2025 Messages
కోకిల గూడు -- పరిమితుల మధ్య -- పరిచర్యలో పరిపూర్ణత
పరిశుద్ధ గ్రంథములో మోషే జన్మ గురించి విశదంగా వివరించబడింది, కానీ అతని అన్నయ్య అహరోను, అక్క మిర్యాము పుట్టుక గురించి ప్రత్యేకంగా జన్మించారు అనే రీతిలో వివరాలు ఇవ్వబడలేదు. అయినప్పటికీ, కొన్ని వచనాలలో వారి వయస్సు, లేదా కుటుంబ నేపథ్యం ద్వారా మనం వారి జన్మను ఊహించుకోవచ్చు.
1. మోషే జన్మ –
నిర్గమకాండము 2:1-10
ఇక్కడ మోషే ఎలా పుట్టాడో, తల్లిదండ్రులు ఎవరో (లేవీ గోత్రానికి చెందినవారని) వివరించబడింది. అతని తల్లి 3 నెలలు రహస్యముగా పెంచి, తర్వాత నీటిలో వదిలి పెట్టిన సంగతి ఉంది. ఫరో కుమార్తె అతన్ని దత్తత తీసుకొని మోషే అనే పేరు పెట్టినట్టు చెప్పబడింది.
2. అహరోను జననం గురించి సూచన
నిర్గమకాండము 7:7
వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.
ఈ వచనం ద్వారా అహరోను మోషే కంటే మూడేళ్ళ పెద్దవాడు అని తెలుస్తుంది. అంటే అహరోను కూడా మోషే పుట్టే ముందు, అదే కుటుంబంలో పుట్టాడు అని మనం గ్రహించవచ్చు. అతని ప్రత్యేక జనన వివరాలు ఎక్కడా వ్రాయబడలేదు.
3. మిర్యాము గురించి,
నిర్గమకాండము 15:20
మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా,
మీర్యాము పేరు మొదటగా నిర్గమకాండము 15:20 లో పేర్కొనబడింది.
మొదటి సందర్భంలో మోషేను నీటిలో ఉంచినప్పుడు ఓ చిన్న పిల్ల తన తమ్ముడుకు ఏమవుతుందో అని గమనిస్తూ నిలబడి ఉన్నట్టు నిర్గమకాండము 2:4 లో ఉంది.
వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఇది మిర్యాము అని అధిక శాతం పండితులు నమ్ముతారు, కానీ అక్కడ ఆమె పేరు ప్రస్తావించలేదు.
పరిశుద్ధ గ్రంథంలో మోషే గురించి విస్తృతంగా వివరాలు ఇవ్వబడ్డాయి, ఎందుకంటే ఆయనకు నాయకత్వపు పాత్ర అప్పగించబడింది. ఆయన దేవుని ప్రజలను ఐగుప్తు నుండి విడుదల చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే, అహరోను, మిర్యాము కూడా దేవుని పిలుపు కలిగి ఉన్న వ్యక్తులే. వారి పరిచర్యలు భిన్నమైనవైనా, అవి దేవుని ఆలోచనలో కీలకమైన భాగాలుగా ఉన్నాయి.
దీని ద్వారా మనకు ఒక విషయం అన్నది స్పష్టమవుతుంది – ప్రతి వ్యక్తికీ దేవుడు ఒక ప్రత్యేకమైన పాత్రను, సమయాను సారముగా ఒక కీలక మైన బాధ్యతను అప్పగిస్తాడు. మన పాత్ర పెద్దదా చిన్నదా అన్నది కాదు, దేవుని ఆలోచనలో అది ముఖ్యమైనదా కాదా ! అనేదే అసలైన విషయం.
వీరు ముగ్గురు ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారైనప్పటికీ వీరు చేసిన పరిచర్య వేరువేరు రీతులుగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులను నడిపించడంలో వీరు సమాజముగా కలిసి ప్రయాణించారు.
కోకిల గూడు కట్టుకోదు, కాకి గూటిలోనే తన గుడ్లు పెడుతుంది అన్న విషయం సహజ జీవజాల లక్షణాలలో ఒక విశిష్టత కలిగిన విషయము ఇది,
ఇది కోకిలకు సహజంగా దేవుడు ఇచ్చిన లక్షణం.
తాను గుడ్లు పెట్టి వాటిని పెంచుకోవడం కాకుండా, ఇతర పక్షుల గూళ్ళలో గుడ్లు పెట్టి, ఆ పక్షులే వాటిని ముద్దుగా పెంచేలా చేయడం.
