CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

యెషయా 45:3

అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.

ఆశీర్వాదము : > అంటే ఏమిటి ?

క్రింది స్థాయి నుంచి పై స్థాయికి తీసుకుని వచ్చే దానిని మన మనసు ఆత్మ శరీరము వీటి పరిసరాలు వీటి పరిస్థితులు అన్నిటిని కూడా అభివృద్ధి పరిచేటట్లు మెరుగుపరిచేటట్లు చేసే ఆస్తులను సంపదలను ఆరోగ్యము దేవుని గురించిన జ్ఞానము ఆత్మ సంభందమైన కృపవరాలు శాంతి సమాధానము ఆనే ఇటువంటి వాటినే ఆశీర్వాదం అని అంటారు.

ఆశీర్వాదం అనేది ఒక్క శరీర సంబంధమైన జీవితానికి సంబంధించినది మాత్రమే కాక ఇది ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించినదిగా ఒక వ్యక్తి ఆత్మీయ అభివృద్ధిని శరీర సంబంధమైన ఈ జీవన స్థాయిని అతని వ్యక్తిత్వమును అతని సేవను అది ఎదైనప్పటికీని దానిని క్రొత్తస్థాయికి తీసుకుని వెళుతుంది,అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదం అనేది దేవుని కృప వల్ల మానవుని జీవితానికి కలిగే గొప్ప మార్పును సూచిస్తుంది

దేని ద్వారా వచ్చే ఆశీర్వాదం మనకు క్షేమం > :

అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను. యెషయా 45:3

ఈ వాక్యము శరీర సంబంధమైన జీవితంలోను అత్మ సంబంధమైన జీవితంలోను ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది.

శరీరసంబంధమైన జీవితంలో ఈ వాక్యము నెరవేరితే ఆత్మ సంబంధమైన జీవితములో ఇటువంటి ఆశీర్వాదాలు అన్నవి కనపడవు, పాత నిబంధనలోని దేవుని ప్రజలైన అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆశీర్వాదము అన్నది అది శరీర సంబంధమైనది.

1. అబ్రహముకి దేవుడు వాగ్దానం ఇచ్చి అతనిని ఆశీర్వదించి అతని జీవితాన్ని ఒక గొప్ప వంశము యొక్క ప్రారంభవమునకు పునాది వేశాడు

ఆదికాండము 12:2,3 " నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, "

2. యోసేపు జీవితములో

యోసేపు అన్యాయంగా బానిసత్వంలోనికి వెళ్ళినప్పటికీ చివరికి దేవుని ఆశీర్వాదం వలన ఐగుప్తు దేశమునకు ప్రధానిగా తాను ఎదిగాడు.

ఆదికాండము 41:41- 4

"మరియు ఫరోచూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.

మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి

తన రెండవ రథముమీద అతని నెక్కించెను.

అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను."

పాత నిబంధనలోని ఈ భక్తులకు దొరికిన ఆశీర్వాదాలు అన్నీ కూడా శరీర సంబంధమైనవి అందుకే వారికి దోరికిన ఆశీర్వాదాల వలన వారి ఆత్మకు ఎటువంటి ప్రయోజనం అన్నది కలుగ లేదు

అందుకే యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో నిర్మించబడి ఈ లోకములకు వచ్చి క్రొత్త నిబంధన భక్తులకు పాత నిబంధన భక్తులకు మధ్యవర్తిగా నిలబడ్డారు.

కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుని ప్రజలకు కలిగిన ఆశీర్వాదం అన్నది ఆత్మకు సంబంధించినది యేసుక్రీస్తు ప్రభువారి శరీరము పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించ బడినది అందుకే క్రొత్త నిబంధనలో మొదటి ప్రాధాన్యత ఆత్మకే ఇవ్వబడినది.

