కుమార్తె నిద్ర లేచిన వెంటనే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది వాళ్లు అలా ఉదయాన్నే నన్ను వెతుక్కుంటూ వచ్చారు అంటే వారికి ఏదో ఒక కల వచ్చింది అని నాకు అర్థం అవుతుంది.

నేను వెంటనే ఏమి కల వచ్చింది అని అడిగినప్పుడు నా కుమార్తె చెప్పింది అమ్మ * మన ఇండియాలో యుద్ధం జరుగుతుంది అంట సైనికులు ఉన్నారు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు అలా యుద్ధం చేస్తు ఉన్నప్పుడు నదులు ఎండిపోతున్నాయి ఇంతే కల * అని నాకు చెప్పింది.

నాకు అప్పుడు అసలు అర్థం కాలేదు చాలా ఆలోచించాను ఈ కల అర్థం ఏమిటి అని ఏదైనా కల వస్తే వాక్యాను సారముగా దేవుడు నాకు దాన్ని అర్థం చేయాలి. అప్పటివరకు దాని గురించి నేను పట్టించుకోను యుద్ధం అన్నది ఎక్కడైనా జరిగితే ధరలు పెరుగుతాయి లేకపోతే ఇంకేమన్నా జరుగుతాయి కానీ నదులు ఎందుకు ఎండిపోతాయి యుద్ధానికి నదులుకి ఏమి లింకు ఉంటుంది అని ఆలోచించాను అర్థం కాలేదు.

అప్పుడు నాకు ఆ క్షణంలో ఇంకొక అడుగు ముందుకు వేసి మన ఇండియాకి ఇంకా వేరే దేశాలకి ఏమన్నా యుద్దం వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ కల ఎందుకు ఇలా వచ్చింది అని కూడా ఆలోచించాను ఎలా ఆలోచించిన ఆ కలకి అర్థమును

నేను తెలుసుకో లేక పోయాను.

కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన క్రైస్తవ లోకము కోల్పోయినటువంటి దైవజనుడైన ప్రవీణ్ గారిని నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదు తన వర్తమానం ఎలా ఉంటుందో కూడ నాకు తెలియదు ఎందుకంటే నేను చాలా తక్కువ పరిమితిలో కొంతమంది దైవజనుల వాక్యమును మాత్రమే నేను వింటూ ఉంటాను

ఈ సంఘటన జరిగిన తర్వాత నా ఫోన్ యూట్యూబ్లో ఆ దైవజనుని వర్తమానాలు నాకు పదేపదే కనపడుతూ వచ్చాయి వాటిని నేను వింటూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఎంత గొప్ప జ్ఞానాన్ని తాను సంపాదించాడు ఇంత జ్ఞానం సంపాదించాలి అని అంటే ఎంత సమయాన్ని తాను దేవునికి ఇచ్చాడు.

ఇటువంటి నదిలా ప్రవహించే వాక్య జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి మరలా రావాలి అని అంటే దానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కదా అని నేను బాధపడుతూ ఉన్న ఆ సమయంలో నాకు వెంటనే నా చిన్న కుమార్తె నాకు చెప్పిన ఆకల గుర్తుకు వచ్చింది.

బాహ్యంగా ఇప్పుడు ఈ సంఘటన జరగటానికి మూడు నెలల ముందే ఆత్మలోకంలో ఒక పోరాటం అన్నది ప్రారంభమైనది దానిని దేవుడు కల ద్వార తెలియచేశాడు అని నాకు ఆ క్షణాన అర్థం అయింది

నేను వెంటనే ఈ విషయాన్ని నా పిల్లలకు తెలియజేశాను ప్రార్థించమని చెప్పాను ఆ క్షణానుంచి నేను ఏం చేస్తున్నా కూడా ఒక ప్రార్థన మా దేశంలో నదిలా ప్రవహించే వాక్య జ్ఞానాన్ని కలిగిన దైవజనులను కాపాడండి వారికి క్షేమాన్ని ఇవ్వండి అన్న ఒక ప్రార్ధనను ఒక ప్రార్థన పోరాటమును నేను చేస్తూ వస్తున్నాను.

ఎవరో నాకు సంబంధం లేని వ్యక్తి కోసం నేను ఎందుకు ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు నాకు కల ద్వార తెలియజేశాడు ప్రార్ధనా అనే ఒక పరిచర్యను ఒక బాధ్యతగా దేవుడు నాకు ఇచ్చాడు ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య ఇది బాహ్యంగా కనపడేది కాదు కాబట్టి,

నేను మనుషులను కాకుండా దేవుడు మీదే ఎందుకు ఆధారపడి ప్రార్థిస్తున్నాను అని అంటే ఈ బాధ్యతను ఇచ్చింది నాకు కల ద్వారా తెలియజేసింది దేవుడే కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య యిది నేను చేస్తే దీనికి నేను పరలోకంలో బహుమానాన్ని పొందుతాను అని నాకు అర్థమైంది కాబట్టి,

దేవుని ప్రజలు ఈ లోక సంబంధమైనమైన యుద్ధాలను చేయటానికి శరీర సంభందమైన సామర్ధ్యములను కనుపరుస్తు యూద్దాలను చేయటానికి ఏర్పరచబడలేదు కానీ ఆత్మసంబంధమైన పోరాటాలను చేయటానికి ప్రత్యేకింపబడిన దేవుని సైనికులు.

