CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

దేవుని పిలుపులో ప్రత్యేకతలు – నీ స్థానాన్ని గుర్తించు

సంఖ్యాకాండము 12:2

వారు మోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా,

మోషే వివాహం చేసుకున్న స్త్రీ ని బట్టి మిర్యాము, అహరోనులు మాట్లాడుకున్న విషయం ఇది,

మోషే అహరోను మిర్యాము వీరి పరిచర్యలు వేరు వేరే రీతులలో ఉన్నప్పటికీ వీరు సమాజంగా కలసి కట్టుగా ఇశ్రాయేలీయులను కనాను వైపుకు నడిపించారు.

ఒక పనిని మనకు ఎవరైనా అప్పగిస్తే ఆ పని విషయంలో తగిన సూచనలను తీసుకోవడానికి మనకు ఆ బాధ్యతను ఇచ్చిన వారితో మనము ముఖాముఖిగా మాట్లాడాలి ఇలా మాట్లాడే సౌలభ్యం ఉండటం ద్వారా ఆ పనిని మనము విజయవంతంగా ముగించగలుగుతాము.

మోషే ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యతను కలిగిన దేవుని చేత ఏర్పరచబడిన ఒక నాయకుడు ఇటువంటి బాధ్యతను కలిగిన వ్యక్తి దేవునితో ముఖాముఖిగా మాట్లాడాల్సిన అవసరత ఎంతైనా ఉంది అందుకనే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినాడు.

మీర్యాము అహరోనులతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు కనబడదు ఎందుకంటే వీరికి ఇచ్చిన పరిచర్య మోషేకు ఇచ్చిన పరిచర్య లాంటిది కాదు

మనము చేసే పరిచర్యలను బట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతలను బట్టి మనము దేవునితో చేసే సహవాసము అన్నది ఉంటుందా ! అవును

అవుననే చెప్పాలి.

వారు మోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని మీర్యాము అహరోనులు మాట్లాడటం అన్నది ఇక్కడ వీరు దేవుడు వారి ముగ్గురికి ఇచ్చిన పిలుపుకు కలిగిన ప్రత్యేకతలు ఏమిటో ఆ పరిచర్యల బాధ్యతలు ఏమిటో గమనించనటు వంటి స్థితిలో వీరు మాట్లాడుతూ వచ్చారే కాని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని చేత సాక్ష్యమును పొందిన మోషే కంటే ఎక్కువ సామర్ధ్యము బాధ్యతను కలిగిన వారము మేము అనే భావన కాదు.

పరిశుద్ధ గ్రంథములో దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్లు మరి ఎవరితోనూ మాట్లాడలేదు అవును, ఇది పూర్తిగా నిజమే — పరిశుద్ధ గ్రంథములో దేవుడు మోషేతో మాత్రమే ముఖాముఖిగా మాట్లాడాడు, మరెవరితోనూ ఆ విధంగా మాట్లాడలేదు అని బైబిల్ స్పష్టంగా చెబుతోంది.

1. సంఖ్యాకాండము 12:6-8

వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట లాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడ లేదనెను.

ఇది ఈ వచనము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది మిగతా ప్రవక్తలతో కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కానీ మోషేతో మాత్రం ప్రత్యక్షంగా, ముఖాముఖిగా, మనిషి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతాడు అన్నా విషయమును గురించి,

2. నిర్గమకాండము 33:11

మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను.

3. ద్వితియోపదేశకాండము 34:12

యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. ఇశ్రాయేలులో మోషే లాంటి ప్రవక్త మరొకడు లేడు. అతడు యెహోవాతో ముఖా ముఖిగా పరిచయము గలవాడు.

మోషేనే ఏకైక మనిషి – దేవుడు తన స్వరూపాన్ని చూపించి, ప్రత్యక్షంగా మాట్లాడినవాడు.

బైబిల్లో ఎవరితోనూ ఇలా మాట్లాడినట్టు చెప్పబడలేదు – యిర్మియా, ఏలీయా, దానియేలు, పౌలు, పేతురు వంటి గొప్ప సేవకులతో కూడా, దేవుడు దర్శనాల ద్వారా, దేవదూతల ద్వారా, ఆత్మవలన లేదా వాక్యముల ద్వారా మాట్లాడాడు.

యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా దేవుడు గనుక,శరీర దారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినది వేరే విషయం – కానీ మోషేతో మాట్లాడినది, ఇతర మనుషులతో పోలిస్తే ప్రత్యేకమైనది.

అవును, పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుడు మోషేతో మాత్రమే ముఖాముఖిగా మాట్లాడాడు. మిగతా వారితో కలలు, దర్శనాలు, వచనాలు ద్వారా మాట్లాడాడు.

దేవుడు దీని గురించి వివరణ ఇస్తున్నాడు– ఎవరి పిలుపు ఎలా ఉంటుందో ఆయన చెబుతున్నాడు

సంఖ్యాకాండము 12:6

వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు.ఇది యెహోవా మాట!

మరి మిర్యాము, అహరోనులతో దేవుడు మాట్లాడాడా? ఔను, కొంత మేరకు

మిర్యాము – ప్రవక్తురాలు అని నిర్గమ 15:20 లో ఉంది. మికా 6:4 –మోషే, అహరోను, మిర్యాము – ముగ్గురినీ నియమించాను అని దేవుడే చెప్పాడు.

