2025 Messages
💖
కీర్తనలు 18:28
నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.
మన జీవితాల్లో కొన్ని సందర్భాలు అంధకారముతో నిండి ఉంటాయి. మనకు మార్గం కనిపించదు, ఏంచేయాలో తెలియదు. అలాంటి క్షణాల్లో మనకు ఆధారం దేవుడే. ఆయన మన చీకటిని వెలుగుగా మార్చగలుగుతాడు. మనము వెళ్లలేని సమస్యలనే మార్గములను సరిచేసి దారిని చూపిస్తాడు. దేవుని చిత్తాన్ని అనుసరించి మనము నడిచినప్పుడు, ఏటువంటి చీకటి కూడ మనపై ప్రభావం చూపలేదు.
మనలో కొందరు తమ జీవితంలో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా మలుపులు ఎదురవుతున్నాయి. కాని మన గతి దేవుని చేతిలో ఉంది. ఆయనే మన మార్గం! ఆయనతో ఉన్నప్పుడు చీకటి మనపై నిలవదు, ఎందుకంటే ఆయన వెలుగు.
మీ జీవితంలో ఇప్పుడున్న చీకటిని దేవుడు ఎలా వెలుగుగా మార్చగలడని మీరు నమ్ముతున్నారా? ఆయన మార్గంలో నడిచేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
యెహోవా సూర్యుడును కెడెమునై యున్నాడు
కీర్తనలు 84:11
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన యే మేలును చేయక మానడు.
సూర్యుడు అంధకారాన్ని పారద్రోలే శక్తివంతమైన కాంతి. సూర్యుడును కేడెమునై యున్నా యెహోవా దేవుడు కూడ అలానే మన ఆత్మలోనూ, మన జీవితంలోనూ వెలుగును ప్రసాదిస్తాడు. ఆయనను నమ్మినవారికి ఆయన రక్షణకవచంలా నిలిచి, వారికి అవసరమైన కృపను, ఆశీర్వాదాన్ని అందిస్తాడు.
మీ జీవితాలలో కొన్ని దారులు తెలియకుండానే మసక బారిపోతున్నాయ!. భయాలు, సందేహాలు, నిరాశ మిమ్ములను చుట్టుముట్టుతున్నాయా !. యెహోవా సూర్యుని వంటివాడు; ఆయన వెలుగు ఆనే వాక్యమును మీరు అనుసరించినప్పుడు, దానిని మీరు విశ్వసించినప్పుడు, మీరు చీకటిలో నడవాల్సిన అవసరం ఉండదు. ఆయన మంచి వాటిని మనకు ఇవ్వకుండా దాచి పెట్టే దేవుడు కాదు, మనకు అవసరమైన మంచి దానిని సమయానికి అనుగ్రహిస్తాడు.ఫిలిప్పీయులకు 4:19
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
సూర్యుని వెలుగు వలన మానవునికి కలిగే లాభాలు
ఈ సూర్య కాంతి, వ్యాధి నిరోధక శక్తిని, హార్మోన్ల సమతుల్యతను, ఎముకలకు బలాన్ని, ఈ సూర్యకాంతి ఇవ్వటమే కాకుండా, కొన్ని క్రిములను నశింపజేసే శక్తి, ఈ సూర్య కాంతికి ఉంది.
కీర్తనలు 119:130
నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును.
మన దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న వాక్యం అనే దేవునితో మనము సహవాసం చేస్తున్నప్పుడు, మనలను నాశనం చేయటానికి వచ్చేకష్టాలు, శ్రమలు భయాలు ఇటువంటి అనేక రకములైన సమస్యలనే చీకటి క్రిములు నశించి పోతాయి.మన ఆత్మీయ జీవితం చీకటిలో కాకుండా వాక్యపు వెలుగులో నడవాలని ఈరోజే మనము ప్రార్థిద్దాం.
సామెతలు 4:18
పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
వాక్యమనే దేవుని మార్గంలో నడిచేవారికి వారి జీవితంలో వారికి దారిని యిచ్చే, చూపించే, కనపరచే వెలుగు ఉంటుందని, అది అంత కంతకు వృద్ధి చేందుతుంది ఆని ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు.మీరు మీ జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో నడిపించు కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజే ఏకాగ్రతతో వాక్యాన్ని అనుసరించే ఒక నిర్ణయం తీసుకుంటారా?
ఎస్తేర్ క్రైసోల్తెట్
26-3-2025