2025 Messages
నిద్రిస్తున్న ఓ క్రైస్తవుడా — మేల్కొమ్ము!
ప్రార్థన అనే ఆయుధాన్ని గట్టిగా పట్టుకో!
ప్రార్థన దేవుని కనికరాన్ని తీసుకువస్తుంది.
ప్రార్థన ద్వారా దేవుని కృప మనపై విస్తరించ భడుతుంది.
ప్రార్థన అపజయంలో ఉన్నవారికి విజయాన్ని ఇస్తుంది.
నిరాశలో ఉన్నవారికి జీవాన్ని నింపుతుంది.
విరిగి నలిగిన వారిని లేవనెత్తుతుంది.
ప్రార్థన మన అవసరాలను తీర్చడమే కాదు —
ఇతరుల కోసం మనము ప్రార్థించినప్పుడు, దేవుడు మన ప్రార్థనా ద్వార వారికీ క్షేమాన్ని అందించగలడు.
ఎస్తేరు — రాజనగరంలో భద్రత కలిగిన చోట తాను ఉన్నాప్పటికి తన ప్రజల నాశనానికి హింసకు ఎదురుగా మౌనంగా తాను నిలబడలేదు.
నేను మౌనంగా ఉంటే నేను కాపాడబడుతాను?" అనే ఆలోచన కాకుండా,
ఆ శాసనాన్ని మార్చగలిగే రాజు ముందు నిలబడేందుకు ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థనతో నిలబడి,
దేవుని కనికరాన్ని పొందింది.
తన వంతు బాధ్యతను గుర్తించి, తాను చేయగలిగిన దాన్ని చేసింది.
ఈనాటికి కూడా —
మనముందు కనబడుతున్న దృశ్యాలు దేవుని సేవకులు హింసకు గురవుతున్నారు.
ఈ లోకమంతా సాతాను అధీనంలో ఉన్నా,
మన ప్రభువు యేసుక్రీస్తు సాతానుపై, ఈ లోకంపై విజయాన్ని సాధించాడు మన దేవుడు అన్నిటిని జయించిన విజయశాలి,
అధికారాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి.
ఆ దేవుని కనికరాన్ని కోరుతూ, కృప కోసం ప్రార్థించాల్సిన సమయం ఇది.

ప్రభు శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో,
ప్రార్థనా శక్తితో పోరాడవలసిన సమయం ఇది!
ప్రారంభం నుండీ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తున్నది ఇదే —
హింస ఉన్నపుడే ప్రార్థనను మరి ఎక్కువ గట్టిగా పట్టుకోవాలి!
ఎస్తేర్ క్రైసోలైట్
8-4-2025