CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

విమర్శకు ప్రతివిమర్శ కాదు – ప్రార్థనతో స్పందించిన మోషే

సంఖ్యాకాండము 12:1

మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.

మోషే భార్య సిప్పోరా అని మనకు తెలుసు ఈమె మిద్యానీయులకు చెందిన వ్యక్తి ఈ మిద్యానియులు అబ్రహాము కేతురాకు జన్మించిన వాళ్లు వీరు పూర్తిగా అన్యజనులు కాదు కానీ దేవుని వాగ్దానం లేని ప్రజలు అని వీరిని గురించి మనం చెప్పవచ్చు

సిస్పోరా అన్వజాతీయు రాలే అయినప్పటికీ తన కుమారునికి సున్నతిని చేసి దేవుని నిబంధనకు విధేయురాలు అయింది

నిర్గమకాండము 4:26

అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.

సిప్పోరా దేవుని నిబంధనను పాటించిన వ్యక్తి కాబట్టి ఇమెను బట్టి మిర్యాము సనగ వలసిన అవసరం లేదు

మీధ్యానియులు వంశమును బట్టి వీరు ప్రత్యేకతను కలిగి ఉంటే కూషీయులు అనేవారు భౌగోళికంగా ప్రత్యేకతను కలిగి ఉన్నారు అంటే మోషే సిస్పోరాను

మాత్రమే కాకుండా కూషుదేశపు స్త్రీ అనే వేరోక స్త్రీని కూడ మరల వివాహం చేసుకున్నాడా ? మీర్యాము ఆహారోను సనిగింది ఎవరిని గురించి ?

ఈ విషయమును గురించి పరిశుద్ధ గ్రంథములో మనకు స్పష్టమైన సమాచారం లేదు

మిర్యాము అహరోనులు మోషేకు విరోధముగా మాటలాడి నప్పుడు మోషే వారికి విరోధముగా బదిలేమీ చెప్పలేదు మోషే భూమి మీద ఉన్న ప్రజలందరి అంటే సాత్వికుడనీ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు.

సాత్వికుడు అంటే ?

1. తనపై వచ్చిన విమర్శలకు ప్రతివిమర్శ చేయని శాంత హృదయుడు, తన గురించి తానేమీ చెప్పుకోని స్వభావం ఇక్కడ మోషేలో మనకు కనబడుతుంది మిర్యాము అహరోను విమర్శ చేసినప్పుడు మోషే ఏమి స్పందించలేదు. ఆయన మనుషుల ముందూ, దేవుని ముందూ తనకు వచ్చిన అపకీర్తిని బట్టి అన్యాయమును బట్టి తానే గట్టిగా వాదించుకోలేదు సమర్థించుకోలేదు. ఆయన నిశ్శబ్దంగా ఉండి దేవుడే తనకు న్యాయమూర్తిగా ఉండనిచ్చాడు.

ఈ లోకంలో మన మీద ఎవరు ఎన్ని నిందలు విమర్శలు చేసిన కీడునకు ప్రతికిడు చేయకుండా మోషే వలే మన మున్నప్పుడు మన వాజ్యములను దేవునికి అప్పగించి నప్పుడు దేవుడు మోషే పక్షాన వాజ్యమాడినట్లు మన పక్షాన నిలబడతాడు

మోషేల సాత్వికము చూపించే ప్రతి ఒక్కరికి దేవుడు చేసే మేలు ఇదే,

2. తాను నిందింపబడ్డా ఇతరులకు మేలే కోరే మృదు స్వభావమును కలిగిన వ్యక్తి తనను విమర్శించిన తనను నిందించిన వారి కోరకు ప్రార్థించే హృదయం ఇక్కడ మోషేలో మనకు కనపడుతుంది. మోషే చేసిన పని శక్తివంతమైనది! తన మీద విమర్శలు చేసిన మిర్యాము, అహరోను లకు ఆయన ఒక్క మాట కూడా ప్రతిగా బదులియ్యాలేదు. దేవుడు తానే న్యాయమూర్తి అని తెలిసిన మోషే… విమర్శకు ప్రతివిమర్శ చేయలేదు,

కానీ ప్రార్థన చేశాడు!

సంఖ్యాకాండము 12:13

దేవా, దయచేసి ఈమెను బాగుచేయుమని మోషే యెహోవాకు మొఱ పెట్టెను.

మిర్యాము కోపముతో మాట్లాడిన తరువాత, దేవుడు ఆమెను శిక్షించినప్పుడు

మోషే దేవున్ని ప్రార్థించాడు: సంఖ్యాకాండము 12:13

​మోషే యెలుగెత్తిదేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱ పెట్టెను.

3. దేవుని ఎదుట వినయముగా ఉండే వాడు.

మోషే దేవుడు తనకిచ్చిన స్థానమును బట్టి గర్వం లేకుండా సేవను చేశాడు మోషేకు గొప్ప భవిష్యత్తు వాగ్దానం ఉన్నా, అతడు దేవుని ముందు భయంతో, తగ్గింపు స్వభావంతో నడిచాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నా మోషే తనను ఎప్పుడూ గర్వంగా చూపించుకోలేదు.

4. తన తప్పులను ఒప్పుకునే మనసు

సంఖ్యా కాండం 20 వ అధ్యాయంలో నీళ్ల విషయంలో ప్రజలను ద్రోహులారా అని పలికి మోషే తప్పు చేసినప్పుడు,

ఇది తప్పు చేసినప్పుడే ఒప్పుకోగల స్వభావాన్ని చూపిస్తుంది.

ఇక్కడ మోషే తన తప్పును తేలికగా తీసుకోలేదు, మరియు క్షమించమని దేవుని వేడుకున్నట్టుగా కనిపించే సందర్భం ఉంది. అయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో అతడు తప్పు చేసినప్పుడు, అక్కడే వెంటనే మోషే క్షమించమని అడిగినట్లు స్పష్టంగా రాసి లేదు. కానీ, ఆ తర్వాత మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించిన సందర్భం ఉంటుంది — అది ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో ఉంది.

మోషే చేసిన ప్రార్థన – క్షమించమని అడిగిన సందర్భం

ద్వితియోపదేశకాండము 3:25

​​నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా

ద్వితియోపదేశకాండము 3:26

యెహోవా మిమ్మును బట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెనుచాలును ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.

ద్వితియోపదేశకాండము 3:27

నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.

ఇక్కడ మనం గమనించాల్సింది:

మోషే తనకు ఇవ్వబడిన శిక్ష (కానాను దేశములో ప్రవేశించకపోవడం) గురించి దేవుని దయ కోరాడు.

దేవుడు ఆయన ప్రార్థనను నిరాకరించాడు.

మోషే అక్కడ తన బాధను బయటపెట్టినా, తన తప్పును తేలికగా తీసుకోలేదు;

ఆయన మౌనంగా అనుభవించడానికి సిద్ధమయ్యాడు.

ఇది మోషే యొక్క సాత్వికత, దీనత్వం దైవ నీయా మాలపట్ల నీబద్ధతను చూపిస్తుంది.

మనం విమర్శలు ఎదుర్కొన్నపుడు ఎలా స్పందిస్తున్నాం?

మన పైన తప్పుగా మాట్లాడినవారికోసం మనం ప్రార్థిస్తున్నామా?

మన మీదున్న దేవుని పిలుపును స్వాతికముగా స్వీకరిస్తున్నామా?

ఎస్తేర్ క్రైసోలైట్

12-4-2025