2025 Messages
నూతన మార్గాలకు సిద్ధంగా ఉన్నారా?
ద్వితియోపదేశకాండము 1:7
మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును(ఫరాతు) వెళ్లుడి.
ఇశ్రాయేలు ప్రజలు ఎన్నాళ్లుగానో ఒకే స్థలంలో ఉండిపోయారు. కానీ దేవుడు వారిని నిలబెట్టిన చోటే మిగిలిపోకుండా, ముందుకు సాగాలని ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పిన ప్రదేశాలు అన్ని భూమిని విస్తరించి, కొత్త ఆశీర్వాదాలను తెచ్చే చోట్లే! అది ఒక్క భౌతిక ప్రయాణం మాత్రమే కాదు—ఆధ్యాత్మిక ఎదుగుదలకూ కూడ సంకేతం.
దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని మార్గాలను తెరిచినప్పుడు, మనం అలవాటు పడిన స్థితిలోనే ఉండిపోవడం సరికాదు. ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటేనే అభివృద్ధి, సమృద్ధి కలుగుతుంది. అనుమానాలు, భయాలు మనల్ని కట్టిపడేసినా,
దేవుడు చూపించిన మార్గమే ఆశీర్వాదాలకు ప్రారంభ ద్వారం. ఈ వచనంలో మనకు స్పష్టంగా కనిపించే విషయం—ఆజ్ఞను అనుసరించినవారికే అభివృద్ధి కలుగుతుంది.
మీరు దేవుడు మీకు చూపిన కొత్త మార్గాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? లేకపోతే భయంతో, అలవాట్లతో పాత స్థితిలోనే ఉండిపోతున్నారా?
ద్వితియోపదేశకాండము 1:8
ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వీకరించడమే మన పని!
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక దేశాన్ని వాగ్దానంగా ఇచ్చాడు. అది ఒక ఆశాతో కూడిన భవిష్యత్తును సూచిస్తోంది. కాని, వారు కేవలం వాగ్దానాన్ని విన్నంత మాత్రానా దేశాన్ని స్వతంత్రించుకోలేదు. "వెళ్లి స్వాధీనపరచుకొనుడి" అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అంటే, దేవుడు ఆశీర్వాదాన్ని సిద్ధం చేసాడు, కానీ దాన్ని స్వీకరించేందుకు మన కదలిక మన ప్రయత్నం కూడా ఎంతో అవసరం.
మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప వాగ్దానాలను ఇస్తాడు. కానీ, మనం ఆ వాగ్దానాలను పొందాలంటే భయాన్ని వదిలి విశ్వాసంతో ముందడుగు వేయాలి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను స్వీకరించేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? లేకపోతే అవిశ్వాసంతో కూడిన సందేహాలతో వెనుకబడి పోతున్నామా?
దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని స్వీకరించడంలో ఏవైనా ఆటంకాలు, విరోధాలు ఎదుర్కొంటున్నారా?వాటిని అధిగమించి ముందుకు సాగేందుకు మీరు సిద్ధమా?
ఎస్తేర్ క్రైసోలైట్
25-3-2025