2025 Messages
ఎవరి పరిచర్య వాళ్లే చేయాలి!
( మోషే, అహరోను, మిర్యాము పరిచర్యల ఉపోద్ఘాతము )
దేవుడు తన ప్రజలను ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో ఒక్కొక్కరిని ఒకో రీతిగా వాడుకుంటూ ఉంటాడు, మోషే, అహరోను, మిర్యాము – ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికిని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఈ ముగ్గురినీ దేవుడు వేర్వేరు పరిచర్యల కోసం పిలిచాడు.
మోషే – ఇశ్రాయేలీయులను గొప్ప నాయకుడిగా ముందుండి నడిపించేందుకు పిలిచాడు.
అహరోను – యాజక పదవి కోసం ప్రత్యేకంగా ఏర్పరచి, యాజకుడిగా నియమించాడు.
మిర్యాము – ప్రవక్తురాలిగా, దేవుని మహిమను స్తోత్రించే నాయకురాలిగా నిలిపాడు.
మీకా 6:4
ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై
మోషే అహరోను మిర్యాములను పంపించితిని.
ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠిత ప్రజలు వీరు దేవుని సంఘాము వీరి మధ్య పరిచర్యను చేయటానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దేవుడు వాడుకున్నాడు వీరు చేసే పరిచర్యలు వేరు వేరే అయినప్పటికి ఈ ముగ్గురు దేవునిలో ఏకముగా ఉన్నారు.
గలతియులకు 3:28
ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
ఈరోజులలో కూడా దేవుని మందిరాలలో దేవుని సంఘాలలో ఇటువంటి సహోదర భావము
స్త్రీ పురుషుల మధ్య ఉండాలి.
భక్త సింగ్ గారి సహవాసంలో అన్న అక్క సిస్టర్ బ్రదర్ ఈ రెండు పిలుపులు మాత్రమే వినపడతాయి అంకుల్ వయస్సులో ఉన్న సేవకులను విశ్వాసులను వారిని కూడా అన్నా అక్క అని పిలిచే ఆలవాటును నేను ఆ సహవాసము లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను.
దేవుని జనుల మధ్య సంఘాలలో ‘అన్న’ ‘అక్క’ అనే సంబోధనలు ఒక పవిత్రమైన భావాన్ని, ఆత్మీయ అనుబంధాన్ని కలిగిస్తాయి.
మోషే అహరోను మిర్యాములను దేవుడు వేరు వేరు పరిచర్య కొరకు వాడుకున్న ఈ ముగ్గురిని గురించి నేను చెప్పేముందు ఈ ఉపోద్ఘాతము వీరిని గురించి ముందుగా ఎందుకు తెలియజేస్తున్నాను అని అంటే
దేవుడు వీరికిచ్చిన పిలుపును వీరు నడిపించే విధానం వీరికి ఇచ్చిన పరిచర్యను వీరు గమనించారా లేదా గమనించ లేకపోతే ఎటువంటి దుష్ప్రభావాలు కలిగాయి అన్న విషయం వీరిని బట్టి మన జీవితాలలో మనము ఏమి నేర్చుకోవాలి అన్న ప్రాముఖ్యమైన సత్యమును మనము ఖచ్చితంగా గ్రహించాలి.
నేను ప్రతి ఇయర్ నా మినిస్ట్రీ గురించి ప్రత్యేకంగా వాగ్దానం అన్నది ఏమి తీసుకొను కొన్ని కొన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు తప్ప అది కూడా నేను ఎప్పుడూ బుక్ స్టాల్ నుంచి తీసుకొచ్చి నా ఇంటిలో ఉంచబడిన వాగ్దానాల నుంచే ఒకటి తీసుకుంటాను తప్ప వేరే సహవాసంలో నా మినిస్ట్రీ కొరకు నేను వాగ్దానం ఎప్పుడు తీసుకోలేదు నేను ఏ సహవాసంలోకి వెళ్లిన నా వ్యక్తిగత వాగ్దానమును మాత్రమే నేను తీసుకుంటాను నా మినిస్ట్రీ కొరకు నేను ఎప్పుడు వాగ్దానం తీసుకోలేదు.
యూట్యూబ్లో నా పరిచర్య అప్పుడప్పుడే వృద్ధి అవుతుంది అనుకున్న సమయంలో ఒక సంవత్సరం నేను వెళ్లె వేరొక సహవాసంలో నా వ్యక్తిగత వాగ్దానం తీసుకున్న తర్వాత నా మినిస్ట్రీ కొరకు నేను వాగ్దానం తీసుకున్నాను ఆది జెఫన్యా 3:20 నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును;
ఆ సంవత్సరం ఆ సహవాసంలో దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకోని నా మినిస్ట్రీ వాగ్దానామును దేవుడు నెరవేర్చాడు నా మినిస్ట్రీ ద్వారా నేను అక్కడ ఆ సహవాసంలో వాడబడ్డాను కానీ దేవుడు నాకు బాధ్యతగా వ్యక్తిగతంగా ఇచ్చిన నా యూట్యూబ్ పరిచర్యలో నేను వృద్ధి చెందలేదు.
ఎందుకంటే దేవుడు మనకిచ్చిన మన వ్యక్తిగతమైన పరిచర్య ముందు దానిలో మనము వాడబడాలి దేవుడు వ్యక్తిగతంగా మనకు ఏ బాధ్యతను అయితే తన పరిచర్య నిమిత్తము ఇచ్చాడో దానిలో మనము నమ్మకంగా ఉండాలి.
వ్యక్తిగతంగా వచ్చిన పరిచర్యను వ్యక్తిగతంగానే దానిని నమ్మకముగా చేయాలి దేవుడు యిచ్చిన బాధ్యతను ఇంకొకరికి అప్పగించకూడదు, సమాజంగా వచ్చిన పరిచర్యను సమాజంతో కలిసి చేయాలి ఇది క్రమం ఇది నాకు ఆర్ధం అయిన తర్వాత
నా మినిస్ట్రీ కొరకు నేను ఏ సహవాసంలో కూడా వాగ్దానం అనేది ఇంక నేను తీసుకోలేదు.
దేవుడు మీకు బాధ్యత నేదైనా ఇచ్చాడా ? అయితే దాని విషయంలో పట్టు వదలకుండా నమ్మకం గా దాని అభివృద్ధి కొరకు దేవునితో పోరాడండి దేవున్ని ప్రార్థించండి దేవుడు మీకు ఏ పరిచర్యను అయితే ఇచ్చాడో ఏ బాధ్యత అయితే ఇచ్చాడో దాని విషయంలో దాని నెరవేర్చే విషయంలో నమ్మకముగా మీరు ఉండండి దేవుడు మీకు ఇచ్చిన దానిని ఇంకొకరికి ఇస్తే దాని విషయంలో దేవునికి లెక్క చెప్పవలసినది మీరే ఆన్న విషయమును మాత్రం మరచిపోకండి !
ఎస్తేర్ క్రైసోలైట్
7-4-2025