2025 Messages
ప్రవహించే నీటి బుగ్గ - దేవుని వాక్యము
దేవుని వాక్యము జీవజలము – జీవింపజేసే నీరు
యోహాను 4:14
నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.
దేవుని వాక్యము జీవజలముగా ఉంది. అది మన ఆత్మకు తృప్తినిచ్చే నీరు. మనం దీన్ని పొందాలంటే, ఒక రోజు, ఒక క్షణం మాత్రమే కాదండి యిది ఒక నిరంతరమైన ప్రయాణం అయి ఉన్నది,
యెషయా 58:11
యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.
మానవుని ఆత్మీయ దాహాన్ని తీర్చే శ్రేష్ఠమైన నీరు ఇది జీవింపజేసే జీవజలము. ఇది ఒక ఊటగా నదిలా ప్రవహించాలంటే, ఎన్నో త్యాగాలు అవసరం. నదుల తీరాన నిలబడి నీరు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం కాదు; మనమే జీవజలాన్ని అందించేవారిగా మారాలి.
యోహాను 7:38
నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
క్రీస్తు ద్వారా జీవజలము పొందిన వారు నీటి బుగ్గలా మారతారు. వారు దేవుని ఆత్మ ద్వారా ప్రవహిస్తూ, మరెందరికో ఆశీర్వాదంగా ఉంటారు. కానీ, ఈ లోకంలో నీటి బుగ్గలను ఎండిపోయెటట్లు వాటిని నాశనము చేసే మూర్ఖులు కూడా ఉన్నారు.
నదులను నాశనం చేసే మూర్ఖులు ఉన్నట్లే, మన ఆత్మీయ జీవజలాన్ని అడ్డుకునే శక్తులు కూడా ఉంటాయి. క్రీస్తును అడ్డుకోవాలనుకున్న రోమా ప్రభుత్వం ఆయనను సిలువవేశారు. మరణమునకు అప్పగించారు కానీ జీవజలాన్ని ఆపలేకపోయారు.
ఈ సత్యాన్ని మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భాలలో జ్ఞాపకం చేసుకుంటాం. మన కోసం క్రీస్తు తన ప్రాణమును అర్పించి, జీవజల ప్రవాహంగా మనలను మార్చటానికి దేవుడు తన ఆత్మను మనలో నివాసముండేలా చేశాడు.
ఈ జీవజలాన్ని ఈ నీటి బుగ్గలను కాపాడే బాధ్యత మన అందరిది,
మీ చుట్టూ జీవజలంగా ఉండే నీటి బుగ్గలు ఉన్నాయా ! ఆ నీటి బుగ్గలను రక్షించడానికి అవి ఎండిపోకుండా ఉండటానికి మీరు ఏం చేస్తారు?
ఈ జీవజలముల ఈ నీటి బుగ్గల భద్రత కోసం మీరు ప్రార్థించగలరా? ఈ నదులు ఎండిపోకుండా ఉండటానికి మీరు దేవుని వైపు మీ చేతులను చాపగలరా !
ఎస్తేర్ క్రైసోలైట్
3-4-2025