CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

💃కన్యకతో పురుషుని జాడ.

సామెతలు 30:18 --19

నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,

బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.

🧜‍♀ కన్యకతో పురుషుని జాడ.

ఈ మార్గము శరీరానికి కాదు, మనసుకు కాదు — ఇది ఆత్మకే. ఇది కనిపించదు గాని అనుభవించవచ్చు. ఈ మార్గంలో నడవాలంటే,నడవాలని అనుకున్నా ప్రతి ఒక్కరికి కన్యక గుణం అవసరం — అంటే పరిశుద్ధత, అంకితభావం, పూర్తిగా క్రీస్తుతో అనుసంధానము చేయబడిన జీవితం

పురుషునితో కూడిన కన్యక మార్గము –ఇది ఆత్మీయంగా తెలియనిది, ఆత్మ నేత్రాలతో మాత్రమే గ్రహించగలిగేది.

ఇది సాధారణమైన బుద్ధితో, శరీరగుణాలతో, శారీరక భావాలతో అర్థం చేసుకోలేనిది. ఇది మన ఆత్మతో సంబంధమున్న రహస్యమయమైన మార్గం. ఆ మార్గాన్ని మన మనసుతో కాదు, మన ఆత్మతో, ఆత్మ నేత్రాలతో మాత్రమే గ్రహించగలము.

ఉదాహరణగా: దేవుని ఆలోచనలను, ఆయన పరిశుద్ధమైన మార్గాలను మన ఆత్మీయ జీవితంలో ఒక భాగంగా అనుభవించాలి. అవి దేవుని వాక్య మాటల శబ్దాలకు మాత్రమే పరిమితమయ్యే విషయాలు కావు—ఆయనతో గాఢమైన సంబంధం కలిగినవారు మాత్రమే అర్థం చేసుకునేలా ఉండే మహత్తరమైన అద్భుతమైన రహస్యాలు.

కాబట్టి, "పురుషునితో కూడిన కన్యక మార్గము" అనే విషయం కూడా ఇది ఒక రహస్యమును సూచిస్తుంది ఇది ఆత్మసంబంధమైన విషయం,

ఇది కేవలం మనసుతో అర్థం అయ్యేది కాదు, దైవిక జ్ఞానంతో మాత్రమే మనము గ్రహించగలము.

"ఆత్మీయంగా తెలియనిది, ఆత్మ సంబంధ మైన దృష్టితో మాత్రమే గ్రహించగలిగేది" అంటే ఏమిటి ?

సాధారణంగా మనం ఏదైనా తెలుసుకోవడానికి:

చదువుతాము వింటాము ఆలోచిస్తాము, అనుభవిస్తాము.

ఇవన్నీ బాహ్య సంభందమైన జ్ఞానం – మన శరీర, మనస్సు, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానం.

కానీ మరి కొన్ని విషయాలు ఉంటాయి:

దేవుని ఆలోచన, పరలోక రాజ్య మార్గం, ఆత్మకు సంబంధించిన నిజాలు విషయాలు,

ఇవి బాహ్య సంబంధమైన దృష్టితో కాదు, ఆత్మీయ దృష్టితోనే తెలుసు కోగల మన్నది దీని అర్థం.

🕊ఆత్మ దృష్టి అని అంటే ఏమిటి?

ఆత్మసంబంధమైన దృష్టి అని అంటే దేవుని ప్రజలముగా పరిశుద్ధాత్మతో ముద్రించ బడిన మన లోపల ఉన్న ఆత్మ బోధించే బోధ. దేవుని ఆత్మ మనలో పనిచేస్తే, మన హృదయంలో ఆయన చూపించేదాన్ని గ్రహించగలగటం. ఇది చదివి తెలుసుకునే విషయం కాదు. ప్రార్థనలో, వాక్యధ్యానంలో, దేవునికి సమీపంలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనకు బోధించేది.

పురుషునితో కూడిన కన్యక మార్గము" – అంటే ఇది భౌతిక సంబంధం గురించి కాదు. ఇది ఆత్మకి సంబంధించిన విషయం. ఇది క్రీస్తుతో ఆత్మీయ ఐక్యత, పవిత్రత, అంకిత భావన గురించి. దీన్ని గ్రహించాలంటే పరిశుద్ధమైన మనసుతో దేవుని ముందు ఉండాలి.

