2025 Messages
దేవుని ప్రేమలో స్థిరముగా నిలబడండి - ఏది మనలను వేరు చేయలేదు.
2 తిమోతికి 4:18
ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్.
ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు, ఆపదలు, దుష్టత్వాలు మన చుట్టూ ఆవరించి ఉంటాయి, ఇవి ఎందుకు ఇలా ఉంటాయి అని అంటే మనలను దేవుని ఏర్పాటు లో నుండి దేవుడు చిత్తంలో నుండి అసలు దేవుని లో నుండే మనలను తప్పించి పరలోక రాజ్యం లోనికి మనలను వెళ్ళనియ్యకుండా ఉండటానికి దుష్టుడైన సాతాను పన్నిన పన్నాగాలు అని నిస్సందేహంగా మనం చెప్పవచ్చు మన ప్రభువు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన మనలను ప్రతి దుష్కార్యమునుండి తప్పించి, తన మహిమకలిగిన రాజ్యానికి తీసుకువెళ్లే వరకూ మనలను రక్షిస్తాడు.
తనను విశ్వసించిన ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యమునకు చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించుకున్నారు
ఎఫెసీయులకు 1:13,14
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన(సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
సత్య వాక్యమును రక్షణ సువార్తను విని యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసముంచి పరలోక రాజ్యంలోనికి వెళ్లడానికి నిత్యజీవమును మనము పొందటానికి మనలో తన కార్యమును ఆరంభించిన పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారి రాకడ వరకు లేక మన మరణ పర్యంతం వరకు మనలో తన జీవమును తన మహిమ గలిగిన కార్యములను మనలో జరిగించగల సమర్థుడు.
ఫిలిప్పీయులకు 1:4
మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన కార్యాన్ని ప్రారంభించాక, అది పూర్తి అయ్యేవరకు మనలను విడిచిపెట్టడు. ఆయన మన రక్షణను సురక్షితంగా ఉంచేందుకు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించుకున్నారు.
ఎప్పటి వరకు అని అంటే విమోచన దినం వరకు మనల్ని దేవుడు ముద్రించుకున్నాడు.
ఎఫెసీయులకు 4:30
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.
శాపగ్రస్తమైన ఈ శరీరం నుండి మన ఆత్మ విమోచించబడే విమోచన దినం వరకు మనము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నాము కాబట్టి ఈశరిర సంబంధమైన జీవితంలో సంభవించే ఆపదలు ప్రమాదాలు సకల దుష్టత్వాలు అన్నీ కూడా మనకు సంభవించేటట్లు వీటిని బట్టి మనలను దేవునిలో నుండి దేవుని యందు మనముంచే విశ్వాసంలో నుండి మనలను తప్పించాలని దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
ప్రస్తుతం మీ జీవితంలో కూడ ఇటువంటి పరిస్థితులే మీకు ఎదురవుతున్నాయా, అయితే మీరు ఆశ్రయించదగిన ఆధారపడ దగిన వాడు దేవుడే. ఆయన రక్షణను పూర్తిగా నమ్మి ముందుకు సాగండి. మీరు యోగ్యులు కాదనుకున్నా, మీ పట్ల కలిగి ఉన్న దేవుని ప్రేమ, అన్నిటిని జ్జయించగలిగిన దేవుని శక్తి మీకు సమృద్ధిగా దొరుకుతుంది. రోమీయులకు 8:37
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
2 థెస్సలొనికయులకు 3:3
అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి(దుష్టునినుండి) కాపాడును.
మీరు ఈ వాక్యాన్ని విశ్వసించగలరా !
అన్ని ఆశీర్వాదాలు కన్నా అతి గొప్ప ఆశీర్వాదం ఏమిటి ఆని అంటే దేవునిలో నుంచి మనలను బయటకు లాగే ఇటువంటి పరిస్థితులు మన జీవితంలోకి ఎన్ని వచ్చిన వీటిని బట్టి మనము దేవున్ని వదిలీ వేయకుండా దేవున్నె గట్టిగా పట్టుకుని ఉంటామే అదేనండి నిజమైన ఆశీర్వాదం అంటే,
రోమీయులకు 8:35
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?
రోమీయులకు 8:38,39
మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
ఏ కష్టం, ఏ కరువు ఆయిన ఎటువంటి బలమైన శక్తి,అయినా భవిష్యత్తులో ఏమి జరిగినా, దేవుని ప్రేమ నుండి నన్ను ఏదీ కూడా వేరుచేయలేదు అని మీరు చెప్పగలరా !
ఎస్తేర్ క్రైసోలైట్
25-3-2025