CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🌿 📖🌿🍀

🌿 దేవుడు ఇచ్చిన బాధ్యతను గౌరవించడం — దానిలో నడవటం మన బాధ్యత

కీర్తనలు 109:8

వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.

కీర్తనలు 109:8 లో వున్న ఈ వాక్యం మనకు ఒక శక్తివంతమైన ఆత్మీయ సత్యాన్ని గుర్తు చేస్తుంది —

దేవుడు మనకు ఇచ్చిన ప్రతి బాధ్యత పవిత్రమైనది.

ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే, అది మన చేతుల నుండి జారిపోతుంది, దేవుడు ఆ స్థానాన్ని వేరొకరితో నింపుతాడు.

ఒక వ్యకి ఒక ప్రమాదంలో మరణించక ముందు నాకు ఒక కల వచ్చింది. అది ఏమిటంటే, ఆ వ్యక్తి వేరొక సహాదరున్ని పట్టుకొని," నా ఉద్యోగము పోయింది అన్నా!" అని ఎడుస్తున్నా కల ఆది, ఆకల నాకు వచ్చినప్పుడు కీర్తనలు109:8 లో వున్న ఈ వాక్యం నాకు అస్సలు గుర్తు రాలేదు. ఎన్నో సార్లు నేను ఈ పరిశుద్ధ గ్రంథమును చదివాను కానీ ఆసలు ఈ వాక్యం ఉందన్న సంగతి నాకు అప్పుడు జ్ఞాపకం రాలేదు.

నాకు ఈ కల వచ్చిన 3, నెలల తరువాత ఆవ్యక్తి ప్రమాదంలో చనిపోయారు. తన సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత రోజు నేను దేవుని వాక్యమును చదువుతు ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈ వాక్యం నా ముందుకు వచ్చింది. ఆప్పుడు అర్థమైంది నాకు, నాకు వచ్చిన కలకు అర్థం ఎమిటో.

🌿 "కొన్ని వాక్యాలు మనం చదివేటప్పుడు మనకు అర్థం కావు, కానీ దేవుడు ఆ వాక్యములో వున్న సత్యాన్ని మన అనుభవంలో చూపించినప్పుడు, ఆటువంటి పరిస్థితిని మన జీవితంలో దేవుడు అనుమతించి నప్పుడు అప్పుడే ఆ వాక్యం మనకు ఆర్థమవు తుంది. అప్పుడే ఆ వాక్యం మన హృదయాన్ని తాకుతుంది."అందుకే వాక్యాన్ని నిత్యం చదివి మన హృదయంలో దానిని నిలుపుకోవాలి — ఏ సందర్భంలో అది వెలుగుగా మారుతుందో మనకు తెలియదు.

ఈ వాక్యాన్ని మనము పరిశీలించినప్పుడు, ఇది దావీదు తన శత్రువుల గురించి చేసిన ప్రార్థనలో భాగంగా ఉంది. దావీదును అన్యాయంగా హింసించిన వారిపై దేవుని తీర్పు ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. అయితే, కొత్త నీ బంధనలో అపొస్తలుల కార్యములు 1:20 లో, ఈ వాక్యాన్ని యూదా ఈస్కరియోతు విషయంలో వర్తింపచేశారు. యూదా తన ద్రోహం ద్వారా తన స్థానం కోల్పోయాడు, మరియు అతని స్థానాన్ని వేరొకడు (మత్తియను) తీసుకున్నాడు.

ఈ వాక్యం మనకు ఏమి తెలియ జేస్తుంది.?

నీతిమంతుడిని అన్యాయంగా బాధించే వారిపై దేవుని తీర్పు ఉంటుంది. దేవుడు శాసనాలను అతిక్రమించేవారిని నిర్లక్ష్యం చేయడు.

వారి ఉద్యోగమును వేరొకరు తీసుకుంటారు. అంటే, దేవుని దృష్టిలో అనుచితంగా ప్రవర్తించే వారిని ఆయన వారి స్థానాల్లో ఉండనీయడు. వారు నశించిన తర్వాత, వారి స్థానంలో దేవుని యోగ్యులైన వారిని ఉంచుతాడు.

