2025 Messages
🌿 ధైర్యంగా ముందుకు సాగుదాము — ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు.
ద్వితియోపదేశకాండము 31:6
భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు.
మన జీవితానికి ఇది గొప్ప ఆత్మీయ సత్యం. మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితిలోనైనా, దేవుడు మనతో ఉన్నాడు. ఈ వాక్యము మనకు మూడు ముఖ్యమైన నిజాలను బోధిస్తుంది.
1️⃣ దేవుడు మన ముందే నడుస్తున్నాడు — కాపరి స్వరాన్ని వినే మనస్సు మనకు అవసరం
దేవుడు మన ముందుగా నడవడం అనేది ఆయన కాపరి లక్షణాన్ని చూపిస్తుంది. యోహాను 10:4 లో యేసు ఇలా చెప్పారు: యోహాను 10:4
మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.
దేవుడు మన కాపరి. ఒక కాపరిగా దేవుడు మనకు ముందుగా నడవడం అన్నది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, దేవుడు మన కాపరి. ఒక కాపరి ముందుగా నడవడం ఎందుకు అంత ముఖ్యము?
1. మన ముందు ఉన్న ప్రమాదాలను తొలగించడానికి,
2. మనకు రక్షణ కల్పించడానికి,
3. మనకు సురక్షితమైన మార్గాన్ని చూపించడానికి,
దేవుడు ప్రతి దశలో మనకు ముందుగా నడచి, మన మార్గం సురక్షితంగా ఉండేలా చేస్తాడు.
మన బాధ్యత ఏంటి?
మన కాపరి స్వరాన్ని వినడం. ఆయన వాక్యాన్ని అనుసరించటం, (Bible) దానిని మన జీవన మార్గదర్శకంగా ఉంచడం చూడటం. కాపరి మన ముందుగా నడుస్తున్నాడని మనకు తెలుసు, కానీ ఆయన ఇచ్చిన సూచనలను మనం వినకపోతే, ఆ రక్షణను, ఆ మార్గాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రతి రోజు ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థనలో ఆయన స్వరం వినే మనస్సు మనకు కావాలి.
2️⃣ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు — ఇమ్మానుయేలు దేవుడు అంటే:
“ఇమ్మానుయేలు” అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం (మత్తయి 1:23). ఇది ఒక సంబోధన పదం మాత్రమే కాదు; అది నిజం. యేసు క్రీస్తు శరీరమును దరించి ఈ లోకానికి వచ్చి, మన పాపభారాన్ని మోసి, మనకు రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, సంతోష సమయాలలో కూడా, కష్టకాలాలలో కూడా మనకు తోడుగా ఉంటున్నారు.
దేవుడు ఏ రూపంలో మనకు తోడుగా ఉన్నాడు?
1. సత్యమైన వాక్యరూపంలో మనకు తోడుగా ఉన్నాడు
యోహాను 14:6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
2. మన మనస్సులకు శాంతినిచ్చే మన హృదయాలకు సమాధానము యిచ్చే శాంతిదూతగా ఉన్నారు,
యోహాను 14:27
శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
3. ప్రార్థనలో సమాధానమిచ్చే దేవునిగా ఉన్నాడు,
మత్తయి 7:7-8
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.
4. దేవుడు మనతో కలిసే ప్రతి దశలో మనకు స్నేహితునిగా, సహాయకునిగా, మార్గదర్శకునిగా ఉంటాడు. యోహాను 15:15
దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
దేవుడు మనతో ఉన్నాడని మనం తెలుసు కున్నప్పుడు మనకు అర్థం అయినప్పుడు, ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటము; భయం అనేది మనను జయించ లేదు.
3️⃣ దేవుడు మనలను విడువడు — ఎందుకంటే ఆయన తన ఆత్మ ద్వార మనలను ముద్రించారు కాబట్టి, ద్వితి 31:6 భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు. యిది దేవుడు చెప్పిన వాగ్దానం: కొత్త నిబంధనలో ఈ వాగ్దానం మరింత బలమైన రూపంలో మనతో కూడా వస్తున్నది, ఆయన తన ఆత్మను మనలో నివాసముండటానికి ఇచ్చాడు.
2కోరింథీ 1:22
ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. ఆ ఆత్మ ముద్ర కాబట్టి — దేవుడు మనల్ని విడువడు, వదలడు. ఆయన మనలో ఉన్నాడు:
శరీరమేమిటి? దేవుని ఆత్మ నివాసముండే మందిరం.
1కోరింథీయులకు 6:19
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయాలను బలపరుస్తాడు రోమీ 8:11
మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
మన జీవితంలో మనము ఎక్కడికి వెళ్లినా ఆయన మవలను విడువడు కీర్తనలు 139:7-10
నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును?
నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను,అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడిచేయి నన్ను పట్టుకొనును.
ఇందులో మనకు ఉన్న గొప్ప ధైర్యం ఏమిటంటే — మన బలహీనతల కారణంగా, మన లోపాల కారణంగా దేవుడు మనల్ని వదలిపెట్టేవాడు కాదు. ఆయన దయ, ప్రేమ వల్ల మనకు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు, మార్గం చూపిస్తాడు.
