2025 Messages
⛴ నడి సముద్రమున ఓడ నడచు జాడ
సామెతలు 30:18 --19
నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,
బండమీద సర్పము జాడ,
నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.
3. ⛴ నడి సముద్రమున ఓడ నడచుజాడ,
మత్తయి 5:13
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
యేసు ప్రభువు స్వయంగా తన శిష్యులతో చెప్పిన మహోన్నతమైన వాక్యం యిది.
🌿 మీరు లోకముకు ఉప్పు 🌿
ఈ వాక్యము ఎంత బాగుందో కదా !
1. ఉప్పు యొక్క ప్రభావం
ఉప్పు చిన్నది, కానీ దాని ప్రభావం ఎక్కువ. అది రుచిని ఇస్తుంది, పాడవకుండా కాపాడుతుంది, శుద్ధి చేస్తుంది. అలాగే దేవుని ప్రజలు ఈ లోకంలో ఉన్నవారికి జీవవాక్యము శాంతి ధైర్యము నెమ్మదిని విశ్వాసము అనే దేవుని మాటల రుచిని అందించే వారు.
పాపంతో నిండిన ఈ లోకంలో అన్యాయం, అపవిత్రత, అవిశ్వాసం వ్యాపించినప్పుడు, మనము ఉన్నచోట దేవుని పరిశుద్ధతను నిలిపే వారమై ఉండాలి. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, చూపే ప్రేమ, చూపించే క్షమ — ఇవన్నీ ప్రజలకు దేవుని జ్ఞానమును, ప్రేమను, సత్యాన్ని దేవుని నీతిని పరిచయం చేయాలి.
ఉప్పు లేకుండా ఆహారం ఎలా రుచిలేనిదైపోతుందో, మనం లేకుండా ఈ లోకం దేవుని సత్యాన్ని అనుభవించలేదు.
మన ఉనికి ద్వారా ఈ లోకానికి ఒక రుచిని యిచ్చే మార్గము లభించాలి. మనం ఉన్నచోట సమాధానం దొరకాలి కలహం తగ్గాలి. మనం ప్రార్థించుచోట చీకటి తొలగించబడాలి, నిరాశ విడిపోవాలి. ఇది సాధ్యమె ఎందుకంటే — మనం దేవుని చేతిలో ఉన్న ఉప్పు.
ఉప్పు తనకు తగిన శక్తిని కోల్పోతే అది వ్యర్థమవుతుంది. అలానే మన విశ్వాసమూ, మనలో వున్న ఆత్మ దేవునిలో నిత్యం బలపడుతు వుండాలి. మన హృదయం దేవునితో నిండినప్పుడే మనం నిజమైన ఉప్పులా ఈ లోకాన్ని ప్రభావితం చేయగలుగుతాం.
2. దేవుడు తన ప్రజలను ఉప్పుగా ఈ లోకంలో ఎందుకు ఉంచారు
ఉప్పుతో కూడిన నిబంధన దేవునితో శాశ్వత సంబంధం సూచిస్తుంది. ఇది మన ఆ త్మలోని అపవిత్రత, స్వార్థం, అసత్యం లాంటి వాటిని ఎదుర్కొంటుంది.
దేవుని వాక్యంతో మనం చూస్తే అది మనలోని చెడు ఆలోచనలు, తేడాలను బయటకి తీస్తుంది – ఇది అంతర్గత పరిశుద్ధత. దేవుని వాక్యంలో ఉప్పు వంటి పదాలు మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తాయి, బోధిస్తాయి.
కొలస్సీయులకు 4:6
ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి.
ఇక్కడ “ఉప్పుతో రుచి కలిగిన మాటలు” అంటే కేవలం రుచి కాదు — పరిశుద్ధత, నిర్ధారణతో కూడిన సత్యమైన రక్షణార్థమైన వాక్యము, ప్రేమతో కూడిన దేవుని మాటలు ఇటువంటి వాటితో మనము ఈ లోకంలో ఉప్పు లాంటి రుచిని కలిగించాలని దేవుడు మనలను ఈ లోకంలో ఉప్పుగా ఉంచాడు.
3. సముద్రం :
🌊 సముద్రం ఈ లోకానికి సూచనగా ఉన్నది
యెషయా 57:20
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
ఈ లోకంలో ఉన్న భక్తిహీనులు, లేదా దుర్మార్గులు, నిశ్చలత లేని సముద్రంతో పోలికగా చేప్పబడ్డారు. ఇది వారి హృదయ స్థితిని సూచిస్తుంది — ఆత్మ జీవితంలో ప్రశాంతత లేకుండా కలవరంగా ఉండటం, భక్తిహీనులలో వున్న మురికి ( మార్కు 7:20 - 23 )
మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడు తనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును(మూలభాషలో-చెడ్డ కండ్లును) దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.
