2025 Messages
గాడిద నేర్పిన హద్దు - శ్రమలో ప్రార్థనే మనకు శరణ్యం
మత్తయి 21:7
ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
శాపగ్రస్తులైన మానవుల శాపములను తనమీద వేసుకుని, శాపగ్రస్తుడిగా క్రీస్తు ప్రభువు సిలువలో మరణించారు. తిరిగి లేచె ముందు ఇది జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన.
ఒక మానవుడు ఇంకొక మానవుని ఆత్మను రక్షించలేడు ఆ ఆత్మకు విమోచనను ఇవ్వలేడు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేడు అందుకనే క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించబడి మానవుని లో నీతిని గురించి పాపమును గురించి ఒప్పింప జేసె జయింపజేసే తన ఆత్మను ఉంచి పరిశుద్ధ మైన తన ఆత్మ అధికారంలో వారు జీవించాలని తాను మరణించి తిరిగి లేచి తనను విశ్వసించిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో ముద్రించుకున్నారు.
క్రీస్తుప్రభువు ఎక్కిన గాడిద, ఒక సాధారణ జంతువు మాత్రమే కాదు. అది హద్దులను తెలిసిన జీవి.
క్రీస్తు ప్రభువు గాడిద మీదకి ఎక్కి తన సిలువ యాత్రను ప్రారంభించినప్పుడు ఈ యాత్ర పొడుగునా హోసన్న జయము అనే కేకలు వినబడినవి.
హోసన్న అన్న పదము హీబ్రూ భాష మూలం నుండి వచ్చినది హోసన్న అన్న పదమునకు అర్థం దయచేసి మమ్ములను రక్షించు అనే అర్థాన్ని కలిగి ఉంది.
హోసన్న అన్న పదము * దయచేసి రక్షించు * అనే ప్రార్థనగా ప్రారంభమై తరువాత * రక్షణ కలిగించువాడు వచ్చాడు! *
* రక్షణ మనకొచ్చింది! * అనే ఆనందోత్సాహం, ఆరాధన పదంగా మారింది.
హోసన్న జయము ప్రభువునకు!
అంటే — ప్రభువు రక్షించాడు, ఆయనలోనే మా గెలుపు ఉంది.
హోసన్న జయము – మరణంపై గెలుపు సాధించాడు!
హోసన్న జయము - మన పాపాలపై గెలుపు, శత్రువులపై గెలుపు, రాక్షస బలాలపై రాక్షసత్వంపై గెలుపు — అంతా యేసులోనే సాధ్యమవుతుందనే నమ్మకం.
క్రీస్తు ప్రభువు గాడిద మీదికి ఎక్కి ప్రయాణిస్తున్నప్పుడు హోసన్న జయము అన్న కేకలు ఎలా వినపడినాయో క్రీస్తు యేసు ప్రభువు వారి పరిశుద్ధాత్మ ఆయన పునరుత్థానపు ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనము కూడా దేవుని స్తుతించేవారముగా దేవుని ప్రార్థించే వారముగా మనము ఉండాలి అన్న అవసరతను ఇది మనకు తెలియజేస్తుంది.
రక్షించేవాడు రక్షణను తీసుకొని వచ్చేవాడు ఎక్కిన ఈ గాడిదకు ఉండే లక్షణాలలో ఒక లక్షణము.
1. హద్దుల్ని తెలిసిన జంతువు
అంటే గాడిదకు తన హద్దులు ఏమిటో దేవుడు తనకు నియమించిన ఆజ్ఞలు ఏమిటో తెలిసి ఉన్న జంతువు దీనిలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏమిటి అని అంటే గాడిద అన్నది హద్దులు దాటి నడవదు. ఇది చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి ఆగిపోతుంది.
బిలాము గాడిద (సంఖ్యాకాండము 22) , అది దేవుని దూతను చూసి అటు వెళితే ఆ మార్గముకుండా నడిస్తే తన జీవితానికి ప్రమాదము వస్తుందని గుర్తించి నిలిచిపోయింది — బిలాము ఎంత కొట్టిన అది మార్గంలో నుంచి తొలగిపోతూ వచ్చింది.
సంఖ్యాకాండము 22:23
యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను.
యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని ఉండటాన్ని ఈ బిలాము గాడిద చూసి ఈ మార్గము గుండా నేను వెళ్ళకూడదు ఈ మార్గము దేవుని ఉద్దేశంలో ఉన్న మార్గం కాదు అని తను వెంటనే గ్రహించింది కానీ బిలామునకు మాత్రము అది అర్థం కాలేదు.
సంఖ్యాకాండము 22:12 లో దేవుడు ముందుగానే బిలాముకు ఇలా తెలియజేశాడు
అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.
ఆదాము నుంచి బిలాము వరకు దేవుని ఆజ్ఞలను పాటించని వారుగా వారి హద్దులను అతిక్రమించే వారు గానే ఉంటూ వచ్చారు అందుకే దేవుడు తన హద్దులను గుర్తించి వాటి ప్రకారము జీవించే జంతువైన గాడిద మీద తన సిలువ యాత్రను ప్రారంభించాడు.
ఇది మనకు చెప్పే బోధ ఏమిటంటే:
మనము కూడా గాడిద వలె ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను గౌరవిస్తూ, మన హద్దులను గుర్తించి జీవించాలి. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రార్థనతో ముందుకు సాగాలి.
హోసన్న విజయం అనే స్తుతితో, క్రీస్తు ప్రభువు పునరుత్థాన శక్తిలో ప్రార్థనచేస్తూ ముందుకు కోనసాగుతున్నారా !
యాకోబు 5:13
మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను;
శ్రమ అనగా బాధ, వేదన, ఒత్తిడి, ఆందోళన – ఇవన్నీ వచ్చినప్పుడు మన ముందున్న మొదటి చర్య
మనము చేయవలసినది ప్రార్ధన
శ్రమ బాధ వేదన ఒత్తిడి ఆందోళన భయము గోలిపే పరిస్థితులు ఇటువంటివి మన ముందుకు వస్తున్నాయి అని అంటే దేవుడు మనలో ప్రార్థన భారాన్ని ఉంచడానికే అన్న విషయాన్ని చాలా చాలా త్వరగా మనము గుర్తించాలి.
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.(యోహాను 14:14) అన్న దేవుని వాక్యమును దేవుని వాగ్దానమును మీరు నమ్మగలరా !
ఎస్తేర్ క్రైసోలైట్
13-4-2025