మన జీవితాలలో దేవుని నియామకాన్ని కాపాడుకోవాలి. యూదా ఈస్కరియోతు లాగా దేవునిచేత నియమింపబడిన ఓ బహుమతిని నిర్లక్ష్యం చేస్తే, అది మనం కోల్పోతాం, మరియు దేవుడు మరొకరిని నియమిస్తాడు.

1. పరిచర్యలో బాధ్యత:

దేవుడు మనకు ఇచ్చిన ఆత్మీయ పరిచర్య — అది చిన్నది అయినా పెద్దది అయినా — అది మనకు ఒక నమ్మకమైన బాధ్యతగా ఇవ్వబడింది. మనం ఆ పరిచర్యను స్వార్ధం కోసం, ఖ్యాతి కోసం, వినియోగించిన లేక నిర్లక్ష్యం చేసిన దేవుడు దానిని మన నుండి తీసి వేరొకరికి ఇచ్చె దేవుడు. యూదా ఇస్కరియోతు దీనికి ఉదాహరణ.

2. కుటుంబంలో బాధ్యత:

భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, సోదరిగా, సోదరుడిగా, దేవుడు మనకు ఇచ్చిన కుటుంబ బాధ్యతలను కూడా మేము గౌరవంగా నిర్వర్తించాలి. అవి దేవుని నుండి వచ్చిన బహుమతులు. నిర్లక్ష్యం చేస్తే, ఆ ఆశీర్వాదములు శాపములుగా మారవచ్చు.

3. ఉద్యోగం, చదువు, సామాజిక బాధ్యత:

మన ఉద్యోగం దేవుని ఒక ఆదేశం, మనకు దానిలోనూ నిశ్చితమైన నైతికతతో, నిజాయితీతో, క్రమపద్ధతితో జీవించమని ఆయన కోరుకుంటాడు. అదే విధంగా విద్యలో, మన సామాజిక జీవితంలోనూ దేవుని గౌరవించటం మన బాధ్యత. దేవుని ఆశీర్వాదం లేని స్థానం శూన్యమవుతుంది.

4. మన శరీరంపై బాధ్యత:

పౌలు రాసినట్లు, మన శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం 1కోరింథీయులకు 6:19-20

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన శరీర పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ, దానిని పాపానికి కాదు, దేవుని మహిమకు ఉపయోగించాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు పరిశుద్ధంగా ఉండటానికి నిత్యం యేసు రక్తం ద్వారా కడక బడుతు ఉండాలి.

🌸 ఇది మనం తెలుసుకోవలసిన ఒక సత్యం:

దేవుడు మనకు ఇచ్చిన స్థానం మనకే సదా ఉంటుందని మనం అనుకోకూడదు. అది దేవుని కృప వల్ల మాత్రమే మనకు ఉంది. మనం నిజాయితీగా ఆ స్థానం ను నిర్వర్తిస్తే, ఆయన మనలను నిలబెడతాడు. లేకపోతే, ఆ బాధ్యతను దేవుడు వేరొక నమ్మకస్థుని చేతిలో ఉంచుతాడు.

ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక ఆహ్వానం కూడా. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను గౌరవంగా నిర్వహించాలి. మన పరిచర్యను, మన కుటుంబాన్ని, మన ఉద్యోగాన్ని, మన శరీరాన్ని పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుకొవాలి.నేను నా పరిచర్యలో, కుటుంబంలో, ఉద్యోగంలో దేవుడు ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా నిర్వహిస్తున్నానా? లేక దేవుడు ఇచ్చిన బాధ్యతను నేను నిర్లక్ష్యం చేస్తున్నానా? నా జీవితంలో దేవుడు ఇచ్చిన స్థానం కాపాడుకోవడానికి నేను యెంతగా ఆయన సన్నిధిలో జ్ఞాన వివేకాలు కలిగి, వినయంతో ఉండటానికి ప్రయాత్నిస్తున్నానా? అన్న విషయమును పరిశీలిస్తూ ! "దేవా! మీరు నాకిచ్చిన బాధ్యులలో నన్ను నమ్మకస్తునిగా చేయండి అని ప్రార్థించుదాం!." మన నిర్లక్ష్యం వల్ల ఆ స్థానం వేరొకరికి వెళ్ళిపోకముందే, మనం జాగ్రత్తపడుదాం! .

ఎస్తేర్ క్రైసోలైట్

31-3-2025