CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

సువార్త ఆజ్ఞ కాదు హృదయాన్ని మార్చే సత్యం

దేవుడు చేసిన ఈ సృష్టి యావత్తు కూడా ఆదిలోనే ఆదాము అజ్ఞాతి క్రమం ద్వార జీవములో నుంచి నాశననకు మార్చబడినది. దేవుడు మానవుని ముందు జీవమును మరియు నాశనమును ఉంచి, జీవమును ఎంచుకోమని ఆహ్వానించడు.

ద్వితియోపదేశకాండము 30:19

నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.

ఈ వాక్యంలో ప్రాముఖ్యాముగా మనకు కనిపిస్తున్నది ఏమిటంటే,

జీవము మరియు మరణము మన ముందే దేవుని ద్వారా ఉంచబడినవి. మన ఎంపికే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. దేవుని హృదయం మాత్రం స్పష్టంగా సూచించిందే “జీవమును ఎంచుకొనుము” ఆదిలో ఏదేను తోటలో కూడా జరిగింది, దేవుడు చెప్పింది ఇదే,అప్పుడే కాదు ఇప్పటికి కూడా మానవుని హృదయం సర్వసాధారణంగా జీవాన్ని కోరుకోదు, నాశనకరమైన, మరణకరమైన,వ్యర్ధమైన వాటి వైపే మానవుని మనసు మొగ్గు చూపుతుంది.

ఈ సృష్టిని చేసిన జీవం కలిగిన జీవింపచేసే దేవుని వైపు తమ మనసులను తిప్పకుండా,దేవుడు చేసిన ఈ సృష్టి వైపు మానవుడు తమ మనసును తిప్పుతూ దాని వైపే తన నమ్మకాన్ని ఉంచుతూ,ఈ సృష్టిలోనే జీవాన్ని మానవుడు వెతుకుతూ ఉన్నాడు.

రక్షణ పొందండి అని మనము ప్రజలకు ఆజ్ఞాపించకూడదు, రక్షణ పొందడం వలన మానవుని ఆత్మకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో వారికి మనము తెలియజేయాలి,"అంతరంగ మార్పే నిజమైన సువార్తకు మూలం."

యేసుక్రీస్తుప్రభువారిని విశ్వసించటం వలన కలిగే ప్రాముఖ్యతను, మనము ఇతరులకు తెలియజేయాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించండి, అని మనము ఎవరిని బలవంతం చేయకూడదు.

రక్షించబడుట, యేసు యందు విశ్వాసం ఉంచుట, అనే ఈ విషయాలు అంతరంగంలో నుంచి, జన్మించాలి, రావాలి, పుట్టాలి, కానీ బాహ్యంగా ఒకరు చెప్పినదాన్ని బట్టి అవలంబించే విషయాలు ఇవి కావు.

యేసుక్రీస్తుప్రభు వారిని విశ్వసించటం, క్రీస్తు రక్తము ద్వారా మానవుని ఆత్మ పరిశుద్ధ పరచబడటం, అనేది ఇది ఆత్మకు సంబంధించిన విషయం,

"ఆత్మ పరిశుద్ధ పరచ బడిన వ్యక్తి ఆలోచనలు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే రీతిలో ఉంటాయి."

"అప్పటివరకు శరీర అలంకరణ కొరకు శరీర కోరికల కొరకు తాపత్రయపడిన ఆ వ్యక్తి హృదయం పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు శరీర సంబంధమైన అలంకరణ శరీర సంబంధమైన కోరికలు అన్నీ కూడా అపవిత్రమైనవిగా అసహ్యమైనవిగా అతని ఆత్మకు అనిపిస్తాయి."

“ఈ పరిశుద్ధమైన అర్ధాన్ని ఈ ప్రత్యేకతను శరీర సంబంధమైన మనస్సు గ్రహించలేదు; అది ఆత్మకి సంబంధించిన వెలుగు, ఆత్మతో నడిచే వారు మాత్రమే దీనిని గ్రహించగలరు, ఆస్వాదించగలరు.”

1కోరింథీయులకు 2:14

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని మానవుని అవసరత కొరకే,దేవుడు సృజించాడు,దీనిని మన అవసరత కొరకు ఉపయోగించుకోవటం,తప్పు కాదు,

1తిమోతికి 2:9-10

మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో నైనను అలంకరించుకొనక,

దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.