అంటే వారి పిలుపు కూడా దేవునివద్ద నుండి వచ్చింది. కానీ – అది మోషేతో సమానమైనది కాదు.

దేవుడు ఏ పిలుపునైనా ప్రత్యేకంగా చూసేవాడు.

మవ పిలుపు ఏదైనా కావచ్చు – ప్రార్థన, పరిచర్య, సేవా పని, పాడటం, బోధన సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం…ఇలా రకరకాలుగా ఉండవచ్చు అయితే మనకు కలిగిన పిలుపుని బట్టి దేవుడు మనకు భారాన్ని ఇస్తూ ఉంటాడు అటువంటి సమయాలలో వేరొకరితో వారికి కలిగిన పిలుపుతో మనము మనకు కలిగిన భారము ఎదుటి వారికి కూడా ఉండాలి అని మనము అనుకోకూడదు

ఎదుట వ్యక్తికి ఉన్నటువంటి భారమును మనకు కూడా ఉండాలి ఆ బాధ్యతను మనము కూడా తీసుకోవాలి అన్న నిర్ణయాన్ని మనం తీసుకోకూడదు

ఎవరి పిలుపు వారిదే ఎవరి పరిచర్య వారిదే ఎవరి బాధ్యత వారిదే ఎవరి పని వారిదే ఎవరి భారము వారిదే ఎవరి ప్రత్యేకతలు వారివే.

దేవుడు మనకిచ్చిన బాధ్యతలు పరిచర్యలు దేవుని పిలుపు ఇవి అన్ని ప్రత్యేకంగా ఉన్నప్పటికీని సమాజంగా మనమందరము క్రీస్తు శరీరం అనే సంఘములో పాలి భాగమును కలిగి ఉన్నాము మనము చేసే పరిచర్య మనము తీసుకున్న బాధ్యత ఇది మనది కాదు దేవునిది మనము దేవుని జత పనివారము.

మనం ఒకే సంఘాముగా, ఒకే సమాజముగా కలిసి ప్రయాణిస్తున్నా, ప్రతి ఒక్కరికీ దేవుడు ప్రత్యేకమైన బాధ్యతను,ప్రత్యేకమైన స్థితిని, ప్రత్యేక సమయాన్ని నియమిస్తున్నాడు.

అధికారం అనేది దేవుడిచ్చిన పరిచర్యల విధుల ప్రకారం దేవుడు ఏర్పరచే ఒక ఏర్పాటు మనము చేసే పరిచర్యలను బట్టి మనము చేపట్టిన బాధ్యతలను బట్టి మనము కలిగి ఉన్న అవసరతలను బట్టి మనకు వున్న అధికారం ఏ స్థాయి అన్నది నిర్ణయించబడుతుంది.

ఇక్కడ మిర్యాము మోషేను విమర్శించటము అన్నది కాదు కాని – ఇశ్రాయేలీయుల సమాజమును నడిపించే నాయకుడుగా మోషేను ఎన్నుకున్న దేవుని నిర్ణయాన్ని తక్కువ చేయడము, మాత్రమే కాకుండా మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొనటానికి మోషే తీసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం వలన ఇవి మిర్యాముకు శిక్షను తెచ్చిపెట్టాయి.

ప్రతి వ్యక్తి దేవునిచేత ప్రత్యేకంగా పిలవబడ్డాడు. దేవుని పిలుపులో ఉన్న ప్రత్యేకతను తెలుసుకోవడం, ఆయన మనకు ఇచ్చిన స్థానంలో నమ్మకంగా, విశ్వాసంగా నిలబడటం ఎంతో ముఖ్యం. ఇతరుల బాధ్యతలతో, పరిచర్యలతో మన దైన పిలుపును పోల్చడం సరికాదు ఎన్నిక విషయంలో దేవుని నిర్ణయాలను గౌరవించి, మనకు అప్పగించిన పనిలో విశ్వాసంగా నిలబడుదాం.కొనసాగుదాం !

1. దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఏమిటి?

2. నా పిలుపును నేను ఎంతవరకు గుర్తించాను?

3. నా పరిచర్యను ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నానా?

4. దేవుడు నన్ను పెట్టిన స్థానంలో విశ్వాసంగా ఉన్నానా?

5. నా హృదయంలో ఎవ్వరినైనా విమర్శించే భావన ఉందా?

ఈ క్రింది ఐదు అంశాలు మీలో లేకపోతే — ఇప్పుడు దేవునితో హృదయాన్ని తెరిచి మాట్లాడండి:

ప్రభువా, నీవు నన్ను పిలిచిన పిలుపును నేను స్పష్టంగా తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి

నా హృదయంలో ఉన్న అసూయను, విమర్శలను తొలగించు. నీవు నన్ను పెట్టిన స్థానంలో విశ్వాసంతో నిలబడేందుకు శక్తినివ్వు. నా పరిచర్య ద్వారా నీ మహిమను వెదజల్లడానికి సహాయం చేయండి

నిన్ను ప్రతి దినమూ ప్రార్థించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

14-4-2025