దేవుడు మనకు ఎటువంటి బాధ్యతలను ఇచ్చిన అవి చేయటానికి మనము మనుషుల మీద మన సామర్థ్యముల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకు బాధ్యతను ఇచ్చిన దేవుని మీదే మనం ఆధారపడి దేవుని చెప్పిన నియమములోనే మనము యుద్ధం చేయాలి.

మన బాధ్యతలలో మన పోరాటాలలో మన యుద్ధాలలో మనకు విజయాన్ని ఇచ్చేది మనకు సహాయం చేసేది మనలను పిలిచిన దేవుడే మనుషులు కాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించవలసిన అవసరత ఉన్నది.

ఈలోకంలోని ప్రతి సమస్యకు మన మనసు ముందు ముందే ఒక దారిని వెతుకుతుంది. మన తెలివి, మన సామర్థ్యం, మన అనుభవం – ఇవన్నీ కలిసి ఒక పరిష్కార మార్గంను మనకు సూచిస్తాయి. కానీ ఆ మార్గము నమ్మకంగా ఉంటుందా? శాశ్వతంగా ఉంటుందా? ఉండదు పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుంది.

దేవుని మార్గం మాత్రం అలా ఉండదు వేరేలా ఉంటుంది. అది మన తెలివికి అందనంతగా

ఉంటుంది. దేవుడు మన శత్రువులను మనకు నష్టం చేసిన వారిని క్షమించమంటాడు, మౌనంగా ఉండమంటాడు, ప్రార్థన చేయమంటాడు. మన మనసుకు అవి బలహీనంగా కనిపించినా, అవే శక్తివంతమైన ఆయుధాలు. అవే శత్రు సాతాను కోటలు కూల్చగల శక్తి కలవి.

ఒక మనిషిగా నాకు వున్న సామర్ధ్యమును బట్టి నేను ఎంతో ప్రయత్నించవచ్చు, కానీ నా సమస్యయొక్క లోతును దేవుడు మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలడు. ఆయన ఇచ్చిన ఆయుధాలు పలుకుబడి కాదు, తెలివి కాదు, సామర్ధ్యము కాదు బలమే కాదు. అవి విశ్వాసం, దేవుని వాక్యం, ప్రార్థన, మరియు పరిశుద్ధాత్మ సహాయమే ఇవి మాత్రమే మనకు విజయమును ఇవ్వగలవు.

2 కోరింథీయులకు 10:4

మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై యున్నవి.

మనము చేసె యుద్ధము లో ఉపయోగించు ఆయుధములు శరీర సంబంధమైనవి కావు ఆవి దేవునిచేత ఏర్పరచబడినవి శత్రు కోటలు కూల్చుటకు శక్తివంత మైనవి

పరిశుద్ధ గ్రంథంలో యుద్ధకవచం గురించి

ఎఫెసీయులకు 6:10–18 వచనాలలో ఉంది. ఇది క్రైస్తవునికి అవసరమైన ఆత్మీయ కవచాన్ని వివరించే అద్భుతమైన భాగం.

ఇక్కడ యుద్ధ కవచాలను గురించి ఈ విధంగా చెప్పబడినవి:

ఎఫెసీయులకు 6:13 - 18

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు(దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణము లన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.

మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.

ఇవి మాత్రమే కాక

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో చెప్పిన ఆత్మీయ కవచాలలో, దేవుని వాక్యం (ఆత్మయొక్క ఖడ్గము) మాత్రమే మనకు శత్రువును ఓడించే ఒక ఆయుధం – అంటే శత్రువు మీద దాడి చేయగల ఆయుధం.

ఇతర ఆయుధాలు అన్నీ రక్షణ కోసం ఉన్నాయి —

నీతికవచం మన హృదయాన్ని కాపాడుతుంది, రక్షణ శిరస్త్రాణం మన మనస్సును కాపాడుతుంది, విశ్వాసఢాలు శత్రువు వేసే బాణాలను ఆర్పుతుంది. ఇవన్నీ మనపై వచ్చే దాడుల నుండి రక్షించేందుకు మాత్రమే,

కానీ వాక్యము మాత్రం శత్రువుపై మనము దాడి చేసేందుకు ఉపయోగపడుతుంది.

అది అబద్ధాన్ని ఛేదిస్తుంది.

అది అంధకారాన్ని చీల్చుతుంది.

అది బాధలను చెరిపి వేస్తుంది.

అది శత్రువులు మన ప్రక్కనే చేరి ఉన్నప్పుడు, విశ్వాసం బలహీనమైనప్పుడు — మన చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం.

యేసు సాతానును ఎదుర్కొన్నప్పుడు చేసిన దాడి ఇదే – వాక్యంలో వ్రాయబడి యున్నది - అని చెప్పడం. యేసు ప్రభువు ప్రతి సారి వాక్యాన్ని ఖడ్గంలా ఉంచి దాడి చేశారు అలాగే మనకూ ఆత్మయుద్ధంలో విజయం కావాలంటే – వాక్యం చేతిలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన నోటి మీద ఉండాలి.

దేవుని రాజ్యంలో ఉన్న దేవుని ప్రజగా మీ బాధ్యత ఏమిటో దేవుడు మీకు ఇచ్చిన పని ఏమిటో మీరు గ్రహించరా !

ఎస్తేర్ క్రైసోలైట్

16-4-2025