2025 Messages
దేవుడు మనకు ముందుగా తెలియజేస్తున్నాడా?
మన జీవితంలో కొన్ని అనుకోని సవాళ్లు, వ్యాధులు, ప్రమాదాలు ఎదురవుతాయి. అవి మన వల్ల కావచ్చు లేదా ఇంకెవరైనా కారణంగా రావచ్చు. హిజ్కియా రాజు కూడా ఇదే అనుభవించాడు. అతనికి మరణకరమైన వ్యాధి వచ్చిందని దేవుడు ప్రకటించినప్పుడు, అతను ఎంతో బాధపడ్డాడు. కానీ ఆ బాధను తనలోనే ఉంచుకోకుండా, దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి, అతని ఆయుష్యాన్ని 15 సంవత్సరాలు పొడిగించాడు (యెషయా 38:1-5).
ఆదికాండము 18:17
అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?
ఈ వాక్యలన్నిటిని బట్టి మనకు ఏమీ అర్థం అవుతుంది అని అంటే మన జీవితంలో జరగబోయేది అది ఏదైనా కానీ దాని విషయంలో దేవుడు మన దగ్గర దాచిపెట్టి ఉండాలని అనుకోడు మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనకు సమస్తము తెలియజేస్తూ ఉంటాడు జీవమును మరణమును దేవుడు మన ముందే ఉంచాడు దానిని రహస్యంగా దాచి పెట్టలేదు,
నీవు మరణం అవుదువు అని హిజ్కియాకు దేవుడు చెప్పినప్పుడు హిజ్కియా దేవుని ప్రార్థిస్తూ వచ్చాడు లోతు విషయంలో ఏమి దాచి పెట్టకుండా ఏమి జరుగుతుందో అన్న విషయంలో దేవుడు అబ్రహాముకి బయలుపరిచినప్పుడు అబ్రాహాము వెంటనే విజ్ఞాపన చేస్తూ వచ్చాడు దేవుడు అబ్రహాము విజ్ఞాపనను ఆలకించాడు.
మరణం అనేదే కాదండి మనకు నష్టమును కలిగించేది ఏదైన ఆది మన జీవితంలోకి వస్తున్నప్పుడు దేవుడు దాని విషయంలో మనకు ఏదో ఒక రూపంలో దాని గురించి తెలియజేస్తూనే ఉంటాడు దేవుని హృదయాన్ని గ్రహించే వారముగా ఆ చూచనలను గ్రహించే వారముగా మనము ఉండాలి దానిని మనము గ్రహించడమే కాదు కానీ దేవుడు మనకు తెలియజేసిన ఆ విషయంలో మన స్థితి మార్పు చెందేటట్లు దేవుడు మనకు వాగ్దానము ఇచ్చే ఆంత వరకు మనము దేవుని ప్రార్థిస్తూనే ఉండాలి.
నాకున్న ఒకే ఒక అన్న తాను ఒక బ్యాంక్ ఆఫీసర్ గా పని చేసేవాడు తాను తాను ఉంటున్న హెబ్రోన్ సహవాసంలో ఎలా వాడబడుతూ వచ్చాడు అని అంటే తను ఎక్కడికి ట్రాన్సఫర్ అయినా అక్కడ
ఉన్న దేవుని మందిరాన్ని కట్టిస్తూ ఉండేవాడు దేవుని మందిరాన్ని కట్టించటం కొరకైనా ఒక భారాన్ని దేవుడు తనలో ఉంచాడు,
తాను మరణించే రెండు నెలల ముందు నాకు ఒక కల వచ్చింది ఆ కలలో మా అన్న వాళ్ల ఇంటికి దగ్గరలో ఉన్న మా అన్నకు ఫ్రెండ్ అయినా ఒక దైవజనుని పట్టుకొని నా ఉద్యోగం పోయింది అన్న అని ఏడుస్తున్న కల ఆది,
నేను వెంటనే ఈ కలను నా తల్లికి మా వదినకు చెప్పాను తన గురించి ప్రార్థించాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నవారు నేను చెప్పిన విషయమును అంతగా వారు పట్టించుకోలేదు ఈ మార్చి మంత్ లోనే ఆండి ! ఇది జరిగి చాలా సంవత్సరాలవుతుంది ఒకరోజు మా అన్న బ్యాంకు పని ముగించుకుని వస్తున్నప్పుడు తాను ప్రయాణించే కారును ఒక లారి ఢి కొట్టినప్పుడు తాను అక్కడికక్కడే మరణిస్తూ వచ్చాడు.