తేలికగా చెప్పాలంటే:

ఇది మన తలతో అర్థం చేసుకునే విషయం కాదు

మన ఆత్మతో అనుభవించే విషయం

ప్రార్థనలో, ధ్యానంలో దేవుడు మన హృదయానికి బోధించేది.

"పురుషునితో కూడిన కన్యక మార్గము" అన్నది చాలా పవిత్రమైన, ఆత్మీయమైన, రహస్యమయమైన బోధ. దీన్ని భౌతికంగా కాక, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి.

పదాల అర్థం:

పురుషుడు – బైబిల్ ప్రకారం ఇది క్రీస్తుని సూచిస్తుంది. (ఉదా: పరమ గీతము, ఎఫెసీయులకు 5వ అధ్యాయం)

కన్యక – పరిశుద్ధమైన, అంకితమైన ఆత్మ. దేవునికి అంకితమైన మందిరము (లేక వ్యక్తిగతంగా విశ్వాసి).

అంటే: క్రీస్తుతో పరిశుద్ధమైన, భక్తితో కూడిన ఆత్మీయ సంబంధం.

ఈ మార్గము ఏమిటి?

ఇది ఒక సాధారణ మార్గం కాదు. ఇది:

భక్తి పరిశుద్ధత ప్రేమ పూర్తిగా దేవునికి అంకితమయిన జీవితం.

ఈ మార్గంలో నడవడానికి:

మనసు కాదు తెలివి కాదు

హృదయంలో వచ్చే తలంపులు కూడా కాదు

కేవలం ఆత్మ కావాలి – ఎందుకంటే ఇది ఆత్మలో అనుభవించే ఆత్మతో కూడిన బంధం.

ఒక యువతి తన పెళ్లికి ముందు తన మనస్సు, శరీరం, హృదయం అన్నీ ఒక వ్యక్తికే అంకితం చేస్తుంది. ఆమె ఎవరితోనూ కలవదు, మాట్లాడదు, దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె తన మనసులో అతనికే చెందింది.

ఇదే విధంగా, ఒక విశ్వాసి కూడా ఈ ప్రపంచపు ఆకర్షణల నుంచి తనను పరిశుద్ధంగా ఉంచుకుంటూ, క్రీస్తుతో తన ఆత్మను కలపడం అదే "పురుషునితో కూడిన కన్యక మార్గము".

ఈ మార్గం ఎలా తెలిస్తుంది ?

ఈ మార్గాన్ని మనం పుస్తకాలు చదివి, ప్రజల మాటలు విని, మతాచారాలు చేసి చూసి మనం తెలుసుకోలేం.

ప్రార్థనలో, ధ్యానంలో, దేవుని ఆత్మ మనకు బోధించినప్పుడు మాత్రమే ఇది నిజంగా మనకు అర్థమవుతుంది. అంటే దీనికి ఆత్మ నేత్రాలు వెలిగించబడటం అవసరం.

"పురుషునితో కూడిన కన్యక మార్గము" అనేది:

ఇది భౌతికముగా మనకు కనపడేది కాదు

మనసుతో తెలుసుకోవడం కాదు

ఇది ఒక ఆత్మసంబంధమైన బంధం

దీనిని గ్రహించాలంటే దేవుని ఆత్మ చేత బోధించబడాలి నడిపించబడాలి

ఈ బంధంలో పరిశుద్ధత, ప్రేమ, అంకితభావం ఉంటాయి

యోహాను 14:6

యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

"నేనే మార్గము" అన్న క్రీస్తు వాక్యమే ఈ "పురుషునితో కూడిన కన్యక మార్గము"కి గల మూలసూత్రం.

