CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

సత్యం చెదరదు - దేవుడు నిలిపి ఉంచుతాడు

యోబు 20:4,5

దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్ర ముండును. ఆదినుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?"దుష్టుని విజయమంతయు కొంచెమే; దుర్మార్గుని సంతోషము క్షణమైనను నిలుచునది కాదు.

దుష్టత్వము అన్నది ఎవరికైనా సంభవిస్తున్న అన్యాయం అన్నది ఎవరికైనా జరుగుతూ మనకు కనిపిస్తున్నప్పుడు చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది కదా ! అది దేవుని ప్రజలకే జరిగితే ఆ విషయం ద్వారా మన గుండెల్ని పిండేసే మన హృదయాలను కలచివేస్తు దుష్టులకు కలిగే విజయము మన ముందు కనపడుతు ఎందుకు దేవా ఇలా ! ఎందుకు దేవా ఇలా ! అని దేవున్ని ప్రశ్నించే బాధ వేదన మనకు కలుగుతూ ఉంటుంది.

ఇది మనకి మాత్రమే కాదండి !

ఆదినుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నది అని దేవుడు యేబు గ్రంథము ద్వారా మనకు తెలియచేస్తున్నారు.

మీకు కూడా ఇలా దేవుని ప్రశ్నిస్తూ ఉన్నా అనుభవము మీకు ఎదురవుతూ ఉందా!

ఈ రోజు మనం ఎంతో బాధగా ఉన్నప్పటికీ, మనకు కలిగిన నష్టము వేదన అది ఎటువంటిది అయినప్పటికీ ఒక సత్యమును ఒక నిజాన్ని మనము మరచిపోకూడదు—దేవుని దృష్టిలో అన్యాయం అక్రమము దుష్టత్వం అనేది శాశ్వతంగా నిలబడదు స్థిర పడదు! అది కొద్ది సమయము మాత్రమే! గుండె బరువును పెంచే దుష్టత్వము అన్యాయము ఎవరికి సంబవించిన దేవుడు దానిని చూస్తూనే ఉన్నారు.

కీర్తనలు 11:4

యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

2దినవృత్తాంతములు 16:9

తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవాకను దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది;

నీతిమంతుల వ్యక్తిత్వాలను అవమానపరిచేటట్లు కించపరిచేటట్లు దుష్టులు తమ ప్రణాళికలను తమ ఆలోచనలను చక్కబెట్టుకుని,చక్కని ప్రణాళికతో అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేయగలరు. కానీ సత్యం నాశనమయ్యేలా దేవుడు ఒప్పుకోడు!

ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యముగా ఈ లోకంలో మాత్రమే కాకుండా తనను నమ్మిన తనను విశ్వసించిన ప్రజల హృదయాలలో నిజముగా సత్యమైన దేవుడుగా సత్యముగా జీవిస్తూ ఉన్నారు

ఈ సత్యమును ఈ సత్యమైన దేవుడ్ని ఎవరు మాఫీ చేయగలరు!

హామాను యూదులను తొక్కి పూర్తిగా నాశనం చేయాలని అంటే యూదుల జాతిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో కుట్ర పన్నాడు.

మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దెకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలో చించెను.

ఈ వాక్యం ఎస్తేరు 3:6 లో ఉంది: ఈ విజయం అన్నది హామానుకు కొద్ది రోజులు మాత్రమే ఉంది

మొర్దెకై ను యూదులను నశింప చేయాలని హామాను ప్రయత్నించిన యదార్ధ హృదయంతో తనను సేవించే తన ప్రజలకు షూనతను గౌరవమును దేవుడు యిచ్చాడు

కీర్తనలు 37:6,7

ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.

మీ జీవితంలో ఎప్పుడైనా అన్యాయాన్ని చూశారా? అప్పుడు దేవుడు ఎలా స్పందించారు?

మీరు అనుభవించిన ఒక సంఘటనలో, సత్యం ఎప్పుడు గెలిచిందో గుర్తుందా?

న్యాయం అనేది ఎక్కడైనా తప్పిపోయిందా! తప్పిపోతున్నట్లు మీకు కనపడుతుందా !

ధైర్యంగా ఉండండి! సత్యమై యున్న దేవుడు మన ద్వార ప్రత్యక్ష పరచబడేటట్లు.

మనం న్యాయం కోసం ప్రార్థిద్దాం ! దేవుడు తప్పక విజయం అనుగ్రహిస్తాడు!

సత్యాన్ని దేవుడు నిలిపి ఉంచుతాడు!మీరు విశ్వసించండి !

ఎస్తేర్ క్రైసోలైట్

1-4-2025