1.ఈ రోజు మీరు నిజంగా ఆ కాపరి స్వరాన్ని వినడానికి ప్రయత్నిస్తున్నారా?
2.ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు అనే సత్యం మీ భయాలను జయించడానికి సహాయపడుతున్నదా?
3.దేవుని ఆత్మను ముద్రగా పొందిన వ్యక్తిగా, మీరు ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్నారా?
“ప్రభువా, ధైర్యముతో ముందుకు సాగడానికి, మీ స్వరాన్ని వినడానికి, మీ తోడును బలంగా అనుభవించి, మీ ఆత్మకు విధేయులుగా ఉండటానికి మాకు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్.”
ఎస్తేర్ క్రైసోలైట్
23-6-2025
🌿 ధైర్యంగా ముందుకు సాగుదాము — ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు.
ద్వితియోపదేశకాండము 31:6
భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు.
మన జీవితానికి ఇది గొప్ప ఆత్మీయ సత్యం. మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితిలోనైనా, దేవుడు మనతో ఉన్నాడు. ఈ వాక్యము మనకు మూడు ముఖ్యమైన నిజాలను బోధిస్తుంది.
1.దేవుడు మన ముందే నడుస్తున్నాడు — కాపరి స్వరాన్ని వినే మనస్సు మనకు అవసరం
దేవుడు మన ముందుగా నడవడం అనేది ఆయన కాపరి లక్షణాన్ని చూపిస్తుంది. యోహాను 10:4 లో యేసు ఇలా చెప్పారు: యోహాను 10:4
మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.
దేవుడు మన కాపరి. ఒక కాపరిగా దేవుడు మనకు ముందుగా నడవడం అన్నది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, దేవుడు మన కాపరి. ఒక కాపరి ముందుగా నడవడం ఎందుకు అంత ముఖ్యము?
1. మన ముందు ఉన్న ప్రమాదాలను తొలగించడానికి,
2. మనకు రక్షణ కల్పించడానికి,
3. మనకు సురక్షితమైన మార్గాన్ని చూపించడానికి,
దేవుడు ప్రతి దశలో మనకు ముందుగా నడచి, మన మార్గం సురక్షితంగా ఉండేలా చేస్తాడు.
మన బాధ్యత ఏంటి?
మన కాపరి స్వరాన్ని వినడం. ఆయన వాక్యాన్ని అనుసరించటం, (Bible) దానిని మన జీవన మార్గదర్శకంగా ఉంచడం చూడటం. కాపరి మన ముందుగా నడుస్తున్నాడని మనకు తెలుసు, కానీ ఆయన ఇచ్చిన సూచనలను మనం వినకపోతే, ఆ రక్షణను, ఆ మార్గాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రతి రోజు ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థనలో ఆయన స్వరం వినే మనస్సు మనకు కావాలి.
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు — ఇమ్మానుయేలు దేవుడు అంటే:
“ఇమ్మానుయేలు” అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం (మత్తయి 1:23). ఇది ఒక సంబోధన పదం మాత్రమే కాదు; అది నిజం. యేసు క్రీస్తు శరీరమును దరించి ఈ లోకానికి వచ్చి, మన పాపభారాన్ని మోసి, మనకు రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, సంతోష సమయాలలో కూడా, కష్టకాలాలలో కూడా మనకు తోడుగా ఉంటున్నారు.
దేవుడు ఏ రూపంలో మనకు తోడుగా ఉన్నాడు?
1. సత్యమైన వాక్యరూపంలో మనకు తోడుగా ఉన్నాడు
యోహాను 14:6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
2. మన మనస్సులకు శాంతినిచ్చే మన హృదయాలకు సమాధానము యిచ్చే శాంతిదూతగా ఉన్నారు,
యోహాను 14:27
శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
3. ప్రార్థనలో సమాధానమిచ్చే దేవునిగా ఉన్నాడు,
మత్తయి 7:7-8
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.
4. దేవుడు మనతో కలిసే ప్రతి దశలో మనకు స్నేహితునిగా, సహాయకునిగా, మార్గదర్శకునిగా ఉంటాడు. యోహాను 15:15
దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
దేవుడు మనతో ఉన్నాడని మనం తెలుసు కున్నప్పుడు మనకు అర్థం అయినప్పుడు, ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటము; భయం అనేది మనను జయించ లేదు.
3. దేవుడు మనలను విడువడు — ఎందుకంటే ఆయన తన ఆత్మ ద్వార మనలను ముద్రించారు కాబట్టి, ద్వితి 31:6 భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు. యిది దేవుడు చెప్పిన వాగ్దానం: కొత్త నిబంధనలో ఈ వాగ్దానం మరింత బలమైన రూపంలో మనతో కూడా వస్తున్నది, ఆయన తన ఆత్మను మనలో నివాసముండటానికి ఇచ్చాడు.