CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

దేవుని పిలుపును ఆలస్యం చేయకండి ముందుకు సాగండి.

ద్వితియోపదేశకాండము 1:5

​యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రక టింప మొదలుపెట్టి ఇట్లనెను,

మోషే యొర్దాను ఆయితే దాటలేకపోయినా, దేవుడు ఇచ్చిన బాధ్యతను ముగించే స్థితిలో మోషే ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు మరోసారి ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. ఎందుకంటే కొత్త తరానికి పాత విషయాలను పునరుద్ధరించి మరల చెప్పడం అవసరం. దేవుని మాటలు మర్చిపోకుండా, వాటిని వారి హృదయాలలో ఉంచుకుని జీవించాలని మోషే వారికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.

ఇటువంటి సంఘటనలు మన జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా, మనం వాటిని నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ , వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని దేవుని పట్ల పూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మనము నడుచుకోవాలి. గత అనుభవాలను చూసి, భవిష్యత్తులో మనం దేవుని మాటను మరింత నమ్మకంతో అనుసరించేలా మన గమనాన్ని సరిచేసుకుంటు మనము జీవించాలి.

దేవుడు మనకు ఇప్పటికే పలుమార్లు ఇచ్చిన వాగ్దానములను మనము మరచిపోతున్నామా? దేవుడు చెప్పిన వాక్కులను మన పిల్లలకు, మనఇంటి చుట్టుపక్కల వారికి మన పరిచర్యలో ఉన్నవారికి మనము తెలియజేస్తున్నామా? మోషేలా మనం కూడా దేవుని మాటను ధైర్యంగా ప్రకటిద్దాం

దేవుని వాక్యాన్ని పట్టుకుని, ఆయన పిలుపును అనుసరిస్తూ, ముందుకు సాగే ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి అన్న సత్యమును ఈ వచనం మనకు తెలియజేస్తుంది.

ద్వితియోపదేశకాండము 1:6

​​మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును,

హోరేబు పర్వతం వద్ద ఇశ్రాయేలీయులు దేవుని మహిమను చూశారు, దేవుని ధర్మశాస్త్రాన్నివిన్నారు దేవుని ఆజ్ఞలను వారు స్వీకరించారు. కానీ, అక్కడే అలా ఉండిపోవడం దేవుని సంకల్పం దేవుని చిత్తం కాదు. ఆయన వారిని వాగ్దాన దేశం దిశగా ప్రయాణించమని ఆజ్ఞాపించాడు.

ఇదే నిజం మన జీవితాల్లోనూ వర్తిస్తుంది. కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మనం స్థిరపడిపోవాలని అనుకుంటాం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రదేశాన్ని విడిచి, కొత్త స్థాయికి వెళ్లడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం కొంతకాలం ఒక పరిస్థితిలో ఉండొచ్చు, కానీ దేవుని పిలుపును అనుసరించి ముందుకు సాగాల్సిన సమయం వస్తుంది.దేవుడు మనలను ఎప్పుడూ ఒకే రీతిగా వాడుకోడు, ఒక్కొక్కసారి ఒక రీతిలో మనలను వాడుకుంటూ ఉంటాడు, దేవుడు మనలను ఎలా వాడుకోవాలని అనుకున్న దానికి సిద్ధంగా దేవునికి అనుకూలంగా మనము ఉండాలి.

దేవుడు మన జీవితంలో ఒక దశకు కట్టుబడి ఉండకుండా, ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. మనం ఎక్కడ ఆగిపోవాలో కాదు, ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవాలి. దేవుడు చూపించే దిశలో మన ప్రయాణాన్ని కొనసాగించాలి అన్న ప్రాముఖ్యమైన అంశమును ఈ వచనము మనకు తెలియజేస్తుంది.

దేవుడు మన ప్రయాణాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని కోరుతున్నప్పుడు, మనం సిద్ధంగా ఉన్నామా? మన జీవితంలో దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరించడంలో ఆలస్యం చేస్తున్నామా?

మనల్ని మనము పరిశీలించుకుందాం.

ఎస్తేర్ క్రైసో లైట్

25-3-2025