CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

ఫిలిప్పీ 3:17

మీరు నన్ను పోలి నడుచుకొనుడి

ఫిలిప్పీ 1:21

నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే వాక్యాన్ని ఫిలిప్పీయులకు 1:21 లో మనము చూచినప్పుడు, ఇది అపొస్తలుడు పౌలు చెప్పిన గొప్ప ఆత్మీయ సత్యం ఇందులో రెండు భాగాలు ఉన్నాయి,

1. బ్రతుకుట క్రీస్తే అంటే ఏమిటి ?

ఇక్కడ పౌలు తన జీవితానికి తాను బ్రతకటానికి ఏకైక అర్థం క్రీస్తు అని అంటున్నాడు.

పౌలు ఈ లోకంలో బ్రతకడం అనేది తన సొంత ప్రయోజనం కొరకు కాదు, క్రీస్తు కోసం, ఆయన సువార్త కోసం, ఆయన సేవ కోసం.

పౌలు జీవితం పూర్తిగా క్రీస్తును ప్రకటించడానికే అంకితమై ఉంది.

ఈ మాట క్రీస్తును మాత్రమే ధ్యానంలో దృష్టిలో ఉంచుకుని జీవించే విధానాన్ని సూచిస్తుంది.

క్రీస్తును మాత్రమే దృష్టిలో ఉంచుకొని క్రీస్తు సేవను చేస్తూ జీవించే జీవిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజల ప్రాణాలను ఎవరు తీసిన వారికి శిక్ష తప్పదు ఆ శిక్ష అన్నది ఈ లోకము లో ఎవరు వేసిన వేయకపోయినా అపోస్తుడైన పౌలు లాంటి సేవకులను వాడుకోవడానికి ఈ లోకంలో నిలబెట్టిన ఆ దేవుడిచ్చె తీర్పును శిక్షను ఖచ్చితంగా వారు పొందవలసిందే స్వీకరించాల్సిందే ఇది ఖచ్చితం !

మనకు హాని చేసిన వారికి మనమిచ్చె దండన ఒక వంతు అయితే దేవునికి అప్పగిస్తే ఆ శిక్ష ఆ దండన రెండంతలుగా దేవుడు ఇచ్చి తీరతాడు.

రోమీయులకు 12:19

ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.

ప్రకటన గ్రంథం 18:6

అది యిచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.

2. చావైతే లాభము అంటే ఏమిటి ?

అపోస్తులుడైన పౌలు చావును మరణమును లాభంగా లాభమును తీసుకుని వచ్చేదిగా తాను చూశాడు సాధారణంగా ఈ లోకంలో మానవులు ఎవరైనా మరణిస్తే ఎవరి ద్వారానైనా మరణానికి లోనైతే ఈ లోకంలో నిత్యత్వం గురించి సరైన గ్రహింపు లేని వాళ్ళు నశించిపోయే లయమయిపోయే ఈ లోకమే శాశ్వతమని అనుకునేవాళ్లు వాళ్ళకు ఈ లోకంలో జీవించి బ్రతక లేకుండా ఉండటం అన్నది వారికి నష్టం అని భావిస్తారు అలానే చూస్తారు, కాని అపోస్తులుడైన పౌలు దాన్ని లాభంగా పేర్కొన్నాడు.

ఎందుకంటే క్రీస్తుతో పరిశుద్ధాత్మతో మనకు ఉన్న సంబంధం అనేది మన మరణానంతరం అది ఒక పరిపూర్ణతను పొందుతుంది. చనిపోయిన వ్యక్తి మరణించబడిన వ్యక్తి శ్రమ బాదను అపవిత్రతను కలిగించే ఈ లోకంలో నుండి ఈ పాప శరీరం నుండి విమోచించబడి నిత్య సంతోషమును పరిశుద్ధతను ఇచ్చే దేవుని రాజ్యంలో ప్రవేశించి, శాశ్వత ఆనందాన్ని అనుభవించగలడు.

బ్రతుకుట క్రీస్తే అంటే మనము భూమిపై జీవించినంత కాలం, దేవుని కోసం జీవించాలి.శ్రమలతో బాధలతో ఎదిరింపులతో రోగాలతో ఆఖరికి మనుషులతో కూడా మన చేతనయినంత వరకు దేవుడిచ్చిన సామర్ధ్యంతో మనము కలిగి ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో మనం పోరాడాలి మన సామర్థ్యం ముగిసిన చోట దేవుని చిత్తం నిలుస్తుంది. కాబట్టి, మనం మన జీవితాన్ని పూర్తిగా ఆయన చేతుల్లో ఉంచాలి.

చావైతే లాభము ఎందుకు అంటే మరణానంతరం వచ్చే జీవితం క్రీస్తుతో కలిసే అనుభవం ఇంకా ఎక్కువ పరిపూర్ణమైనది.

పౌలు ఇక్కడ భయానికి కాదు, ఆశకు, ధైర్యానికి, అంకిత భావానికి ఇక్కడ ఒక సూచనను ఇస్తున్నాడు.

పౌలు ఇది ఎందుకు ఇలా అన్నాడు?

మన జీవితానికి ఇది ఎలా వర్తిస్తుంది?

ఈ వాక్యం మనకూ ఇదే ప్రశ్నను వేస్తుంది:

మన బ్రతుకు మనము ఈ లోకంలో జీవించేది నిజంగా క్రీస్తే కొరకేనా? మరణాన్ని లాభంగా చూడగలగే నమ్మకం మనకుందా? అయితే నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

నా జీవితంలో దేవుడు దేనిని అనుమతించిన దానిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు చెప్పగలరా ?మీరు నిజంగా మీ బ్రతుకును క్రీస్తు కొరకే అంకితం చేశారా? మరణాన్ని లాభంగా చూడగలగే హృదయము నమ్మకం మీకు ఉందా?

ఎస్తేర్ క్రైసోలైట్

30-3-2025