2025 Messages
యేసు పునరుత్థానం – పరిశుద్ధాత్మతో కూడిన విజయ మార్గము
పరిశుద్ధాత్మ మనకు ఏల! విజయాన్ని ఇస్తుంది.
గుడ్ ఫ్రైడే అంటే మన శరీర సంబంధమైన పాప శాపలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి శరీరము ద్వార సిలువలో మరణమునకు అప్పగిస్తున్నము.
ఈస్టర్ అంటే పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభువు వారి మరణ భూస్థాపన ద్వార మనము శరీర సంభందమైన స్వభావమును వదిలి ఆత్మసంబంధంగా ఆత్మసంబంధమైన ప్రజలముగా తిరిగి సజీవులముగా క్రీస్తు పునరుత్థానము ద్వార లేపబడుతున్నాము బాప్తీస్మం యొక్క అర్థమీదే !
క్రీస్తు యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని మనలను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చారని ఆయన యందు విశ్వాసముంచి బాప్తీస్మందు సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని క్రీస్తు యేసుప్రభు వారు
తన పునరుత్థానం ద్వార పరలోక రాజ్యంలో వారికి స్థానం యిచ్చారు.
ఎఫెసీయులకు 2:6,7
క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.
తనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి మరణం మీద విజయాన్ని ఇచ్చారు విమోచనను ఇచ్చారు పాపశాపగ్రస్తమైన శరీరం నుండి విముక్తిని యిచ్చారు.
క్రీస్తు యేసు ప్రభువు వారిలో మనము ఉండటం ద్వారా మనము విశ్వసించటం ద్వారా ఈ విజయం మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది.
క్రీస్తు యేసు ప్రభువు వారిలో మనము ఎలా ఉండగలుగుతున్నాము ? మనము ఎలా దేవుని బిడ్డలం గా అయ్యాము? క్రీస్తు యేసు ప్రభు వారిని తిరిగి లేపిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆత్మతో మనలను ముద్రించుకోబట్టి మనము దేవుని ప్రజలముగా పరిశుద్ధ ప్రజలముగా మనము చేయబడ్డాము ఈ పరిశుద్ధాత్మ మనలను నీతిని గురించి పాపమును గురించి ఒప్పింప చేస్తుంది మన మార్గము గూర్చి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధాత్మను మనము పొందకుండా మేము దేవుని బిడ్డలము అని మనము మన గురించి చెప్పలేము ఇది అసంభవం !
రోమీయులకు 3:10
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,
నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఆ నీతిమంతుడు ఒక్క యేసు క్రీస్తు ప్రభువు వారే !
ఈ వాక్యము ఆధారం చేసుకుని మనము నీతిమంతులు కాదు అని మనము శోధనకు లొంగిపోవచ్చా ! పాపము చేయవచ్చా ! అని అంటే
పరిశుద్ధ గ్రంథము దీనికి ఒప్పుకోదు ఎందుకంటే పాపము చేసే ప్రతి వాని గురించి బైబిల్ ఇలా చెబుతుంది.
1యోహాను 3:9-10
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
పరిశుద్ధాత్మ ఎవరిలోనికి ఆయితే వస్తుందో పరిశుద్ధాత్మ చేత ఎవరైతే ముద్రించబడతారో ఇక అంతకు ముందు అంటే పరిశుద్ధాత్మ వారిలోకి రాకముందు పరిశుద్ధాత్మతో వారు ముద్రించ బడకముందు వారు జీవించే అటువంటి జీవితము అటువంటి ప్రవర్తనతో ఇక వారు జీవించలేరు ఆది మొత్తం మారిపోతుంది.
త్రాగుబోతులకు మధ్యము త్రాగాలని అనిపించదు దొంగతనము జారత్వము వ్యభిచారము లాంటి శరీరానికి సమాజానికి నష్టాన్ని కలిగించే ఎటువంటి హానికరమైన అలవాట్లు ఉన్న వారు పూర్తిగా మార్చబడతారు.
నూతనమైన జీవితమును నూతన ప్రవర్తన అన్నది వారిలో కనబడుతుంది దేవునికి ఇష్టం లేని దేవుని వాక్యానికి విరోధమైన క్రియలన్ని కూడా ఇక వారిలో కనపడవు.
పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఏమి ఆశిస్తూ ఉంటాడు ఆని అంటే అన్ని విషయాలలో నేను పరిశుద్ధంగా ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలి అన్నటువంటి ఆశను తనలో గాఢంగా కలిగి ఉంటాడు ఇది పరిశుద్ధాత్మ ఎవరిలోకి అయిన వచ్చినప్పుడు వారిలో జరిగించే మార్పు,
పరిశుద్ధాత్మను పొందిన వాళ్లు మాత్రమే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది అన్న విషయాన్ని గ్రహిస్తారు దానిని పొందని వారు ఎవరైనా సరే వారు ఈ సత్యాన్ని గ్రహించలేరు కాబట్టే దేవుని ప్రజలను త్రాగుబోతులుగా దేవునికి విరుద్ధమైన శరీర సంబంధమైన క్రియలను కలిగిన వారుగా చిత్రీకరిస్తూ ఉంటారు వీరు పరిశుద్ధాత్మ లేని శరీర సంబంధులు.
