2025 Messages
విజయమును ఇచ్చే నామము
1సమూయేలు 17:45
దావీదు-నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల కధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
దావీదు గోల్యాతును ఎదుర్కొన్నప్పుడు దావీదు దగ్గర ఖడ్గం, కవచం ఏమీ లేవు. కానీ అతనికి ఒకే ఒక్క ఆశ్రయం – యెహోవా నామమును అతడు ప్రకటించాడు,
దేవుని నామము అనేది కేవలం పిలవబడే పేరు కాదు – అది బలమైనది అది అధికారముతో కూడినది అది జీవమును యిచ్చేది ఆ నామములో మనము ప్రార్థించినప్పుడు దేవుడు స్పందిస్తాడు, మన ప్రార్థనకు జవాబులు ఇస్తాడు పరిస్థితులలో మార్పును తెస్తాడు, విజయాన్ని అందిస్తాడు.
కీర్తనలు 20:7 -- 9
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయ పడుదము. వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.
యుద్ధరంగంలో గెలుపు కోసం ఆయుధాలే అవసరమై ఉంటాయనుకునే ఈ సమాజంలో, దావీదు ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతియైన యెహోవా నామమున
నిన్ను ఎదుర్కొంటున్నాను అని దావీదు ధైర్యంగా ప్రకటించాడు ఆ యెహోవా నామము దావీదుకు విజయాన్ని తీసుకొని వచ్చింది.
మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అనేకమైన రకరకాలైనను సమస్యలు మనకు ఎదురు కావచ్చు అది వ్యక్తిగతమైనవి కావచ్చు సమాజపరంగా కూడా కావచ్చు ఆయుధాలు అనేవి అప్పుడు మన దగ్గర ఉండకపోవచ్చు. కాని మన వద్ద ఉన్నది మనకు విజయమును ఇచ్చేది– దేవుని నామము, అది ఒక సాధారణ మైన పేరు కాదు – అది బలముతో కూడిన నామము. అది ఒక ఆశ్రయ స్థలం, ఒక విశ్వాసి ప్రాణానికి జీవనాధారం.
మనకు విజయమిచ్చే శక్తి మన తెలివిలో లేదు,
దేవుడు ఇచ్చే విజయము, ఆయన నామమునందు ఉన్న బలం – అది మనం ఊహించిన పరిష్కార మార్గాల్లో ఉండదు. మనకు కనిపించే మార్గాల్లో కాకుండా, అంచనా వేయలేని దేవుని మార్గంలో ఆది వస్తుంది.
దేవుని నామము తాత్కాలికంగా మన రక్షణకోసం ఉపయోగించుకునే మార్గం కాదు, దేవుని నామము అది ఆయనను నమ్మిన వ్యక్తికి పూర్తిగా ఆధారమైన బలమైన కోట, సామెతలు 18:10
యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
శాశ్వతమైన రక్షణ స్థిరమైన స్థానం నమ్మక మైన ఆధారం ఆ నామమే మనకు ఇస్తుంది.
శాశ్వతముగా గెలుపును యిచ్చే శక్తి
యెహోవా నామములో ఉంది. ఆ నామం లో దేవుని స్వభావం, దేవుని అధికారము, దేవుని విశ్వసనీయత వుంది మనము ఆ నామంలో నిలబడినప్పుడు ఆ నామమును బట్టి ప్రార్ధించినప్పుడు పోరాడినప్పుడు యుద్ధం చేసినప్పుడు మనకు కచ్చితంగా విజయం వస్తుంది.
ఎంత బలమైన శత్రువు ఎదురొచ్చినా, మనవద్ద దేవుని నామము ఉన్నప్పుడు మనం ఓడిపోము.
దావీదు దగ్గర ఖడ్గం లేదు, కవచం లేదు – కానీ అతడి నమ్మకం ఒక్కటే: నేను యెహోవా నామమున నిన్ను ఎదుర్కొంటున్నాను (1 సమూ. 17:45).దావీదు నమ్మిన దావీదు ఆశ్రయించిన ఆ నామమే గోల్యాతును నేలకూల్చింది.ఇశ్రాయేలీలకు విజయాన్ని తెచ్చిపెట్టింది.
మనకూ ఈ రోజు ఎంతోమంది ఎన్నో రకాలైన గోల్యాతులు ఎదురవుతున్నారు – సమస్యల రూపంలో, భయాల రూపంలో, నిరాశల రూపంలో. మన చేతుల్లో ఆయుధాలుండకపోయినా, మన హృదయంలో యెహోవా నామము ఉందంటే చాలు – అదే మనకు విజయాన్ని ఇస్తుంది. కీర్తనలు 44:5
నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.
ఆలోచించండి: మీరు ఈ రోజుమీ జీవితంలో ఏ యుద్ధమును ఎదుర్కొంటున్నారు? మీ బలహీనతలు మీ సమస్యలు ఎంత గొప్పవిగా కనిపిస్తున్నా, మీ నమ్మకము దేవుని నామములో ఉందా? యోహాను 14:13
మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.
మీ విజయానికి ఆధారం – మీ తెలివి కాదు, మీ ప్రణాళికలు కాదు –యెహోవా నామము వాక్యము అను నామము కలిగిన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామము అంత గొప్పది, బలమైనది, ప్రభావవంతమైనది ఈ దేవుని నామము!
ప్రకటన గ్రంథం 19:13
రక్త ములో ముంచబడిన(కొన్ని ప్రాచీన ప్రతులలో-చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
మీరు ఈ నామమునందు ప్రార్థించినపుడు, దేవుడు మిమ్మల్ని ఓడిపోయే వ్యక్తిగా కాక, విజయాన్ని పొందే వ్యక్తిగా మిమ్ములను ఉంచుతాడు.
ఎస్తేర్ క్రైసోలైట్
11-4-2025