3 యోహాను 1:2 లో

" ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను." అని వ్రాయబడిన వాక్యము కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది

3 యోహాను 1:2 లో వున్న ఈ వాక్యము ఆత్మ సంబంధమైన జీవితంలో నెరవేరితే శరీర సంబంధమైన జీవితంలో కూడా ఈ ఆశీర్వాదాలు అనేవి విస్తరిస్తాయి.

మానవుని ఆత్మ సంబంధమైన జీవితంలో శరీర సంబంధమైన జీవితంలో మేలును అభివృద్ధిని క్షేమమును సమాధానమును సంతోషమును కలిగించే ఈ ఆశీర్వాదాలు అనేవి మనకు * ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యము * అనే దానిలో మాత్రమే మనకు దొరుకుతాయి.

పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరలోక రాజ్యమును దేనితో పోల్చాడు అని అంటే ఒక విలువైన సంపదతో ధనముతో పోల్చాడు.

మత్తయి 13:44 పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.

అంధకారస్థలములలో ఉంచబడిన నిధులుగా రహస్యస్థలములలోని మరుగైన ధనముగా దాచబడి ఉన్నా ఈ పరలోక రాజ్యమును దీని విలువ తెలిసి ఇది అమూల్యమైనదని ఈ భూలోకంలో బ్రతికే బ్రతుకు దీని కొరకే అని ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని వదిలివేసి సంపాదించుకోవలసి నటువంటి విలువైనది ఈ పరలోక రాజ్యం అని ఈ భూలోకంలో ఉన్న పరిశుద్ధమైన దేవుని రాజ్యమును గుర్తించేవారు కొద్ది మంది ప్రజలు మాత్రమే వీరు మాత్రమే పరిశుద్ధమైన పరలోక రాజ్యమును సంపాదించు కుంటున్నారు దానిని విస్తరింప చేయుట కొరకే ప్రయాస పడుతున్నారు.

దానిలో ఉన్నటువంటి పాత క్రొత్త అనే మంచి పదార్థములను ఇతరులకు పంచుతున్నారు వారినే శాస్త్రలు అని పరిశుద్ధ గ్రంధం మనకు తెలియ జేస్తుంది

శాస్త్రలు అంటే ఎవరు ? : పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరి దేవుని వాక్యమును అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒక శాస్త్రి

ఈ శాస్త్రి దాచబడి ఉన్న ఈ పరలోక రాజ్యములోని పాత నిబంధనలోని క్రొత్త నిబంధనలోని పాత క్రోత్త విలువైన సత్యాలను తాను పొంది వాటిని అనుసంధానించి జ్ఞానమైయున్న దేవుడు తనకిచ్చిన ఆత్మ సంబంధమైన జ్ఞానమనే ధననిధిలో నుండి విలువైన దేవుని సందేశాలను ప్రజలకు అందిస్తాడు.

మత్తయి 13:52

ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థ ములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను.

దేవుని రాజ్యంలో ఉన్నవారు పాతనిబంధన (పాత పదార్థాలు) మరియు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చిన కొత్త సందేశాలు ఆజ్ఞలు (క్రొత్త పదార్థాలు) రెండింటినీ సరైన సమయానికి ఉపయోగించగలగాలి.

పాతనిబంధనను పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా క్రీస్తు బోధనలు మరింత స్పష్టంగా అవుతాయి.

పాతనిబంధనలో ఉన్నటువంటి విలువైన సందేశాలు

క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్త ఇవి రెండు భాగాలుగా ఒక ఆత్మసంబంధమైన సంపదగా ధనముగా పదార్థములుగా ఉన్నటువంటి వీటిని ఇతరులకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి శిష్యునికి ఉంది.

దీని ద్వారా దాచబడిన ధనముగా సంపదగా ఉన్నటువంటి పరలోక రాజ్యం అనేది ఇంకా కొంతమందికి ప్రత్యక్షమవుతుంది బయలు పరచబడుతుంది మత్తయి 6:33

మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి;

ఎస్తేర్ క్రైసోల్తెట్

2-1-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-1-25