2025 Messages
విరిగిన హృదయం దూషణకు స్పందన కాదు
అది దేవునికి అర్పణ
కీర్తనలు 51:15,16,17
ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
దావీదు యుద్ధములను చేసే రాజుగా యెహోవా చేత అభిషేకించబడిన వాడు, అనేక యుద్ధాలలో దేవుని ద్వార విజయాన్ని పొందాడు
దేవుడు ఏర్పరచు కున్నటువంటి దేవుడు అభిషేకించు కున్నటువంటి ఆటువంటి దావీదు — ఒక దాసుడిగా ఒక సామాన్యుడిగా తన జనుల మధ్య నడవగలడా ! నడవలేడు. ఆలా ! నడవాలి అని అంటే తన హృదయం ఎంత విరిగిపోతుంది ఎంత నలిగిపోతుందో కదా !
తన కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసినపుడు, తాను సింహాసనం వదిలి పారిపోతున్నప్పుడు…
అప్పుడు షీమి అనే ఒక తక్కువ స్థాయి వాడు రాళ్లు విసిరి, దూషణలతో దావీదును దూషించాడు
2సమూయేలు 16:7,8
ఈ షిమీ-నరహంతకుడా, దుర్మార్గుడా
ఛీపో, ఛీపో,నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి యున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా,
దావీదు చేతిలో దావీదు ఆధీనంలో వున్న అతని సైన్యం
2 సమూయేలు 16:9
సెరూయా కుమారుడైన అబీషై-ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.
అతని సేవకులు దావీదుతో షీమీ తల తీయమా? అని అడిగినపుడు –
దావీదు సమాధానం ఏమిటంటే,
2సమూయేలు 16:10,11,12
అందుకు రాజు-సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగా-నీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి
అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా-నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి.
యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
ఏ రాజు అలా ఒప్పుకుంటాడు?
ఏ యోధుడు తన దూషకుడిని సహించగలడు?
పవిత్రమైన జీవితమును జీవించడానికి పరిశుద్ధాత్మతో ముద్రించబడిన మనలను అపవిత్రులుగా ఆపవిత్రమైన కార్యాలను చేసేవారిగా ముద్రిస్తు వుంటే ఆన్యాయమునకు మనము గురి అవుతున్న సమయాలలో మనము ఏమి చేస్తున్నాము !
దావీదు వలె మనము కూడా దేవునికి మన వాజ్యమును అప్పగిస్తున్నామా!
నా విరిగి నలిగిన స్థితిని బట్టి నా ప్రార్ధనను బట్టి మాత్రమే కాక ! షిమీ లాంటి వారి దూషణలను అవమానాలను అపకారాలను అపనిందలను అన్యాయాలను బట్టి కూడా దేవుడు నన్ను దీవిస్తాడు అన్న దావీదు లాంటి విశ్వాసమును మనము కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది.
దావీదుకు కలిగిన ఈ ఓర్పు ఈ సహనము సామాన్యమైనది కాదు.
ఇది దేవుని ముందు తనని తాను తగ్గించుకున్న విరిగి నలిగిన హృదయముతో దేవుని మీద తన భారాన్ని వేసిన దావీదు నిస్సహాయ స్థితి ఇది.
ఇటువంటి దావీదుకు కలిగిన విరుగి నలిగిన హృదయములో నుండి వచ్చే స్పందనను దేవుని ప్రజలము అని చెప్పబడుతున్న పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియ జేస్తుంది.
ఈ రోజు మన జీవితంలో కూడా కొందరు షీమీ లు ఉండవచ్చు.అవమానించే వారు, మన స్థితిని ఉపయోగించుకొని దూషించే వారు, మన బాధను మన నిస్సహాయ స్థితిని చూసి అపహాస్యం చేసే వారు మన ముందు ఉన్న మన చేతిలో ప్రతికారం తీర్చుకునే పరిస్థితి అవకాశము సామర్థ్యాలు అన్ని మనకు ఉన్నా కూడా మనము చేయవలసింది ఒక్కటే మన భారములన్నిటిని దేవుని మీద వేయుటమే.
మీ జీవితంలో ఉన్న షీమీ లను చూచి మీరు ఎలా స్పందిస్తున్నారు?
మీ హృదయం దేవునికి నమ్మకంగా ఉన్నదా? లేక ప్రతీకారము తీర్చుకునేటట్లు మారుతున్నదా?
విరిగి నలిగిన హృదయం దేవునికి ప్రియమైన ఇష్టమైన బలి దేవుడు అంగీకరించే సుగంధ సువాసన స్తుతి అని మీరు దీన్ని నమ్మగలరా !
ఎస్తేర్ క్రైసోలెట్
6-4-2025