ఈ వాక్యమును ఆధారం చేసుకుని ఇటువంటి అలంకారమును కలిగిన స్త్రీలకు భక్తి లేదు, విశ్వాసం లేదు అనే భావం వచ్చేటట్లు సందేశాలు ఇస్తూ ఉండటం వలన ఇలా చెప్పే వారి పట్ల ఒక వ్యతిరేక త పెరుగుతుంది."పౌలు ఇక్కడ స్త్రీలకు చెబుతున్నది, బయట బాహ్యాపు అలంకారంలోనే అందం కాదు, ప్రధానంగా దెవభక్తి, సత్కార్యములు, లోపల ఉన్న వినయంతో కూడిన హృదయం అన్నిటి కంటే ప్రాముఖ్యము అని". జడలు, బంగారు నగలు లేదా విలువైన బట్టలు మానేయమని కాదు, అవి వాటి ప్రాముఖ్యం కంటే లోపలి మనసు అందమైనది కావాలి అని పౌలు హితబోధ యిది.

నేను రక్షింపబడక ముందు అలంకరించు కోవటం,నన్ను నేను అందంగా తయారు చేసుకోవడం, అన్న విషయమే నా హృదయంలో ప్రథమ స్థానముగా ఉండేది.ఎవరైనా నన్ను ఈ విషయంలో ఏమైనా అంటే నాకు చాలా బాధ కలిగేది వారి మీద కోపం వచ్చేది.

ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను వింటు వస్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా నా హృదయం దేవునికి దైవ సంబంధమైన విషయాలకు ప్రథమ స్థానము అన్నది ఇవ్వడం ప్రారంభమైనది,

ఇప్పటికీ నాకు చాలా పట్టు చీరలు ఉన్న వాటిని కట్టుకోవడానికి నన్ను నేను వాటితో అలంకరించుకోవడానికి నాకు సమయం ఉండదు.వాటిని ఎప్పుడు కట్టుకోవాలి అని నేను అనుకున్న , ఈ మంచి చీరలన్నీ ఇలానే ఎందుకు ఉంచుతావు కట్టుకోవచ్చు కదా ! అని నాయింట్లో వాళ్లు నన్ను అడిగిన ప్రతిసారి నాకు ఏమని అనిపిస్తుంది అని అంటే ఈ సమయాన్ని దేవుని కార్యాలకు వినియోగించవచ్చు కదా! ఎందుకు వీటిని కట్టుకొవాటంలో నా సమయాన్ని వ్యర్థపరచాలి అని నాకు అనిపిస్తు వుంటుంది,అంటే నా హృదయం దేవునికి ప్రథమ స్థానం ఇస్తుంది.

దేవుడు,దేవుని వాక్యం ఆజ్ఞగా ఇతరుల ద్వారా నాకు తెలియ పరచ బడినప్పుడు నాకు బాధ కలిగేది వారి మీద నాకు కోపం వచ్చేది, కానీ అదే వాక్యం "సత్యంగా"నా హృదయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఈ సువార్త నా హృదయాన్ని తాకింది.

సువార్త అంటే:

మనలను స్వతంత్రులుగా చేసే ఒక సత్యం, శాపగ్రస్తమైన నశించిపోయే ఈ శరీరము, ఈ లోకములో నుండి మనలను ప్రత్యేక పరిచేది. మనము దేనికి ప్రథమ స్థానము ఇవ్వాలి అన్న జ్ఞానాన్ని మనకు కలిగించే ఒక సత్యం,

మనలను స్వతంత్రులనుగా చేసే ఇటువంటి సత్య వాక్యమును,ఇతరులకు మనము ఆజ్ఞగా దానిని తెలియజేయకూడదు,

వాక్యం అనేది మన అంతరంగమును మార్చేది

రోమీయులకు 12:2లో పౌలు ఇలా చెబుతున్నాడు:

రోమీయులకు 12:2

మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

ఇక్కడ "మార్పు పొందుడి" అంటే అంతరంగపు మార్పు. వాక్యం, దేవుని సత్యము, ఒక ఆజ్ఞా ఒక నియమం కాకుండా ఒక సత్యముగా మన మనసులో ప్రవేశిస్తే, అది మనలో సహజమైన మార్పుని తేగలదు.

ఎందుకంటే దేవుని దృష్టి మన మనసును మన హృదయమును ఎక్కువగా ఆకర్షిస్తూంది.

1 సమూయేలు 16:7లో ఇలా వుంది:

1సమూయేలు 16:7

అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను•••••మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు ఎప్పుడూ అంతరంగ సత్యాన్ని కోరతాడు, పైకి కనిపించే దానిని కాదు.

యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మార్పు యొక్క సారాంశం:

యేసు కొండమీద ప్రసంగంలో (మత్తయి 5–7) ధర్మశాస్త్రనికి సంబంధించి కేవలం బాహ్య ఆజ్ఞను పాటించడమే కాకుండా, దాని వెనుక ఉన్న హృదయపూర్వక ఉద్దేశ్యం, మన మనసు ఉంచే దిశను ఆయన చాలా స్పష్టంగా బోధించారు.