1యోహాను 2:16
లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
తనలో ఉన్న ఇటువంటి పనికి రాని మానవునికి ఉపయోగపడని మురికిని బయటకు నెట్టి వేస్తుంది గనుక సముద్రమును పాపంతో శాపంతో నిండి ఉన్న ఈ లోకంతో పోల్చి దేవుని వాక్యం మాట్లాడుతుంది.
4. ఉప్పు ఎక్కడ ఉంటుంది.?
ఉప్పు సముద్రంలో ఉంటుంది ఉప్పులేని సముద్రం అంటూ ఏది ఉండదు ఉప్పు సముద్రానికి సహజ స్వభావము కొద్దిగా అయినా ఉప్పులేని సముద్రము అసలు ఉండదు.
దేవుని ప్రజలు లేని ఈ లోకము లేనేలేదు రుచి కలిగిన దేవుని మాటలను తెలియ జేసే ఉప్పు లాంటి కొద్దిమంది దేవుని ప్రజలను అయినా ఈ లోకము కలిగి ఉంటుంది ఎందుకంటే మీరు ఈ లోకములకు ఉప్పు అయి ఉన్నారు అని క్రీస్తు యేసు ప్రభు వారు సెలవిచ్చారు కాబట్టి.
5. ఓడ ⛴
ఓడ అంటేనే సముద్ర ప్రవాహాల మీద నడిచే ఎకైక ఆతి పేద్ధదైన ఒక వాహనం.
ఓడ సముద్రపు మధ్యనున్న లోతైన జలాల మీదనే ఆది నడవాలి.
ఈ ఓడ మానవునికి ఉపయోగ కరమైన ఎన్నో వాటిని రవాణా చేస్తూ సముద్ర జలాల మీద ప్రయాణిస్తూ ఉంటుంది ఉప్పు కలిగిన సముద్రపు నీటి మీద ఈ ఓడ ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ దీని జాడ ఇది వెళ్లిన ఇది ప్రయాణిస్తున్న మార్గము ఎవ్వరికీ కనపడదు దీని ప్రభావం మాత్రమె మనకు కనపడుతుంది అంటే ఇది వెళ్లిన జాడ గుర్తు మనకు కనబడదు కానీ ఇది సముద్రం ప్రవాహాల మీద ప్రయాణిస్తూ తన గమ్యస్థానానికి చేరుకుంటున్నా ఈ ప్రభావాన్ని మాత్రమే మనము చూడగలుగుతాము.
ఈ లోకంలో రుచిని కలిగించే ఉప్పు లాంటి దేవుని ప్రజల హృదయాలలో వుండి ప్రయానించే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ జాడ కూడ ఎవ్యరికి కనపడదు దాని శక్తి దాని సామర్ధ్యము వలన కలిగే ప్రభావము మాత్రమే మనకు కనపడుతుంది.
ఒక ఆత్మసంబంధమైన వ్యక్తి ఆత్మీయ ప్రయాణాన్ని బాహ్యంగా చూస్తున్నవారు ఆత్మలో గ్రహించని వారు పరిశుద్ధాత్మ నడిపింపు లేని వారు అతని లోపల నడిచే ఆ పరిశుద్ధమైన ప్రవాహాన్ని ఆత్మ నడిపింపును వారు చూడలేరు.
దేవుని జ్ఞానం, ప్రార్థన, వాక్య ధ్యానం ద్వారా నడిపించబడుతున్నా — ఇతరులకు అది ప్రాముఖ్యమైనదిగా కనిపించదు అర్ధం కానిదిగా ఉంటుంది మన జీవితాలలోనికి వచ్చేఅనేక సమస్యలను దేవుని వాగ్దానాల ద్వారా ప్రార్థన ద్వారా వాటిని మనము జయించే టట్లు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. కానీ దాన్ని జాడ ఎవ్వరికి కనపడదు మనము సాధించిన ప్రభావం మాత్రమే కనపడుతుంది.
యోహాను 14:17
లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.
దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో ఆత్మ సంబంధమైన జీవితమును కలిగిన ఒక విశ్వాసి ప్రయాణం జాడ కనపడని ఒక అజ్ఞాతమైన ఆత్మ నడిపింపుతో సాగుతుంది — అది బహిరంగంగా బలంగా కనబడదు. కానీ, అది వారి జీవితంలో ప్రభావాన్ని చూపుతు స్థిరత్వమును, విశ్వాసాన్ని, గమ్యానికి చేరే లక్ష్యాన్ని కలిగిస్తుంది.