క్రీస్తుతో నడిచే మార్గం:

పవిత్రమైనది

భక్తి, అంకిత భావంతో నిండినది

ఈ ప్రపంచపు ఆకర్షణల నుంచి దూరంగా ఉండే ఒక విడిచి పెట్టిన ప్రత్యేకింపబడిన జీవితం

పరిశుద్ధ గ్రంథములో "కన్యకతో పురుషుని జాడ" అనే వాక్యనికి మూలము:

ప్రకటన గ్రంథం 14:4

వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱె పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

స్త్రీలతో తమ్మును తాము కల్మషపరచుకోక కన్యకలుగా ఉన్నవారు. వీరు దేనితోనైనా ఏ విధంగానైన కలిసిపోలేదు. యేసు ఎక్కడికి పోయినను ఆయనను అనుసరించువారు వీరే.

అపోస్తలుడైన పౌలు స్పష్టంగా వ్రాసాడు — పెండ్లి కానివాడు ప్రభువును సంతోషపెట్టుట గురించే ఆలోచించును; కానీ పెండ్లి అయినవాడు తన భార్యను సంతోషపెట్టుట గురించే ఆలోచించును (1 కొరింథీయులకు 7:32–34). ఇది శరీర సంబంధమైన విషయము ఆని కాదు ఇది మన దృష్టి ఎటువైపు నిలుస్తుందన్నది. పెండ్లి కానివారికి అవకాశం ఉంటుంది: వారు పరసంబంధమైన వాటిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని జీవించవచ్చు.

కన్యక మార్గము అంటే భౌతిక సంబంధాలకన్నా, ఆత్మీయ సంబంధాన్ని ముఖ్యంగా పరిగణించడమే. ఈ మార్గంలో నడిచేవారు ఈ లోక బంధకాలకంటే, ప్రభువుతో ఉండే అనుబంధాన్ని మొదటిగా ప్రథమ స్థానంలో ఉంచుతారు. అందుకనే క్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే ఉపమానమును కూడా కన్యకులకు పోల్చి చెప్పాడు

పురుషుని జాడ = యేసును అనుసరించడం

కన్యకలుగా ఉండడం = ఈ ప్రపంచపు ఈ లోక పాపల నుంచి కలుషాల నుంచి విడిగా, పరిశుద్ధంగా ప్రత్యేకంగా ఉండటం

“పురుషునితో కూడిన కన్యక మార్గము” అనే మాట అర్థం:

ఇది యేసు క్రీస్తుతో ఉండే ఆత్మీయ ప్రయాణం. కన్యక అంటే శరీర సంబంధం కాదు — ఆత్మ యొక్క పరిశుద్ధత, విశ్వాసం, విశ్వాసంలో అంకితమైన జీవితం. కాబట్టి ఈ మార్గం అనేది యేసుతో ప్రారంభమై, యేసుతో నడిచే మార్గం.

“నేనే మార్గము” అన్న వాక్యం (యోహాను 14:6):

మార్గం = యేసే

కన్యక మార్గం అంటే యేసుతో కలిసి నడిచే పవిత్రమైన మార్గం.

"పురుషునితో కూడిన కన్యక మార్గము నేనే మార్గము అన్న క్రీస్తుతో పునాది."

కన్యక అంటే పరిశుద్ధత, ఈ పాపలోక శరీర ఆశలు లేని వాటి నుండి ప్రత్యేకింపబడిన వ్యక్తి అని అర్థం.

పురుషుడు అంటే క్రీస్తు

ఈ మార్గం ఈ లోక ప్రపంచపు బంధకాల నుండి విడిపడి,ప్రత్యేకింపబడి యేసుతో మాత్రమే కలసి అనుసంధానమై ఉండే జీవితం.

ఇది భక్తితో కూడిన శ్రమల మార్గం — కానీ నేనే మార్గము అన్నాడు కాబట్టి ఆయనే నడిపిస్తాడు.

ఈ మార్గం అందరికీ కనిపించదు — ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించబడిన వారు మాత్రమే ఆత్మ సంబంధమైన నేత్రాలతో మాత్రమే గ్రహించగలిగేది.