అప్పుడు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేసే పోలీసు వాళ్ళు మా అన్న జేబులో ఉన్న ఫోన్ ని తీసుకొని తాను లాస్ట్ కాల్ ఎవరి కయితే చేశాడో వారి ద్వారా మా అన్న వివరాలు తెలుసుకున్నారు
మా అన్న లాస్ట్ కాల్ చేసింది ఎవరికి అంటే నా కలలో వారి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ అయినా ఒక దైవజనుని పట్టుకొని నా ఉద్యోగం పోయింది అన్న అని ఏడ్చినట్టు నాకు కల వచ్చింది కదా ! మా అన్న తన బ్యాంకు పని ముగించుకుని ఇంటికి వస్తు తాను లాస్ట్ కాల్ చేసింది
అవ్యక్తికే చూశారా ! దేవుడు మన జీవితంలో మనకు సంబంధించిన వారి జీవితాలలో కూడా జరగబోయేది ఏమిటి అన్నది ఖచ్చితంగా మనకు తెలియజేస్తాడు కానీ దానిని మనము సద్వినియోగం చేసుకోలేని గ్రహించలేని వారముగా వుండి కొన్ని నష్టాలను మనము తెచ్చుకుంటాము.
కొన్ని కొన్ని అనుకోని ప్రమాదాలు మనము ఎవరికైతే జరగకూడదని అనుకుంటామొ, వాళ్ళు ఇలాగ మరణించకూడదు అని మనం కోరుకుంటామో, వాళ్లకి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎందుకు చేశాడు ఇలా ఇంకా కొన్ని రోజులు ఉంటే వాళ్ళు దేవుని కొరకు వాడబడే వాళ్ళు కదా ! అని, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారి జీవితాలలో అప్పుడు తెలియజేసినట్లు, ఆ దేవుడే ఇప్పుడు కూడా సజీవంగా మార్పులేని దేవుడుగా తనను విశ్వసించిన ప్రజల పట్ల ఒకే రీతిలో ఒకే విశ్వాస్యతను ప్రకటిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు,
ఏది కూడా మన జీవితాలలో మనకు సంబంధించిన వారి జీవితాలలో కూడ దేవుడు మనకు తెలియ పరచ కుండా దేనిని తీసుకురాడండీ, మరణమును జీవమును మన ముందు ఉంచి ఏది కావాలో కోరుకో అని తెలియజేస్తు, మనలను రక్షించే మనతో మనలో ఉంటూన్న, ఈ దేవుని గుణ లక్షణమును ఈ ఒక్క విషయంను ప్రతి ఒక్కరు గమనించ గలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఎక్కడ ఎవరికి ప్రమాదం సంభవించిన, ఎటువంటి ఆశుభాలు అనేవి మనకు వినబడిన మనము అస్సలు భయపడము.
ఈ సంఘటనల ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, దేవుడు మన జీవితంలో జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేస్తాడు. కానీ మనం ఆ సూచనలను పట్టించుకుంటున్నామా?
దేవుడు మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన పరిణామం సంభవించబోతున్నప్పుడు, ఏదో ఒక రూపంలో మనకు సంకేతాలు ఇస్తూనే ఉంటాడు. కానీ, ఆ సంకేతాలను మనం గ్రహించలేకపోతే లేదా నిర్లక్ష్యం చేస్తే, అనంతరం బాధ పడాల్సి వస్తుంది.
దేవుడు హిజ్కియాకు ముందుగానే మరణాన్ని తెలియజేశాడు, కానీ అతను తన పరిస్థితిని మార్చుకునేలా ప్రార్థించాడు. అబ్రాహాము లోతు కోసము ప్రార్థించి, దేవుని హృదయాన్ని కదిలించాడు. అలాగే, మన జీవితంలో కూడా ఏదైనా విపత్తు, నష్టం, అనారోగ్యం రాబోతున్న సంకేతాలను గ్రహించి, దేవుని ముందు మనము ప్రార్థించాలి.
మీ జీవితంలో దేవుడు ఇలాంటి సంకేతాలు ఇచ్చిన అనుభవం మీకు ఉందా? మీరు వాటిని పట్టించుకున్నారా, లేక నిర్లక్ష్యం చేశారా?
ఇరోజు నుంచైనా, దేవుడు మనకు ముందుగా తెలియజేసే సంకేతాలను గ్రహించేందుకు మన మనస్సును మన హృదయమును తెరచిపెట్టుకుందాం!
ఎస్తేర్ క్రైసోలైట్
26-3-2025