యోహాను 3:8
గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువే గాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
ఆత్మతో పుట్టినవారి జీవితాల్లో కూడా ఇదే ఉంటుంది
వారు నడిపించబడ్డారు — కానీ అది ఇతరులకు బాహ్యంగా స్పష్టంగా కనిపించదు.
దేవుడు మన జీవితంలో సహజంగా కాని బలంగా పని చేస్తాడు. మన నడకలో బాహ్యంగా ఏ మార్పు తొందరగా కనిపించకపోయినా, మన అంతరంగంలో ఆయన మార్పు శక్తిగా పని చేస్తుంటాడు.
1కోరింథీయులకు 2:14
ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
అంటే ఆత్మ స్వాధీనంలో లేని విశ్వాసులు కూడా, వారు రక్షించబడినవారు అయినా, ఆత్మ స్వాధీనంలో లేని వారు అయితే ఇతరుల ఆత్మ సంబంధమైన మార్పును లేదా నడిపింపును వారం పూర్తిగా గమనించలేరు, అర్థం చేసుకోలేరు.
ఇతరుల ఆత్మ నడిపింపు జీవితాన్ని గుర్తించలేరు వాళ్లు ఎందుకంటే అది ఆంతర్యంగా జరుగుతున్న పని పరిశుద్ధాత్మ జాడ కనిపించదు — కానీ ప్రభావం మాత్రం ఉంటుంది నిజమైన విశ్వాసి నడకను బాహ్యంగా అంత సులభంగా గుర్తించలేం.
ఆంతర్య పురుషుడు (ఆత్మ సంబంధ జీవితం) కేవలం కొంతమంది మాత్రమే గమనించదగినది
ఆంతర్య పురుషుడు – కనిపించని ఆత్మ సంబంధమైన జీవితము లోపల మారిన మనిషి. దీని ఫలితాలు బయటకు కొంతమంది గమనించగలిగినా, అంతా కాదు.
రక్షించబడిన విశ్వాసులలో వారిని నడిపించే శక్తి పరిశుద్ధాత్మ.
రోమీయులకు 8:14
దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
పరిశుద్ధాత్మ దేవుడు బాహ్య పురుషుడు కాదు (అందరికీ కనిపించే దేహ జీవితంలా)
పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో నివసించే ఒక ఆంతర్య పురుషుడు కొంతమంది మాత్రమే గుర్తించగలిగే ఆత్మ జీవితం ఆత్మ సంబంధమైన జాడ
దీని జాడ ఎవ్వరికీ కనపడదు
ఇది మన జీవితం, ప్రవర్తన, మరియు మార్పు ద్వారా ఇతరులకు బాహ్యంగా తెలుస్తుంది.మనుష్యుని లోనికి వచ్చిన పరిశుద్ధాత్మ వలన కలిగే అంతర్గత మార్పులను ఆత్మఫలములు ఆని అంటారు.
(గలతియులకు 5:22)
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.ఇవి హృదయంలో యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన వారికి కలిగే దేవుని సహజ ఫలితాలు. ఇవి స్వతహాగా మనకు కనిపించవు, కానీ జీవితం మీద స్పష్టమైన ప్రభావం చూపుతాయి — సముద్రంలో ఓడలా, గాలిలో గాలి శబ్దంలా.
ఉప్పుతో కూడిన సముద్రములో ప్రయాణించే ఓడ జాడ మనకు ఎలా కనపడదో అలానే
పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిని నడిపిస్తున్నా, ఆ జాడ అది బాహ్యంగా కనిపించకపోయిన దాని ప్రభావమును బట్టి పరిశుద్ధాత్మ దేవుని జాడను మనము అ వ్యక్తిలో గుర్తించగలము.
మన జీవితం "లోకమునకు ఉప్పు" వలె ప్రభావవంతంగా ఉండాలి (మత్తయి 5:13) ఎందుకంటే అంతర్గత పరిశుద్ధత బయటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి.
ఓడ జాడ కనపడనట్లే, ఆత్మానుసారమైన నడకకు బాహ్య జాడ ఉండకపోవచ్చు, కానీ ప్రభావం మాత్రం ఉండి తీరుతుంది (సామెతలు 30:19).
ఆత్మ ద్వారా నడిపించబడే జీవితం లోకానికి విభిన్నం — గాలి ఎలా కనిపించదో, కానీ దాని శబ్దం వినిపిస్తుందో అలాగే (యోహాను 3:8).

ఎస్తేర్ క్రైసోలైట్
2-6-2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25