మత్తయి 5:8

హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.యేసు సత్యం అందిస్తాడు; ఆ సత్యమే మనలను లోపల నుండి మార్చి, సహజంగానే దెవభక్తి ఫలించేటట్లు చేస్తుంది.

కొన్ని ఉదాహరణలు:

హత్య (మత్తయి 5:21–22) — కేవలం హత్య చేయకపోవడమే కాదు, సహోదరుని పట్ల కోపం, దూషణ కూడా దేవుని దృష్టిలో పాపమే అని యేసు చెప్పారు.

వ్యభిచారం (మత్తయి 5:27–28) — కేవలం వ్యభిచారం చేయకపోవడమే కాదు, హృదయంలో దురాలోచనతో చూడడమే పాపమని బోధించారు.

ప్రతిజ్ఞలు (మత్తయి 5:33–37) — కేవలం ప్రమాణాలు చేయడమే కాదు, ఎప్పుడూ నిజాయితీగా ఉండటమే ముఖ్యమని ఆయన హితవు చెప్పారు.

ప్రతీకారం (మత్తయి 5:38–42) — “కన్నుకు కన్ను” అనే పాత చట్టాన్ని మించి, ద్రోహం చేసినవారికి కూడా దయ చూపించమని బోధించారు.

ప్రేమ (మత్తయి 5:43–48) — కేవలం స్నేహితులను ప్రేమించడమే కాదు, శత్రువులను కూడా ప్రేమించమని బోధించారు.

యేసు బోధించినది ఏమిటంటే దేవుడు బాహ్య క్రియలను మాత్రమే కాదు, మన హృదయ ఉద్దేశ్యాలు, మన దృక్పథం, మన అంతరంగపు స్థితిని కూడా పరిశీలిస్తాడని. అందుకే, చట్టం యొక్క ఆత్మను అనుసరించమని పిలుపునిచ్చారు.

దేవుని వాక్యమను సత్యముగా చెప్పడం ఎందుకు ఫలవంతం?

ఆజ్ఞగా చెబితే ఏమవుతుంది :

దేవుని వాక్యములో ఆజ్ఞగా చెప్పినప్పుడు

అది బాహ్యపరమైన ఒత్తిడిగా మారి, పాపము అనే భావనను లేదా ఆది ఒక ప్రతిఘటనను తీసుకువస్తుంది.

వాక్యమను సత్యముగా చెబితే:

అది హృదయాన్ని వెలిగించే కాంతి అవుతుంది. కీర్తనలు 119:130

నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును , అప్పుడు మార్పు సహజమైనది, స్థిరమైనది అవుతుంది.

దేవుని సువార్త సారాంశం ఏమిటంటే:

యోహాను 8:31-32

కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;

అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా,

దేవుని వాక్యం కేవలం ఒక ఆజ్ఞ ఒక నియమం కాదు,

అది ఒక సత్యం. సత్యం అనేది హృదయానికి చేరినప్పుడు, అది స్వయంగా వెలుగును ఇచ్చి, మార్పుని పుట్టిస్తుంది.

వాక్యం వినిపించేది మనం, దానిని హృదయాలలో విత్తేది దేవుని ఆత్మ 1కోరింథీయులకు 3:7

కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

కాబట్టి

మిగతావారికి మార్పు బలవంతంగా రాదు;

అ సత్యం హృదయానికి చేరినప్పుడు రాదు.అయితే అది మరి ఎప్పుడు వస్తుంది?

"అది ఒక వ్యక్తి తనంతట తానే సత్యమును హత్తుకున్నప్పుడు దానితో నిబంధనను చేసుకున్నప్పుడు జరుగుతుంది"

"ఇదే ఈ ప్రక్రియనే అసలైన సువార్త."

"మన కర్తవ్యం వాక్యమును సత్యముగా బోధించడం చూపించడమే; మిగతా పని దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ చేస్తుంది.ఇది ధర్మ శాస్త్రము కాదు... ఇది జీవితం. ఇది ఆజ్ఞ కాదు... ఇది ఆత్మ. ఇది ఒత్తిడి కాదు... ఇది మార్పు. ఇదే సువార్త."

ఎస్తేర్ క్రైసోలైట్

20-6-2025

🔹 🔹 🔹 🔹 🔹 🔹 🔹 🔹 🔹 🔹

🔹 🔹 🔹 🔹 🔹 🔹 🔹 🔹 🔹