ఆత్మసంబంధము గా దీనిని మనము చూస్తే ఇది మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలను నేర్పుతుంది:
సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా దేవుడు ఒక ప్రత్యేక లక్షణాన్ని ఇచ్చాడు. మనం మనల్ని ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు ఇచ్చిన విధానం ఇతరుల విధానముల ఉండక పోవచ్చు అయినప్పటికీ అది దేవుని ఆలోచనలో వున్న భాగమే.
కోకిల గూడు కట్టక పోవడమూ అనేది కోకిల సహజ లక్షణము ఇది దేవుడు తనను ఉంచిన స్థితిని తనకు దేవుడు ఏర్పరిచిన స్థితిని ఇది మనకు తెలియ జేస్తుంది.
కోకిలను మనము బయటి నుంచి చూసినప్పుడు కోకిల తాను గూడు కట్టకపోవడం అనేది కోకిల కలిగి ఉన్న ఈ లక్షణం మనకు ఒక "మైనస్"గా కనిపించవచ్చు, కానీ కోకిలకు గొప్ప గాత్రం ఉంది – మధురమైన స్వరమును దేవుడు దానికి ఇచ్చాడు.
దేవుడు ప్రతి ఒక్కరికి వివిధమైన తలాంతులను ఇస్తాడు. పరిమితులను ఏర్పరుస్తాడు.
కోకిల పక్షి జాతికి చెందినది ఒక్క కోకిల తప్ప పక్షులన్నీ కూడా గూడు కట్టుకుంటాయి
పక్షులన్నీ కూడా వాటి గూటిలోనే వాటి పిల్లలను భద్రపరుస్తాయి ఒక్క కోకిల మాత్రం ఇంకొక పక్షి గూటిలో తన పిల్లలను ఉంచాలని భద్రపరచాలని అనుకుంటుంది ఇది కోకిల నిస్సహాయ స్థితి,
కోకిలకు దేవుడు అన్ని పక్షులకు కలిగి ఉండే లక్షణాన్ని కాక గూడు లేని గూడు కట్టలేని స్థితిని కోకిల సహజ లక్షణముగా దేవుడు దీనిలో ఉంచాడు.
దేవుడు చేసిన సృష్టి అంతా కూడా తమ బాధ్యతను దేవుడు ఎందుకు తమను ఈ రీతిగా ఇటువంటి స్థితులను ఇటువంటి లక్షణాలను ఇచ్చి సృష్టించాడో అన్న దానిని గ్రహించి దేవుని ఉద్దేశాన్ని సృష్టి యావత్తు నెరవేరుస్తుంది.
ఈ పక్షి జాతి ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకరికి లేని తలాంతులను
ఇంకొకరు కలిగి ఉన్నప్పుడు సమాజంగా అలా వారి బాధ్యతను నిర్వర్తించా టానికే దేవుడు ఇచ్చిన బాధ్యతలను పరిచర్యలను సమర్థవంతంగా పరిపూర్ణంగా నిర్వర్తించటానికే దేవుడు సమాజముగా అందరినీ సమకూర్చాడని ఇది దేవుడు ఏర్పరచిన క్రమమని దీనిని మనం గుర్తించాలి.
మోషే అహరోను మిర్యాము ఈ ముగ్గురు దేవుని కొరకు వేరు వేరు పరిచర్యలను చేసిన వీరు సమాజముగా దేవుని పనిని మాత్రమే చేశారు
వీరు ముగ్గురు కూడా ఈ లోకంలో వచ్చే బహుమానము కాక పరలోకంలో దేవుడిచ్చే బహుమానం కొరకు వీరు ప్రయాసపడ్డారు.
సమాజంగా మనం అందరం పరిమితుల మధ్య ఉన్నప్పటికీ, దేవుడు మనకు ఇచ్చిన తలాంతులు దేవుని కార్యాలకు దేవుని పరిచర్యలకు ఉపయోగపడేలా దేవుని ఉద్దేశాన్ని సంపూర్ణం చేయడానికి ఏర్పరచబడ్డాయి. మన దృష్టికి లోపంగా, అసంపూర్ణంగా కనిపించేవి—దేవుని దృష్టిలో ప్రత్యేకమైనవిగా, లాభదాయకమైనవిగా, ఆయన బాధ్యతను నెరవేర్చే సాధనంగా మారవచ్చు. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో—అదే విధంగా పరిచర్య బాధ్యతలను పంచుకునే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి.
మీరు మీ పరిమితులను చూసి వెనక్కి తగ్గుతున్నారా? లేకపోతే, దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకతను గుర్తించి, పరిచర్యలో ఇంకొకరికి అవకాశాన్ని ఇవ్వగలిగే స్థాయికి ఎదుగుతున్నారా?
ఎస్తేర్ క్రైసోలైట్
10-4-2025