CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿 దియోత్రెఫేసు — ఒక హెచ్చరికగా నిలిచిన వ్యక్తి

3యోహాను 1:9-10

నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.

వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.

యోహాను పత్రిక 9–10 లో మనకు పరిచయం అవుతున్న దియోత్రెఫేసు ఒక హెచ్చరికగా నిలిచిన ఉదాహరణ. ఒక వ్యక్తి సంఘంలో స్థానాన్ని, అధికారాన్ని బలవంతంగా పొందాలని ప్రయత్నిస్తే అది సంఘానికి ఎంత ప్రమాదకరమో అతని జీవితం చూపిస్తుంది.

దియోత్రెఫేసు లో వున్న లక్షణాలను మనం విశ్లేషణ చేద్ధాం

1. మొదటి స్థానం పొంద గోరుచు (అహంకారం)

దియోత్రెఫేసు లక్ష్యం — సంఘంలో ప్రధాన స్థానం పొందడం. అతని ఆలోచనలు ఆతని ఉద్దేశం తనకే గౌరవం రావాలని ఆశించేది. ఇది సాతాను పడిపోవడానికి కారణమైన అదే పాత స్వభావం,

యెషయా 14:1215

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును మేఘ మండలము మీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

2. సేవకులను తిరస్కరించడం, (ఆత్మీయ చీకటి)

యోహాను అపొస్తలుడు, ఇతర దేవుని సేవకులను అతను గౌరవించలేదు. సంఘానికి ఉపదేశం ఇచ్చే వారిని తక్కువ చేసాడు. ఇది కేవలం అధికారం మాత్రమే కాదు — దేవుని క్రమాన్ని తిరస్కరించడం.

3. చెడుగా మాటలు మాట్లాడటం (విభజన సృష్టించడం) తన స్థానాన్ని కాపాడుకోవడానికే కాదు, సహోదరులకు అపఖ్యాతి తీసుకు రావడం ద్వారా అతను సంఘాన్ని విభజించేవాడు. తీయని మాటల స్థానంలో విషపు మాటలను వాడి చీల్చి వేయడం అతని పద్ధతి.

4. సంఘం నుండి తోలగించడం (దైవ నియమానికి విరుద్ధం) అతని గర్వం ఇతరులను శ్రమకు గురిచేసింది. సహకరించేవారిని సంఘం నుండి తోలగించాడంటే అది దేవుని గృహాన్ని తన స్వంత గృహంగా చేసుకున్నట్టు.

దేవుని దృష్టిలో దియోత్రెఫేసు స్థానం ఏమిటి?

బైబిల్ లో యోహాను అపొస్తలుడు ఇలా చెబుతున్నారు:3యోహాను 1:11

ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.

అంటే దియోత్రెఫేసు జీవిత విధానం దేవుని సన్నిధిలో అంగీకారం పొందలేదు. దేవుని గృహంలో అధికారం పొందాలనే స్వార్థం దేవుని దృష్టిలో వున్న తీవ్రమైన పాపం. దేవుని పనిలో, సంఘంలో, అధికారం కోసం కాక, సేవ కోసం దేవుని పరిచర్య కొరకు మాత్రమే మనం ఉండాలి.

🌱 ఇది మనకు ఏమి తెలియజేస్తుంది?

1. ఏ స్థలంలోనైనా మనం సేవకులుగా ఉండాలి, అధికారులుగా కాకుండా.

2. మన మాటలు సంఘాన్ని కట్టడానికి కాని విభజించడానికి కాదు?

3. దేవుని క్రమానికి లోబడి ఉన్నామా! లేక మన స్వంత ఉద్దేశాలతో ఆలోచనలతో మనము ముందుకు వెలుతున్నామా?

ఎస్తేర్ క్రైసోలైట్

23-6-2025