ఈ మార్గము శరీరానికి కాదు, మనసుకు కాదు — ఇది ఆత్మకే. ఇది ఆత్మసంబంధమైన ఈ మార్గము కనిపించదు గాని దీనిని మనము అనుభవించవచ్చు. ఈ మార్గంలో నడవాలంటే,నడవాలని అనుకున్నా ప్రతి ఒక్కరికి కన్యక గుణం అవసరం — అంటే పరిశుద్ధత, అంకితభావం, పూర్తిగా క్రీస్తుతో అనుసంధానము చేయబడిన జీవితం.

దేవుని ఆలోచనలను, ఆయన పరిశుద్ధమైన మార్గాలను దేవుని వాక్యము ద్వార మనం కేవలం చదివి, విని గ్రహించడం మాత్రమే కాకుండా — వాటిని మన ఆత్మలో అనుభవించాలి. ఎందుకంటే, అవి మాటల శబ్దాలకు మాత్రమే పరిమితమయ్యే విషయాలు కావు.

ఇవి మన హృదయాన్ని తాకే, జీవాన్ని మార్చే సత్యాలు. దేవుని వాక్యం మాటల శబ్దాల రూపంలో మనకు విని బడవచ్చు, మన హృదయంలో మన మనసులో కూడా ఉండవచ్చు. కానీ వాటిని గ్రహించని స్థితిలో మన ఆత్మ మన హృదయం ఉంటే గనుక అవి కేవలం మాటల శబ్దమే. శబ్దంగా వినిపించిన వాక్యాలు, వాటిని మన ఆత్మతో అనుభవించకపోతే అవి మన జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని శక్తిని చూప లేవు.

అయితే ఆయనతో గాఢమైన సంబంధం కలిగినవారికి మాత్రం, ప్రతి వాక్యం, ప్రతి మాట జీవముగా మారుతుంది. ఎందుకంటే వారి ఆత్మ ఆయన స్వరాన్ని వింటుంది, ఆయన మార్గాన్ని అనుసరించేందుకు సిద్ధంగా ఉంటుంది

దేవుని ఆలోచనలు, వాక్యాలు మనకు మాటల శబ్ద రూపంలో వినబడవచ్చు. మనం వాటిని చదవవచ్చు, పలుకవచ్చు. కానీ పౌలు చెప్పినట్లు, మన హృదయంలో వాటిపట్ల ప్రేమతో కూడిన ఆసక్తి లేకపోతే, ఆ మాటలన్నీ మ్రోగే కంచుల్లా ఖాళీ శబ్దాలే. అవి ఆత్మను స్పృశించవు మన హృదయానికి స్పందనను కలగచేయవు. ప్రేమ ఆసక్తితో కూడిన అనుభవమే దేవుని వాక్యానికి జీవాన్ని ఇస్తుంది.

1కోరింథీయులకు 4:20

దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.

ఈ పాప లోకములో నుంచి ప్రత్యేకింపబడి నేనే మార్గమును అని చెప్పిన క్రీస్తు ప్రభువు వారి మార్గంలోకి వచ్చిన ఒక విశ్వాసి కానీ ఒక సంఘాము కానీ కన్యకతో సమానము ఇటువంటి మార్గమై ఉన్న పురుషునితో కన్యక జాడ బాహ్యంగా ఇది కనపడనిది.

శబ్దాలు అంటే: కేవలం మాటల రూపంలో ఉన్న వాక్యాలు, ఉపదేశాలు, గీతాలు, ప్రార్థనలు — కానీ అవి మన ఆత్మను తాకకపోతే, అవి శబ్దాలకే పరిమితమవుతాయి.

తేడా:

శబ్దాల స్థాయి: వినిపించే మాటలు, మాటల వలన కలిగే సమాచారం.

ఆత్మీయ స్థాయి: ఆ మాటలు మన ఆత్మను తాకి, మార్పు కలిగించే స్థాయి (అలాంటి మార్పు అనుభవంతో వస్తుంది, శబ్దంతో కాదు).

దేవుని వాక్యాన్ని మాటల శబ్ద రూపంలో కాకుండా ఆత్మతో మనము వాటిని ధ్యానించినప్పుడు అవి జీవం కలిగినవిగా మనలను మన ఆత్మీయ జీవితమును రూపాంతర పరుస్తాయి.

ఎస్తేర్ క్రైసోల్తెట్

19-5-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 19-5-25