పరిశుద్ధాత్మకు వేరుగా ఉండి మనము విజయమును పొందగలమా ! ఎప్పటికీ పొందలేము.
క్రీస్తు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను లోకమును జయించాడు శరీరమును జయించాడు సాతానుని జయించాడు ఆఖరికి మరణమును కూడా జయించి విజయశాలిగా తిరిగి లేచి మనకు అంటే తనను విశ్వసించిన ప్రజలందరికీ ప్రధముడిగా నిలబడి మనమందరము ఆయన మార్గంలో పరిశుద్ధంగా నడవాలని అయిన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి వాడై ఉన్నాడో మనము కూడా అన్ని విషయాలలో అలానే ఉండాలని మనకు మాదిరిని చూపించాడు.
క్రీస్తు యేసు ప్రభు వారి పునరుత్థాన విజయానికి కారణమైన పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో కూడా ఉంది మనము ఈ లోకంలోనే ఉన్నాము.
మనము ఈ శరీరమును విడిచినప్పుడు మహిమ శరీరమును ధరిస్తామన్న విశ్వాసము నమ్మిక మనకు ఎలా కలుగుతుంది క్రీస్తు యేసు ప్రభువు వారు పునరుత్థానం ద్వారా కదా !
క్రీస్తు యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు లోకమును శరీరమును సాతాను అంతిమంగా మరణాన్ని జయించారు.
దానికి ముందు క్రీస్తు యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైతే దేనినైతే శరీరమును లోకమును సాతానును ( శరీరాశ నేత్రాశ జీవపు డంభము ) తాను జయిస్తూ వచ్చారో ఆ ప్రతి దానిని కూడా మనము జయించాలి
జయించ గలుగుతాము కూడా ఇది మన శక్తి ద్వారా కాదు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా,
నీతిమంతులముగా పాపము లేని శాపము లేని నిత్యజీవమును పొందిన పునరుత్థానుడైన క్రీస్తు యేసు ప్రభు వారిలో పరలోకంలో కూర్చుండ బెట్టబడిన సజీవులముగా మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రతి దానిని జయించే శక్తి ఉంది.
క్రీస్తు యేసు ప్రభు వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా లోకమును సాతాను శరీరమును మరణమును జయించాలి !
జయించిన పునరుత్థాన దేవుని ప్రజలుగా మనము దేవుని రాజ్యంలో ఉండాలనే కదా !
తాను జయించిన ఆత్మను పరిశుద్ధాత్మను మనలో వుంచి పరిశుద్ధాత్మ చేత దేవుడు మనలను నడిపిస్తున్నరు.
దేవుని ఆత్మను పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో వారు కచ్చితంగా జయిస్తారు
నీతిమంతుడు ఎవరూ లేరు ఆ నీతిమంతుడు యేసు క్రీస్తు ప్రభువు వారే ఇది నిజమే ! కానీ ఆ క్రీస్తు యేసు ప్రభు వారి ఆత్మను అన్నిటిని జయించిన ఆ పరిశుద్ధాత్మను పొందిన ప్రజలు కూడా నీతిమంతులుగా అన్నిటిని జయిస్తారు జయించే శక్తిని పరిశుద్ధాత్మ ద్వార దేవుడు వారిలో ఉంచాడు
ఈ లోకంలో వున్నా అందరి ప్రజల కంటే క్రీస్తు ప్రభువు వారిని విశ్వసించిన ప్రజల భాగ్యము ఏమిటి? అని అంటే ఇదే !
పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మాత్రమే మనతో ఉంటాడా మిగతా సమయంలో మనతో ఉండడా! కాదు ఎప్పుడు మనతోనే ఉంటాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ముద్రించబడిన వ్యక్తి ప్రవర్తన అనేది తనను ప్రజలు చూస్తున్నప్పుడు గానీ చూడనప్పుడు గాని ఎప్పుడు ఒకే రీతిగా తన ప్రవర్తన ఉంటుంది.
గుడ్ ఫ్రైడే ఈస్టర్ వీటి యొక్కఅర్థము మీకు తెలుసా?
క్రీస్తు యేసు ప్రభువు వారి మరణ భూస్థాపన పునరుత్థానాల యొక్క అర్థాన్ని మీరు గ్రహించారా ! పునరుత్థాన శక్తిని మీ జీవితంలో అనుభవిస్తున్నారా !
ఎస్తేర్ క్రైసోలైట్
14-4-2025